Bank licences
-
ఆర్బీఐ ఎఫెక్ట్- ఫైనాన్షియల్ షేర్ల దూకుడు
ముంబై, సాక్షి: రిజర్వ్ బ్యాంక్ ప్యానల్ చేసిన తాజా ప్రతిపాదనలు దేశీ ఫైనాన్షియల్ రంగ కంపెనీలకు జోష్‌నిస్తున్నాయి. భారీ కార్పొరేట్ హౌస్‌లకు బ్యాంకింగ్ లైసెన్సుల మంజూరీ, ఎన్‌బీఎఫ్‌సీలకు బ్యాంకులుగా మారేందుకు అవకాశం వంటి పలు ప్రతిపాదనలు ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నిచ్చాయి. దీంతో స్మాల్ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలుసహా పలు ఫైనాన్షియల్ రంగ కౌంటర్లకు డిమాండ్ పెరిగింది. వెరసి ఈ రంగంలోని పలు లిస్టెడ్ షేర్లు భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం.. పలు సంస్కరణలు ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఎం.రాజేశ్వరరావు అధ్యక్షతన ఏర్పాటైన ప్యానల్ బ్యాంకింగ్ లైసెన్సులకు సంబంధించి పలు కీలక ప్రతిపాదనలు చేసింది. అర్హత కలిగిన అతిపెద్ద కార్పొరేట్ గ్రూప్‌లకు బ్యాంకింగ్ లైసెన్సులు, పేరున్న ఎన్బీఎఫ్సీలు బ్యాంకులుగా మారేందుకు అవకాశం, 15 ఏళ్ల తదుపరి ప్రమోటర్ల వాటా 26 శాతానికి పెంచుకునేందుకు అనుమతి తదితర పలు కీలక ప్రతిపాదనలు చేసింది. దీంతో ప్రధానంగా చిన్న బ్యాంకులు, ఎన్బీఎఫ్సీ కౌంటర్లు జోరు చూపుతున్నాయి. జోరుగా హుషారుగా ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఐడీఎఫ్సీ లిమిటెడ్ 20 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకి రూ. 40.20 వద్ద, ఉజ్జీవన్ స్మాల్ బ్యాంక్ 20 శాతం పెరిగి రూ. 40.40 వద్ద ఫ్రీజయ్యాయి. ఈ బాటలో ఉజ్జీవన్ ఫైనాన్షియల్ 18 శాతం దూసుకెళ్లి రూ. 292ను తాకగా.. ఐడీఎఫ్సీ ఫస్ట్‌బ్యాంక్ 12 శాతం జంప్‌చేసి రూ. 38కు చేరింది. ఇకబజాజ్ హోల్డింగ్స్7 శాతం ఎగసి రూ. 3,215 వద్ద కదులుతోంది. తొలుత రూ. 3,250ను తాకింది. ఇక శ్రీరామ్ సిటీ యూనియన్ 5.5 శాతం పెరిగి రూ. 1,064 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 1,098కు చేరింది. ఇతర కౌంటర్లలో శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ 3.6 శాతం పెరిగి రూ. 968 వద్ద, ఆవాస్ ఫైనాన్షియర్స్ 3.6 శాతం లాభంతో రూ. 1548 వద్ద కదులుతున్నాయి. ఆవాస్ తొలుత రూ. 1,610 వరకూ ఎగసింది. ఇదేవిధంగా మ్యాక్స్ ఫైనాన్షియల్ 3 శాతం వృద్ధితో రూ. 636 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 648 వద్ద 52 వారాల గరిష్టాన్ని అందుకుంది. చోళమండలం ఇన్వెస్ట్మెంట్ 2.5 శాతం లాభపడి రూ. 347 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 355ను అధిగమించడం ద్వారా ఏడాది గరిష్టాన్ని తాకింది. -
కొత్త బ్యాంకుల లెసైన్సుల దిశగా మరో అడుగు...
రాయ్‌పూర్: కొత్త బ్యాంకు లెసైన్సులను జారీ చేసే ప్రక్రియ వేగం పుంజుకుంది. లెసైన్సుల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించేందుకు రిజర్వ్ బ్యాంక్ కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి ఆర్బీఐ మాజీ గవర్నర్ బిమల్ జలాన్ సారథ్యం వహిస్తుండగా ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ ఉషా థోరట్, సెబీ మాజీ చైర్మన్ సీబీ భవే, ఆర్థికవేత్త నచికేత్ మోర్ సభ్యులుగా ఉంటారు. శుక్రవారం జరిగిన బోర్డు సమావేశం అనంతరం ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ ఈ విషయాలు తెలిపారు. కొత్త బ్యాంకుల అంశాన్ని పర్యవేక్షిస్తున్న డిప్యూటీ గవర్నర్ ఆనంద్ సిన్హా జనవరిలో రిటైరయ్యే లోగా లెసైన్సులను జారీ చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామన్నారు. కొత్త బ్యాంకింగ్ లెసైన్సుల కోసం మొత్తం 26 దరఖాస్తులు వచ్చాయి. టాటా సన్స్, అనిల్ అంబానీ గ్రూప్, కుమార మంగళం బిర్లా గ్రూప్ మొదలైన దిగ్గజ సంస్థలు బరిలో ఉన్నాయి. గడచిన 20 సంవత్సరాల్లో రెండు విడతలుగా ఆర్బీఐ ప్రైవేట్ రంగంలో 12 బ్యాంకులకు లెసైన్సులు ఇచ్చింది. 1993 జనవరిలో మార్గదర్శకాల ప్రకారం అప్పట్లో పది బ్యాంకులకు లెసైన్సులు ఇచ్చింది. ఈ అనుభవాలతో 2001 జనవరిలో మార్గదర్శకాలను సవరించి.. 2003-04లో కోటక్ మహీంద్రా బ్యాంక్, యస్ బ్యాంకులకు ఆర్బీఐ లెసైన్సులు జారీ చేసింది. -
కొలువుల బ్యాంకింగ్
ముంబై: ఈ ఏడాది బ్యాంక్ కొలువులు భారీగా రానున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు ప్రైవేట్ బ్యాంకులు కూడా జోరుగా విస్తరణ కార్యకలాపాలు నిర్వహిస్తుండటంతో ఈ ఏడాది మొత్తంమీద కొత్తగా 80 వేల నుంచి లక్ష వరకూ బ్యాంక్ ఉద్యోగాలు నమోదుకానున్నట్లు పరిశ్రమ నిపుణులంటున్నారు. గత ఏడాది వచ్చిన ఉద్యోగాలతో పోల్చితే ఇది 30 శాతం అధికమని వారంటున్నారు. బ్యాంకులు తమ బ్రాంచీ, పోర్ట్‌ఫోలియో విస్తరణ, ఉద్యోగుల వలస, రిటైర్మెంట్, కొత్త బ్యాంకుల ప్రవేశం తదితర కారణాల వల్ల భారీ సంఖ్యలో బ్యాంకు ఉద్యోగాలు రానున్నాయని టాలెంట్‌స్ప్రింట్ ఎండీ, సీఈవో శంతను పాల్ చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరం చివరిలోనే ఆర్బీఐ కొత్త బ్యాంకులకు లెసైన్స్‌లు ఇస్తుందని, ప్రభుత్వ రంగ బ్యాంకులు 8 వేల బ్రాంచీలను ఏర్పాటు చేయనున్నాయని, ప్రైవేట్, గ్రామీణ, విదేశీ బ్యాంకులు తమ నెట్‌వర్క్‌ను విస్తృతం చేస్తున్నాయని, ఫలితంగా బ్యాంకింగ్ రంగంలో భారీ సంఖ్యలో కొత్త ఉద్యోగాలు వస్తున్నాయని వివరించారు. బ్యాంకింగ్ రంగంలో కొలువులు పెరుగుతుండటంతో గత ఏడాది 45గా ఉన్న ఎగ్జామినేషన్ సెంటర్ల సంఖ్య ఈ ఏడాది 210కు పెరిగిందని తెలిపారు. ఐసీఐసీఐలో 6,000 ఉద్యోగాలు కాగా ఈ ఏడాది 5,000-6,000 కొత్త ఉద్యోగాలు ఇవ్వనున్నామని ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ, సీఈవో చందా కొచర్ చెప్పారు. ఈ ఏడాది కొత్తగా 300 బ్రాంచీలను ఏర్పాటు చేయనున్నామని 2,000-2,200 కొత్త ఉద్యోగాలివ్వనున్నామని ఐడీబీఐ బ్యాంక్ డిప్యూటీ ఎండీ ఎం.ఒ. రెగో చెప్పారు. కొత్త బ్యాంకుల రాక కారణంగా తమ బ్యాంక్ నుంచి అధికంగా ఉద్యోగులు వలసపోతారని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర భావిస్తోంది. అంతేకాకుండా ఈ ఏడాది 800 మంది రిటైరవుతున్నారని, అందుకే తమకు అవసరమైన దానికంటే 30 శాతం అధికంగా ఉద్యోగులను తీసుకోనున్నామని, ఈ ఏడాది 2,000 ఎగ్జిక్యూటివ్ స్థాయి ఉద్యోగాలను భర్తీ చేస్తామని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఈడీ సి.వి.ఆర్. రాజేంద్రన్ చెప్పారు. -
కార్పొరేట్లకు బ్యాంకు లెసైన్సులొద్దు: స్థాయీ సంఘం
న్యూఢిల్లీ: కార్పొరేట్ సంస్థలకు కొత్త బ్యాంకు లెసైన్సులు ఇచ్చే అంశాన్ని పార్లమెంటరీ స్థాయీ సంఘం వ్యతిరేకించింది. దీని వల్ల బ్యాంకింగ్ రంగ ప్రయోజనాలు దెబ్బతినే అవకాశముందని అభిప్రాయపడింది. ఇలాంటి విధానం ప్రపంచంలో ఎక్కడా లేదని, భారత్ ఇందుకు మినహాయింపు కాదని స్థాయీ సంఘం నివేదికలో పేర్కొంది. మాజీ ఆర్థిక మంత్రి, బీజేపీ నేత యశ్వంత్ సిన్హా సారథ్యంలోని స్థాయి సంఘం(ఆర్థిక) ఈ నివేదికను రూపొందించింది. లెసైన్స్‌ల విషయంలో ఆర్బీఐకి ఇచ్చిన విచక్షణాధి కారాలవల్ల ఏకపక్షంగా దరఖాస్తులను ఆమో దం/తిరస్కరణ అధికారం లభిస్తుందనేది సభ్యుల వాదన. కొత్త బ్యాంక్ లెసైన్సులను జారీ చేసేందుకు 2001 నాటి మార్గదర్శకాలే ప్రాతిపదికగా ఉండాలని సభ్యులు అభిప్రాయపడ్డారు.