Baloch activists
-
బలూచ్ కార్యకర్త మృతి.. పాక్పై అనుమానం
టొరంటో: ప్రఖ్యాత కార్యకర్త కరీమా బలూచ్ అనుమానాస్పద స్థితిలో మరణించారు. పాకిస్తాన్ సైన్యం, బలూచిస్తాన్ ప్రభుత్వ దురాగతాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న కరీమా బలూచ్ మృతదేహాన్ని టొరంటోలో కనుగొన్నారు. 2016లో పాకిస్తాన్ నుంచి తప్పించుకుని వెళ్లిన కరీమా ప్రస్తుతం కెనడాలో శరణార్థిగా ఆశ్రయం పొందుతున్నారు. కెనడా పోలీసులు లేక్షేర్ ప్రాంతంలో ఓ ద్వీపంలో అనుమానాస్పద స్థితిలో ఉన్న ఆమె మృతదేహాన్ని గుర్తించారు. ఇక కరీమా పాక్ సైన్యం, బలుచిస్తాన్ ప్రభుత్వం దురాగతాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో టొరంటో సీనియర్ జర్నలిస్ట్ ఒకరు మాట్లాడుతూ.. ‘కరీమా మరణం వెనక పాక్ హస్తం ఉందనే అనుమానాలు తలెత్తుతున్నాయి. టొరంటో పోలీసులు, కెనడా సెక్యూరిటీ ఏజెన్సీ సీఎస్ఐఎస్ ఈ కోణంలో దర్యాప్తు చేయాలి. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో పాక్ ఐఎస్ఐ ఏజెంట్ల బారి నుంచి దేశాన్ని కాపాడటానికి చర్యలు తీసుకోవాలి’ అని కోరారు. (చదవండి: ‘పాక్ ఆర్మీ ఆగడాల నుంచి రక్షించండి.. ప్లీజ్’ ) పాకిస్తాన్ ఆక్రమణ నుంచి బలుచిస్తాన్ వేరుపడి స్వేచ్ఛ పొందాలని కరీమా బలంగా కోరుకునేది. ఈ నేపథ్యంలో పాక్ మాజీ ఆర్మీ అధికారులు కెనడాలో స్థిరపడటాన్ని వ్యతిరేకించే కరీమా ఈ విషయంలో వారిపై పదునైన విమర్శలు చేసేంది. అంతేకాక కరీమా ఎంతో ధైర్య సాహసాలు గల మనిషి. కెనడాలో ఐఎస్ఐ ఆపరేషన్లకు ఆమె అడ్డంకిగా మారింది. ఇక కరీమా మృతికి సంతాపంగా బలోచ్ నేషనల్ మూవ్మెంట్ 40 రోజులు సంతాప దినాలు ప్రకటించింది. ఎలాంటి కార్యకలపాలు నిర్వహించకూడాని నిర్ణయించింది. ఇక ‘కెనడాలో ప్రవాసంలో నివసిస్తున్న బీఎస్ఎం నాయకురాలు, బలూచ్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ (బీఎస్ఓ) మాజీ చైర్పర్సన్ కరీమా బలిదానం బలూచ్ దేశానికి, జాతీయ ఉద్యమానికి తీరని నష్టమని’ బలూచ్ నేషనల్ మూవ్మెంట్ కార్యదర్శి తెలిపారు. "బానుక్ కరీమా మరణంతో, మేము ఒక దూరదృష్టిగల నాయకురాలిని, జాతీయ చిహ్నాన్ని కోల్పోయాము. శతాబ్దాల పాటు పూడ్చలేని నష్టం ఇది’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. (చదవండి: ఆ 63 మంది హాయిగా ఇంట్లో ఉండేవారు!) ఇక నాలుగేళ్ల క్రితం అంటే 2016లో కరీమా ప్రధాని నరేంద్ర మోదీకి రక్షాబంధన్ సందేశం పంపారు. అదే ఏడాది ఆమె పాక్లో తన ప్రాణానికి ప్రమాదం ఉండటంతో కొందరు స్నేహితులు, కార్యకర్తల సాయంతో దేశం విడిచి పారిపోయారు. ఇక అదే ఏడాది బీబీసీ వెలువరించిన 100మంది అత్యంత ప్రభావవంతైన మహిళల జాబితాలో కరీమా చోటు దక్కించుకున్నారు. -
ముషారఫ్ ఒక అంతర్జాతీయ ఉగ్రవాది
వాంకోవర్ (కెనడా) : పాకిస్తాన్ మాజీ సైనిక పాలకుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ని అంతర్జాతీయ తీవ్రవాదిగా ప్రకటించాలని వరల్డ్ బలూచ్ ఉమెన్ ఫోరమ్(డబ్ల్యూబీడబ్య్లూఎఫ్) డిమాండ్ చేసింది. ప్రస్తుతం దుబాయ్లో ఉంటున్న ముషారఫ్ పాకిస్తాన్ న్యూస్ చానల్తో మాట్లాడిన విషయాలను ఐక్యరాజ్యసమితి పరిగణలోకి తీసుకుని.. ఆయనను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని డబ్ల్యూబీడబ్య్లూఎఫ్ నాయకురాలు ప్రొఫెసర్ నీలా ఖాద్రి బలూచ్ డిమాండ్ చేశారు. కశ్మీర్లో మారణహోమాన్ని సృష్టిస్తున్న లష్కరే తోయిబా, జమాతే ఉద్ దవా సంస్థలంటే అభిమానమని.. అలాగే హఫీజ్ సయీద్కు మద్దతుదారుడినని చెప్పడం ద్వారా ముషారఫ్ ఉగ్రవాదాన్ని సమర్థించారని ఆమె అన్నారు. ముషారఫ్ మాట్లాడిన మాటలను సాక్ష్యాలుగా తీసుకుని లష్కరో తోయిబా, జమాతే ఉద్ దవాను ఉగ్రసంస్థలుగా ప్రకటించడంతో పాటు.. ముషారఫ్ను ప్రపంచ ఉగ్రవాదిగా ప్రకటించాలని ఆమె అమెరికాను కోరారు. లష్కరే తోయిబా ఏర్పాటు, విస్తరణ, రిక్రూట్మెంట్లు, ఉగ్రదాడులకు ముషారఫ్ అందించిన సహకారంపై అమెరికా పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని ఆమె అమెరికాను కోరారు. ఇదిలా ఉండగా ముషారఫ్ వ్యాఖ్యలను గమనిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. -
'క్రిమినల్ దేశంతో చైనా చేతులు కలపొద్దు'
వాంకోవర్: భారత ప్రధాని నరేంద్రమోదీ ఉద్వేగభరిత ప్రసంగం బలూచిస్థాన్ పౌరులకు గట్టి ధైర్యాన్ని ఇచ్చినట్లుంది. మొన్నటి వరకు స్థానికంగా, ఇటీవల ఐక్యరాజ్య సమితిలో పాకిస్థాన్ కు వ్యతిరేకంగా తమ గొంతు వినిపించిన ఆ ప్రాంతపౌరులు ఇప్పుడు ఏకంగా పాక్ తో సంబంధంపెట్టుకుంటున్న దేశాల్లో కూడా నిరసనలకు దిగుతున్నారు. తమ పరిస్థితి చూసి కూడా పాక్ తో సంబంధాలు పెట్టుకోవాలనుకోవడం ముమ్మాటికి తమ హక్కులను ఉల్లంఘించడమే అని వారు నినదిస్తున్నారు. త్వరలోనే వరుసగా మూడు రోజులపాటు కెనాడలోని బలూచిస్థాన్ వాసులు చైనా విదేశాంగ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగనున్నారు. మూడు రోజులపాటు నిర్వహించే ఈ ఆందోళనలో పాక్తో చైనా సంబంధం పెట్టుకోవడాన్ని నిలదీయనున్నారు. ఈ ఏడాది జులైలో ప్రధాని మోదీ బహిరంగ కార్యక్రమంలో మాట్లాడుతూ పాక్ లో ఉన్న బలూచ్ వాసులు అష్టకష్టాలుపడుతున్నారని, వారు చిత్ర హింసలకు గురవుతున్నారని, వారికి స్వాతంత్ర్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ప్రకటనతో అప్పటి వరకు పాక్ పై పీకల్లోతూ కోపంగా ఉన్న బలూచ్ వాసులు తమ గొంతును ప్రపంచానికి వినిపించడం మొదలుపెట్టారు. కెనాడాలోని చైనా కాన్సులేట్ ముందు నిర్వహించే ధర్నాలో 'బలూచ్ ప్రాంతంలో నేరాలు చేస్తున్న పాకిస్థాన్ భాగస్వామిగా ఉండటం చైనా మానుకోవాలి' అని తీర్మానం చేయనున్నారు. బలూచ్ ప్రాంతంలో పాక్ యుద్ధ నేరాలకు పాల్పడుతోందని, మానవత్వాన్ని హత్య చేస్తుందని, హింసాకాండను కొనసాగిస్తోందని వారంతా ఆందోళన చేస్తున్నారు. 'ది ప్రీ బలూచిస్థాన్ మూమెంట్(ఎఫ్బీఎం) అనే సంస్థ ఈ ఆందోళనకు నాయకత్వం వహిస్తోంది. -
పాక్ నుంచి కాపాడండి : బలుచిస్తాన్ వాసులు
న్యూయార్క్ : పాకిస్తాన్లో మానవ హక్కులు మంటగలిసిపోతున్నాయని నినదిస్తూ బలూచిస్తాన్ వాసులు బుధవారం ఐక్యరాజ్యసమితి కార్యాలయం ముందు నిరసనకు దిగారు. బలుచిస్తాన్పై పాకిస్తాన్ ప్రభుత్వం చేస్తున్న బాంబు దాడులను ఆపాలంటూ నినాదాలు చేశారు. పాకిస్తాన్ నుంచి తమకు స్వాతంత్య్రం కావాలంటూ బలుచిస్తాన్ వాసులు డిమాండ్ చేశారు. బలూచ్ ఫ్రీడం కార్యకర్తలు, మానవహక్కుల కార్యకర్తలు ఈ ఈవెంట్లో పాల్గొన్నారు.పాకిస్తాన్లో పశ్చిమ భూభాగంగా ఉన్న ఈ ప్రాంతంపై ఆ ప్రభుత్వం వివక్ష చూపుతూ వారి హక్కులను కాలరాస్తున్న క్రమంలో, బలుచిస్తాన్ వాసులు స్వాతంత్య్ర హక్కుల కోసం గత కొంత కాలంగా పోరాటం చేస్తున్నారు. పాక్ తమపై చేస్తున్న దాడులనుంచి రక్షించాలని వారు కోరుతున్నారు. అంతర్జాతీయ వ్యవహారమని బలూచ్ స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న నాయకుడు మజ్దాక్ దిల్షాన్ బలూచ్ పేర్కొన్నారు. అరబ్ ప్రపంచం, యూరోపియన్ యూనియన్, నార్త్ అమెరికా లాంటి బలమైన దేశాలు, కూటములు బలూచిస్తాన్ విషయంలో పాక్పై ఆంక్షలను విధించాలని దిల్షాన్ కోరుతున్న సంగతి తెలిసిందే. పాక్ ప్రభుత్వం చేస్తున్న ఈ వివక్షపూర్వక చర్యలపై బలుచిస్తాన్ ప్రజలకు భారత్ మద్దతుగా నిలుస్తుందని ప్రధాని మోదీ కూడా ప్రకటించారు. -
జర్మనీలో బలూచ్ కార్యకర్తలు ఆందోళన