Balimela reservoir
-
'బలిమెల'లో మృతదేహం కలకలం
విశాఖపట్నం: ఏవోబీలోని బలిమెల రిజర్వాయర్ లో బయటపడిన మృతదేహం కలకలం రేపింది. తొలుత ఈ మృతదేహం ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టుది అయి ఉంటుందని భావించారు. దాంతో దీనిపై పెద్ద ఎత్తున కలకలం రేగింది. దానికి తోడు అక్కడకు సమీపంలో మరో రెండు మృతదేహాలు ఉన్నాయని కూడా అన్నారు. స్థానికులు ఈ మృతదేహాలను గమనించి, మీడియా ప్రతినిధులకు సమాచారం ఇచ్చారు. అయితే.. బలిమెల రిజర్వాయర్‌లో కనిపించిన మృతదేహం.. చింతల్పాంగీ గ్రామానికి చెందిన వ్యక్తిదని గుర్తించారు. కుటుంబ కలహాలతో వారం రోజుల క్రితం రిజర్వాయర్‌లో దూకినట్లు స్థానికులు తెలిపారు. దాంతో దీనిపై చెలరేగిన ఊహాగానాలకు ఫుల్స్టాప్ పడింది. ఎన్ కౌంటర్ జరిగినప్పటి నుంచి మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ (ఆర్కే) ఆచూకీ లేకపోవడంతో ఇప్పుడు బయటపడిన మృతదేహం ఆయనదా అనే సందేహాలు సైతం ఒక దశలో వ్యక్తమయ్యాయి. ఎన్కౌంటర్లో ఆర్కే మరణించారా.. తప్పించుకున్నారా, పోలీసులు నిర్బంధించారా అనేది మిస్టరీ మారిన నేపథ్యంలో ఈ మృతదేహం తీవ్ర ఉత్కంఠ రేపింది. అయితే.. చివరకు అది స్థానికుడిదేనని తేలడంతో చిక్కుముడి వీడింది. -
అప్పుడు గ్రేహౌండ్స్.. ఇప్పుడు మావోలు
► 2008లో లాంచీలో వెళ్తున్న గ్రేహౌండ్స్ సిబ్బందిపై మావోయిస్టుల దాడి ► ఆ దాడిలో 38 మంది మృతి.. నీటి కారణంగానే భారీ ప్రాణనష్టం సాక్షి, హైదరాబాద్: దాదాపు ఎనిమిదేళ్ల కిందట బలిమెల రిజర్వాయర్‌లో గ్రేహౌండ్స్ భారీగా నష్టపోవడానికి కారణమైన ‘నీరు’ ఇప్పుడు ఏఓబీలో మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బతీసింది. ఆ ప్రాంత భౌగోళికాంశాలపై పూర్తి పట్టున్న ఉదయ్, దయ లాంటి వాళ్లూ చనిపోవడానికి కారణమైంది. 2008 జూన్ 29న విశాఖపట్నం జిల్లా బలిమెల రిజర్వాయర్‌లో లాంచీలో వెళ్తున్న గ్రేహౌండ్స్ బలగాలపై కొండ పైనుంచి మావోయిస్టులు విరుచుకుపడ్డారు. ఆ సమయంలో లాంచీలో ఉన్న 64 మంది గ్రేహౌండ్స్ సిబ్బందిలో లాంచీ డ్రైవర్‌తోసహా 38 మంది చనిపోయారు. దాడి జరిగిన సమయంలో లాంచీలో ఉన్న వారు బయటపడాలనే ఉద్దేశంతో నీళ్లలోకి దూకేశారు. దీంతో ఎదురుదాడికి వారికి ఆస్కారం లేకుండా పోయింది. మావోయిస్టులు రిజర్వాయర్ చుట్టూ ఉన్న ఎత్తై కొండలపై మాటు వేయడంతో దాడి చేయడం వారికి తేలికైంది. దీంతో గ్రేహౌండ్స్ చరిత్రలో మర్చిపోలేని, పోలీసులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. అదే తరహాలోనే..: తాజా ఎన్కౌంటర్ సైతం దాదాపు ఇలాంటి పరిస్థితుల్లోనే, బలిమెలకు సమీపంలోనే జరిగింది. క్యాడర్‌కు కమాండో శిక్షణ ఇస్తున్న మావోయిస్టులు అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఏఓబీ మావోయిస్టులకు కంచుకోట. చాలా కాలంగా పార్టీ అగ్రనేతలు అక్కడే సురక్షితంగా ఉంటున్నారు. ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన మావోయిస్టులు ఎప్పుడు ప్లీనరీలు, ట్రైనింగ్ క్యాంప్స్ నిర్వహించాలన్నా ఏఓబీనే ఎంచుకుంటారు. భద్రత కూడా అదే స్థాయిలో ఏర్పాటు చేసుకుంటారు. మందుపాతరల ఏర్పాటు సహా మూడంచెల ఉంటుంది. ఈ శిక్షణ శిబిరంపై సమాచారం అందుకున్న గ్రేహౌండ్, ఎస్ఓటీ బలగా లు వారం రోజులుగా ముమ్మరంగా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. సోమవారం గుట్టల నుంచి కిందికి వెళ్తున్న సమయంలో మావోయిస్టులు కనిపించారు. బలగాల కదలికల్ని గుర్తించిన మావోయిస్టులు కాల్పులు ప్రారంభించారు. క్రమంలో సెంట్రీ విధు ల్లో ఉన్న మావోయిస్టులు పారిపోయేందుకు యత్నించారు. అయితే వీరున్న ప్రాంతానికి రెండు వైపులా వాగు ఉండటంతో హడావుడిలో అందులోకి దూకేశారు. దీంతో మావోయిస్టులు పూర్తిస్థాయిలో ఎదురుదాడి చేయలేకపోయారు. బలగాలు ఎత్తులో ఉండటంతో ఎన్కౌంటర్ తేలికైంది. దీంతో మావోయిస్టుల ఉద్యమ చరిత్రలోనే భారీగా 24 మంది ప్రాణాలు కోల్పోయారు. కేంద్ర కమిటీ సభ్యుడు అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే ఇప్పటికి చాలాసార్లు పోలీసు దాడుల నుంచి తప్పించుకున్నారు. ఈ ఎన్కౌంటర్ నుంచి కూడా ఆయన సురక్షితంగా తప్పించుకున్నట్లు సమాచారం. -
నాటుపడవ మునిగి ముగ్గురు మృతి
బలిమెల రిజర్వాయర్ లో నాటుపడవ మునిగి ఇద్దరు బాలికలు సహా ముగ్గురు మరణించారు.విశాఖ జిల్లా ముంచంగి పుట్టు మండలం పట్నపగులుపుట్టు చెందిన వ్యక్తులు గురువారం ఒడిశాలో జరిగిన సంతకు వెళ్లి తిరిగి వస్తుండగా.. ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వీరు ప్రయాణిస్తున్న పడవ బలిమెల రిజర్వాయర్ లో మునిగి పోయింది. పడవలో ప్రయాణిస్తున్న నలుగురు ఈదుకుంటూ ఒడ్డుకు చేరారు. మృతి చెందిన వారిని పూజారి రాజేశ్వరి(8), మండి దేశాయి(10), టంజి రొబ్బి(25)గా గుర్తించారు. -
ఆంధ్ర వాటా 56 టీఎంసీలు
ఒడిశాకు 39 టీఎంసీలు బలిమెల నీటి వినియోగంపై అధికారుల సమావేశం సీలేరు : ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాలకు నీరందించే బలిమెల రిజర్వాయర్‌లో ఏపీ వాటాగా 56 టీఎంసీలు నీరు ఉందని ఏపీ జెన్కో (మోతుగూడెం) ఇన్చార్జి సీఈ నాగభూషణరావు తెలిపారు. బలిమెల రిజ ర్వాయర్ నీటి వినియోగంపై బుధవారం బలిమెలలో సమీక్షించారు. అనంతరం సీలేరు ఏపీ జెన్కో గెస్ట్‌హౌస్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ బలిమెల జలాశయంలో మొత్తం 95 టీఎంసీల నీరు నిల్వ ఉందని చెప్పారు. ఇందులో ఒడిశాకు 39, ఆంధ్రకు 56 టీఎంసీలు కాగా, ఇప్పటికే 16 టీఎంసీలు ఒడిశా అదనంగా వాడుకుందన్నారు. విద్యుత్ ఉత్పత్తి అనంతరం గోదావరి డెల్టాకు నీటిని పంపడంతో ఒడిశాతోపాటు సమానంగా ఆంధ్ర నీటిని వాడుకోవలసి ఉందని, ఈమేరకు బలిమెలలో ఉన్న నీటిని ఆంధ్రకు తెచ్చుకునేందుకు నిర్ణయించామన్నారు. ప్రస్తుతం ఉన్న నీటితో రానున్న వేసవిలో విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చని, మాచ్‌ఖండ్, సీలేరు, మోతూగుడెం, డొంకరాయి జలాశయాల్లో ఉన్న నీటితో విద్యుత్ ఉత్పత్తికి ఎటువంటి ఢోకా లేదని తెలిపారు. సమావేశంలో ఒడిశా హైడ్రోపవర్ కార్పొరేషన్, ఒడిశా నీటి వనరుల విభాగం అధికారులతోపాటు ఏపీజెన్కో ఎస్ఈ మురళీ మోహన్, ఈఈ ఈఎల్ రమేష్, జలవిద్యుత్ కేంద్రం డీఈ సుధాకర్, ఏడీలు చలపతిరావు, భీమశంకరం పాల్గొన్నారు. -
బలిమెలలో బయటపడిన అయిదు మృతదేహాలు
ముంచంగిపుట్టు: రంగబయలు పంచాయతీ కొసంపుట్టు సమీపంలో బలిమెల జలాశయం గెడ్డలో నాటుపడవ బోల్తా పడి మునిగిన అయిదుగురి మృతదేహాలు శుక్రవారం బయటపడ్డాయి. ఈ దుర్ఘటన బుధవారం జరగడం తెలిసిందే. మృతులంతా గిరిజన విద్యార్థినులే. ఇద్దరు మాత్రం తర్వాత ప్రాణాలతో బయటపడ్డారు. కొసంపుట్టుకు చెందిన ఏడుగురు విద్యార్థినులు బుధవారం నాటుపడవపై కొసంపుట్టు నుంచి మల్కన్‌గిరి జిల్లా కాల్గూడ గ్రామానికి వెళ్తున్నారు. మధ్యలో పడవకు రంధ్రం ఏర్పడి నీరు చేరడంతో మునిగిపోయింది. ఇందులో ఉన్న ఒకే కుటుంబానికి చెందిన అక్కా చెల్లెళ్లు నాయకం జానకి (15), నాయికం కాంతమ్మ(13)లతో పాటు జనభ. కొండమ్మ(12), ముందిలి జోగతి(10), ముందిలి లక్ష్మి(13) మృతి చెందారు. ఎం.రామ్‌నాథ్, ఎం.సురేంద్ర ప్రాణాలతో బయటపడ్డారు. శుక్రవారం మృతదేహలను గ్రామస్తులే వెలికి తీశారు. అధికారులెవరూ రాకపోవడంతోమృతదేహాలను వీఆర్వో కె.కోటిబాబు, సర్పంచ్ జి.శ్రీను సమక్షంలో గెడ్డ వద్దే ఖననం చేశారు. జీపీఏస్ పాఠశాలలో రెండేళ్లుగా ఉపాధ్యాయుల్లేక మూతపడటంతో విద్యార్థులు చదువు కోసం దూరప్రాంతానికి వెళ్లాల్సి రావడం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మృతుల కుటుంబాలను వైఎస్సార్ సీపీ నేతలు పాంగి పాండురంగస్వామి, కె.గాసిరావు, ఎస్.రుక్మాంగధర్, ఆర్.గణపతి పరామర్శించారు. పాండురంగ స్వామి మాట్లాడుతూ మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించాలని డిమాండ్ చేశారు. -
బలమెల జలాశయంలో ప్రమాద స్థాయిలో నీటి మట్టం
పై-లీన్ తుపాన్ వల్ల ఉత్తరాంధ్రలోని భారీగా వర్షాలు కురిశాయి. దాంతో సీలేరు, డొంకారాయి, బలమెల జలాశయాలోకి భారీగా వర్షపు నీరు చేరుకుంది. దాంతో అధివారం ఉదయం నాటికి అయా జలాశయాల్లో నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరింది. అయితే బలమెల జలాశయంలో నీరు గరిష్ట స్థాయికి మించి ప్రమాద స్థాయికి చేరుకుంది. దాంతో18 వేల క్యూసెక్కుల నీటీని అధికారులు ఆదివారం దిగువకు విడుదల చేశారు.