giri
-
ప్రేమలో పడ్డాక...
నిజ జీవిత ఘటనల మేళవింపుతో రూపొందుతున్న సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ‘శారీ’. సత్య యాదు, ఆరాధ్య దేవి లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. గిరి కృష్ణకమల్ దర్శకత్వంలో ఆర్జీవీ ఆర్వీప్రొడక్షన్స్ పతాకంపై రామ్‌గోపాల్‌వర్మ, రవి వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని నవంబర్‌లో విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు. ‘‘ఉత్తరప్రదేశ్‌లో ఎంతోమంది అమాయకమైన మహిళలను హత్యాచారం చేసిన ఓ శారీ కిల్లర్ ఆధారంగా ఈ సినిమా ఉంటుంది. చీరలో ఉన్న అమ్మాయిని చూసి, ఆమెతో ప్రేమలో పడిన తర్వాత ఓ అబ్బాయి జీవితం ఎలా భయానకంగా మారింది అన్నదే ఈ చిత్రకథాంశం’’ అని యూనిట్ పేర్కొంది. -
పాపను కాపాడబోయి.. జిల్లా హాకీ కార్యదర్శి గిరి మృతి
సాక్షి, మదనపల్లె సిటీ: నీటి కుంటలో మునిగిపోతున్న పాపను కాపాడబోయి జిల్లా హాకీ అసోసియేషన్ కార్యదర్శి, బీటీ కాలేజీ పూర్వపు ఫిజికల్ డైరెక్టర్ లెక్కల గోవర్థన గిరిరావు(53) గురువారం మృతి చెందాడు. దీంతో క్రీడాకారుల్లో విషాదం నెలకొంది. మదనపల్లె పట్టణం కృష్ణానగర్‌కు చెందిన గోవర్థన గిరిరావు జిల్లా హాకీ అసోసియేషన్ కార్యదర్శిగా ఉన్నారు. భార్య జలజ తంబళ్లపల్లె మండలం కన్నెమడుగు జెడ్పీ ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. సెలవులు కావడంతో తనతో పాటు పాఠశాలలో పని చేసే హిందీ టీచర్ దీప, ఫిజికల్ సైన్సు టీచర్ ఇంద్రాణి కుటుంబసభ్యులతో కలిసి ప్రముఖ పుణ్యక్షేత్రమైన బోయకొండకు వెళ్లారు. దైవదర్శనం చేసుకుని తిరుగు ప్రయాణంలో మదనపల్లె– చౌడేపల్లె మార్గంలోని ఓ ఫామ్‌హౌస్ వద్ద వంటలు చేసుకునేందుకు వెళ్లారు. వీరితో పాటు వెళ్లిన పిల్లలు సరదాగా ఫామ్ హౌస్‌లో ఆడుకుంటుండగా హిందీ టీచర్ కుమార్తె లాస్య ప్రమాదవశాత్తు నీటికుంటలో పడటంతో కేకలు వేసింది. గమనించిన గిరిరావు వెంటనే లాస్యను కాపాడేందుకు నీటికుంటలో దూకాడు. నీటి కుంట బురదమయమై ఉండటంతో ఇరుక్కుపోయాడు. ఆందోళనతో గుండెపోటుకు గురై మృతి చెందాడు. నీటి కుంటలో గిరిరావు ఇరుక్కపోవడాన్ని గమనించిన పిల్లలు కేకలు వేయడంతో, పరిసర ప్రాంతాలవారు అక్కడికి చేరుకుని ఆయన్ను వెలికితీశారు. స్థానికులు 108కు సమాచారం ఇచ్చి, ప్రాథమిక చికిత్స చేసినప్పటికి గిరిరావు మృతి చెందాడు. కుటుంబసభ్యులు, భార్య జలజ, కుమారుడు జస్వంత్‌లు ఆయన మృతిని తట్టుకోలేక బోరున విలపించారు. శుక్రవారం కురబలకోట మండలం కంటేవారిపల్లె వద్ద వ్యవసాయక్షేత్రంలో అంత్యక్రియలు జరగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఎమ్మెల్యే పరామర్శ గిరిరావు మృతి చెందిన విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే నవాజ్‌బాషా గిరిరావు ఇంటికి చేరుకుని కుటుంబసభ్యులను ఓదార్చారు. మాజీ ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి ,బీటీ కాలేజీ కరస్పాండెంట్ వై.ఎస్.మునిరత్నం, దివ్యభారతి ప్రసాద్‌రెడ్డి, జ్ఞానాంబిక డిగ్రీ కాలేజీ కరస్పాడెంట్ రాటకొండ గురుప్రసాద్, సాయిశేఖర్‌రెడ్డి, పీడీలు భౌతికకాయాన్ని సందర్శించి విచారం వ్యక్తం చేశారు. -
రాష్ట్రపతి పై బెంగాల్ మంత్రి అనుచిత వ్యాఖ్యలు.. బీజేపీ నేతలు ఫైర్
-
సండే స్టోరీ: ఈ ప్రేమ బస్సు ఇలా సాగిపోనీ...
‘మరో చరిత్ర’ సినిమాలో కమల హాసన్, సరితల మధ్య సంవత్సరం ఎడబాటు పెడతారు తల్లిదండ్రులు ప్రేమను నిరూపించుకోమని. కేరళలో గిరి, తార ఏకంగా 20 ఏళ్లు ఎడబాటును పాటించారు– ఎందుకంటే వాళ్ల ప్రేమ పెళ్లి దాకా వెళ్లడానికి జాతకాలు కలవలేదు గనక. కేరళ ఆర్.టి.సిలో ఒకే బస్సుకు అతను డ్రైవర్‌గా ఆమె కండక్టర్‌గా పని చేస్తారు. బస్సులో సొంత ఖర్చుతో అనేక హంగులు పెట్టారు. వారికీ, వారి బస్సుకీ ఫ్యాన్స్ బోలెడు. అజ్ఞాతంగా ఉన్న వీరి ప్రేమ సోషల్ మీడియా ద్వారా ఇప్పుడు దేశాలు దాటుతోంది. సండే రోజు బస్సు ప్రేమను తెలుసుకోవచ్చు. ఈ ప్రేమ కథ 2000 వ సంవత్సరంలో మొదలైంది. ఆమె, అతడూ కాకుండా మధ్యలో ఒక బస్సు కూడా ముఖ్య పాత్ర ధరించింది. ‘నువ్వు ఎక్కవలసిన బస్సు ఇరవై ఏళ్లు లేటు’ అన్నట్టు పెళ్లి మాత్రం 2020లో జరిగింది. అయితే ఏమి వారు సంతోషంగా ఉన్నారు. ఒకరితో ఒకరు అంతే ప్రేమగా ఉన్నారు. ఒకరి కోసం ఒకరు ప్రాణం ఇచ్చేలా ఉన్నారు. అలెప్పీ.. ఒరు ప్రేమకథ గిరి గోపీనాథ్‌కు అప్పుడు 26. తారా దామోదరన్‌కు 24. ఆమె అలెప్పీకి సమీపంలోనే ఉండే ముత్తుకులం అనే పల్లె నుంచి సిఏ కోర్సుకు ఆడిటింగ్ నేర్చుకోవడానికి అలెప్పీలోని ఒక కోచింగ్ సెంటర్‌కు వచ్చేది. గిరి మేనమామది ఆ కోచింగ్ సెంటర్. అప్పటికి సరైన ఉద్యోగం లేని గిరి ఆ కోచింగ్ సెంటర్లో మేనమామకు సహాయంగా ఉండేవాడు. అతనికి తార నచ్చింది. తారకు గిరి. ‘మొదటిసారిగా వాలెంటైన్స్ డే రోజు ఒక గ్రీటింగ్ కార్డు ద్వారా నా ప్రేమను ఆమెకు తెలియచేశాను. ఆమె కూడా ఓకే అంది’ అంటాడు గిరి. కొన్నాళ్లు ఈ గ్రీటింగ్ కార్డులతోనే వాళ్ల సందేశాలు నడిచాయి. ‘పెళ్లి చేసుకుందాం’ అని గిరి అంటే ‘మా ఇంటికొచ్చి మాట్లాడు’ అని తారా అంది. గిరి పెద్దలతో కలిసి ఆమె ఇంటికెళ్లాడు. ‘మాకు ఓకే. కాని జాతకాలు కలవాలి’ అని అమ్మాయి తరఫువారు అన్నారు. జాతకాలు కలవలేదు. గిరి కుటుంబం కూడా కలవని జాతకాలను చూసి జంకింది. ఈ పెళ్లి ఏ మాత్రం జరగదు అని ఇరుపక్షాలు తేల్చి చెప్పారు. గిరి మనసు విరిగిపోయింది. తార కుంగిపోయింది. కాని ఇద్దరి మధ్య ప్రేమ మరింత పెరిగింది. గిరి కోచింగ్ సెంటర్లో పని మానేసి 2007లో కేరళ ఆర్టీసీలో డ్రైవర్ అయ్యాడు. తార కోసం పెళ్లాడకుండా ఉండిపోయాడు. ‘నా కోసం ఒకతను వేచి ఉండగా నేను మరొకరిని ఎలా చేసుకుంటాను..’ అని తార కూడా వచ్చిన సంబంధాలను తిరగ్గొట్టసాగింది. అంతేనా... తానూ ఎలాగో పరీక్షలు రాసి 2010లో ఆర్టీసి కండక్టర్ అయ్యింది. ఇద్దరూ అలెప్పీలోని హరిపాద్ బస్టాండ్‌లో రూట్ నంబర్ 220కు డ్రైవర్, కండక్టర్లుగా మారారు. వారిద్దరి మధ్య ప్రేమ ఉన్నట్టు మెల్లగా మొదట బస్సుకు, తర్వాత ఆర్టీసి స్టాఫ్‌కు, ఆపైన పై అధికారులకు తెలిసింది. ‘బస్సే మా ప్రేమ వారధి’ అనుకుని వారిద్దరూ పెళ్లి మాట ఎత్తకనే కొనసాగారు. 2020లో పెళ్లి 2019లో కరోనా లాక్డౌన్ వచ్చాక బస్సులు వాటితో పాటు వీరిరువురి ప్రేమ హాల్ట్ అయ్యింది. కలుసుకోవడం వీలు కాలేదు. కావడం లేదు. అప్పటికి వారి వయసు 46, 44లకు చేరాయి. పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయిన వీరిరువురి పట్టుదలకు పెద్దలు తల వంచారు. జాతకాలు ఓడిపోయాయి. ఏప్రిల్ 5, 2020న తమ హరిపాద్ ఆర్టీసి బస్టాండ్‌లో తమ రూట్ నం 220 బస్సును సాక్షిగా పెట్టి దండలు మార్చుకున్నారు. అంతేనా? పై అధికారులకు చెప్పి విహార అటవీ ప్రాంతమైన మలక్కపారాకు స్పెషల్ ట్రిప్ బుక్ చేసుకున్నారు. అలా ఒక బస్సులో ప్రేమించుకుని, ఆ బస్సు ఎదుట పెళ్లి చేసుకుని, దానిలోనే హనీమూన్‌కు వెళ్లిన జంటగా వీళ్లు రికార్డు స్థాపించారు. సోషల్ మీడియాలో వైరల్ పెళ్లి సమయంలో వీరి మీధ కథనాలు వచ్చినా వారం క్రితం వల్లికదన్ అనే ఒకతను ఇన్‌స్టాలో వీరి ప్రేమ కథను వీడియో తీసి పెట్టడంతో పెద్ద రెస్పాన్స్ వచ్చింది. పది లక్షల మంది వీరి ప్రేమ కథ చూశారు. వీరి ప్రేమ బలానికి ఫిదా అయ్యారు. అలెప్పీ వెళితే రోజూ ఉదయం 5.30కు హరిపాద్‌లో బయలుదేరే వీరి రూట్ నంబర్ 220 బస్ ఎక్కండి. ఆ ప్రేమ బస్సులో అలా సాగిపోండి. ఎన్నో హంగులు... డ్యూటీలో డ్రైవర్, కండెక్టర్లు అయినా వాస్తవానికి వారు ప్రేమికులే కదా. అందుకని పై అధికారుల పర్మిషన్తో ఒక మ్యూజిక్ సిస్టమ్ పెట్టారు. హాయిగా పాటలు వింటూ ప్రయాణిస్తారు. తాము ఉండే బస్సు అందంగా ఉండాలని సొంత ఖర్చుతో ప్రత్యేక అలంకరణలు చేశారు. నేరాలు జరిగి ఉద్యోగాలు దెబ్బ తినకుండా సిసి టీవీలు బిగించుకున్నారు. ఎల్ఇడి డిస్ప్లే కూడా. ఇవన్నీ ప్రయాణికులకు నచ్చాయి. హరిపాద్ బస్ స్టాండ్ నుంచి 220 రూట్లో తిరిగే పాసింజర్లు ఆ బస్సుకు– గిరి తారలకు ఫ్యాన్స్‌గా మారారు. అంతేనా... వారంతా ఒక అభిమాన సంఘంగా మారారు. ఈ ప్రేమ ఎక్కడిదాకా వెళ్లిందంటే ఈ సభ్యులు ‘లీజర్ ట్రిప్’ బుక్ చేసుకుని ఈ బస్సులో పిక్నిక్లకు వెళ్లేవారు. ప్రేమజంట గిరి తారలకు ఈ ట్రిప్పులే డ్యూయెట్లు. -
కామెడీ హీరోకి బాలయ్య టైటిల్
ఒకప్పుడు మినిమం గ్యారెంటీ హీరోగా మంచి ఫాం చూపించిన కామెడీ స్టార్ అల్లరి నరేష్ తరువాత పూర్తిగా గాడి తప్పాడు. వరుసగా పేరడి కామెడీలు చేయటంతో నరేష్ కామెడీ పెద్దగా వర్క్ అవుట్ కావటం లేదు. కాస్త డిఫరెంట్ గా ట్రై చేసినా సక్సెస్ రాకపోవటంతో ఈ యంగ్ హీరో ఆలోచనలో పడ్డాడు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న మహర్షి సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న అల్లరి నరేష్.. హీరోగా రెండు సినిమాలు చేస్తున్నారు. ఇ. సత్తిబాబు దర్శకత్వంలో ఓ సినిమాతో పాటు గిరి అనే దర్శకుడితో మరో సినిమా చేస్తున్నాడు. అనిల్ సుంకర నిర్మాణంలో గిరి ఆదర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా బంగారు బుల్లోడు టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. బాలకృష్ణ, రవీనా టండన్, రమ్యకృష్ణ హీరో హీరోయిన్లు గా 1993లో ఘన విజయం సాధించిన బంగారు బుల్లోడు సినిమా టైటిల్‌ను ఇప్పుడు అల్లరి నరేష్ కోసం పరిశీలిస్తున్నారు. గతంలో సుందరకాండ, యముడికి మొగుడు, ఆహ నా పెళ్లంట లాంటి ఓల్డ్ టైటిల్స్ తో ఆకట్టుకున్న నరేష్.. బంగారు బుల్లోడుతో సక్సెస్ ట్రాక్‌లోకి వస్తాడేమో చూడాలి. -
గిరిపై ఎన్నికల బరి
రసవత్తరంగా ‘పురోహిత’ ఎన్నికల రాజకీయం ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం అధ్యక్ష పదవికి నలుగురు, కార్యదర్శి పదవికి ఇద్దరు పోటీ ఒకేఒక్క నామినేష¯ŒS దాఖలుతో ఏకగ్రీవమైన కోశాధికారి కొండ దిగువకు మారిన పోలింగ్ అన్నవరం : సత్యదేవుని సన్నిధిలో ఎన్నికల వేడి రాజుకుంది. ట్రేడ్యూనియ¯ŒS తరహాలో దేవస్థానం చరిత్రలోనే తొలిసారిగా దేవస్థానం పురోహితుల యూనియ¯ŒSకు అధికారులు ఎన్నికలు నిర్వహిస్తుండడంతో 213 మంది వ్రతపురోహితులు రెండు వర్గాలుగా చీలిపోయారు. అధ్యక్ష, కార్యదర్శి, కోశాధికారి పదవులకు ఈ నెల 27న శుక్రవారం ఎన్నికలు జరుగుతున్నాయి. బుధవారం సాయంత్రం ఐదుగంటలకు నామినేషన్ల ఉపసంహరణ పూర్తి కాగా, అధ్యక్ష పదవికి నలుగురు, కార్యదర్శి పదవికి ఇద్దరు బరిలో మిగిలారు. కోశాధికారి పదవికి ఒక్కరే నామినేష¯ŒS వేయడంతో అది ఏకగ్రీవమైంది. కాగా, బరిలో మిగిలిన వారికి గుర్తులను కూడా కేటాయించినట్టు ఎన్నికల అధికారి, వ్రతపురోహిత స్పెషల్‌గ్రేడ్ సూపర్వైజర్ ముత్య సత్యనారాయణ బుధవారం సాయంత్రం తెలిపారు. ఏకగ్రీవంగా కోశాధికారి పదవి కోశాధికారి పదవికి సవితాల వీరబాబు ఒక్కరే నామినేష¯ŒS దాఖలు చేయడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే ఈ విషయాన్ని శుక్రవారం మధ్యాహ్నం లాంఛనంగా ప్రకటిస్తారు. కొండదిగువకు మారిన ఎన్నికలు శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకూ కొండదిగువన ప్రైవేటు లాడ్జిలో పోలింగ్ జరగనుంది. మొదట దేవస్థానంలో నైరుతి మండపంలో పోలింగ్ నిర్వహించాలని అధికారులు భావించారు. అయితే భక్తిభావంతో కూడిన ఆధ్యాత్మిక వాతావరణం ఉండాల్సిన దేవస్థానంలో ఎన్నికలు నిర్వహించడమేంటన్న విమర్శలతో పురోహితుల యూనియ¯ŒS ఎన్నికలు కొండదిగువకు మార్చారు. అధికారుల మద్దతుదారులు...వ్యతిరేకుల పోరుగా ఎన్నికలు దేవస్థానంలో ప్రతిసారి పురోహితులందరూ ఏకగ్రీవంగా తమ యూనియ¯ŒS కార్యవర్గాన్ని ఎన్నుకునేవారు. అయితే అధికారులే కొంతమందికి అధిక ప్రాధాన్యం ఇస్తుండడం, మరి కొంతమందిని అణగతొక్కడానికి ప్రయత్నిస్తున్నట్టు విమర్శలు వచ్చాయి. దానికి తోడు గత ఆరు నెలల్లో వివిధ కారణాలతో సుమారు 50 మంది పురోహితులు సస్పెన్ష¯ŒSకు గురయ్యారు. వీరందరినీ తిరిగి విధుల్లోకి తీసుకునేటప్పుడు అధికారులు ఒకే రకంగా చూడలేదనే విమర్శలున్నాయి. కొంతమందికి జురిమానాలు వేశారు. మరి కొంతమంది మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండానే వి««దlుల్లోకి తీసుకున్నారు. దీంతో అన్యాయానికి గురయ్యామని భావిస్తున్న వారు అధికారులపై తీవ్ర అసంతృప్తి కలిగి ఉన్నారు. కొంతమంది పురోహితులైతే అధికారుల చర్యలపై హైకోర్టు ను ఆశ్రయించి స్టేలు కూడా పొందారు. -
విద్యుత్‌షాక్‌తో యువకుడు మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లమండలంలో నవరాత్రి ఉత్సవాల్లో విషాదం చోటుచేసుకుంది. మండలంలోని నకిరేకల్ గ్రామానికి చెందిన గిరి(20) మంగళవారం రైసుపేట గ్రామానికి వచ్చాడు. రాత్రి గ్రామంలో జరిగిన దుర్గ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనేందుకు వెళ్లాడు. అక్కడ ఏర్పాటు చేసిన విద్యుత్‌దీపాల తీగలు ప్రమాదవశాత్తు తగలటంతో షాక్‌కు గురై అక్కడికక్కడే చనిపోయాడు. అతడి తండ్రి చర్లలో జీసీసీ సేల్స్‌మన్‌గా పనిచేస్తున్నట్లు తెలిసింది. -
సినీనిర్మాత గిరి కూతురు పెళ్లి వేడుక