ban lift
-
పీక్స్‌లో కరోనా..? చైనా నిర్ణయంతో ప్రపంచ దేశాలకు గుబులు!
బీజింగ్: చైనాలో ఒకవైపు కరోనా కల్లోలం విచ్చలవిడిగా కొనసాగుతూనే ఉన్నా సరిహద్దులను తెరవాలన్న ప్రభుత్వ నిర్ణయం ప్రజల్లో కొత్త జోష్ నింపుతోంది. కరోనా వెలుగు చూసిన మూడేళ్ల తర్వాత తొలిసారిగా విదేశీ ప్రయాణాలకు వీలు చిక్కేలా కన్పిస్తుండటంతో వారు సంబరపడుతున్నారు. జనవరి చివర్లో వచ్చే చైనా న్యూ ఇయర్ సంబరాల కోసం విదేశాలకు వెళ్లేందుకు ఇప్పట్నుంచే ప్లాన్ చేసుకుంటున్నారు. చైనా బుకింగ్ వెబ్సైట్ ట్రిప్.కామ్ తదితర సైట్లలో పలు దేశాల్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు మామూలు కంటే ఏకంగా పది రెట్లు ఎక్కువగా బుకింగ్‌లు జరుగుతున్నాయి! విదేశాల నుంచి వచ్చేవారికి జనవరి 8 నుంచి క్వారంటైన్ నిబంధనను చైనా ఎత్తేస్తుండటంతో పలు దేశాల్లోని చైనీయులు కూడా స్వదేశానికి వెళ్లడానికి సిద్ధపడుతున్నారు. మరోవైపు ఈ పరిణామం ప్రపంచ దేశాలకు గుబులు పుట్టిస్తోంది. చైనా పర్యాటకులతో పాటు కరోనా కూడా మరోసారి వచ్చిపడుతుందేమోనని బెంబేలెత్తుతున్నాయి. దాంతో చైనా నుంచి ప్రయాణికుల రాకపై నిషేధం విధించే అంశాన్ని అమెరికా, భారత్‌తో పాటు పలు దేశాలు చురుగ్గా పరిశీలిస్తున్నాయి. భారత్‌తో పాటు జపాన్, దక్షిణ కొరియా, తైవాన్ ఇప్పటికే చైనా ప్రయాణికులకు కరోనా పరీక్షలను తప్పనిసరి చేశాయి. కరోనాకు ముందు వరకూ అమెరికాతో పాటు పలు ఆసియా, యూరప్ దేశాలను సందర్శించే విదేశీ పర్యాటకుల్లో చైనీయుల సంఖ్యే ఎక్కువగా ఉండేది. అంతమయ్యే లక్షణాలే! చైనాలో కరోనా విలయం తాండవం చేస్తున్నా వైరస్ అంతమయ్యే ముందు అలాగే విధ్వంసం సృష్టిస్తుందని అక్కడి వైద్య నిపుణులుంటున్నారు. ఇక కరోనా ముగిసిపోయే దశకు వచ్చేసినట్టేనని చెబుతున్నారు. దేశంలో కరోనా పరీక్షలను బాగా తగ్గించేశారని చైనా జెజాంగ్ ప్రావిన్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న భారతీయ డాక్టర్ అభిషేక్ కుందు చెప్పారు. ఆస్పత్రికి వెళ్లే పరిస్థితి వచ్చిన వారు, ఇళ్లల్లో కోవిడ్–19 కిట్ కొనుక్కొని చేసుకుంటున్నవారే తప్ప ప్రభుత్వం చేసే పరీక్షలు తగ్గిపోయాయని అన్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో అత్యధికులు కోలుకుంటున్నారని, ఇతరత్రా అనారోగ్య సమస్యలున్నవారు, వృద్ధులు మాత్రమే ప్రాణాలు కోల్పోతున్నారని డాక్టర్ కుందు వివరించారు. -
మొన్న బ్యాన్ ప్రకటన.. ఇప్పుడు అశ్లీల కంటెంట్‌కు రైట్ రైట్!
OnlyFans Reverse Ban Decision: అశ్లీల కంటెంట్‌తో దూసుకుపోతున్న వెబ్సైట్ ఓన్లీఫ్యాన్స్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఇకపై తమ సైట్లో అడల్ట్ కంటెంట్‌కు చోటు ఉండదని ప్రకటించిన కొన్ని గంటలకే.. మాట మార్చేసింది. అన్నిజానర్ల కంటెంట్‌కు తమ వెబ్సైట్లో చోటు ఉంటుందంటూ సె*వర్కర్లకు బహిరంగ మద్దతుతో ఓ ప్రకటన రిలీజ్ చేసింది. బ్యాకింగ్ పార్ట్నర్స్, పే అవుట్ ప్రొవైడర్స్ విజ్ఞప్తుల మేరకు అక్టోబర్ 1 నుంచి తమ వెబ్సైట్లో అశ్లీల కంటెంట్‌కు చోటు ఉండబోదని ప్రకటించింది ఓన్లీఫ్యాన్స్. అయితే ఈ నిర్ణయంపై తీవ్ర దుమారం చెలరేగింది. పెద్ద ఎత్తున్న అభ్యంతరాలు వ్యక్తం కావడంతో బుధవారం సాయంత్రం మరో ప్రకటన రిలీజ్ చేసింది. బ్యాకింగ్ పార్ట్నర్స్ మద్దతుతోనే ముందుకెళ్తామని ప్రకటించడం గమనార్హం. ఓన్లీ ఫ్యాన్స్ అనేది యూకేకు చెందిన పెయిడ్ సబ్ స్క్రిప్షన్ సర్వీస్. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా కంటెంట్ క్రియేటర్లు.. నేరుగా తమ కంటెంట్‌ను కస్టమర్లకు అమ్ముకోవచ్చు. తద్వారా క్రియేటర్లకు ఆదాయం.. మరోవైపు వెబ్‌సైట్‌కు, కస్టమర్ల పేమెంట్ ద్వారా బ్యాకింగ్ పార్ట్నర్స్కు అందులో కొంత వాటా వెళ్తుంది. ప్రారంభంలో సెలబ్రిటీ యూజర్ల వల్ల డీసెంట్ సైట్‌గా పేరు దక్కించుకున్న ఓన్లీఫ్యాన్స్.. ఆ తర్వాతి కాలంలో సెక్స్‌వర్కర్ల ఎంట్రీతో అశ్లీల వెబ్సైట్ అనే ముద్ర వేయించుకుంది. కంటెంట్ ఓన్లీఫ్యాన్స్‌కు గ్లోబల్ వైడ్‌గా 130 మిలియన్ల యూజర్లు ఉండగా.. భారత్ నుంచి సుమారు మూడున్నర లక్షలు ఉన్నట్లు తెలుస్తోంది. అభ్యంతరాలు ఇవే.. ఆన్లైన్ పో* పరిశ్రమ బిలియన్ల వ్యాపారం నడుస్తుండడంతో పాటు నేరాలు బాగా తగ్గాయి. ముఖ్యంగా కరోనా టైం ఈ సైట్లో ఎరోటిక్ కంటెంట్‌కు ఫుల్ గిరాకీ ఉంటోంది. అయితే ఇలాంటి అడల్ట్ కంటెంట్ క్రియేట్ వెబ్‌సైట్‌పై నిషేధాలు విధిస్తే మళ్లీ సె*వర్కర్లంతా రొడ్డెక్కుతారని, తద్వారా క్రైమ్ రేటు పెరిగే అవకాశాలు ఉంటాయని మానవ హక్కుల సంఘాలు వాదిస్తున్నాయి. అంతేకాదు తమ ఉపాధిపై దెబ్బపడుతుందని, భద్రతకు సంబంధించి ఆందళోన వ్యక్తం చేస్తున్నారు సె*వర్కర్లు. చదవండి: అశ్లీల వెబ్సైట్లు.. సబ్‌స్క్రిప్షన్‌కు కార్డులూ పని చేయవు -
‘మా దేవుడు నువ్వేనయ్యా’.. మంత్రికి హారతి, పూజలు!
బతికుండగా.. అందులో ఓ మంత్రిగారికి హారతి అందిస్తూ పూజలు చేస్తున్నాడు ఓ వ్యక్తి. ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోలు సోషల్‌మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఆ ఫొటోలో ఉన్న వ్యక్తి చంద్రాపూర్‌లో ఓ బార్ ఓనర్. ఫొటోలో హారతి అందుకుంటోంది మహారాష్ట్ర గార్డియన్ మినిస్టర్ విజయ్ వాడెట్టివర్. జిల్లా వ్యాప్తంగా మద్య నిషేధం ఎత్తేయడంతో కృతజ్ఞతగా అలా పూజలు చేస్తున్నాడట. ముంబై: మహరాష్ట్రలో చంద్రాపూర్‌తో పాటు వార్ధా, గడ్చిరోలి జిల్లాలో 2015, ఏప్రిల్ నెల అప్పటి ఫడ్నవిస్ సర్కార్ లిక్కర్ బ్యాన్ విధించి.. లైసెన్స్‌లు కూడా వెనక్కి తీసుకుంది. అప్పటి నుంచి ఈ మూడు జిల్లాల్లో మద్య నిషేధం అమలు అవుతోంది. ఇక ఈ నిర్ణయంపై పునరాలోచన చేయాలని 2018లో రిటైర్డ్ అధికారి రామనాథ్ నేతృత్వంలో ఓ కమిటీని నియమించింది మహారాష్ట్ర సర్కార్. అయితే.. మద్యం అమ్మకాల నిషేధం వల్ల క్రైమ్ రేట్ తగ్గకపోగా.. నకిలీ మద్యం అమ్మకాలు పెరిగాయని ఈ ఏడాది మే నెలలో ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఈ రిపోర్ట్ ఆధారంగా మద్య నిషేధాన్ని ఎత్తేస్తున్నట్లు శివసేన సర్కార్ పోయిన వారం ప్రకటించింది. ఇక కమిటీకి మద్య నిషేధం ఎత్తేయాలని సూచించిన వాళ్లలో చంద్రాపూర్ జిల్లా గార్డియన్ మంత్రి (మొత్తం 36 మంది గార్డియన్ మంత్రుల హోదాలో జిల్లాలకు పర్యవేక్షకులుగా ఉన్నారు) విజయ్ వాడెట్టివర్ కూడా ఉన్నారు. అందుకే అలా హారతి ఇస్తున్నాడట ఆ బార్ ఓనర్. ‘మాకు ఆయన దేవుడే. మా బతుకు తెరువును మళ్లీ మాకు ఇప్పించాడు. అందుకే ఈ పూజలు’ అని చెప్తున్నాడు ఆ వ్యక్తి. ఇదిలా ఉంటే ఈ ఐదేళ్లలో మద్య నిషేదంతో చంద్రాపూర్ నుంచి సుమారు 1,600 కోట్ల రూపాయల్ని మహా సర్కార్ నష్టపోయింది. Maharashtra: Owner of a bar & restaurant in Chandrapur, performs 'aarti' of a photo of district's Guardian Minister Vijay Wadettiwar, as the six-yr-old liquor ban here was lifted by state govt last week He says, "For us he is God. Whoever helps us earn a livelihood, is our God." pic.twitter.com/YikN32AEWb — ANI (@ANI) July 10, 2021 -
నిషేధ కాలం తగ్గించండి: భారత రెజ్లర్ సుమిత్ అప్పీల్
డోపింగ్‌లో పట్టుబడటంతో రెండేళ్ల నిషేధానికి గురైన భారత రెజ్లర్ సుమిత్ మలిక్... నిషేధ కాలాన్ని తగ్గించాలంటూ యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ)కు అప్పీల్ చేయనున్నాడు. తను తీసుకున్న ఔషధాల్లో నిషేధిత ఉత్ప్రేరకం కలిసి వుండవచ్చని అంగీకరించిన రెజ్లర్ విధించిన నిషేధాన్ని ఏడాదికి తగ్గిస్తే వచ్చే ఏడాది కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొనే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నాడు. 125 కేజీల కేటగిరీలో టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించిన ఈ ఫ్రీస్టయిల్ రెజ్లర్ సస్పెన్షన్ వేటుతో విశ్వ క్రీడలకు దూరమయ్యాడు. -
ఆ ఉత్తర్వులను ఉపసంహరించుకున్న కేంద్రం
సాక్షి, న్యూడిల్లీ: ‘మేడ్ ఇన్ ఇండియా’లో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న పారామిలిటరీ క్యాంటీన్లలో దిగుమతి అయిన 1,000పైగా ఉత్పత్తులను నిషేధించాలన్న ఉత్తర్వులను కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఉపసంహరించుకుంది. దిగుమతి చేసుకున్న ఉత్పత్తుల్లో అనేక వస్తువులు భారత్‌లోనే తయారైనట్లు వెల్లవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. పారామిలిటరీ క్యాంటీన్లు దేశీయ పరిశ్రమలకు మద్దతునిచ్చే క్రమంలో జూన్ 1వ తేదీ నుంచి స్వదేశీ లేదా భారతీయ ఉత్పత్తులను మాత్రమే విక్రయిస్తామని ప్రభుత్వం గత నెలలో ప్రకటించిన విషయం తెలిసిందే. (‘కరోనా వ్యాప్తిలో భారత్ అగ్రస్థానానికి వెళ్తుంది’) ఇటీవల క్యాంటీన్లలో దిగుమతి అయిన ఉత్పత్తులను పరిశీలించగా అందులో నిషేధించబడిన ‘నుట్రెల్లా, కిండర్ జాయ్, టిక్ టాక్, హార్లిక్స్, ఓట్స్, యురేకా ఫోర్బ్స్, టామీ హిల్ఫిగర్ షర్ట్స్, అడిడాస్ బాడీ స్ప్రే’లు వంటి బ్రాండ్లు ఉన్నట్లు గమనించారు. మైక్రోవేవ్ ఓవెన్లు వంటి ఇతర గృహోపకరణాల వస్తువులను కూడా తీసివేసింది. అంతేగాక స్కెచర్స్, ఫెర్రెరో, రెడ్‌బుల్, విక్టోరినాక్స్, సఫిలో (పోలరాయిడ్, కారెరా) సహా దిగుమతి చేసుకునే ఏడు సంస్థల ఉత్పత్తులను కూడా నిషేధ జాబితా నుంచి తొలగించింది. ఈ జాబితాలో ఉన్న భారత ఉత్పత్తులైన డాబర్, బజాజ్, ఉషాతో సహా అనేక భారతీయ ఉత్పత్తులను కూడా ఈ జాబితా నుంచి తొలగించినట్లు హోంమంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. హోంమంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి స్పందిస్తూ.. ‘‘మా అధికారి మంత్రిత్వ శాఖను సంప్రదించకుండానే దిగుమతి ఉత్పత్తులను తీసుకున్నారు. ఇండియా ఉత్పత్తులను కూడా నిషేధ బ్రాండ్లలో చేర్చిన సదరు సీనియర్ అధికారులపై వెంటనే చర్యలు తీసుకుంటాం. అంతేగాక పూర్వ జాబితాను పరిశీలించి దానిని సవరించాం. త్వరలో సవరించిన జాబితాను పంపిస్తాం’’ అని చెప్పారు. ఈ క్యాంటీన్ల మాతృసంస్థ కేంద్రీయ పోలీసు కళ్యాణ్ భండార్స్ అన్ని ఉత్పత్తులను మూడు వర్గాలుగా విభజించారు. కేటగిరి1- భారతదేశంలో పూర్తిగా తయారైన ఉత్పత్తులను కలిగి ఉంది. కేటగిరీ 2- దిగుమతి చేసుకున్న ముడి పదార్థాలతో ఉత్పత్తులు ఉన్నాయి, కానీ అవి భారతదేశంలో తయారు చేయబడతాయి లేదా సమావేశమవుతాయి. కేటగిరి 3 - పూర్తిగా దిగుమతి చేసుకున్న ఉత్పత్తులు మాత్రమే ఉంటాయి. -
మనసు మార్చుకున్న సౌదీ
రియాద్: బంగ్లాదేశ్ విషయంలో సౌదీ అరేబియా మనసు మార్చుకుంది. ఆ దేశం నుంచి ఎవరినీ పనిలోకి తీసుకోకుండా విధించిన నిషేధాన్ని ఎత్తివేసింది. గత ఆరేళ్లుగా కొనసాగుతున్న ఈ నిషేధాన్ని ఎత్తేసినట్లు ఢాకా అధికార ప్రతినిధి గులామ్ మోషి చెప్పారు. గత జూన్ నెలలో తమ దేశ ప్రధాని షేక్ హసీనా, సౌదీ రాజు సల్మాన్ మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని, దాని ప్రకారమే తాజాగా నిషేధాన్ని ఎత్తివేశారని చెప్పారు. దీంతో తమ దేశం నుంచి నైపుణ్యంగల ఉద్యోగులు, నైపుణ్యం లేని శ్రామికులు సౌదీలో పనిచేసేందుకు వీలైందని పేర్కొన్నారు. వైద్యులు, నర్సులు, ఉపాధ్యాయులు, వ్యవసాయం చేసేవాళ్లు, భవన నిర్మాణ కార్మికులు ఇక ఉపాధి కోసం సౌదీకి వెళ్లవచ్చని అన్నారు. ఇప్పటికే మొత్తం 48 రంగాల్లో తమ దేశం నుంచి అక్కడ పనిచేసేందుకు తమ వాళ్లు సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు.