bari
-
ఆ వృత్తం.. ఓ వి‘చిత్రం’!
అది ఏడున్నర మీటర్ల వ్యాసంతో ఉన్న భారీ వృత్తం.. ఎక్కడా వంకరటింకరగా లేకుండా వృత్తలేఖినితో గీసినట్టు కచ్చితమైన రూపం.. పెద్ద బండరాయి మీద 30 అంగుళాల మందంతో చెక్కటంతో అది ఏర్పడింది.. కానీ అది ఇప్పటిది కాదు, దాదాపు 3 వేల ఏళ్ల నాటిది కావడం విశేషం. సాక్షి, హైదరాబాద్: భాగ్యనగర శివారు ప్రాంతాల్లో కొన్ని గుట్టల్లో ఆదిమానవులు గీసిన రంగుల చిత్రాలు నేటికీ కనిపిస్తాయి. కానీ వాటికి భిన్నంగా ఇప్పుడు గుట్ట పరుపుబండ మీద ఆదిమానవులు చెక్కిన పెద్ద వృత్తం (జియోగ్లిఫ్) చరిత్ర పరిశోధకులను ఆకర్షిస్తోంది. మేడ్చల్ సమీపంలోని మూడు చింతలపల్లి శివారులోని గుట్ట మీద ఇది వెలుగు చూసింది. కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు కె.గోపాల్, మహ్మద్ నజీరుద్దీన్, అన్వర్ బాష, అహోబిలం కరుణాకర్‌లు ఇచ్చిన సమాచారం మేరకు చరిత్ర పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి ఆ బృందంతో కలసి దాన్ని పరిశీలించారు. ‘తక్కువ ఎత్తున్న గుట్ట పరుపుబండపై ఈ వృత్తం చెక్కి ఉంది. ఏడున్నర మీటర్ల వ్యాసంతో భారీగా ఉన్న ఈ వృత్తం మధ్యలో రెండు త్రిభుజాకార రేఖా చిత్రాలను కూడా చెక్కారు. అంత పెద్దగా ఉన్నప్పటీకీ వంకరటింకరలు లేకుండా ఉండటం విశేషం. దీనికి సమీపంలో కొత్త రాతియుగం రాతి గొడ్డళ్లు నూరిన గాడులు (గ్రూవ్స్) ఉన్నాయి. ఇప్పటి వరకు తెలంగాణలో ఈ తరహా చెక్కిన రేఖా చిత్రం వెలుగుచూడకపోవటంతో దీనిపై మరింతగా పరిశోధించాల్సి ఉంది’అని శివనాగిరెడ్డి పేర్కొన్నారు. సమాధి నమూనా అయ్యుండొచ్చు.. ఈ చిత్రం ఇనుప యుగానికి చెందిందిగా భావిస్తున్నాం. అప్పట్లో మానవుల సమాధుల చుట్టూ వృత్తాకారంలో పెద్ద రాళ్ల వరుసను ఏర్పాటు చేసేవారు. ఆ సమాధి నిర్మాణానికి నమూనాగా ఈ వృత్తాన్ని గీసి ఉంటారన్నది మా ప్రాథమిక అంచనా. గతంలో కర్ణాటకలో ఇలాంటి చిత్రం కనపించింది. దాని మధ్యలో చనిపోయిన మనిషి ఉన్నట్లు చిత్రించి ఉంది. ఈ చిత్రాన్ని మరింత పరిశోధిస్తే కొత్త విషయాలు తెలుస్తాయి. – రవి కొరిశెట్టార్, పురావస్తు నిపుణుడు -
గ్రామీణ నేపథ్యంతో 'బరి'.. ఫస్ట్ లుక్, టీజర్ విడుదల
Bari Movie First Look And Teaser Released: రాజు, సహాన జంటగా సురేష్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'బరి'. ఈ చిత్రం ఫస్ట్ లుక్, టీజర్‌ను సోమవారం ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి చేతులమీదుగా విడుదల చేశారు. ఫస్ట్ లుక్, టీజర్‌తోపాటు టైటిల్ ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయని రాజ్ కందుకూరి తెలిపారు. సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. 'ఈ సినిమాతో నేను హీరోగా పరిచయం అవుతున్నా. దర్శకుడు ఎంతో హార్డ్ వర్క్ చేసి అందరికీ నచ్చే విధంగా సినిమా తెరకెక్కించారు. టీమ్‌ని నమ్మి మా నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మించారు.' అని హీరో రాజు చెప్పుకొచ్చాడు. ఈ సినిమా గ్రామీణ నేపథ్యంలో కోడి పుంజులు, కోడి పందేలు ప్రధానంశంగా తెరకెక్కనున్నట్లు డైరెక్టర్ సురేష్ రెడ్డి వెల్లడించారు. రేపల్లె, బాపట్ల, తెనాలి ప్రాంతాల్లో షూటింగ్ చేశామన్నాడు. నాలుగు పాటలున్న ఈసినిమా ఆడియోను త్వరలో లాంచ్ చేస్తామన్నారు. ఫిబ్రవరిలో ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. 'మాది బెంగళూరు అయినా సినిమాల మీద ఉన్న ఇష్టంతో తొలి సినిమాగా 'బరి' చిత్రాన్ని నిర్మించాను. టీమ్ అంతా హార్డ్ వర్క్ చేశారు. సినిమా అంతా పూర్తయింది. ప్రస్తుతం సెన్సార్ పనులు జరుగుతున్నాయి. ఇంత వరకు రాని కథాంశంతో ఈ సినిమా చేశాను. మా తొలి ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నా' అని నిర్మాత మునికృష్ణ పేర్కొన్నారు. ఇదీ చదవండి: 'పుష్ప'రాజ్‌కు బాలీవుడ్ ఫిదా.. జాన్వీ కపూర్ ప్రశంసలు -
సైకిల్‌పై వెళితే పారితోషికం!
బారీ(ఇటలీ): సైకిల్ తొక్కడం వల్ల పర్యావరణానికి మేలు జరగడంతోపాటు, ఆరోగ్యానికి మంచి జరుగుతుందనే విషయం తెలిసిందే. అయితే.. ప్రస్తుతం సైకిల్ తొక్కే వారి సంఖ్య చాలా తక్కువైంది. పాఠశాల స్థాయి విద్యార్థులు సైతం స్కూటీలు, బైక్‌లపై చక్కర్లు కొడుతున్నారు. మరికొందరు బద్ధకంతో తక్కువ దూరాలకు సైతం బైక్‌లు, కార్లు లాంటి వాహనాలను ఉపయోగిస్తున్నారు. ఇలాంటి వారిని దృష్టిలో పెట్టుకుని ఇటలీలోని ‘బారీ’ నగరంలో అధికారులు ఓ ప్రోత్సాహక పథకం ప్రవేశపెట్టారు. సైకిల్ మీద ఆఫీసుకు వెళ్లే వారికి నగదు పారితోషికం ఇవ్వాలని నిర్ణయించారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా సైకిల్‌పై ఆఫీసుకు వెళ్లేవారికి కిలోమీటరుకు 20 సెంట్ల పారితోషికం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. సుమారు వెయ్యిమందికి ఇందులో చేరే అవకాశం ఉంటుంది. గరిష్ఠంగా ఒక్కొక్కరికి 25 యూరోల (సుమారు రూ.2000) వరకు చెల్లించే అవకాశముంది. అత్యధిక కిలోమీటర్లు సైకిల్ తొక్కినవారికి అదనంగా బోనస్ సైతం ఉంటుందట. దీనికోసం ఉద్యోగులు, పిల్లల కోసం తల్లిదండ్రులు సైకిళ్లు కొనేందుకు నగరపాలక సంస్థ నిధులూ కేటాయించింది. సైకిల్ తొక్కడం వల్ల ఆరోగ్యం మెరుగుపడడమే కాకుండా డబ్బులూ వస్తాయని నగర మేయర్ ఆంటోనియో డెకారో అంటున్నారు. -
గిరిపై ఎన్నికల బరి
రసవత్తరంగా ‘పురోహిత’ ఎన్నికల రాజకీయం ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం అధ్యక్ష పదవికి నలుగురు, కార్యదర్శి పదవికి ఇద్దరు పోటీ ఒకేఒక్క నామినేష¯ŒS దాఖలుతో ఏకగ్రీవమైన కోశాధికారి కొండ దిగువకు మారిన పోలింగ్ అన్నవరం : సత్యదేవుని సన్నిధిలో ఎన్నికల వేడి రాజుకుంది. ట్రేడ్యూనియ¯ŒS తరహాలో దేవస్థానం చరిత్రలోనే తొలిసారిగా దేవస్థానం పురోహితుల యూనియ¯ŒSకు అధికారులు ఎన్నికలు నిర్వహిస్తుండడంతో 213 మంది వ్రతపురోహితులు రెండు వర్గాలుగా చీలిపోయారు. అధ్యక్ష, కార్యదర్శి, కోశాధికారి పదవులకు ఈ నెల 27న శుక్రవారం ఎన్నికలు జరుగుతున్నాయి. బుధవారం సాయంత్రం ఐదుగంటలకు నామినేషన్ల ఉపసంహరణ పూర్తి కాగా, అధ్యక్ష పదవికి నలుగురు, కార్యదర్శి పదవికి ఇద్దరు బరిలో మిగిలారు. కోశాధికారి పదవికి ఒక్కరే నామినేష¯ŒS వేయడంతో అది ఏకగ్రీవమైంది. కాగా, బరిలో మిగిలిన వారికి గుర్తులను కూడా కేటాయించినట్టు ఎన్నికల అధికారి, వ్రతపురోహిత స్పెషల్‌గ్రేడ్ సూపర్వైజర్ ముత్య సత్యనారాయణ బుధవారం సాయంత్రం తెలిపారు. ఏకగ్రీవంగా కోశాధికారి పదవి కోశాధికారి పదవికి సవితాల వీరబాబు ఒక్కరే నామినేష¯ŒS దాఖలు చేయడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే ఈ విషయాన్ని శుక్రవారం మధ్యాహ్నం లాంఛనంగా ప్రకటిస్తారు. కొండదిగువకు మారిన ఎన్నికలు శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకూ కొండదిగువన ప్రైవేటు లాడ్జిలో పోలింగ్ జరగనుంది. మొదట దేవస్థానంలో నైరుతి మండపంలో పోలింగ్ నిర్వహించాలని అధికారులు భావించారు. అయితే భక్తిభావంతో కూడిన ఆధ్యాత్మిక వాతావరణం ఉండాల్సిన దేవస్థానంలో ఎన్నికలు నిర్వహించడమేంటన్న విమర్శలతో పురోహితుల యూనియ¯ŒS ఎన్నికలు కొండదిగువకు మార్చారు. అధికారుల మద్దతుదారులు...వ్యతిరేకుల పోరుగా ఎన్నికలు దేవస్థానంలో ప్రతిసారి పురోహితులందరూ ఏకగ్రీవంగా తమ యూనియ¯ŒS కార్యవర్గాన్ని ఎన్నుకునేవారు. అయితే అధికారులే కొంతమందికి అధిక ప్రాధాన్యం ఇస్తుండడం, మరి కొంతమందిని అణగతొక్కడానికి ప్రయత్నిస్తున్నట్టు విమర్శలు వచ్చాయి. దానికి తోడు గత ఆరు నెలల్లో వివిధ కారణాలతో సుమారు 50 మంది పురోహితులు సస్పెన్ష¯ŒSకు గురయ్యారు. వీరందరినీ తిరిగి విధుల్లోకి తీసుకునేటప్పుడు అధికారులు ఒకే రకంగా చూడలేదనే విమర్శలున్నాయి. కొంతమందికి జురిమానాలు వేశారు. మరి కొంతమంది మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండానే వి««దlుల్లోకి తీసుకున్నారు. దీంతో అన్యాయానికి గురయ్యామని భావిస్తున్న వారు అధికారులపై తీవ్ర అసంతృప్తి కలిగి ఉన్నారు. కొంతమంది పురోహితులైతే అధికారుల చర్యలపై హైకోర్టు ను ఆశ్రయించి స్టేలు కూడా పొందారు.