భారీ ఆర్డర్ దక్కించుకున్నజెఎంసీ
ముంబై: ప్రముఖ దేశీయ రియల్ఎస్టేట్ సంస్థ జెఎంసీ ప్రాజెక్టు ఇండియా భారీ ఆర్డర్‌ను దక్కించుకుంది. రూ.1,058కోట్ల విలువైన ఆర్డర్‌ను సాధించింది. మహారాష్ట్ర ధానేలో రూ 531 కోట్ల విలువైన నివాస భవనం ప్రాజెక్ట్ ఆర్డర్, బెంగుళూరులో రూ. 527 కోట్ల రెండు వాణిజ్య భవన నిర్మాణ ప్రాజెక్టును సాధించినట్టు బీఎస్ఈ ఫైలింగ్ లోతెలిపింది.
డీమానిటైజేషన్ ప్రభావం ఉన్నప్పటికీ తగిన జాగ్రత్తలు తీసుకున్నట్టు సంస్థ డైరెక్టర్ , సీఎఫ్‌వో మనోజ్ తులసియాన్ తెలిపారు. రియల్ ఎస్టేట్ ఆర్డర్ తీసుకునేటపుడు అప్రమత్తంగా ఉన్నామన్నారు. అలాగే 2018 ఆర్థిక సంవత్సరానికిగాను 15-20 వృద్ధి సాధించనున్నట్టు చెప్పారు. ఈ ప్రకటనతో మార్కెట్లో ఈ కౌంటర్ ఒకదశలో4 శాతం లాభపడింది.
కాగా దేశీయ ఇంజనీరింగ్ మరియు నిర్మాణ సేవల సంస్థ జెఎంసీ భవనాలు, ఇతర కట్టడాల నిర్మాణంతోపాటు, నిర్మాణం రంగంలోని డిజైన్, సేకరణ, సరఫరా, సంస్థాపన, టెస్టింగ్ లాంటి ఇతర ప్రాజెక్టులను నిర్వహిస్తుంది.