సాక్షి, ప్రకాశం : టీడీపీ నేతల అరాచకాలు రోజురోజుకి మితిమీరిపోతున్నాయి. ఓటమి భయంతో అక్రమ అరెస్ట్ చేయిస్తున్నారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ ప్రతిపక్ష పార్టీ నేతలే లక్ష్యంగా అక్రమ కేసులు బనాయిస్తున్నారు. నిన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయగా.. నేడు కమ్మపాలెంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడానికి వెళ్తున్న వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌ను అరెస్ట్ చేశారు.
ఒంగోలులోని కమ్మపాలెంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు బాలినేని శ్రీనివాస్ రెడ్డి వెళ్తున్న సమయంలో టీడీపీ కార్యకర్తలు అడ్డుకొన్నారు. కమ్మపాలెంలోకి వైఎస్సార్‌సీపీని అనుమతించేది లేదని టీడీపీ కార్యకర్తలు కాలనీ ఎంట్రన్స్ వద్ద బైఠాయించారు. ఈ క్రమంలో రెండు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది. పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవాన్ని అడ్డుకున్న టీడీపీ నేత దామచర్ల వర్గీయులను వదిలేసి వైఎస్సార్‌సీపీ నేతలను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ.. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవాన్ని టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారన్నారు. తమ కార్యకర్తలు తలచుకుంటే టీడీపీ నేత దామచర్ల జనార్దన్ నియోజకవర్గంలో తిరగనివ్వరు.. కానీ తమది అలాంటి సంస్కృతి కాదన్నారు. ఈ ఘటనను ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. త్వరలోనే కమ్మపాలెంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తామని బాలినేని పేర్కొన్నారు. (సీఎం సొంత జిల్లాలో పోలీసుల అరాచకం)
Comments
Please login to add a commentAdd a comment