కామెడీ హీరోకి బాలయ్య టైటిల్‌ | Bangaru Bullodu Title For Allari naresh Next Film | Sakshi
Sakshi News home page

Published Sat, Dec 8 2018 1:50 PM | Last Updated on Sat, Dec 8 2018 1:50 PM

Bangaru Bullodu Title For Allari naresh Next Film - Sakshi

ఒకప్పుడు మినిమం గ్యారెంటీ హీరోగా మంచి ఫాం చూపించిన కామెడీ స్టార్‌ అల్లరి నరేష్‌ తరువాత పూర్తిగా గాడి తప్పాడు. వరుసగా పేరడి కామెడీలు చేయటంతో నరేష్‌ కామెడీ పెద్దగా వర్క్‌ అవుట్‌ కావటం లేదు. కాస్త డిఫరెంట్ గా ట్రై చేసినా సక్సెస్ రాకపోవటంతో ఈ యంగ్‌ హీరో ఆలోచనలో పడ్డాడు.

ప్రస్తుతం సూపర్‌ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న మహర్షి సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న అల్లరి నరేష్‌.. హీరోగా రెండు సినిమాలు చేస్తున్నారు. ఇ. సత్తిబాబు దర్శకత్వంలో ఓ సినిమాతో పాటు గిరి అనే దర్శకుడితో మరో సినిమా చేస్తున్నాడు. అనిల్‌ సుంకర నిర్మాణంలో గిరి ఆదర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా బంగారు బుల్లోడు టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

బాలకృష్ణ, రవీనా టండన్‌, రమ్యకృష్ణ హీరో హీరోయిన్లు గా 1993లో ఘన విజయం సాధించిన బంగారు బుల్లోడు సినిమా టైటిల్‌ను ఇప్పుడు అల్లరి నరేష్‌ కోసం పరిశీలిస్తున్నారు. గతంలో సుందరకాండ, యముడికి మొగుడు, ఆహ నా పెళ్లంట లాంటి ఓల్డ్‌ టైటిల్స్‌ తో ఆకట్టుకున్న నరేష్.. బంగారు బుల్లోడుతో సక్సెస్‌ ట్రాక్‌లోకి వస్తాడేమో చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement