ban entry of citizens
-
Russia War: యుద్ధం వేళ పుతిన్ సంచలన నిర్ణయం
మాస్కో: ఉక్రెయిన్‌లో రష్యా బలగాలు దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. యుద్ధం వేళ రష్యా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌పై రష్యా నిషేధం విధించింది. బోరిస్ జాన్సన్ రష్యాలోకి రాకుండా ఉండేలా చర్యలు తీసుకున్నది. అయితే, ఉక్రెయిన్‌లో యుద్దం జరుగుతున్న సమయంలో బ్రిటన్ ప్రధాని బోరిస్.. యుద్ద ప్రభావిత ఉక్రెయిన్‌లో పర్యటించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో కలిసి అక్కడి పరిస్థితులను ప్రత్యక్షంగా తిలకించారు. ఆ తర్వాత రష్యా దాడులను తీవ్రం ఖండించారు. ఇక, అంతకు ముందే యూరోపియన్ యూనియన్, యూకే.. రష్యాపై భారీ ఆంక్షలు విధించాయి. రష్యాకు చెందిన 350 మంది వ్యక్తులు, సంస్థలపై ఆంక్షలు విధించాయి. అంతేకాకుండా రష్యాకు లగ్జరీ వస్తువుల ఎగుమతిని నిషేధించాయి. దీంతో రష్యా.. బ్రిటన్‌పై ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా రష్యా విదేశాంగ మంత్రి లిజ్ ట్రాస్ స్పందిస్తూ.. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌తో పాటుగా మాజీ ప్రధాని థెరిసా మే, స్కాట్లాండ్ మినిస్టర్ నికోలా స్టర్జియన్‌తో పాటు మరో 13 మంది బ్రిటీష్ ప్రభుత్వాధికారులపై నిషేధాన్ని విధిస్తున్నట్లు తెలిపారు. రష్యా సీనియర్ అధికారులపై బ్రిటన్ చర్యలు తీసుకున్న నేపథ్యంలో రష్యా కూడా ఆంక్షలను విధించినట్టు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్‌తో పోరులో రష్యాకు వ్యతిరేకంగా ఉన్నారని పుతిన్ ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, న్యూజిలాండ్ ప్రధాని, ఆస్ట్రేలియా ప్రధానితో సహా ఆయా దేశాలకు చెందిన ప్రముఖులపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. మరోవైపు.. ఉక్రెయిన్‌లో రష్యా బలగాలు దాడులను తీవ్రతరం చేశాయి. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో ఉన్న మిలిటరీ ఫ్యాక్టరీపై రష్యా సైన్యం దాడి చేసింది. హై ప్రిసిషన్ మిస్సైళ్లతో 16 శత్రు టార్గెట్లను ధ్వంసం చేసినట్లు రష్యా తెలిపింది. కీవ్‌తో పాటు మైకోలైవ్‌లో ఉన్న మిలిటరీ సామాగ్రిని రిపేర్ షాపును క్షిపణతో ధ్వంసం చేసినట్టు రష్యా అధికారులు వెల్లడించారు. #Russia has banned #British Prime Minister Boris Johnson and a number of politicians and parliamentarians from the United Kingdom from entering the country. pic.twitter.com/VvbrJChdIg — NEXTA (@nexta_tv) April 16, 2022 -
భారత్‌ను రెడ్‌లిస్ట్‌లో చేర్చిన బ్రిటన్..!
లండన్: భారత్‌లో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ న్యూఢిల్లీ పర్యటనను విరమించుకున్న విషయం తెలిసిందే. బ్రిటన్ ప్రధాని పర్యటన రద్దు చేసుకున్న కొన్ని గంటలకే భారత్ నుంచి బ్రిటన్ వచ్చే ప్రయాణికులపై నిషేధ్ఙాలను విధించింది. కాగా భారత్‌లో కరోనా కేసుల విస్పోటనంతో ఈ నిర్ణయాన్ని బ్రిటన్ ప్రభుత్వం తీసుకుంది. బ్రిటన్ ఆరోగ్య కార్యదర్శి మాట్ హాన్కాక్ మాట్లాడుతూ, భారత్‌ను "రెడ్ లిస్ట్" లో చేర్చుతున్నామని ఒక ప్రకటనలో తెలిపారు. యుకే లేదా ఐరిష్ జాతీయులు మినహా భారతదేశం నుంచి వచ్చే ప్రయాణికులందరినీ తాత్కాలికంగా నిషేధిస్తున్నట్లు తెలిపింది. భారత్ నుంచి వచ్చే బ్రిటన్, ఐరిష్ పౌరులను 10 రోజుల పాటు క్వారంటైన్లో ఉండాలని తెలిపింది. అంతకుముందు న్యూజిలాండ్ ప్రధాని భారత్‌నుంచి వచ్చే ప్రయాణికులను ఏప్రిల్ 11 నుంచి రెండు వారాలు కు రావద్దంటూ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. కాగా భారత్‌లో కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. దేశంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. వరుసగా ఐదో రోజు రెండు లక్షల కరోనా పాజిటివ్ కేసులు నిర్థారణ అయ్యాయి. గత 24 గంటల్లో కొత్తగా 2,73,810 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య సోమవారం హెల్త్ బులిటెన్‌ను విడుదల చేసింది. ఇక గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1619 మంది కోవిడ్ బాధితులు మృతి చెందారు. చదవండి: కరోనా ఎఫెక్ట్: భారత్ నుంచి వచ్చే ప్రయాణికులపై నిషేదం -
ట్రంప్ కూతురు ఇలా చేసిందేమిటి..?
వాషింగ్టన్: ఏడు ముస్లిం మెజార్టీ దేశాల పౌరులు అమెరికాలోకి రాకుండా నిషేధం విధించాక ఆ దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమెరికా అంతటా తీవ్ర నిరసనలు తెలియజేస్తున్నారు. శనివారం అమెరికా నిరసనలతో హోరెత్తిపోతుంటే ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ వ్యవహరించిన తీరుపై నెటిజెన్లు తీవ్ర విమర్శలు చేశారు. శనివారం రాత్రి ఇవాంకా తన భర్త జేర్డ్ కుష్నెర్తో కలసి వాషింగ్టన్లో ఓ డిన్నర్ పార్టీకి వెళ్లారు. ఇద్దరూ ఖరీదైన దుస్తులు వేసుకున్నారు. ఇవాంకా దాదాపు 3.40 లక్షల రూపాయల విలువైన గౌన్ ధరించి పార్టీకి హాజరయ్యారు. భర్తతో కలిసున్న ఫొటోను ఇవాంకా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ రోజు రాత్రి అమెరికా విమానాశ్రయాల్లో ఆందోళనలు జరుగుతుంటే.. ఇవాంకా దంపతులు ఓ క్లబ్లో విందు వినోదాల్లో మునిగిపోయారు. ట్రంప్ కూతురి దుస్తులు, వ్యవహారంపై నెటిజెన్లు మండిపడ్డారు. మతాన్ని బట్టి వ్యక్తులపై వివక్ష చూపడం దారుణమని, నిషేధానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతుంటే, విందువినోదాల్లో మునిగితేలుతారా అంటూ నెటిజెన్లు ఇవాంకాను విమర్శించారు. కాల్చిన ఆలూలా ఉన్నావంటూ కొందరు ఆమెను ఉద్దేశించి ట్వీట్ చేశారు. దేశం ఆందోళనలతో అట్టుడికిపోతుంటే సంబరాలు చేసుకుంటున్నారా అని విమర్శించారు. దీనికి సంబంధించిన మరిన్ని వార్తలకై చదవండి (ఇది ముస్లింలపై నిషేధంకాదు: ట్రంప్) (ట్రంప్ ‘నిషేధం’: ఐసిస్ విజయోత్సవాలు) (ట్రంప్ చెప్పింది పచ్చి అబద్ధం!) (అమెరికాను సమర్థించిన సౌదీ, అబుదాబి) ట్రంపోనమిక్స్ మనకు నష్టమా? లాభమా? ట్రంప్‌గారు మా దేశంపై నిషేధం విధించండి! ట్రంప్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన సీఈవో! వీసా హోల్డర్స్పై ట్రంప్ కొరడా 'ట్రంప్‌తో భయమొద్దు.. మేమున్నాం'