banjara hills road no 12
-
బంజారాహిల్స్‌లో కారు బీభత్సం.. నడిరోడ్డుపై పల్టీ కొట్టి..
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్‌లో ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ పక్కనే ఉన్న దేవాలయాన్ని కారుతో ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో యువకుడికి గాయాలుగా ఆసుపత్రికి తరలించారు. వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నంబర్-12లో ఆదివారం ఉదయం ఓ యువకుడు హల్చల్ చేశారు. ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ హై స్పీడ్‌లో కారుతో దేవాలయాన్ని ఢీకొట్టాడు. దీంతో, కారు ఒక్కసారిగా పల్టీ కొట్టింది. కాగా, ఈ ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలు కావడంతో పోలీసులు అతడిని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. -
ర్యాష్ డ్రైవింగ్‌పై ప్రశ్నిస్తే.. పోలీసుల బిడ్డలమంటూ..
సాక్షి, హైదరాబాద్ : పోలీసు బైకుపై ముగ్గురు యువకులు అతివేగంగా బంజారాహిల్స్ రోడ్ నెం.12లో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ స్థానికుల కంటపడ్డారు. పోలీస్ శాఖ కోట్లు ఖర్చు పెట్టి ప్రజల బందోబస్తు పటిష్టం చేయడానికని కొత్త వాహనాలు కొనిపెడుతుంటే, వారు మాత్రం తమకు తెలిసినవారికి, పిల్లల చేతికిచ్చి దుర్వినియోగం చేస్తున్నారు. ప్రభుత్వ వాహనాన్ని దుర్వినియోగం చేస్తూ ట్రిపుల్ రైడింగ్ చేస్తున్న యువకులను వీడియా తీస్తూ వివరాల కోసం ఆరా తీస్తే, చెప్పేది పోయి గర్వంగా తాము పోలీస్ బిడ్డలమంటూ దాడిచేయడానికి ప్రయత్నించారు. మాములుగా క్షమించాల్సిన తప్పులను కూడా భూతద్దంలో చూసే మన పోలీసుల్లో కొందరు తమ పిల్లలకు ట్రాఫిక్ నిబంధనలు నేర్పించడంలో మాత్రం విఫలమవుతున్నారు. సాటి తల్లితండ్రులకు సమావేశాలు నిర్వహించి యువత- ర్యాష్ డ్రైవింగ్‌పై అవగాహన కల్పిస్తున్న పోలీసులు ఇలాంటి ఘటనల్లో ఎలా వ్యవహరిస్తారో వేచి చూడాలి. -
బంజారాహిల్స్‌లో కారు బీభత్సం..
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని బంజారాహిల్స్ రోడ్ నెం.12లో ఓ కారు బీభత్సం సృష్టించింది. కారు ఢీకొనడంతో ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. అప్తాబ్ అనే వ్యక్తి అతివేగంగా కారు నడుపుతున్నాడు. ఈ క్రమంలో తన కారుతో అదే మార్గంలో వెళ్తున్న ఓ బైక్‌ను ఢీకొట్టాడు. దీంతో బైక్ నడుపుతున్న చేతన్ దానియాకు గాయాలయ్యాయి. అంతటితో ఆగకుండా కారుతో అక్కడి నుంచి పరారు కావాలని నిందితుడు అప్తాబ్ యత్నించడంతో మరో కారు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. నిందితుడు అప్తాబ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. -
బంజారాహిల్స్ లో హోటల్‌పై పోలీసుల దాడి
హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 4లోని ఓ హోటల్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం తెల్లవారుజామున దాడులు నిర్వహించారు. ఈ సందర్బంగా యువతి, ఇద్దరు యువకులును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీసు స్టేషన్‌కు తరలించారు. హోటల్లో వ్యభిచారం జరుగుతుందని పోలీసులకు ఆగంతకులు సమాచారం అందించారు. దాంతో పోలీసులు సదరు హోటల్‌పై దాడి చేశారు. ఈ సందర్బంగా యువతి, ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. వారు పొంతన లేని సమాధానాలు వెల్లడిస్తుండటంతో వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.