ఐసిస్ అధినేత హతం? | Isis chief death | Sakshi
Sakshi News home page

ఐసిస్ అధినేత హతం?

Published Wed, Jun 15 2016 2:54 AM | Last Updated on Fri, Aug 24 2018 7:24 PM

ఐసిస్ అధినేత హతం? - Sakshi

ఐసిస్ అధినేత హతం?

సంకీర్ణ దళాల దాడుల్లో అబు బకర్ చనిపోయినట్లు వార్తలు
 
 రోమ్: ప్రపంచాన్ని వణికిస్తున్న ఉగ్రవాద సంస్థ ఐసిస్ అధినేత అబు బకర్ అల్ బగ్దాదీ సిరియాలోని రక్కాలో అమెరికా సంకీర్ణ దళాలు జరిపిన  దాడిలో హతమైనట్లు టర్కీ వార్తా పత్రిక కథనం ప్రచురించింది. అయితే.. అమెరికా సంకీర్ణ దళాలు ఈ విషయాన్ని ధ్రువీకరించలేదు. రెండేళ్ల కిందట ప్రపంచంలోని ముస్లింలకు తనను తాను ఖాలిఫ్‌గా ప్రకటించుకున్న బకర్ హతమయ్యాడని, గాయపడ్డాడని గతంలోనూ వార్తలు వచ్చినా.. అవి అవాస్తవమని తేలింది.

తాజాగా.. గత ఆదివారం రక్కా ప్రాంతంలో  సంకీర్ణ దళాల వైమానిక దాడుల్లో బకర్ చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. ‘బకర్ రంజాన్ మాసం ఐదో రోజున సంకీర్ణ దళాల వైమానిక దాడుల్లో చనిపోయాడు’ అని  ఐసిస్ అనుబంధ వార్తాసంస్థ అల్-అమాక్ వెల్లడించినట్లు టర్కీ అధికారిక పత్రిక యేనిస్ సఫాక్ పేర్కొంది. ఈ దాడుల్లో బకర్ గాయపడ్డట్లు ఇరాక్ టీవీ చానల్ అల్-సుమేరియా కూడా కథనం ప్రసారం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement