bangaloore
-
జాతీయ పార్టీ కోసం పరిశీలనలో మూడు పేర్లు
-
కరోనా భయంతో భార్యను వెళ్లగొట్టాడు!
బెంగళూర్ : కోవిడ్-19 సోకుతుందనే భయంతో తాళి కట్టిన భార్యను ఇంటిలోకి అడుగుపెట్టకుండా అడ్డుకున్నాడో ప్రబుద్ధుడు. లాక్డౌన్ నేపథ్యంలో మూడు నెలల పాటు పంజాబ్‌లో చిక్కుకుపోయిన మహిళ (38) లాక్డౌన్ సడలింపుల అనంతరం బెంగళూర్‌లోని మెట్టినింటికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కర్ణాటక ప్రభుత్వ నిబంధనల ప్రకారం రాష్ట్రంలోకి వచ్చే ప్రయాణీకులందరూ విధిగా హోం క్వారంటైన్లో ఉండాలి. దీంతో బెంగళూర్‌లో తన భర్త ఇంటికి వెళ్లిన మహిళకు చేదు అనుభవం ఎదురైంది. ‘నువ్వు ఇంటికి వస్తే నాకూ కరోనా వైరస్ సోకుతుంద’ని చెబుతూ ఆమెను ఇంటిలోకి రానిచ్చేందుకు భర్త నిరాకరించాడు. ఆమెను ఇంట్లోకి అడుగుపెట్టేందుకు అనుమతించకుండా మరోచోట క్వారంటైన్‌కు వెళ్లాలని ఉచిత సలహా పారేశాడు. భర్త తీరుతో విస్తుపోయిన మహిళ వార్తుర్ పోలీస్‌లను ఆశ్రయించడంతో పాటు మహిళా హెల్ప్‌లైన్‌కు కాల్ చేశారు. అక్కడకు చేరుకున్న పోలీసులు, హెల్ప్‌లైన్ అధికారులు ఆయనకు కౌన్సిలింగ్ ఇచ్చి మహిళను తన ఇంట్లోకి అడుగుపెట్టేలా చేశారు. కాగా వీరిద్దరి వైవాహిక జీవితంలో చాలాకాలంగా కలతలు చోటుచేసుకున్నాయని, గత కొన్నేళ్లుగా పలుమార్లు గొడవపడ్డారని వారు తెలిపారు. చదవండి : చైనాను దాటేసిన ముంబై -
కేపీఎల్ ఫిక్సింగ్: అంతర్జాతీయ బుకీ అరెస్ట్
బెంగళూరు: కర్ణాటక ప్రీమియర్ లీగ్(కేపీఎల్)లో పలు మ్యాచ్‌లను ఫిక్సింగ్ చేసేందుకు యత్నించిన ఒక అంతర్జాతీయ బుకీని అరెస్టు చేశారు. మ్యాచ్‌లను ఫిక్సింగ్‌కు చేయడానికి పాల్పడ్డ హర్యానాకు చెందిన సయ్యమ్ అనే వ్యక్తిని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సెలబ్రేటీ డ్రమ్మర్ భవేశ్ బఫ్నా సాయంతో మ్యాచ్‌లను ఫిక్స్ చేయడానికి సయ్యర్ యత్నించాడు. అయితే అతనిపై ముందుగా లుక్ ఔట్ నోటీసులు పోలీసులు జారీ చేశారు.(ఇక్కడ చదవండి: క్రికెటర్ గౌతమ్ అరెస్ట్) ఈ క్రమంలోనే వెస్టిండీస్‌లో దాక్కొన్న అతన్ని అరెస్ట్ చేశారు. ఇటీవల బళ్లారి టస్కర్స్ కెప్టెన్ సీఎం గౌతమ్‌తో పాటు అబ్రార్ కాజీలను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ నెమ్మదిగా బ్యాటింగ్ చేయడానికి రూ. 20 లక్షలకు ఒప్పందం చేసుకుని మ్యాచ్ ఫిక్సింగ్ చేయడానికి సహకరించారనే ఆరోపణలు ఉన్నాయి. దాంతో వీరిని అరెస్ట్ చేసిన పోలీసులు.. తాజాగా బుకీని కూడా అదుపులోకి తీసుకుని విచారణను వేగవంతం చేశారు. -
అయ్యో.. ఎంత ఘోరం జరిగిపోయింది!
సాక్షి, బనశంకరి(కర్ణాటక): బైకుపై వెళుతున్న ఓ వ్యక్తి ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు చేసిన ప్రయత్నం.. విషాదానికి దారితీసింది. ఈ ప్రయత్నంలో బైక్‌పై ఉన్న తొమ్మిదేళ్ల బాలుడు మృత్యవాతపడ్డాడు. ఈ ఘటన ఉప్పరపేటే పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. బెంగళూరు నగరానికి చెందిన రాజన్న మనవడు దర్శన్ (9), మనవరాలు నిహారిక విద్యావర్ధక పాఠశాలలో చదువుకుంటున్నారు. రాజన్నశనివారం మధ్యాహ్నం వారిని పాఠశాల నుంచి హోండా యాక్టివా వాహనంపై ఇంటికి తీసుకెళుతుండగా.. దారిలో మేజస్టిక్ సంగోళ్లి రాయణ్ణ సర్కిల్లో ట్రాఫిక్ పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తున్నారు. హెల్మెట్ ధరించని రాజణ్ణ పోలీసులు పట్టుకుంటారనే భయంతో వారి నుంచి తప్పించుకోవడానికి తన వాహనాన్ని పక్కనే ఉన్న రోడ్డుకు మళ్లించాడు. ఈ క్రమంలో వాహనంపైనుంచి మనవడు దర్శన్ కిందపడిపోయాడు. అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు బాలుడిపై దూసుకెళ్లింది. ప్రమాదంలో బాలుడు ఘటనాస్ధలంలోనే దుర్మరణం పాలయ్యాడు. కళ్ల ముందు మనవడు మృత్యవాత పడటంతో రాజణ్ణ కన్నీరుమున్నీరయ్యారు. -
సిలిండర్ పేలి ఇద్దరు టెక్కీల మృతి
బనశంకరి : సిలిండర్ పేలిన ఘటనలో తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అన్నదమ్ములు ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరు చావుబతుకుల మధ్య పోరాడుతున్నారు. ఇక్కడి కాడుగోడి పోలీస్ స్టేషన్ పరిధిలోని వీరాస్వామిరెడ్డి లేఔట్లో నివాసం ఉంటున్న హరేంద్ర (34), నరేంద్ర (27) అన్నదమ్ములు. వీరు ఇద్దరు ఓ ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో టెక్కీలుగా పనిచేస్తున్నారు. మూడు రోజుల క్రితం వీరి ఇంటిలో సిలిండర్ పేలడంతో అన్నదమ్ములతో పాటు నరేంద్ర భార్య శిల్ప, వీరి కుమార్తె ఆర్య తీవ్రంగా గాయపడ్డారు. అప్పటి నుంచి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హరేంద్ర, నరేంద్ర గురువారం మధ్యాహ్నం మృతి చెందారు. నరేంద్ర భార్య శిల్పా చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. చిన్నారి ఆర్యను ఢిల్లీకి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
బాలికపై మైనర్ల సామూహిక అత్యాచారం
బనశంకరి (బెంగుళూరు): పొరుగింటి బాలికపై ముగ్గురు మైనర్ బాలురు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన బెంగళూరు నగరంలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని పీణ్యాకు చెందిన ఓ 15 ఏళ్ల బాలిక స్థానిక ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. పొరుగింటికి చెందిన బాలుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. దీంతో అతను నిత్యం పాఠశాల వద్దకు వెళ్లి బాలికను కలిసేవాడు. పాఠశాల ముగిసిన అనంతరం బాలికను హోటల్‌కు, ఇతర స్ధలాలకు తీసుకెళ్లి సరదాగా తిప్పేవాడు. పాఠశాలకు వేసవి సెలవులు కావడంతో ఈ నెల 8న బాలికను నమ్మించి సినిమాకు తీసుకెళ్లాడు. సినిమా చూసిన అనంతరం బాలికను పీణ్యాలో నిర్మాణదశలో ఉన్న ఓ కట్టడం వద్దకు తీసుకెళ్లి అత్యాచారానికి ఒడికట్టాడు. అనంతరం తన స్నేహితులిద్దరిని పిలిపించుకొని ముగ్గురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనతో భయాందోళనకు గురైన బాలిక తన స్నేహితురాలికి ఫోన్ చేసి.. ఆమె ఇంటికి వెళ్లింది. తల్లికి విషయం తెలిస్తే మందలిస్తుందనే భయంతో బాలిక స్నేహితురాలి ఇంట్లోనే 5 రోజులు గడిపింది. కూతురు ఇంటికి రాకపోవడంతో భయపడిన తల్లి తన బిడ్డను ఎవరో కిడ్నాప్ చేశారంటూ పీణ్యా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఐదు రోజుల అనంతరం ఇంటికి చేరుకున్న బాధితురాలు తల్లి ముందు జరిగిన అకృత్యాన్ని తెలిపింది. దిగ్భ్రాంతికి గురైన తల్లి మళ్లీ పీణ్యాపోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలు తెలిపిన వివరాల మేరకు ముగ్గురు మైనర్ బాలురును అరెస్ట్ చేసి బాలల పరివర్తనా కేంద్రానికి తరలించారు. -
బెంగళూరు చేరిన కేజ్రీవాల్
బెంగళూరు(కర్ణాటక): ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకృతి చికిత్స కోసం మంగళవారం బెంగళూరు చేరుకున్నారు. మధ్యాహ్నం 3.20గంటలకు ఇక్కడి అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన ఆయన వెంటనే జిందాల్ ప్రకృతి చికిత్స కేంద్రానికి వెళ్లారు. మధుమేహం అదుపునకు ఆయన 10 రోజులపాటు ఇక్కడే ఉండి చికిత్స తీసుకోనున్నారు. కేజ్రీవాల్‌కు కర్ణాటక రాష్ట్ర ఆప్ ముఖ్య నేతలు స్వాగతం పలికారు. షుగర్ లెవల్స్ పెరగడంతో మరోసారి ప్రకృతి చికిత్స చేయించుకోవాలని కేజ్రీవాల్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. -
కొత్త బొమ్మ పడినా.. చూసే జనాలేరి?
పెద్ద నోట్ల రద్దు సినీ పరిశ్రమకు పెద్ద దెబ్బగానే మారింది. గత మంగళవారం రాత్రి ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించిన పెద్దనోట్ల రద్దుతో సినీ పరిశ్రమ బిత్తరపోయింది. ఆనవాయితీగా ప్రతి శుక్రవారం విడుదలయ్యే సినిమాలో సందిగ్ధంలో పడే పరిస్థితి నెలకొంది. ఎలాగోలా అనుకున్న ప్రకారం కొన్ని సినిమాలు శుక్రవారం విడుదలైనా వాటిని పట్టించుకునే ప్రేక్షకుడే కరువయ్యాడు. శుక్రవారంనాడు స్టార్ హీరో సినిమా విడుదల అనగానే థియేటర్ల వద్ద భారీ కోలాహలం ఉంటుంది. పండుగ వాతావరణం నెలకొంటుంది. కానీ శుక్రవారం దేశంలోని అన్నీ భాషల్లో సినిమాలు విడుదలైనా.. గతంలో కనిపించేంత సందడి ఇప్పుడు లేదని, చాలాచోట్ల సినిమాలు చూసేవారు కరువయ్యారని ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్లు లబోదిబోమంటున్నారు. కొన్నిచోట్ల జనం లేకపోవడంతో థియేటర్ల షోలు వేయాలా? వద్దా? అన్న దుస్థితి నెలకొంది. పెద్దనోట్ల రద్దు వల్ల దాదాపు తెలుగురాష్ట్రాల్లో శుక్రవారం విడుదలైన సినిమాల కలెక్షన్లపై ప్రభావం పడిందని అంటున్నారు. ఇక బెంగళూరులో అయితే థియేటర్లు మూసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. థియేటర్ల వైపు వచ్చే జనమే లేకపోవడంతో అవి ఈగలను తోలుకుంటున్నాయి. షోలు వేసేందుకు తగిన టికెట్ మనీ కూడా రాకపోతుండటంతో ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్లు లబోదిబోమంటున్నారు.