ట్వీటర్‌ బ్యాంకింగ్‌ చేస్తున్నారా?! | Social Banking Twitter | Sakshi
Sakshi News home page

ట్వీటర్‌ బ్యాంకింగ్‌ చేస్తున్నారా?!

Published Mon, Dec 19 2016 12:23 AM | Last Updated on Mon, Sep 4 2017 11:03 PM

ట్వీటర్‌ బ్యాంకింగ్‌ చేస్తున్నారా?!

ట్వీటర్‌ బ్యాంకింగ్‌ చేస్తున్నారా?!

డబ్బులు పంపొచ్చు.. ఫోన్‌ రీచార్జ్‌ చేసుకోవచ్చు
లావాదేవీలు సహా దగ్గరిలోని బ్రాంచ్, ఏటీఎం వివరాలు పొందొచ్చు
ట్రాన్సాక్షన్లు జరిగేది బ్యాంక్‌ సర్వర్‌లోనే.. భద్రతకు ఢోకా లేదు
హ్యాష్‌ట్యాగ్‌ బ్యాంకింగ్‌గా  ప్రాచుర్యంలోకి..
ఆర్థిక సేవలకు ఓటీపీ తప్పనిసరి


ట్వీటర్‌ అంటే తెలియని వారెవరు చెప్పండి!. ఏదైనా అంశంపై అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించాలంటే చాలామంది వాడేది దీన్నే. అందుకోసం వాళ్లు చేసిన ట్వీట్‌ను... మరింతమందికి వేరొకరు రీట్వీట్‌ చేయటం కూడా జరిగేదిక్కడే. ఇక లైక్‌లూ... కామెంట్లు కామన్‌. ట్వీటర్‌ ద్వారా మనకు నచ్చిన వ్యక్తుల్ని, సంస్థల్ని అనుసరిస్తూ ఉండొచ్చు కూడా!!. అంటే వారిచ్చే అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఇవన్నీ పక్కనబెడితే... ట్వీటర్‌తో బ్యాంకింగ్‌ కార్యకలాపాలు కూడా ఎంచక్కా చేసుకోవచ్చు. దీన్నే ‘హ్యాష్‌ట్యాగ్‌ బ్యాంకింగ్‌’గా పిలుస్తున్నారు. ఆ వివరాలే ఈ వారం ప్రాఫిట్‌ ప్రధాన కథనం...

 సాక్షి, పర్సనల్‌ ఫైనాన్స్‌ విభాగం

సేవలు ఇలా పొందొచ్చు..
హ్యాష్‌ట్యాగ్‌/ట్వీటర్‌ బ్యాంకింగ్‌ సేవలను ప్రస్తుతం కొన్ని బ్యాంకులు మాత్రమే ఆఫర్‌ చేస్తున్నాయి. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, యాక్సిస్, కొటక్‌ వంటి బ్యాంకులు ఈ సేవలను అందిస్తున్నాయి. ఈ సేవలను పొందాలంటే తొలిగా మనకు ఒక ట్వీటర్‌ అకౌంట్‌ ఉండాలి. దీన్నే ట్వీటర్‌ హ్యాండిల్‌గా పిలుస్తారు. అలాగే బ్యాంక్‌ ఖాతా కూడా కావాలి. తర్వాత మనకు ఏ బ్యాంకులో అయితే ఖాతా ఉందో.. ఆ బ్యాంకును ట్వీటర్‌లో ఫాలో అవ్వాలి. ఉదాహరణకు మనకు యాక్సిస్‌ బ్యాంకులో ఖాతా ఉంటే.. ట్వీటర్‌లో @AxisBankSupport అనే అకౌంట్‌ను అనుసరించాలి. అదే ఎస్‌బీఐ అనుకుంటే.. @TheOfficialSBI ఆఐ అనే ట్వీటర్‌ అకౌంట్‌ను ఫాలో అవ్వాలి. తర్వాత బ్యాంకు ట్వీటర్‌ అకౌంట్‌కు #regOTP అని టైప్‌ చేసి, దీనికి బ్యాంక్‌ ఖాతా సంఖ్య లేదా కస్టమర్‌ ఐడీ వంటి వాటిని చేర్చి డైరెక్ట్‌ మెసేజ్‌ పంపాలి. అప్పుడు మీ రిజిస్టర్‌ మొబైల్‌ నెంబర్‌కు బ్యాంకు నుంచి ఓటీపీ వస్తుంది. తర్వాత #SBIreg అని టైప్‌ చేసి స్పేస్‌ ఇచి ఓటీపీ నెంబర్‌ టైప్‌ చేసి మళ్లీ బ్యాంకు ట్వీటర్‌ అకౌంట్‌కు మేసేజ్‌ పంపాలి. అప్పటి నుంచి మీరు ఈ సేవలను పొందొచ్చు. ఉదాహ రణకు మీరు ఎస్‌బీఐ ఖాతాదారుడు అయితే అప్పుడు మీరు బ్యాంక్‌ ట్వీటర్‌ అకౌంట్‌కి #Sఆఐట్ఛజ అని టైప్‌ చేసి స్పేస్‌ ఇచ్చి బ్యాంక్‌ ఖాతా నెంబర్‌ను రాసి డైరెక్ట్‌ మెసేజ్‌ పంపాలి. అప్పుడు మీ రిజిస్టర్‌ బ్యాంక్‌ మొబైల్‌ నెంబర్‌కి ఓటీపీ వస్తుంది. అప్పుడు#regOTP అని స్పేస్‌ ఇచ్చి ఓటీపీ నెంబర్‌ టైప్‌ చేసి మళ్లీ బ్యాంక్‌ ట్వీటర్‌ అకౌంట్‌కి మెసేజ్‌ పంపాలి. ఈవిధంగా మీరు ట్వీటర్‌ బ్యాకింగ్‌ సేవలు పొందొచ్చు.

ఈ విధానం ఎలా పనిచేస్తుందంటే...
బ్యాంకు ట్వీటర్‌ అకౌంట్‌కు మెసేజ్‌ చేయడం ద్వారా నాన్‌S–ఫైనాన్షియల్‌ సేవలను వెంటనే పొందొచ్చు. అంటే #Bal, # Txn, #STMT  వంటి మెసేజ్‌లు పంపడం ద్వారా బ్యాలెన్స్‌ వివరాలు, చివరి 3 లావాదేవీలు, గత 3 నెలల ట్రాన్సాక్షన్ల వివరాలను పొందొచ్చు. కాగా ఫైనాన్షియల్‌ సేవలకు ఓటీపీ తప్పనిసరి. ఉదాహరణకు మీరు యాక్సిస్‌ బ్యాంక్‌ కస్టమర్‌ అయి మొబైల్‌ ఫోన్‌ను రీచార్జ్‌ చేసుకోవాలని భావిస్తే..  @AxisBankSupportMýS$ #sendOTP అని మెసేజ్‌ చేయాలి. అప్పుడు మీ రిజిస్టర్డ్‌ మొబైల్‌ నెంబర్‌కు ఒక ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీ సాయంతో బ్యాంకు రీచార్జ్‌కు ఎలాంటి హ్యాష్‌ట్యాగ్‌ను ఏర్పాటు చేసిందో అదే ఫార్మాట్‌లో బ్యాంకుకు ఇంకొక మెసేజ్‌æ పంపాలి.

ఎలాంటి సేవలు లభిస్తాయంటే..
ట్వీటర్‌/హ్యాష్‌ట్యాగ్‌ బ్యాంకింగ్‌ ద్వారా ఫైనాన్షియల్‌తో పాటు నాన్‌–ఫైనాన్షియల్‌ సేవలు కూడా పొందొచ్చు. ప్రీపెయిడ్‌ మొబైల్‌ ఫోన్ల రీచార్జ్, డీటీహెచ్‌ బిల్లుల చెల్లింపు, పోస్ట్‌పెయిడ్‌ మొబైల్‌ బిల్లుల చెల్లింపు, మనీ ట్రాన్స్‌ఫర్‌ వంటివన్నీ ఫైనాన్షియల్‌ ట్రాన్సాక్షన్స్‌ కిందకు వస్తాయి. అదే నాన్‌–ఫైనాన్షియల్‌ సేవల కింద బ్యాలెన్స్‌ తెలుసుకోవటం, అకౌంట్‌ స్టేట్‌మెంట్, చెక్‌ బుక్‌ రిక్వెస్ట్, గత లావాదేవీల సమాచారం తెలుసుకోవడం, దగ్గరిలోని బ్రాంచ్‌/ ఏటీఎం వివరాలు పొందటం వంటి సేవలు కూడా పొందొచ్చు. మనం ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌ కస్టమర్లు అయితే ట్వీటర్‌ ద్వారా స్నేహితులకు డబ్బులు కూడా పంపొచ్చు.

ప్లస్‌లు.. మైనస్‌లు..
ఈ స్మార్ట్‌ఫోన్ల యుగంలో హ్యాష్‌ట్యాగ్‌ బ్యాకింగ్‌ సేవలను బ్యాంకింగ్‌ కార్యకలాపాలకు మారొక రూపంగా భావించాలి. బ్యాంకుకు డైరెక్ట్‌ మేసేజ్‌ పంపడమనేది చాలా మంచి విషయం. మనం పంపే మెసేజ్‌లను బ్యాంకులు మాత్రమే చూస్తాయి. ఎవరికీ కనిపించవు. అదే ట్వీట్స్‌ అయితే ఇతరులు కూడా చూస్తారు.

ట్వీటర్‌ ద్వారా మొబైల్‌ రీచార్జ్‌ చేసుకోవాలంటే.. పెద్ద హ్యాష్‌ట్యాగ్‌లతో మేసేజ్‌లు పంపాలి. వీటిని గుర్తు పెట్టుకోవడం కష్టం.

ట్వీటర్‌ మాధ్యమంగా నిర్వహించే లావాదేవీలకు పరిమితులు కూడా ఉంటాయి. ఉదాహరణకు యాక్సిస్‌ బ్యాంకు కస్టమర్‌ కనీసం రూ.200 నుంచి రూ.5,000 వరకు మాత్రమే డీటీహెచ్‌ రీచార్జ్‌ చేసుకోగలడు.

అదే కొటక్‌ బ్యాంక్‌ కస్టమర్‌ అయితే ట్వీటర్‌ ద్వారా నెలకు పది మొబైల్‌ రీచార్జ్‌లను, ఐదు డీటీహెచ్‌ రీచార్జ్‌లను మాత్రమే చేసుకోవచ్చు.

ఐసీఐసీఐ బ్యాంక్‌ కస్టమర్‌ ఒక ట్రాన్సాక్షన్‌ ద్వారా రూ.5,000 వరకు మాత్రమే ట్రాన్స్‌ఫర్‌ చేసుకోగలడు. ఇక రోజుకు గరిష్టంగా రూ.10,000 ట్రాన్స్‌ఫర్‌ చేయవచ్చు.

ట్వీటర్‌/హ్యాష్‌ట్యాగ్‌ బ్యాంకింగ్‌ సురక్షితమేనా?
ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ మాదిరిగా కాకుండా సామాజిక మాధ్యమమైన ట్వీటర్‌ ద్వారా ఆర్థిక కార్యకలాపాలను నిర్వహించడం సురక్షితం కాదని చాలా మంది భావిస్తూ ఉంటారు. కానీ ట్వీటర్‌/హ్యాష్‌ట్యాగ్‌ బ్యాంకింగ్‌లో ట్వీటర్‌ అనేది ఒక అనుసంధానకర్త మాత్రమే. ఏ ఫైనాన్షియల్‌ ట్రాన్సాక్షనైనా ఓటీపీ ఆధారంగానే జరుగుతుందనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ‘ట్వీటర్‌/హ్యాష్‌ట్యాగ్‌ బ్యాంకింగ్‌లో జరిగే అన్ని లావాదేవీలు ఐసీఐసీఐ బ్యాంక్‌ సర్వర్‌లోనే జరుగుతాయి. ఇవ్వన్నీ బ్యాంక్‌ ఫైర్‌వాల్‌ పరిధిలోనే ఉంటాయి. హ్యాష్‌ట్యాగ్‌ బ్యాంకింగ్‌ కూడా సురక్షితమైనదే’ అని ఐసీఐసీఐ బ్యాంక్‌ డిజిటల్‌ చానల్స్‌ హెడ్‌ అబోంటి బెనర్జీ వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement