bandits
-
షాకింగ్: పోలీసు క్యాంప్‌పై 150 మంది బందిపోట్ల దాడి
ఇస్లామాబాద్: దారి దోపిడిలో భాగంగా బందిపోట్లు దాడి చేయటం చాలా సినిమాల్లో చూసే ఉంటారు. ఎదురించిన వారిని విచక్షణరహితంగా చంపి దోపిడి చేస్తుంటారు. అలాంటి షాకింగ్ సంఘటనే పాకిస్థాన్‌లోని సింధు రాష్ట్రంలో వెలుగు చూసింది. అయితే, తమపై ప్రత్యేక ఆపరేషన్ చేపట్టిన పోలీసులపై దాడికి దిగింది దొంగల ముఠా. రోంటి రీజియన్ కచా ప్రాంతంలోని ఓ పోలీసు క్యాంపుపై భారీ సంఖ్యలో బందిపోట్లు ఆయుధాలతో దాడి చేశారు. ఈ దాడిలో ఐదుగురు పోలీసులు మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. డీఐజీ జావేద్ జాస్కాని తెలిపిని వివరాల ప్రకారం.. కచా ప్రాంతంలో దుండగుల ఆక్రమణలు పెరిగిపోయిన క్రమంలో పోలీసు క్యాంపు ఏర్పాటు చేసి ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. అయితే, ఒక్కసారిగా 150 మంది బందిపోట్లు పోలీసు పోస్ట్‌పై విరుచుకుపడ్డారు. ఓ డీఎస్పీ, ఇద్దరు ఎస్హెచ్ఓలతో పాటు మొత్తం ఐదుగురు పోలీసులను హత్యచేశారు. మృతులు డీఎస్పీ అబ్దుల్ మాలిక్ భుట్టో, ఎస్హెచ్ఓ అబ్దుల్ మాలిక్ కమాన్‌గర్, ఎస్హెచ్ఓ డీన్ ముహమ్మద్ లెహారి, ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లు సలీమ్ చాచాదర్, జటోయ్ పటాఫిలుగా గుర్తించారు. పోలీసు క్యాంపుపై బందిపోట్లు దాడి చేసిన క్రమంలో ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ క్రమంలో భారీగా బలగాలను కచా ప్రాంతానికి తరలించారు. బందిపోట్లు దాడి చేసినప్పటికీ తమ ఆపరేషన్ కొనసాగుతుందని తెలిపారు డీఐజీ. మరోవైపు.. పోలీసులపై దాడిని ఖండించారు పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ ఛైర్మన్, విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారి. పోలీసుల ప్రాణాలు తీసిన దండగులు తగిన శిక్ష అనుభవిస్తారని పేర్కొన్నారు. ఇదీ చదవండి: పాక్‌లోని చైనీయులకు బులెట్ ప్రూఫ్ కార్లు.. ‘ఇమ్రాన్’ కాల్పులే కారణమా? -
బందిపోట్ల అరాచకం.. 35 మంది గ్రామస్తుల బలి
జంఫారా : వాయువ్య నైజీరియాలో బందిపోట్లు అత్యంత దారుణానికి ఒడిగట్టారు. 35 మంది గ్రామస్తులను కాల్చి చంపారు. గురువారం చోటుచేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. గురువారం బైకులపై ఆయుధాలతో వచ్చిన బందిపోట్లు అటవీ ప్రాంత గ్రామాలైన గిడన్, ఆదాము, సౌని, గిడన్ బౌసి, గిడన్ మైదావాలో విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. కొన్ని ఇళ్లను తగులబెట్టారు. భద్రతాదళాలు అక్కడికి చేరుకునే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ దాడిలో 35 మంది గ్రామస్తులు చనిపోయారని పోలీసులు చెబుతుండగా.. 43 మంది మృతదేహాలను గుర్తించామని, మరికొంతమంది గాయపడ్డారని గ్రామస్తులు చెబుతున్నారు. కాగా, నైజీరియాలో బందిపోట్ల అరాచకాలకు హద్దు లేకుండా పోతోంది. తరుచుగా ఊళ్లపై పడి ప్రజలను బలితీసుకుంటున్నారు. గత గురువారం సౌవా గ్రామంపై దాడి చేసి 18మందిని చంపారు. గత నెలలో జంఫారా, జుర్మీ జిల్లాలోని ఓ ఆరు గ్రామాలపై దాడి చేసిన బందిపోట్లు దాదాపు 53 మందిని చంపేశారు. -
నైజీరియాలో దాడి.. 23 మంది మృతి
కానో: ఉత్తర నైజీరియాలోని రెండు గ్రామాలపై మోటార్‌సైకిళ్లపై గుంపుగా వచ్చి విరుచుకుపడిన సాయుధులు 23 మందిని పొట్టనపెట్టుకున్నారు. తుంగ, కబాజే గ్రామాల్లో స్థానికులు మంగళవారం అల్పాహారం తీసుకుంటున్న సమయంలో వీరు దాడికి పాల్పడ్డారు. -
పెద్దమ్మ చెట్టు ఆలయంలో చోరీ
ప్రొద్దుటూరు క్రైం: స్థానిక వైఎంఆర్ కాలనీలోని పెద్దమ్మ చెట్టు ఆలయంలో శుక్రవారం రాత్రి చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు హుండీని పగులకొట్టి అందులో ఉన్న డబ్బు తీసుకొని వెళ్లారు. విషయం తెలియడంతో శనివారం ఉదయం ఆలయ ధర్మకర్త డాక్టర్ శ్రీధర్‌రెడ్డి సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. హుండీకి పటిష్టమైన లాక్ సిస్టం ఉన్నప్పటికీ పగులకొట్టారని ఆయన అన్నారు. దుండగులు రాడ్డును అక్కడే వదిలి వెళ్లారు. డాక్టర్ శ్రీధర్‌రెడ్డి త్రీ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఏడాది జనవరిలో కూడా ఇదే ఆలయంలో చోరీ జరిగినట్లు ఆయన పోలీసులకు తెలిపారు. సుమారు 25 ఏళ్ల నుంచి ఇక్కడ హుండీని ఏర్పాటు చేశామన్నారు. తరచూ ఆలయంలో చోరీ జరుగుతుండటంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. -
ట్యాక్సీలోకి చొరబడి 31మంది హత్య
అంటాననారివో: మడగాస్కర్‌లో దారుణం చోటుచేసుకుంది. 31మంది ప్రయాణీకులను బందిపోట్లు అతి దారుణంగా హత్య చేశారు. ప్రయాణిస్తున్న వారిని దారి మధ్యలో అడ్డుకొని ఈ ఒళ్లుగగుర్పొడిచే సంఘటనకు పాల్పడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. బుష్ ట్యాక్సీలో తోలియారా అనే ప్రాంతం నుంచి బెరోరోహ అనే ప్రాంతానికి 32మంది ప్రయాణీకులు ప్రయాణిస్తున్నారు. అలా ప్రయాణిస్తుండగా ఒకరుకాదు ఇద్దరు కాదు ఏకంగా 20మంది బందిపోట్లు రోడ్డు మధ్యలో అడ్డంకి సృష్టించారు. అయితే, వారిని తప్పించేందుకు డ్రైవర్ శతవిధాల ప్రయత్నించినప్పటికీ వారు తుపాకీతో ముందు టైరు పేల్చి వాహనాన్ని నిలిపేశారు. అనంతరం అందులోకి చొరబడి అత్యంత పాశవికంగా హత్య చేశారు. చనిపోయినవారిలో పదిమంది చిన్నారులు కూడా ఉన్నారు. ఒకే ఒక్కరు తీవ్రంగా గాయాలపాలై కొన ఊపిరితో ఉన్నాడు. అతడి పరిస్థితి కూడా విషమంగా ఉంది. -
అప్పాజీ విగ్రహానికి నిప్పు
బెంగళూరు : స్థానిక రాజరాజేశ్వరి నగరలో కన్నడ కంఠీరవుడు, పద్మభూషణ్ డాక్టర్ రాజ్‌కుమార్ (అప్పాజీ) విగ్రహానికి గుర్తు తెలియని దుండగులు నిప్పుపెట్టారు. దీంతో నగరంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. నిందితులను పట్టుకోడానికి రెండు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ ఎంఎన్ రెడ్డి గురువారం మీడియాకు చెప్పారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. ఇక్కడి రాజరాజేశ్వరి నగరలోని బంగారప్ప లేఔట్ దగ్గర ఉన్న గుడ్డేలో రాజ్‌కుమార్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని స్థానికులు నిర్ణయించుకున్నారు. గుడ్డే సమీపంలో గ్రానైట్‌తో పెద్ద దిమ్మె ఏర్పాటు చేశారు. రాజ్‌కుమార్ నటించిన సూపర్ డూపర్ హిట్ సినిమా ‘సిపాయి రాము’ సినిమాలోని స్టిల్‌ను ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, సింథటిక్‌తో విగ్రహం తయారు చేయించారు. బుధవారం ఆ విగ్రహం తీసుకువచ్చారు. ఈ నెల 23వ తేదీన ఆ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో గురువారం వేకువ జామున గుర్తు తెలియన అల్లరిమూకలు రాజ్‌కుమార్ విగ్రహంపై పెట్రోల్ పోసి నిప్పంటించి పరారైనారు. గురువారం ఉదయం ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే కర్ణాటక రక్షణా వేదిక, జయ కర్ణాటక రాజ్ కుమార్ అభిమానుల సంఘం, అఖిల కర్ణాటక రాజ్‌కుమార్ అభిమానుల సంఘంతో పాటు వివిధ సంఘాలు సంఘటన స్థలానికి చేరుకుని ధర్నా నిర్వహించారు. బెంగళూరు నగర పోలీసు కమిషనర్ ఎంఎన్ రెడ్డి, నగర అడిషనల్ పోలీసు కమిషనర్లు అలోక్‌కుమార్, దయానంద్, డీసీపీలు లాబురామ్, అభిషేక్ గోయల్ తదితరుల సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చలు జరిపారు. నిందితులను అరెస్ట్ చేస్తామని హామీ ఇచ్చారు. ముందు జాగ్రత చర్యగా ముగ్గురు డీసీపీలు, ఐదు మంది ఏసీపీలు, 10 మంది డీఎస్పీలు, ఇన్స్పెక్టర్లతో పాటు ఎస్ఐలు, కానిస్టేబుల్లు, రెండు కేఎస్ఆర్పీ బెటాలియన్లను సంఘటన స్థలంలో భద్రత కోసం నియమించారు. నిరసన కర్ణాటక రక్షణా వేదిక రాష్ట్ర అధ్యక్షుడు నారాయణగౌడ, అఖిల కర్ణాటక డాక్టర్ రాజ్‌కుమార్ అభిమానుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సా.రా. గోవిందు, జయ కర్ణాటక సంఘం నాయకులతో పాటు బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ తదితర పార్టీల నాయకులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ధర్నా నిర్వహిస్తూ.. నిందితులను అరెస్ట్ చేయాలని నినాదాలు చేశారు. అదే విధంగా కన్నడ సినీ రంగానికి చెందిన రెబల్‌స్టార్ అంబరీష్, డాక్టర్ భారతీ విష్ణువర్దన్, లీలావతి, జయంతి, జయమాల, పవర్ స్టార్ పునీత్‌రాజ్‌కుమార్, రాఘవేంద్ర రాజ్‌కుమార్, ఈగ ఫేం సుదీప్ తదితరులు ఈ విషయంపై నిరసన వ్యక్తం చేశారు. కన్నడ సినీ రంగంలోని వివిధ విభాగాలకు చెందిన వారు ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు.