పెద్దమ్మ చెట్టు ఆలయంలో చోరీ | Temple eldest tree theft | Sakshi
Sakshi News home page

పెద్దమ్మ చెట్టు ఆలయంలో చోరీ

Published Sat, Mar 18 2017 11:31 PM | Last Updated on Sat, Aug 25 2018 4:51 PM

పెద్దమ్మ చెట్టు ఆలయంలో చోరీ - Sakshi

పెద్దమ్మ చెట్టు ఆలయంలో చోరీ

ప్రొద్దుటూరు క్రైం:  స్థానిక వైఎంఆర్‌ కాలనీలోని పెద్దమ్మ చెట్టు ఆలయంలో శుక్రవారం రాత్రి చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు హుండీని పగులకొట్టి అందులో ఉన్న డబ్బు తీసుకొని వెళ్లారు. విషయం తెలియడంతో శనివారం ఉదయం ఆలయ ధర్మకర్త డాక్టర్‌ శ్రీధర్‌రెడ్డి సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. హుండీకి పటిష్టమైన లాక్‌ సిస్టం ఉన్నప్పటికీ పగులకొట్టారని ఆయన అన్నారు. దుండగులు రాడ్డును అక్కడే వదిలి వెళ్లారు. డాక్టర్‌ శ్రీధర్‌రెడ్డి త్రీ టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఏడాది జనవరిలో కూడా ఇదే ఆలయంలో చోరీ జరిగినట్లు ఆయన పోలీసులకు తెలిపారు. సుమారు 25 ఏళ్ల నుంచి ఇక్కడ హుండీని ఏర్పాటు చేశామన్నారు. తరచూ ఆలయంలో చోరీ జరుగుతుండటంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement