'బండారుకు అన్యాయం జరిగిన మాట వాస్తవమే' | Ganta srinivasa rao says It's injustice to bandaru satyanarayana | Sakshi
Sakshi News home page

'బండారుకు అన్యాయం జరిగిన మాట వాస్తవమే'

Published Wed, Jun 11 2014 11:33 AM | Last Updated on Fri, Aug 10 2018 8:08 PM

'బండారుకు అన్యాయం జరిగిన మాట వాస్తవమే' - Sakshi

'బండారుకు అన్యాయం జరిగిన మాట వాస్తవమే'

విశాఖ : టీడీపీ సీనియర్ నేత, పెందుర్తి ఎమ్మెల్యే బంగారు సత్యనారాయణకు అన్యాయం జరిగిన మాట వాస్తవమేనని మంత్రి గంటా శ్రీనివాసరావు అంగీకరించారు. మంత్రివర్గ సమావేశం అనంతరం బండారు విషయాన్ని అధినేత చంద్రబాబు నాయుడుతో చర్చిస్తామని ఆయన బుధవారమిక్కడ అన్నారు. అలకబూనిన బండారును బుజ్జగించేందుకు గంటా ఈరోజు ఉదయం ఆయన నివాసానికి వెళ్లి చర్చలు జరిపారు.

మరోవైపుబండారుకు మంత్రి పదవి ఇవ్వకపోవడంపై ఆయన అనుచరుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బండారుకు మంత్రి పదవికి ఇవ్వనందుకు నిరసనగా పలువురు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు రాజీనామాకు సిద్దపడ్డారు. మంత్రి పదవి ఇవ్వకపోవడంపై అసంతృప్తిగా ఉన్న బండారు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్ష పదవికి గుడ్‌బై చెప్పే యోచనలో ఉన్నారు. ఆయన తన రాజీనామా లేఖను చంద్రబాబుకు నిన్న ఫ్యాక్స్ ద్వారా పంపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement