
బోల్తాపడ్డ కారు (ఫైల్ ఫొటో)
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని బంజారాహిల్స్ రోడ్ నెం.12లో ఓ కారు బీభత్సం సృష్టించింది. కారు ఢీకొనడంతో ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. అప్తాబ్ అనే వ్యక్తి అతివేగంగా కారు నడుపుతున్నాడు. ఈ క్రమంలో తన కారుతో అదే మార్గంలో వెళ్తున్న ఓ బైక్‌ను ఢీకొట్టాడు. దీంతో బైక్ నడుపుతున్న చేతన్ దానియాకు గాయాలయ్యాయి. అంతటితో ఆగకుండా కారుతో అక్కడి నుంచి పరారు కావాలని నిందితుడు అప్తాబ్ యత్నించడంతో మరో కారు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. నిందితుడు అప్తాబ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment