24 గంటలూ అదే యావ
సాఫ్ట్వేర్ ఇంజినీరుపై భార్య ఫిర్యాదు
సాక్షి, బొమ్మనహళ్లి (బెంగళూరు): ప్రతిరోజూ పదేపదే లైంగిక వాంఛ తీర్చాలంటూ వేధిస్తున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్‌పై అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. బెంగళూరులోని బొమ్మనహళ్లికి చెందిన ఈ జంట 2008లో పెళ్లి చేసుకున్నారు. రెండేళ్లపాటు బాగానే చూసుకున్న భర్త.. ఆ తర్వాతి నుంచి లైంగిక వాంఛ తీర్చాలంటూ వేధించడం మొదలు పెట్టాడు.
ఉదయం అల్పాహారం తీసుకోగానే మళ్లీ పడక మీదకు రావాలని వేధించేవాడు. సాయంత్రం డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత ఒకసారి.. రాత్రి భోజనం అయిన తర్వాత మరోసారి, రాత్రి మధ్యమధ్యలో... మళ్లీ మళ్లీ కావాలంటూ బాధితురాలికి కంటిమీద కునుకు లేకుండా చేశాడు. అత్తమామలు కూడా అతనికే వంతపాడుతుండటంతో ఆ యువతి చివరకు పోలీసులను ఆశ్రయించింది.