పూరీ జగన్నాథ్కు థ్యాంక్స్: రేణు దేశాయ్ | I thank Puri Jagannath for making Pawan Kalyan my life: Renu Desai | Sakshi
Sakshi News home page

పూరీ జగన్నాథ్కు థ్యాంక్స్: రేణు దేశాయ్

Published Tue, Apr 22 2014 8:27 AM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

పూరీ జగన్నాథ్కు థ్యాంక్స్: రేణు దేశాయ్ - Sakshi

పూరీ జగన్నాథ్కు థ్యాంక్స్: రేణు దేశాయ్

దర్శకుడు పూరీ జగన్నాథ్కు సదా రుణపడి ఉంటానని పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ పేర్కొన్నారు. తన తొలి సినిమా 'బద్రీ' విడుదలయి ఏప్రిల్ 20 తేదీకి 14 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆమె అభిమానులతో ట్విటర్లో సంభాషించారు. ఈ సందర్భంగా ఫ్యాన్ అడిగిన పలు ప్రశ్నలకు ఆమె సమాధానాలిచ్చారు.

అభిమాని: పవన్ సినిమాల్లో మీకు నచ్చిన సినిమా ఏది? అత్తారింటికి దారేది సినిమా చూశారా?
రేణు: పవన్ సినిమాలన్నీ చూశాను. ఆయనకు నేను వీరాభిమానిని.

అభిమాని: బద్రీ సినిమాలో మీకు నచ్చిన సీన్ లేదా డైలాగ్ ఏది?
రేణు: క్లైమాక్స్ సీన్ బాగా నచ్చింది. ఈ సన్నివేశంలో నాకు ఒక్క డైలాగ్ కూడా లేదు. 'ఈ రింగ్ ఎంత బావుంది' ఇది నాకు నచ్చిన డైలాగ్. హోటల్లో సరయును కలిసినప్పుడు వచ్చే సన్నివేశంలో నేను చెప్పే డైలాగ్ చెప్పిన డైలాగ్ ఇది.

అభిమాని: పవన్ను మీ జీవితంలోకి తీసుకొచ్చిన పూరీ జగన్నాథ్ గురించి చెప్పండి.
రేణు: నా కెరీర్ మంచి సినిమా అందించిన పూరీ జగన్నాథ్కు ఎప్పుడు ధన్యవాదాలు చెబుతాను. అంతేకాదు  పవన్ ను నా జీవితంలోకి తీసుకొచ్చినందుకే కాకుండా పవన్నే నా జీవితంగా చేసినందుకు కూడా పూరీకి థ్యాంక్స్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement