balineniSrinivasa Reddy
-
‘మొక్క’ తొడిగిన ‘పచ్చని’ ఆశయం
పచ్చదనం పెంపుదలే ధ్యేయంగా వనమహోత్సవ యజ్ఞంలో భాగంగా శనివారం గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం డోకిపర్రు వద్ద జరిగిన 70వ వనమహోత్సవ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ యజ్ఞంలో పాల్గొని వేప మొక్క నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం అటవీ శాఖ ఏర్పాటు చేసిన జీవ వైవిధ్యం, వన్యప్రాణి సంరక్షణ ప్రదర్శనశాలను ముఖ్యమంత్రి పరిశీలించారు. రాష్ట్రంలో ఈ ఏడాది 25 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యంగా అన్ని శాఖల సహకారంతో కృషిచేయనున్నట్టు చెప్పారు. ప్రతి ఒక్కరూ కనీసం రెండు మూడు మొక్కలు నాటితే భవిష్యత్తు తరాలు భద్రమైన జీవితాన్ని గడపగలుగుతాయని అన్నారు. ఈ మేరకు సభాప్రాంగణంలో ఉన్న వారందరితో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిజ్ఞ చేయించారు. సాక్షి, తాడికొండ(గుంటూరు) : జాతీయ అటవీ చట్టం ప్రకారం రాష్ట్ర విస్తీర్ణంలో 33 శాతం మొక్కలు పెంచడమే లక్ష్యంగా పచ్చదనం పెంపొందించడానికి అన్ని శాఖల సహకారంతో ఈ ఏడాది రాష్ట్రంలో 25 కోట్ల మొక్కలు నాటేందుకు ప్రభుత్వం సంకల్పించిందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. 70వ వన మహోత్సవంలో భాగంగా గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం డోకిపర్రులో శనివారం నిర్వహించిన సభలో ఆయన ప్రసంగిస్తూ భూమి మీద పచ్చదనం లేకపోతే భవిష్యత్తులో అంతా ఎడారిగా మారిపోతుందని, పంచభూతాలను మనం పరిరక్షించుకోవాలని అన్నారు. ఏలిన వారు మంచివారైతే...: మంత్రి బాలినేని రాష్ట్రాన్ని పచ్చదనం చేసేందుకు చేస్తున్న ఈ ప్రయత్నంలో వరుణుడు కూడా కరుణించాడని, గత 5 ఏళ్లుగా రాష్ట్రంలో వర్షాలు లేవని, పెద్దలు అన్న రీతిలో ఏలిన వారు మంచివారైతే వర్షాలు పడతాయని జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసి సాగర్, శ్రీశైలం ఇతర ప్రాజెక్టులు కళకళలాడుతున్నాయని రాష్ట్ర ఇంధన వనరులు, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక రంగ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో హరితాంధ్రప్రదేశ్ చేయాలని కలలు కన్నారని, నేడు జగన్ మోహన్‌రెడ్డి హయాంలో ఆ కల నెరవేరనుందన్నారు. అటవీ శాఖకు సంబంధించి ఎర్ర చందనం నిల్వలు కడప, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో మాత్రమే ఉన్నాయని, అక్కడ స్మగ్లింగ్ చేసి దోచుకున్న పరిస్థితులు గతంలో ఉన్నందున ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహనరెడ్డి వచ్చిన తరువాత ఎర్ర చందనం కాపాడేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నారన్నారన్నారు. ఎర్రచందనం అమ్మేందుకు అనుమతివ్వాలని కేంద్ర మంత్రిని కోరామని, అందుకు ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. ముఖ్యమంత్రి నేతృత్వంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన కంఫా నిధులు రూ.1734 కోట్లు అందుబాటులోకి వచ్చాయని వాటిని సద్వినియోగం చేసి రాష్ట్రంలో విస్తారంగా పచ్చదనం పెంచేందుకు కృషి చేస్తానన్నారు. శ్రామికుల కష్టాలు, కన్నీళ్లు, తుడిచే నాయకుడు జగనన్న శ్రామికుల కష్టాలు, కన్నీళ్లు తుడిచే నాయకుడు వైఎస్ జగనన్న అని, వ్యవసాయం అంటే దండగ కాదు పండగ అని నిరూపిస్తూ అభివృద్ధిని పరుగులెత్తిస్తున్న ముఖ్యమంత్రికి పాదాభివందనమని తాడికొండ ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి అన్నారు. రాజధానిలో ఎమ్మెల్యేగా గెలిపించినందుకు తాడికొండ నియోజకవర్గ ప్రజలకు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు. అధికారులకు ఆయుధాలు, పురస్కారాల పంపిణీ అనంతరం ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లకు ఆయుధాలు పంపిణీ చేశారు. చిత్తూరు ఈస్ట్ డివిజన్ ఎఫ్ఎస్వో చినబాబు, ఆర్.సలాఉద్దీన్, ఎఫ్‌డీవో లక్ష్మీ ప్రసాద్, పి.కామేశ్వరరావు, ఎస్.రవిశంకర్ తదితరులకు ఆయుధాలను పంపిణీ చేశారు. విధుల్లో నైపుణ్యాలు ప్రదర్శించిన 80 మంది అటవీ శాఖ అధికారులకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా అవార్డులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని), హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత, పశు సంవర్థక, మత్స్య శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణరావు, ప్రభుత్వ చీఫ్ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, నంబూరు శంకరరావు, విడదల రజని, ఆళ్ళ రామకృష్ణారెడ్డి, కిలారి వెంకట రోశయ్య, డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు. సామినేని ఉదయభాను వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శులు లేళ్ల అప్పిరెడ్డి, మర్రి రాజశేఖర్, గుంటూరు–2 సమన్వయకర్త చంద్రగిరి ఏసురత్నం, నగర అధ్యక్షుడు పాదర్తి రమేష్ గాంధీ, పార్టీ నాయకులు నూతలపాటి హనుమయ్య, కావటి మనోహర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. సీఎంకు బోన్సాయ్ మొక్కను బహూకరిస్తున్న మంత్రి బాలినేని సభ కొనసాగిందిలా... • ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డికి మొక్కలనే పుష్పగుచ్ఛంగా స్పెషల్ చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ ఐఏఎస్ అందజేశారు. • సీఎం ప్రసంగం ప్రారంభించే సమయంలో మహిళలు, విద్యార్థులు సీఎం, సీఎం అంటూ ఉత్సాహభరితంగా చేతులు పైకెత్తి కేరింతలు కొట్టడంతో ఆయన ఉత్సాహంగా నవ్వుతూ ప్రసంగం ప్రారంభించారు. • ప్రసంగం ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సభా ప్రాంగణంలో ఉన్నవారందరితో ప్రతిజ్ఞ చేయించారు. • అటవీ శాఖ తరఫున ముఖ్యమంత్రికి మంత్రి బాలినేని చేతుల మీదుగా పలువురు అధికారులు బోన్సాయ్ ప్లాంట్‌ను బహుమతిగా అందజేశారు. • కార్యక్రమం చివరిలో జనగణమన జాతీయ గీతాలాపనతో కార్యక్రమం ముగిసింది. -
అద్వితీయం
ఒంగోలు సిటీ: రాష్ట్ర మంత్రివర్గంలో ప్రకాశం జిల్లా నుంచి ఇద్దరికి అవకాశం లభించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల సమయంలో ప్రకటించిన విధంగానే సీనియర్ నేత, ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికైన బాలినేని శ్రీనివాసరెడ్డికి తన మంత్రివర్గంలో తొలి ప్రాధాన్యం కల్పించారు. జిల్లాకు బాలినేనితో పాటు మరో మంత్రి పదవిని బహుమతిగా ఇచ్చారు. అదీ ఎస్సీ సామాజిక వర్గం నుంచి ప్రాతినిథ్యం కల్పించారు. విద్యాధికుడు ఆదిమూలపు సురేష్‌ను విద్యాశాఖ మంత్రి పదవి వరించింది. జిల్లాలో ఇద్దరికి మంత్రి పదవులు రావడం ఇదే ప్రప్రథమం. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇరువురిని మంత్రులుగా ప్రకటించడం సంచలనమే. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారికి పదవి రావడం ఇది రెండోసారి. కాంగ్రెస్ నుంచి దివంగత నేత జీవీ శేషు ఎస్సీ సామాజిక వర్గం నుంచి మంత్రిగా చేశారు. ఆ తర్వాత ఈ సమాజికవర్గం నుంచి ఎస్సీ మంత్రులు జిల్లా నుంచి లేరు. చాలా ఏళ్ల తర్వాత సురేష్‌కు మంత్రి పదవి ఇచ్చి ఎస్సీలకు ప్రాతినిథ్య లోటును జగన్ భర్తీ చేశారు. గవర్నర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం రాష్ట్ర గవర్నర్ నరసింహన్ జగన్ కోటరీలోని మంత్రులతో పదవీ ప్రమాణస్వీకారం చేయించారు. శనివారం వెలగపూడిలో ఈ కార్యక్రమం జరిగింది. బాలినేని శ్రీనివాసరెడ్డి (వాసు) అనే నేను అంటూ తెలుగులో బాలినేని పదవీ ప్రమాణం చేశారు. ఆదిమూలపు సురేష్ ఆంగ్లంలో ప్రమాణ స్వీకారం చేశారు. విద్యాధికుడు, పశ్చిమ ప్రాంతానికి ప్రాతినిథ్యం ఇవ్వడంలో భాగంగానే ఎస్సీ సామాజిక వర్గానికి జగన్ తన మంత్రి మండలిలో తగిన ప్రాధాన్యం ఇవ్వడం అన్ని వర్గాల్లో, అభిమానుల్లో హర్షాతిరేకాలు ఎదురవుతున్నాయి. మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన బాలినేని, సురేష్లను పలువురు అభినందించారు. ఘనంగా సన్మానించారు. ఎంతో గర్వంగా ఉంది : బాలినేని రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రిగా బాధ్యతలను చేపట్టిన తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి సాక్షితో మాట్లాడారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మంత్రి మండలిలో తాను గనుల శాఖ మంత్రిగా పని చేశానని అన్నారు. ఆయన తనయుడు జగన్ ముఖ్యమంత్రిగా మంత్రి మండలిలో విద్యుత్తు, అటవీశాఖ మంత్రిగా చేస్తున్నానని అన్నారు. ఇరువురి మంత్రి మండలిలో తనకు గౌరవం దక్కినందుకు ఎంతో గర్వంగా ఉందని అన్నారు. పదవికి వన్నె తెచ్చే విధంగా పని చేస్తానని, పారదర్శక పాలన అందిస్తామని చెప్పారు. జగన్ «ఆశయాలు, ఆలోచనలు, లక్ష్యాలకు అనుగుణంగా పని చేస్తానన్నారు. జిల్లాకు, రాష్ట్రానికి మంచి పేరు తెస్తానని ధీమా వ్యక్తం చేశారు. సీఎం వైఎస్ జగన్, గవర్నర్ నరసింహన్‌ల సమక్షంలో మంత్రులుగా పదవీ ప్రమాణస్వీకారం చేస్తున్న -
మితిమీరిపోతున్న టీడీపీ అరాచకం.. బాలినేని అరెస్ట్
సాక్షి, ప్రకాశం : టీడీపీ నేతల అరాచకాలు రోజురోజుకి మితిమీరిపోతున్నాయి. ఓటమి భయంతో అక్రమ అరెస్ట్ చేయిస్తున్నారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ ప్రతిపక్ష పార్టీ నేతలే లక్ష్యంగా అక్రమ కేసులు బనాయిస్తున్నారు. నిన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయగా.. నేడు కమ్మపాలెంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడానికి వెళ్తున్న వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌ను అరెస్ట్ చేశారు. ఒంగోలులోని కమ్మపాలెంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు బాలినేని శ్రీనివాస్ రెడ్డి వెళ్తున్న సమయంలో టీడీపీ కార్యకర్తలు అడ్డుకొన్నారు. కమ్మపాలెంలోకి వైఎస్సార్సీపీని అనుమతించేది లేదని టీడీపీ కార్యకర్తలు కాలనీ ఎంట్రన్స్ వద్ద బైఠాయించారు. ఈ క్రమంలో రెండు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది. పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవాన్ని అడ్డుకున్న టీడీపీ నేత దామచర్ల వర్గీయులను వదిలేసి వైఎస్సార్సీపీ నేతలను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ.. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవాన్ని టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారన్నారు. తమ కార్యకర్తలు తలచుకుంటే టీడీపీ నేత దామచర్ల జనార్దన్ నియోజకవర్గంలో తిరగనివ్వరు.. కానీ తమది అలాంటి సంస్కృతి కాదన్నారు. ఈ ఘటనను ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. త్వరలోనే కమ్మపాలెంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తామని బాలినేని పేర్కొన్నారు. (సీఎం సొంత జిల్లాలో పోలీసుల అరాచకం) -
వైఎస్ఆర్సీపీ నేత బాలినేని అరెస్ట్
-
ఎమ్మెల్యే అవినీతి వల్లే కాంట్రాక్టర్లకు నష్టాలు
ఒంగోలు: నగరంలో అభివృద్ధి పనులు చేపడుతున్న కాంట్రాక్టర్లు ఎందుకు నష్టం వస్తోంది? ఇందుకు కచ్చితంగా స్థానిక ఎమ్మెల్యే పర్సంటేజీల అవినీతే కారణమని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. స్థానిక 3వ డివిజన్లోని కరణం బలరాం కాలనీలో ఆదివారం ఆయన రావాలి జగన్–కావాలి జగన్ కార్యక్రమం చేపట్టారు. ఒకప్పుడు ఏ పనిచేసినా ఎంతో కొంత లెస్‌లకు కాంట్రాక్టర్లు టెండర్లు దక్కించుకొని లాభం పొందేవారని గుర్తు చేశారు. నేడు నిర్ణయించిన ధరకన్నా అధికంగా వేసినా కాంట్రాక్టర్లు నష్టపోతున్నారని ఎమ్మెల్యే పేర్కొనడం చూస్తే ఆయన అవినీతి పర్వం ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవాలంటూ ఒంగోలు ఎమ్మెల్యే తీరుపై ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన గడపగడపకూ వెళ్లి ప్రజలతో రాబోయే ఎన్నికల్లో తన బలం, బలహీనతలు మీరేనని పేర్కొన్నారు. ఇంటింటికీ వెళ్లి నవరత్నాల గురించి తెలియజేశారు. జగన్మోహన్రెడ్డి ప్రకటించిన పథకాలను ప్రస్తుతం అధికారంలో ఉన్న చంద్రబాబు ఏ విధంగా కాపీ కొడుతున్నారో వివరించారు. జగన్మోహన్రెడ్డి ప్రశ్నిస్తే చంద్రబాబునాయుడు డబ్బులు తీస్తున్నాడని, లేకుంటే జనాన్ని పట్టించుకునేవాడే కాదని బాలినేని విమర్శించారు. శివారు కాలనీల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలిస్తే గుండె తరుక్కుపోతోందన్నారు. కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేని ప్రభుత్వం చాలా అభివృద్ధి చేసినట్లు ప్రచారం చేసుకోవడం దారుణమన్నారు. సురక్షిత నీరు, మురుగు నీటి పారుదల వ్యవస్థలను మెరుగు పరచకుండా ఓట్లు అడిగే ధైర్యం అధికార పార్టీకి ఎక్కడ ఉందో ప్రశ్నించాలన్నారు. కుటుంబాలు పెరిగినా ఎప్పుడో ఇచ్చిన ఇళ్లల్లో ఇంకా మగ్గిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే ప్రతి కుటుంబానికి ఇల్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. శివారు కాలనీల ప్రజలకు విద్య, వైద్యం అందుబాటులోకి తెస్తామన్నారు. ఆయా కాలనీల్లో ఉపాధి అవకాశాలు పెంపొందిస్తామని భరోసా ఇచ్చారు. పొదుపు మహిళల రుణాలను దశల వారీగా రద్దు చేస్తామని చెప్పారు. పోతురాజు కాలువను అభివృద్ధి చేసి భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను తీసుకొస్తామని తెలిపారు. దోమలు లేని ఆహ్లాద వాతావరణ పరిస్థితులు తీసుకొస్తామని, వృద్ధులకు రూ.3 వేల పెన్షన్ ఇస్తామంటూ వైఎస్సార్ సీపీ ఏ వి«ధంగా ప్రజలకు అండగా ఉండబోతుందో తెలియజేస్తూ ఆసరా ఇస్తే అండగా నిలుస్తానంటూ ప్రజలకు బాలినేని భరోసా కల్పించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు, వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కుప్పం ప్రసాద్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు గంటా రామానాయుడు, 3వ డివిజన్ అధ్యక్షుడు షేక్ జాఫర్, నాయక్, సుల్తాన్‌బాషా, షేక్ ఆరిఫ్, రంగారావు, ఎండీ షరీఫ్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దూళిపూడి ప్రసాద్‌నాయుడు, దేవరపల్లి అంజిరెడ్డి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు గంగాడ సుజాత, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పురిణి ప్రభావతి, మహిళా విభాగం జిల్లా అధికార ప్రతినిధి బడుగు ఇందిర, జిల్లా ప్రధాన కార్యదర్శి భూమిరెడ్డి ఇందిర, ఒంగోలు నియోజకవర్గ మహిళా విభాగం ఇన్చార్జి బైరెడ్డి అరుణ, మైనార్టీ విభాగం రాష్ట్ర నాయకులు షేక సలాం, కరిముల్లా, రాచమల్లు బ్రహ్మారెడ్డి, ఓగిరాల వెంకట్రావు, పులుగు అక్కిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మోసగాళ్లకు గుణపాఠం చెప్పండి
రాబోయే ఎన్నికల్లో మోసపూరిత హామీలు ఇచ్చే వారికి గుణపాఠం చెప్పాలని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో పలు కాలేజీల విద్యార్థులతో బాలినేని ఆదివారం ముఖాముఖి నిర్వహించారు. ఒంగోలు:పేద విద్యార్థుల చదువుకు వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అండగా నిలిచిందని మాజీమంత్రి, వైనెస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో మోసపూరిత హామీలు ఇచ్చేవారికి తగిన గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. ఆదివారం ఇక్కడి వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో పలు కాలేజీలకు చెందిన విద్యార్థులతో బాలినేని ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ వైఎస్సార్ హయాంలో జిల్లాలో శాశ్వత అభివృద్ధికి చిరునామాగా రామతీర్థం రిజర్వాయర్, గుండ్లకమ్మ ప్రాజెక్టు, రిమ్స్ తీసుకురావడంతోపాటు దాదాపు 70 శాతానికి పైగా వెలిగొండ ప్రాజెక్టు పనులు, మినీ స్టేడియం, నగరంలో నీటి ఎద్దడి నివారణకు ప్రత్యేకంగా ఏడు ఓవర్‌హెడ్ ట్యాంకుల నిర్మాణం చేపట్టామన్నారు. శివారు కాలనీల్లో 8 వేలకు పైగా పట్టాల పంపిణీతోపాటు 2,500కు పైగా గృహాల నిర్మాణం పూర్తిచేయగలిగామన్నారు. యూనివర్శిటీ కోసం 150 ఎకరాల భూమిని పేర్నమిట్ట వద్ద గుర్తించామని, వైఎస్సార్ జీవించి ఉంటే వర్శిటీ ఈ పాటికి పూర్తయ్యేదన్నారు. హైదరాబాద్ కేంద్రంగా ఐటీ అభివృద్ధి జరిగిందని, ఈ నేపథ్యంలో నాలుగేళ్లు దాటినా టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఐటీ ఉద్యోగాలు కల్పించలేకపోయిందన్నారు. అకడమిక్ వర్శిటీని సైతం ఏర్పాటు చేయలేకపోయిన టీడీపీ నాయకులు ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ హడావుడిగా శంకుస్థాపనలు, నిరుద్యోగ భృతి పేరుతో మభ్యపెడుతున్నారన్నారు. విద్యార్థులకు అండగా ఉంటానని, ఏ సమయంలోనైనా తనను సంప్రదించవచ్చని చెప్పారు. బాలినేని ప్రణీత్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులందరినీ ఒక గ్రూప్‌గా చేసే ప్రక్రియ మొదలైందని, జగన్మోహన్రెడ్డి ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం ద్వారా 2019 ఎన్నికల్లో కీలకంగా వ్యవహరిద్దామన్నారు. నగర అధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు మాట్లాడుతూ.. అధికారదాహం, ధనదాహంతో టీడీపీ పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. ఒంగోలుకు మంజూరైన ట్రిపుల్ ఐటీ నిర్మాణంలో తాత్సారం చేసి చివరకు పామూరులో శంకుస్థాపన చేశారన్నారు. యువజన విభాగం జిల్లా అధ్యక్షులు గంటా రామానాయుడు, విద్యార్థి విబాగం నగర అధ్యక్షులు దాట్ల యశ్వంత్‌వర్మ, వైఎస్సార్ సేవాదళ్ జిల్లా అధ్యక్షులు గోపిరెడ్డి ఓబుల్‌రెడ్డి తదితరులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. నిరుద్యోగ భృతి ఎగ్గొట్టేందుకు ప్రభుత్వం సిద్ధపడిందని ధ్వజమెత్తారు. కార్యక్రమం ఏర్పాటు చేసిన బాచి, రాచమల్లు బ్రహ్మారెడ్డిని విద్యార్థులు అభినందించారు. విద్యార్థులతో ముఖాముఖి అనంతరం బాలినేని శ్రీనివాసరెడ్డితోపాటు ఆయన కుమారుడు ప్రణీత్‌రెడ్డిని గజమాలతో సత్కరించారు. -
వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శులుగా బాలినేని, రెహమాన్
హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శులుగా అధినేత జగన్మోహన్రెడ్డి మరో ఇద్దరిని నియమించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని, తెలంగాణ రాష్ట్రం నుంచి హెచ్ఏ రెహమాన్‌ను నియమించారు. ఇదిలా ఉండగా విశాఖపట్నానికి చెందిన బీ జాన్ వెస్లీ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా, ప్రకాశం జిల్లా పర్చూరుకు చెందిన గొట్టిపాటి.