baghdadi killed
-
వైరల్ వీడియో: బాగ్దాదీ అంతానికి ట్రైనింగ్
న్యూయార్క్: సిరియా కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా ఇస్లాం రాజ్య స్థాపనే లక్ష్యంగా నరమేధానికి తెగబడిన ఇస్లామిక్ స్టేట్ చీఫ్ అబు బాకర్ అల్ బాగ్దాదీని అమెరికా సేనలు మట్టుబెట్టిన విషయం విదితమే. పక్కా పథకం ప్రకారం ఇరాక్, టర్కీ, రష్యాల సహాయంతో బాగ్దాదీ జాడను కనిపెట్టిన అగ్రరాజ్య సైన్యం అతడిని చుట్టుముట్టడంతో ఉగ్రమూక నాయకుడు ఆత్మాహుతికి పాల్పడ్డాడు. అమెరికా చేపట్టిన ఈ రహస్య ఆపరేషన్‌లో సైన్యంతో పాటు సైనిక జాగిలాలు కూడా కీలక పాత్ర పోషించాయి. ముఖ్యంగా బెల్జియన్ మలినోయిస్ జాతికి చెందిన శునకం (కే9) ఈ ఆపరేషన్‌లో కీలక పాత్ర పోషించింది. అయితే ఉగ్రవాదులను వేటాడటానికి ఆ కుక్కకు అమెరికా సైన్యాలు ఇస్తున్న ట్రైనింగ్ చూస్తే షాకవ్వక తప్పదు. బాగ్దాది హతం అనంతరం ఆ కుక్కపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు వర్షం కురుస్తున్న విషయం తెలిసిందే. దీంతో అమెరికా సైన్యం ఆ కుక్కు చేసే సైనిక విన్యాసాల వీడియోను సోషల్ మీడియోలో షేర్ చేసింది. వీడియోను పోస్ట్ చేసిన కొద్ది సమయంలోనే వైరల్‌గా మారింది. Belgian Malinois.. The breed of dogs used by US special forces... To track and kill Baghdadi. pic.twitter.com/QeJzB31Xuc — Archie{Col Vijay S Acharya(R)} (@archie65) November 2, 2019 -
బాగ్దాదీని తరిమిన కుక్క
బాగ్దాదీని తుదముట్టించడంలో బలగాలకు సాయంగా ఉన్న శునకం ‘కే–9’ఫొటోను అధ్యక్షుడు ట్రంప్ ట్విట్టర్లో షేర్ చేశారు. రహస్య సొరంగం చివరికి వెళ్లిన బాగ్దాదీ తనను తాను పేల్చేసుకోవడంతో ‘కే–9’ స్వల్పంగా గాయపడింది. ‘బాగ్దాదీ కోసం చేపట్టిన ఆపరేషన్‌లో కే–9 పేరున్న ఈ కుక్క అద్భుత పనితీరు చూపింది’అంటూ బెల్జియన్ మలినోయిస్ జాతికి చెందిన ఆ కుక్కపై ట్విట్టర్లో ప్రశంసలు కురిపించారు. ఆ శునకం పేరు, ఇతర వివరాలు వెల్లడించలేదు. -
బాగ్దాదీ వారసుడూ హతం
వాషింగ్టన్: డెల్టాఫోర్స్ ఆపరేషన్‌లో ఐసిస్ చీఫ్ అబూ బకర్ అల్ బాగ్దాదీతోపాటు, అతని తర్వాత ఐసిస్ పగ్గాలు చేపట్టనున్న మరో ఉగ్రవాది హతమైనట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. సిరియాలోని స్థావరంపై శనివారం రాత్రి ప్రత్యేక బలగాలు దాడి చేయడంతో బాగ్దాదీ తనను తాను పేల్చేసుకున్నట్లు ట్రంప్ సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్‌లో బాగ్దాదీ తరువాతి స్థానంలో ఉన్న మరోవ్యక్తి హతమయ్యాడని ట్రంప్ తాజాగా ప్రకటించారు. అతడి పేరు, ఎలా చనిపోయాడన్న వివరాలను వెల్లడించలేదు. బాగ్దాదీ మృతిపై అమెరికా సైనిక బలగాల అధిపతి జనరల్ మార్క్ మిల్లీ మాట్లాడుతూ..‘ఆపరేషన్ జరిగిన ప్రాంతంలో లభించిన శరీర భాగాలపై డీఎన్ఏ పరీక్ష జరిపి అవి బాగ్దాదీవే అని నిర్ధారించుకున్నాకే అంతర్జాతీయ ప్రామాణిక నిబంధనల మేరకు అంత్యక్రియలు పూర్తి చేశాం’అని తెలిపారు. అయితే, ఈ ఘటన ఫుటేజీని కొంత బయటకు వెల్లడిస్తామంటూ అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనపై ఆయన స్పందిస్తూ.. మొత్తం ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోల పరిశీలన ప్రస్తుతం కొనసాగుతోందని తెలిపారు. బాగ్దాదీ ఇద్దరు అనుచరులను పట్టుకున్నామని, దీంతోపాటు ఆ భవనంలో లభించిన ఐసిస్ కీలక పత్రాల విశ్లేషణ కొనసాగుతోందన్నారు. ఆపరేషన్ ఇంకా ఉంది: అమెరికా బాగ్దాదీని మట్టుబెట్టిన అనంతరం సిరియాలో అమెరికా బలగాలు మరో ప్రత్యేక ఆపరేషన్‌కు శ్రీకారం చుట్టాయి. చమురు క్షేత్రాలకు ఐసిస్ నుంచి రక్షణ కల్పించడంతోపాటు అక్కడి అసద్ ప్రభుత్వ, రష్యా బలగాల స్వాధీనం కాకుండా చూడడం తాజా లక్ష్యమని రక్షణ మంత్రి మార్క్ ఎస్పర్ ప్రకటించారు. -
ఐసిస్ అధినేత హతం?
సంకీర్ణ దళాల దాడుల్లో అబు బకర్ చనిపోయినట్లు వార్తలు రోమ్: ప్రపంచాన్ని వణికిస్తున్న ఉగ్రవాద సంస్థ ఐసిస్ అధినేత అబు బకర్ అల్ బగ్దాదీ సిరియాలోని రక్కాలో అమెరికా సంకీర్ణ దళాలు జరిపిన దాడిలో హతమైనట్లు టర్కీ వార్తా పత్రిక కథనం ప్రచురించింది. అయితే.. అమెరికా సంకీర్ణ దళాలు ఈ విషయాన్ని ధ్రువీకరించలేదు. రెండేళ్ల కిందట ప్రపంచంలోని ముస్లింలకు తనను తాను ఖాలిఫ్‌గా ప్రకటించుకున్న బకర్ హతమయ్యాడని, గాయపడ్డాడని గతంలోనూ వార్తలు వచ్చినా.. అవి అవాస్తవమని తేలింది. తాజాగా.. గత ఆదివారం రక్కా ప్రాంతంలో సంకీర్ణ దళాల వైమానిక దాడుల్లో బకర్ చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. ‘బకర్ రంజాన్ మాసం ఐదో రోజున సంకీర్ణ దళాల వైమానిక దాడుల్లో చనిపోయాడు’ అని ఐసిస్ అనుబంధ వార్తాసంస్థ అల్-అమాక్ వెల్లడించినట్లు టర్కీ అధికారిక పత్రిక యేనిస్ సఫాక్ పేర్కొంది. ఈ దాడుల్లో బకర్ గాయపడ్డట్లు ఇరాక్ టీవీ చానల్ అల్-సుమేరియా కూడా కథనం ప్రసారం చేసింది. -
ఐఎస్ఐఎస్ అధినేత హతం
అబూబకర్ అల్ బాగ్దాదీ.. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాన్ అండ్ సిరియా అధినేత. ఈ ఉగ్రవాద సంస్థను స్థాపించి, ప్రపంచం నలుమూలలా ఉగ్రవాద దాడులతో అల్లకల్లోలం సృష్టిస్తున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి తాజాగా అమెరికా నేతృత్వంలో జరిగిన వైమానిక దాడులలో హతమైనట్లు కథనాలు వస్తున్నాయి. ఐఎస్ఐఎస్ అనుబంధ అరబిక్ వార్తా సంస్థ అల్ అమాక్ ఈ విషయాన్ని తెలిపింది. అమెరికా సాగించిన వైమానిక దాడులలో అల్ బాగ్దాదీ మరణించాడని ఈ వార్తా సంస్థ ప్రకటించింది. ఈ విషయాన్ని అమెరికా గానీ, ఇతర అధికారిక వార్తా సంస్థలు గానీ ఏవీ నిర్ధారించలేదు. సిరియాలో జరిగిన వైమానిక దాడుల్లో బాగ్దాదీ హతమైనట్లు తెలుస్తోంది. ఐఎస్ఐస్ ఆధీనంలో ఉన్న మోసుల్ నగరానికి 65 కిలోమీటర్ల దూరంలో ఈ దాడి జరిగిందని అంటున్నారు.