గిరిపై ఎన్నికల బరి | annavaram | Sakshi
Sakshi News home page

గిరిపై ఎన్నికల బరి

Published Thu, Jan 26 2017 12:21 AM | Last Updated on Tue, Sep 5 2017 2:06 AM

గిరిపై ఎన్నికల బరి

గిరిపై ఎన్నికల బరి

 
 
  • రసవత్తరంగా ‘పురోహిత’ ఎన్నికల రాజకీయం
  • ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం 
  • అధ్యక్ష పదవికి నలుగురు, కార్యదర్శి పదవికి ఇద్దరు పోటీ
  • ఒకేఒక్క నామినేష¯ŒS దాఖలుతో ఏకగ్రీవమైన కోశాధికారి
  • కొండ దిగువకు మారిన పోలింగ్‌
అన్నవరం :
సత్యదేవుని సన్నిధిలో ఎన్నికల వేడి రాజుకుంది. ట్రేడ్‌యూనియ¯ŒS తరహాలో దేవస్థానం చరిత్రలోనే తొలిసారిగా దేవస్థానం పురోహితుల యూనియ¯ŒSకు అధికారులు ఎన్నికలు నిర్వహిస్తుండడంతో 213 మంది వ్రతపురోహితులు రెండు వర్గాలుగా చీలిపోయారు. అధ్యక్ష, కార్యదర్శి, కోశాధికారి పదవులకు ఈ నెల 27న శుక్రవారం ఎన్నికలు జరుగుతున్నాయి. బుధవారం సాయంత్రం ఐదుగంటలకు నామినేషన్ల ఉపసంహరణ పూర్తి కాగా, అధ్యక్ష పదవికి నలుగురు, కార్యదర్శి పదవికి ఇద్దరు బరిలో మిగిలారు. కోశాధికారి పదవికి ఒక్కరే నామినేష¯ŒS వేయడంతో అది ఏకగ్రీవమైంది. కాగా, బరిలో మిగిలిన వారికి గుర్తులను కూడా కేటాయించినట్టు ఎన్నికల అధికారి, వ్రతపురోహిత స్పెషల్‌గ్రేడ్‌ సూపర్‌వైజర్‌ ముత్య సత్యనారాయణ బుధవారం సాయంత్రం తెలిపారు.
ఏకగ్రీవంగా కోశాధికారి పదవి
కోశాధికారి పదవికి సవితాల వీరబాబు ఒక్కరే నామినేష¯ŒS దాఖలు చేయడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే ఈ విషయాన్ని శుక్రవారం మధ్యాహ్నం లాంఛనంగా ప్రకటిస్తారు.
కొండదిగువకు మారిన ఎన్నికలు
శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకూ కొండదిగువన ప్రైవేటు లాడ్జిలో పోలింగ్‌ జరగనుంది. మొదట దేవస్థానంలో నైరుతి మండపంలో పోలింగ్‌ నిర్వహించాలని అధికారులు భావించారు. అయితే  భక్తిభావంతో కూడిన ఆధ్యాత్మిక వాతావరణం ఉండాల్సిన దేవస్థానంలో ఎన్నికలు నిర్వహించడమేంటన్న విమర్శలతో పురోహితుల యూనియ¯ŒS ఎన్నికలు కొండదిగువకు మార్చారు.
అధికారుల మద్దతుదారులు...వ్యతిరేకుల పోరుగా ఎన్నికలు
దేవస్థానంలో ప్రతిసారి పురోహితులందరూ ఏకగ్రీవంగా తమ యూనియ¯ŒS కార్యవర్గాన్ని ఎన్నుకునేవారు. అయితే అధికారులే  కొంతమందికి అధిక ప్రాధాన్యం ఇస్తుండడం, మరి కొంతమందిని అణగతొక్కడానికి ప్రయత్నిస్తున్నట్టు విమర్శలు వచ్చాయి. దానికి తోడు గత ఆరు నెలల్లో వివిధ కారణాలతో సుమారు 50 మంది పురోహితులు సస్పెన్ష¯ŒSకు గురయ్యారు. వీరందరినీ తిరిగి విధుల్లోకి తీసుకునేటప్పుడు  అధికారులు ఒకే రకంగా చూడలేదనే విమర్శలున్నాయి. కొంతమందికి జురిమానాలు వేశారు. మరి కొంతమంది మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండానే వి««దlుల్లోకి తీసుకున్నారు. దీంతో అన్యాయానికి గురయ్యామని భావిస్తున్న వారు అధికారులపై తీవ్ర అసంతృప్తి కలిగి ఉన్నారు. కొంతమంది పురోహితులైతే అధికారుల చర్యలపై హైకోర్టు ను ఆశ్రయించి స్టేలు కూడా పొందారు. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement