bank server
-
లాగర్స్తోనే సొమ్ము లాగేశారు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మహేష్ కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్‌కు చెందిన చెస్ట్ ఖాతా నుంచి రూ.12.93 కోట్లు కాజేసిన కేసులో సైబర్ క్రైమ్ పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. సైబర్ నేరగాళ్లు ఈ వ్యవహారాన్ని కీలాగర్స్ (ఇదో రహస్య సాఫ్ట్వేర్) సాయంతో చేశారని, హైదరా బాద్ కేంద్రంగా ప్రాక్సీ సర్వర్‌లో కథ నడిపారని గుర్తించారు. సైబర్ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు అందించిన యువకుడు, యువతిని ఢిల్లీలో అరెస్టు చేశారు. వీరిని గురువారం నగరానికి తీసుకొచ్చి కోర్టులో హాజరుపరచనున్నారు. సైబర్ సెక్యూరిటీ పక్కాగా లేని మహేష్ బ్యాంక్‌ను కొల్లగొట్టడానికి సైబర్ కేటుగాళ్లు దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి బ్యాంకు ఖాతాల వివరాలు సేకరించారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న దళారుల సాయంతో 128 ఖాతాలు ఎంపిక చేసుకున్నారు. ఈ ఖాతాదారులకు 10–15 శాతం కమీషన్ ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. సూత్రధారులకు, వీరికి మధ్యలో నాలుగు అంచెల్లో అనేక మంది సహకరించారు. వీరిలో నైజీరియన్లతోపాటు వివిధ మెట్రో నగరాలు, ఈశాన్య రాష్ట్రాలకు చెం దిన వారున్నారు. నగదు బదిలీ చేయడానికి ఖాతాలు సిద్ధమైన తర్వాత అసలు పని ప్రారం భించిన సైబర్ నేరగాళ్లు హైద రాబాద్‌లో ఉన్న సూత్రధా రులకు సమాచారం ఇచ్చారు. ఈ–మెయిల్ రూపంలో కీలాగర్స్ బ్యాంక్ సర్వర్‌ను హ్యాకింగ్ చేసేందుకు ముగ్గురు సూత్రధారులు హైదరాబాద్ శివార్లలో అడ్డా ఏర్పాటు చేసుకున్నారు. ప్రాక్సీ సర్వర్లు వాడుతూ నవంబర్ నుంచి కీలాగర్స్ ప్రయోగించారు. ఇంటర్నెట్తోపాటు డార్క్ నెట్లో విరివిగా లభిస్తున్న ఈ నిగూఢ సాఫ్ట్‌వేర్‌ను సైబర్ నేరగాళ్లు బ్యాంకు అధికారిక ఈ–మెయిల్‌కు జోక్స్, బొమ్మలు, ఆఫర్లు లేదా ఆర్బీఐ పేరుతో పంపి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. సైబర్ నేరగాళ్లు బ్యాంక్‌నకు పదుల సంఖ్యలో కీలాగర్స్తో కూడిన మెయిల్స్ పంపారు. దీన్ని అవతలి వ్యక్తి క్లిక్ చేయగానే అతడికి తెలియకుండానే వారి కంప్యూటర్లో ఇన్స్టాల్ అయింది. దీంతో వారి పని సులువైంది. ఈ సాఫ్ట్వేర్ ఉన్న కంప్యూటర్లో కీ బోర్డులో ఒక్క బటన్ నొక్కినా ఆ వివరాలు పూర్తిగా సైబర్ నేరగాడికి ఈ–మెయిల్ రూపంలో చేరిపోతాయి. ఇలానే మహేష్ బ్యాంక్ సూపర్ అడ్మిన్ యూజర్ నేమ్, పాస్వర్డ్ సైబర్ నేరగాళ్లకు చేరాయి. వీటి ద్వారానే బ్యాంక్ నెట్వర్క్ నుంచి సర్వర్లోకి చొరబడి దఫదఫాలుగా రూ.12.93 కోట్లను నాలుగు ఖాతాల్లోకి బదిలీ చేశారు. వాటి నుంచి దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న మరో 128 ఖాతాల్లోకి మళ్లించారు. ప్రస్తుతం ముగ్గురు కీలక సైబర్ నేరగాళ్లతోపాటు బ్యాంకు ఖాతాలు అందించిన, దళారులుగా వ్యవహరించిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నీలం రంగులో లింకులు! ‘సాధారణంగా మెయిల్స్ ద్వారా వచ్చే కీలాగర్స్ లింకులు నీలం రంగులో ఉంటాయి. అపరిచిత ఈ–మెయిల్స్‌లో ఇలాంటి లింక్స్ ఉంటే వాటి జోలికి పోకపోవడం ఉత్తమం. ఆ లింక్‌ను కాపీ చేసి అడ్రస్ బార్లో పేస్ట్ చేసి ఎంటర్ చేస్తే అది అసలుదా? నకిలీదా తెలుసుకునే అవకాశం ఉంటుంది. దీనిపై బ్యాంకు అధికారులకు అవగాహన లేకపోవడమే సైబర్ నేరగాళ్లకు కలిసి వచ్చింది’ అని ఓ ఉన్నతాధికారి తెలిపారు. -
బ్యాంకుకు హ్యాకర్ల భారీ షాక్.. 94 కోట్లు లూటీ!
సాక్షి, పుణె: దేశంలో సైబర్ నేరాల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. బ్యాంక్ ఖాతాదారులను లక్ష్యంగా చేసుకొని సైబర్ నేరాలకు పాల్పడుతున్న నేరగాళ్లు మరో అరాచకానికి పాల్పడ్డారు. తాజాగా ఏకంగా బ్యాంక్ సర్వర్‌ను హ్యాక్ చేసి కోట్లు లూటీ చేశారు. ఈ ఘటన దేశ ఆర్థిక రాజధాని ముంబైకి దగ్గరగా ఉండే పుణెలో జరిగింది. దేశంలోనే పేరుమోసిన కాస్మోస్ కోపరేటివ్ బ్యాంక్‌ను మాల్వేర్ సహాయంతో హ్యాక్‌చేసి దాదపు రూ. 94 కోట్లు దోచుకున్నారు. ఆలస్యంగా గుర్తించిన బ్యాంక్ అధికారులు చత్రుశింగి పోలీసు స్టేషన్లో పిర్యాదు చేశారు. ఈ కేసును స్థానిక పోలీసులు, సైబర్ క్రైం అధికారులు దర్యాప్తుచేస్తున్నారు. అసలు విషయమేమిటంటే ఈ నెల ఆగస్టు 11న హ్యాకర్లు మాల్వేర్ సాయంతో బ్యాంక్ కస్టమర్ల రూపే, వీసా కార్డుల వివరాలను సేకరించి క్లోన్ చేసి దాదాపు 78 కోట్ల రూపాయలను గుర్తు తెలియని పన్నెండు వేల విదేశీ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేశారు. అదే రోజు రెండున్నర కోట్లు స్వదేశీ అకౌంట్లకు బదీలీ చేశారు. ఆగస్టు 13న హాంగ్‌కాంగ్‌కు చెందిన బ్యాంక్ ఆకౌంట్లకు 13.92కోట్లు స్విఫ్ట్ పద్దతిన ట్రాన్స్ఫర్ చేశారని అధికారులు వివరించారు. హాంగ్‌కాంగ్, స్విస్, భారత్ వేదికగా ఈ హ్యాక్ జరిగి ఉంటుందని సైబర్ క్రైం అధికారులు అనుమానం. మీ డబ్బులు ఎటూ పోలేదు కాస్మోస్ కోపరేటివ్ బ్యాంక్ హ్యాక్‌కు గురైందని తెలిసిన వెంటనే ఖాతాదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్న తరుణంలో బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ సుహాస్ గోఖలే స్పందించారు. హ్యాక్ కు గురైంది బ్యాంక్ అకౌంట్లు మాత్రమేనని, ఖాతాదారుల వ్యక్తిగత అకౌంట్లు కాదని పేర్కొన్నారు. ఖాతాదారులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని, మీ డబ్బులు ఎటూ పోలేదని భరోసా ఇచ్చారు. సైబర్ నేరగాళ్ల మరోసారి బ్యాంక్ సర్వర్‌ను హ్యాక్చేయడానికి ప్రయత్నం చేశారని కానీ బ్యాంక్ ఫైర్‌వాల్ సిస్టం సమర్థవంతంగా అడ్డుకుందని వివరించారు. ఓవరాల్‌గా మొత్తం ఎంత డబ్యు లూటీకి గురైందో బ్యాంక్ ఆడిట్లో స్పష్టంగా తెలస్తుందని గోఖలే తెలిపారు. -
బ్యాంకుల్లోనే ఆధార్ నమోదు యంత్రాలు
న్యూఢిల్లీ: బ్యాంకులు ప్రస్తుత, కొత్త ఖాతాదారుల సౌలభ్యం కోసం తమ శాఖల్లోనే ఆధార్ నమోదు చేసుకోవాలని, దీనికి వీలుగా వేలిముద్రలు, ఐరిస్ స్కానర్లను ఏర్పాటు చేసుకోవాలని యూఐడీఏఐ కోరింది. ఆధార్ లింకింగ్ ప్రక్రియను సులభతరం చేసేందుకు తాము నిరంతరం శ్రమిస్తున్నామని, సత్వరమే బ్యాంకులు 10 శాతం శాఖల్లో ఫింగర్‌ప్రింట్, ఐరిస్ స్కానర్లు ఏర్పాటు చేసుకోవాలని, దాంతో ఖాతాదారులకు ఆధార్ నమోదు ఇబ్బందులు తొలగుతాయని యూఐడీఏఐ సీఈవో అజయ్ భూషణ్ పాండే చెప్పారు. ఆధార్ లేని వారు బ్యాంకులోనే ఆధార్‌కు నమోదు చేసుకుని, సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు 2018 మార్చి 31లోపు ఖాతాతో అనుసంధానించుకోవచ్చని సూచించారు. ఇప్పటి వరకు బ్యాంకు శాఖల్లో 3,000 ఆధార్ నమోదు కేంద్రాలు ఏర్పాటయ్యయాని, మొత్తం మీద 14,000 శాఖల్లో ఏర్పాటు చేయాల్సి ఉంటుందని పాండే తెలిపారు. -
ట్వీటర్ బ్యాంకింగ్ చేస్తున్నారా?!
డబ్బులు పంపొచ్చు.. ఫోన్ రీచార్జ్ చేసుకోవచ్చు లావాదేవీలు సహా దగ్గరిలోని బ్రాంచ్, ఏటీఎం వివరాలు పొందొచ్చు ట్రాన్సాక్షన్లు జరిగేది బ్యాంక్ సర్వర్లోనే.. భద్రతకు ఢోకా లేదు హ్యాష్‌ట్యాగ్ బ్యాంకింగ్‌గా ప్రాచుర్యంలోకి.. ఆర్థిక సేవలకు ఓటీపీ తప్పనిసరి ట్వీటర్ అంటే తెలియని వారెవరు చెప్పండి!. ఏదైనా అంశంపై అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించాలంటే చాలామంది వాడేది దీన్నే. అందుకోసం వాళ్లు చేసిన ట్వీట్‌ను... మరింతమందికి వేరొకరు రీట్వీట్ చేయటం కూడా జరిగేదిక్కడే. ఇక లైక్లూ... కామెంట్లు కామన్. ట్వీటర్ ద్వారా మనకు నచ్చిన వ్యక్తుల్ని, సంస్థల్ని అనుసరిస్తూ ఉండొచ్చు కూడా!!. అంటే వారిచ్చే అప్డేట్స్ను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఇవన్నీ పక్కనబెడితే... ట్వీటర్‌తో బ్యాంకింగ్ కార్యకలాపాలు కూడా ఎంచక్కా చేసుకోవచ్చు. దీన్నే ‘హ్యాష్‌ట్యాగ్ బ్యాంకింగ్’గా పిలుస్తున్నారు. ఆ వివరాలే ఈ వారం ప్రాఫిట్ ప్రధాన కథనం... సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం సేవలు ఇలా పొందొచ్చు.. హ్యాష్‌ట్యాగ్/ట్వీటర్ బ్యాంకింగ్ సేవలను ప్రస్తుతం కొన్ని బ్యాంకులు మాత్రమే ఆఫర్ చేస్తున్నాయి. ఎస్బీఐ, ఐసీఐసీఐ, యాక్సిస్, కొటక్ వంటి బ్యాంకులు ఈ సేవలను అందిస్తున్నాయి. ఈ సేవలను పొందాలంటే తొలిగా మనకు ఒక ట్వీటర్ అకౌంట్ ఉండాలి. దీన్నే ట్వీటర్ హ్యాండిల్గా పిలుస్తారు. అలాగే బ్యాంక్ ఖాతా కూడా కావాలి. తర్వాత మనకు ఏ బ్యాంకులో అయితే ఖాతా ఉందో.. ఆ బ్యాంకును ట్వీటర్లో ఫాలో అవ్వాలి. ఉదాహరణకు మనకు యాక్సిస్ బ్యాంకులో ఖాతా ఉంటే.. ట్వీటర్లో @AxisBankSupport అనే అకౌంట్‌ను అనుసరించాలి. అదే ఎస్బీఐ అనుకుంటే.. @TheOfficialSBI ఆఐ అనే ట్వీటర్ అకౌంట్‌ను ఫాలో అవ్వాలి. తర్వాత బ్యాంకు ట్వీటర్ అకౌంట్‌కు #regOTP అని టైప్ చేసి, దీనికి బ్యాంక్ ఖాతా సంఖ్య లేదా కస్టమర్ ఐడీ వంటి వాటిని చేర్చి డైరెక్ట్ మెసేజ్ పంపాలి. అప్పుడు మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు బ్యాంకు నుంచి ఓటీపీ వస్తుంది. తర్వాత #SBIreg అని టైప్ చేసి స్పేస్ ఇచి ఓటీపీ నెంబర్ టైప్ చేసి మళ్లీ బ్యాంకు ట్వీటర్ అకౌంట్‌కు మేసేజ్ పంపాలి. అప్పటి నుంచి మీరు ఈ సేవలను పొందొచ్చు. ఉదాహ రణకు మీరు ఎస్బీఐ ఖాతాదారుడు అయితే అప్పుడు మీరు బ్యాంక్ ట్వీటర్ అకౌంట్‌కి #Sఆఐట్ఛజ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి బ్యాంక్ ఖాతా నెంబర్‌ను రాసి డైరెక్ట్ మెసేజ్ పంపాలి. అప్పుడు మీ రిజిస్టర్ బ్యాంక్ మొబైల్ నెంబర్‌కి ఓటీపీ వస్తుంది. అప్పుడు#regOTP అని స్పేస్ ఇచ్చి ఓటీపీ నెంబర్ టైప్ చేసి మళ్లీ బ్యాంక్ ట్వీటర్ అకౌంట్‌కి మెసేజ్ పంపాలి. ఈవిధంగా మీరు ట్వీటర్ బ్యాకింగ్ సేవలు పొందొచ్చు. ఈ విధానం ఎలా పనిచేస్తుందంటే... బ్యాంకు ట్వీటర్ అకౌంట్‌కు మెసేజ్ చేయడం ద్వారా నాన్S–ఫైనాన్షియల్ సేవలను వెంటనే పొందొచ్చు. అంటే #Bal, # Txn, #STMT వంటి మెసేజ్‌లు పంపడం ద్వారా బ్యాలెన్స్ వివరాలు, చివరి 3 లావాదేవీలు, గత 3 నెలల ట్రాన్సాక్షన్ల వివరాలను పొందొచ్చు. కాగా ఫైనాన్షియల్ సేవలకు ఓటీపీ తప్పనిసరి. ఉదాహరణకు మీరు యాక్సిస్ బ్యాంక్ కస్టమర్ అయి మొబైల్ ఫోన్‌ను రీచార్జ్ చేసుకోవాలని భావిస్తే.. @AxisBankSupportMýS$ #sendOTP అని మెసేజ్ చేయాలి. అప్పుడు మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఒక ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీ సాయంతో బ్యాంకు రీచార్జ్‌కు ఎలాంటి హ్యాష్‌ట్యాగ్‌ను ఏర్పాటు చేసిందో అదే ఫార్మాట్లో బ్యాంకుకు ఇంకొక మెసేజ్æ పంపాలి. ఎలాంటి సేవలు లభిస్తాయంటే.. ట్వీటర్/హ్యాష్‌ట్యాగ్ బ్యాంకింగ్ ద్వారా ఫైనాన్షియల్తో పాటు నాన్–ఫైనాన్షియల్ సేవలు కూడా పొందొచ్చు. ప్రీపెయిడ్ మొబైల్ ఫోన్ల రీచార్జ్, డీటీహెచ్ బిల్లుల చెల్లింపు, పోస్ట్‌పెయిడ్ మొబైల్ బిల్లుల చెల్లింపు, మనీ ట్రాన్స్ఫర్ వంటివన్నీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కిందకు వస్తాయి. అదే నాన్–ఫైనాన్షియల్ సేవల కింద బ్యాలెన్స్ తెలుసుకోవటం, అకౌంట్ స్టేట్మెంట్, చెక్ బుక్ రిక్వెస్ట్, గత లావాదేవీల సమాచారం తెలుసుకోవడం, దగ్గరిలోని బ్రాంచ్/ ఏటీఎం వివరాలు పొందటం వంటి సేవలు కూడా పొందొచ్చు. మనం ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లు అయితే ట్వీటర్ ద్వారా స్నేహితులకు డబ్బులు కూడా పంపొచ్చు. ప్లస్‌లు.. మైనస్‌లు.. ►ఈ స్మార్ట్ఫోన్ల యుగంలో హ్యాష్‌ట్యాగ్ బ్యాకింగ్ సేవలను బ్యాంకింగ్ కార్యకలాపాలకు మారొక రూపంగా భావించాలి. బ్యాంకుకు డైరెక్ట్ మేసేజ్ పంపడమనేది చాలా మంచి విషయం. మనం పంపే మెసేజ్‌లను బ్యాంకులు మాత్రమే చూస్తాయి. ఎవరికీ కనిపించవు. అదే ట్వీట్స్ అయితే ఇతరులు కూడా చూస్తారు. ► ట్వీటర్ ద్వారా మొబైల్ రీచార్జ్ చేసుకోవాలంటే.. పెద్ద హ్యాష్‌ట్యాగ్‌లతో మేసేజ్‌లు పంపాలి. వీటిని గుర్తు పెట్టుకోవడం కష్టం. ► ట్వీటర్ మాధ్యమంగా నిర్వహించే లావాదేవీలకు పరిమితులు కూడా ఉంటాయి. ఉదాహరణకు యాక్సిస్ బ్యాంకు కస్టమర్ కనీసం రూ.200 నుంచి రూ.5,000 వరకు మాత్రమే డీటీహెచ్ రీచార్జ్ చేసుకోగలడు. ► అదే కొటక్ బ్యాంక్ కస్టమర్ అయితే ట్వీటర్ ద్వారా నెలకు పది మొబైల్ రీచార్జ్‌లను, ఐదు డీటీహెచ్ రీచార్జ్‌లను మాత్రమే చేసుకోవచ్చు. ► ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్ ఒక ట్రాన్సాక్షన్ ద్వారా రూ.5,000 వరకు మాత్రమే ట్రాన్స్ఫర్ చేసుకోగలడు. ఇక రోజుకు గరిష్టంగా రూ.10,000 ట్రాన్స్ఫర్ చేయవచ్చు. ట్వీటర్/హ్యాష్‌ట్యాగ్ బ్యాంకింగ్ సురక్షితమేనా? ఇంటర్నెట్ బ్యాంకింగ్ మాదిరిగా కాకుండా సామాజిక మాధ్యమమైన ట్వీటర్ ద్వారా ఆర్థిక కార్యకలాపాలను నిర్వహించడం సురక్షితం కాదని చాలా మంది భావిస్తూ ఉంటారు. కానీ ట్వీటర్/హ్యాష్‌ట్యాగ్ బ్యాంకింగ్‌లో ట్వీటర్ అనేది ఒక అనుసంధానకర్త మాత్రమే. ఏ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షనైనా ఓటీపీ ఆధారంగానే జరుగుతుందనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ‘ట్వీటర్/హ్యాష్‌ట్యాగ్ బ్యాంకింగ్‌లో జరిగే అన్ని లావాదేవీలు ఐసీఐసీఐ బ్యాంక్ సర్వర్లోనే జరుగుతాయి. ఇవ్వన్నీ బ్యాంక్ ఫైర్‌వాల్ పరిధిలోనే ఉంటాయి. హ్యాష్‌ట్యాగ్ బ్యాంకింగ్ కూడా సురక్షితమైనదే’ అని ఐసీఐసీఐ బ్యాంక్ డిజిటల్ చానల్స్ హెడ్ అబోంటి బెనర్జీ వివరించారు.