ఐఎస్ఐఎస్‌ అధినేత హతం | Abu Bakr al-Baghdadi killed in US led air strike | Sakshi
Sakshi News home page

ఐఎస్ఐఎస్‌ అధినేత హతం

Published Tue, Jun 14 2016 3:01 PM | Last Updated on Fri, Aug 24 2018 7:24 PM

ఐఎస్ఐఎస్‌ అధినేత హతం - Sakshi

ఐఎస్ఐఎస్‌ అధినేత హతం

అబూబకర్ అల్ బాగ్దాదీ.. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాన్ అండ్ సిరియా అధినేత. ఈ ఉగ్రవాద సంస్థను స్థాపించి, ప్రపంచం నలుమూలలా ఉగ్రవాద దాడులతో అల్లకల్లోలం సృష్టిస్తున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి తాజాగా అమెరికా నేతృత్వంలో జరిగిన వైమానిక దాడులలో హతమైనట్లు కథనాలు వస్తున్నాయి.

ఐఎస్ఐఎస్ అనుబంధ అరబిక్ వార్తా సంస్థ అల్ అమాక్ ఈ విషయాన్ని తెలిపింది. అమెరికా సాగించిన వైమానిక దాడులలో అల్ బాగ్దాదీ మరణించాడని ఈ వార్తా సంస్థ ప్రకటించింది. ఈ విషయాన్ని అమెరికా గానీ, ఇతర అధికారిక వార్తా సంస్థలు గానీ ఏవీ నిర్ధారించలేదు. సిరియాలో జరిగిన వైమానిక దాడుల్లో బాగ్దాదీ హతమైనట్లు తెలుస్తోంది. ఐఎస్ఐస్ ఆధీనంలో ఉన్న మోసుల్ నగరానికి 65 కిలోమీటర్ల దూరంలో ఈ దాడి జరిగిందని అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement