Bandari satyanarayana
-
'బండారుకు అన్యాయం జరిగిన మాట వాస్తవమే'
విశాఖ : టీడీపీ సీనియర్ నేత, పెందుర్తి ఎమ్మెల్యే బంగారు సత్యనారాయణకు అన్యాయం జరిగిన మాట వాస్తవమేనని మంత్రి గంటా శ్రీనివాసరావు అంగీకరించారు. మంత్రివర్గ సమావేశం అనంతరం బండారు విషయాన్ని అధినేత చంద్రబాబు నాయుడుతో చర్చిస్తామని ఆయన బుధవారమిక్కడ అన్నారు. అలకబూనిన బండారును బుజ్జగించేందుకు గంటా ఈరోజు ఉదయం ఆయన నివాసానికి వెళ్లి చర్చలు జరిపారు. మరోవైపుబండారుకు మంత్రి పదవి ఇవ్వకపోవడంపై ఆయన అనుచరుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బండారుకు మంత్రి పదవికి ఇవ్వనందుకు నిరసనగా పలువురు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు రాజీనామాకు సిద్దపడ్డారు. మంత్రి పదవి ఇవ్వకపోవడంపై అసంతృప్తిగా ఉన్న బండారు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్ష పదవికి గుడ్‌బై చెప్పే యోచనలో ఉన్నారు. ఆయన తన రాజీనామా లేఖను చంద్రబాబుకు నిన్న ఫ్యాక్స్ ద్వారా పంపారు. -
బండారును బుజ్జగించిన మంత్రి గంటా!
విశాఖ : చంద్రబాబు నాయుడు కేబినెట్లో చోటు దక్కకపోవటంతో మనస్తాపం చెందిన ఆపార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి బండారు సత్యనారాయణ తన అలక వీడటం లేదు. దాంతో మంత్రి గంటా శ్రీనివాసరావు రంగంలోకి దిగారు. బండారును బుజ్జగించే యత్నంలో భాగంగా బుధవారం ఉదయం ఆయన నివాసానికి గంటా వెళ్లారు. ఈ సందర్భంగా మంతనాలు జరిపారు. అయితే భేటీపై గంటా మాత్రం పెదవి విప్పలేదు. కాగా కొత్త మంత్రివర్గంలో తనకు స్థానం కల్పించలేదన్న బాధతో అలిగిన విశాఖ జిల్లా పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించడంతో జిల్లా తెలుగుదేశం పార్టీలో చిచ్చు మొదలైనట్టయింది. ఆయన తన రాజీనామా లేఖను ఫ్యాక్స్ ద్వారా చంద్రబాబుకు పంపించిన విషయం తెలిసిందే. కాగా బాబు ప్రమాణస్వీకారోత్సవానికి హాజరైన బండారు మధ్యలోనే వెనుదిరిగి వచ్చేశారు.