Bandhavgarh
-
అయ్యో గజరాజా.. 48 గంటల్లో ఎనిమిది అనుమానాస్పద మృతి
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని బాంధవ్‌ఘర్ టైగర్ రిజర్వ్‌లో 48 గంటల్లో ఎనిమిది ఏనుగులు మృతి కలకలం రేపుతోంది. ఇప్పటికే మంగళవారం ఏడుగురు మృతి చెందగా, నిన్న (బుధవారం)మరో ఏననుగు మృతదేహం లభించినట్లు అధికారులు తెలిపారు. మృతిచెందిన ఏనుగుల్లో ఏడు ఏనుగులు.. ఒక్కొక్కటి మూడు ఏళ్ల వయస్సు గలవి ఉన్నాయి. ఎనిమిదో ఏనుగ ఐదేళ్ల మగ ఏనుగుగా అధికారులు గుర్తించారు. మొత్తం 13 మంది ఏనుగుల్లో తొమ్మిదో ఏనుగు పరిస్థితి విషమంగా ఉందని వన్యప్రాణి అధికారులు పేర్కొన్నారు. వైద్యసేవలు పొందిన పదో కోలుకున్నట్లు తెలిపారు. ఇక.. మిగిలిన మూడు ఏనుగుల నిశితంగా పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. ఈ ఏనుగుల మృతిపై.. ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్‌లతో కూడిన ఐదుగురు సభ్యుల బృందం స్వతంత్ర విచారణను చేపట్టింది. విచారణ నివేదికను 10 రోజుల్లో సమర్పించనుంది. ఏనుగుల మృతికి ప్రాథమిక కారణం విషంగా అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏనుగు కళేబరాలు ఉన్న ప్రాంతంలోని ఐదుగురి వ్యక్తులను వన్యప్రాణి అధికారులు ప్రశ్నిస్తున్నారు. దర్యాప్తు ప్రాంతం ఐదు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉందని తెలిపారు. కుక్కల స్క్వాడ్‌తో సహా 100 మంది అటవీ అధికారులు ఏనుగులు మృతి చెందిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు. కోడో మిల్లెట్ గింజలను ఏనుగులు తిన్నాయా అనే విషయంపై అధికారులు విచారణ జరుపుతున్నారు. కోడో మిల్లెట్ గింజలు ఫంగస్‌తో కలుషితమైతే సైక్లోపియాజోనిక్ యాసిడ్ అనే విష పదార్థాన్ని ఉత్పత్తి చేస్తుంది.అందుకే.. మృతిచెందిన ఏనుగుల మలం నమూనాలను సేకరించినట్లు అధికారులు తెలిపారు. -
ఈవీఎంల ట్యాంపరింగ్‌పై విచారణ జరపాలి: లాలు
పట్నా: ఈవీఎంల ట్యాంపరింగ్‌పై పూర్తిస్థాయి విచారణ జరపాలని ఆర్జేడీ నేత లాలూప్రసాద్ యాదవ్ ఆదివారం కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మధ్యప్రదేశ్‌లో బంధవ్గర్, అతర్లో జరగబోయే ఉప ఎన్నికల్లో భాగంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇది చాల ముఖ్యమైన విషయమని, ఈవీఎంల ట్యాంపరింగ్‌లపై వెంటనే విచారణ చెపట్టాలన్నారు. ఈవీఎంల పేపర్ ఆడిట్ ట్రయల్‌ను ఆయన తప్పుబట్టారు. గత ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటు వేసిన బీజేపీకి వెళ్లినట్లు ప్రింట్లు వచ్చాయని, ఇతర పార్టీలకు పడ్డ ఓట్ల ప్రింట్లు ఎందుకు చూపించలేదని ప్రశ్నించాడు. బీజేపీ ప్రభుత్వం గోవధ నిషేద చట్టాన్ని ఈశాన్య రాష్ట్రాల్లో కూడ అమలు చేయాలని లాలూఈ సందర్భంగా డిమాండ్ చేశారు.