Banned Substance
-
ఆ విషయం తెలియదు.. అయినా తప్పు చేశా
మాస్కో: అవగాహన లేకుండా నిషేధిత ఉత్ప్రేరకం మెల్డోనియం వాడినందుకు నిషేధం ఎదుర్కొన్న రష్యా టెన్నిస్ స్టార్ మరియా షరపోవా అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్యను నిందించింది. నిషేధిత ఉత్ప్రేరకాల జాబితాలో మెల్డోనియంను చేర్చినట్టుగా తనను అప్రమత్తం చేయడంలో ఐటీఎఫ్ తగిన ప్రయత్నాలు చేయలేదని షరపోవా పేర్కొంది. 2016 ఆస్ట్రేలియా ఓపెన్ సందర్భంగా షరపోవా నిషేధ ఉత్ప్రేరకం మెల్డోనియం వాడినట్టు పరీక్షల్లో తేలడంతో ఆమెపై రెండేళ్లు సస్పెన్షన్ విధించారు. తర్వాత నిషేధిత కాలాన్ని 15 నెలలకు తగ్గించారు. మెల్డోనియంను నిషేధించిన విషయం తనకు తెలియదని, అధికారులు ఈ విషయాన్ని నేరుగా అథ్లెట్లకు తెలియజేసి ఉంటే బాగుండేదని షరపోవా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఏదేమైనా తెలుసుకోకుండా నిషేధిత ఉత్ప్రేరకం వాడటం తనదే తప్పని, ఇందుకు బాధ్యత తనదేనని వాపోయింది. ఈ నెల చివర్న జరిగే టోర్నీలో షరపోవా ఆడనుంది. -
రాణిగారి రేసుగుర్రం శరీరంలో నిషేధిత డ్రగ్స్
లండన్: ఇంగ్లండ్ రాణి ఎలిజబెత్ 2 పెంపుడు గుర్రం శరీరంలో నిషేధిత ఉత్ప్రేరకం ఉన్నట్టు వైద్య పరీక్షలో వెల్లడైంది. దీని శరీరంలో నిషేధిత మార్ఫిన్ ఉన్నట్టు పరీక్ష ద్వారా నిర్థాణయిందని బకింగ్‌హామ్ ప్యాలెస్ ఒక ప్రకటనలో తెలిపింది. కలుషిత ఆహారం ద్వారా నిషేధిత పదార్థం దాని శరంలోకి ప్రవేశించివుండొచ్చని పేర్కొంది. ఈ విషయాన్ని బ్రిటీష్ హార్స్ రేసింగ్ అథారిటీకి రాణి ఎలిజబెత్ తెలిపారని గార్డియన్ పత్రిక వెల్లడించింది. మారీ పేరుతో పిలుచుకునే ఈ గుర్రం వయసు ఐదేళ్లు. ఈ గుర్రం గేడాది ప్రతిష్టాత్మక గోల్డ్ కప్ గెల్చింది. మైఖేల్ స్టౌట్ దీనికి శిక్షణనిస్తున్నారు. రాణి ఎలిజబెత్ 2 దగ్గరవున్న ఐదు పెంపుడు గుర్రాల్లో ఇది ఒకటి. అయితే గుర్రం శరీరంలోని నిషేధిత పదార్థం ఎలా ప్రవేశించిందనే దానిపై దర్యాప్తు జరుపుతున్నామని రాజకుటుంబం తెలిపింది.