కుండపోత.. గుండెకోత
అన్నదాత గుండె చెరువైంది. అప్పులబాధ నుంచి గట్టెక్కుదామని భావించిన తరుణంలో ముసురువాన నిండాముంచింది. రైతన్న రెక్కలకష్టమంతా వర్షార్పణమైంది. పత్తి, వరి పంటలకు తీవ్రనష్టం వాటిల్లింది. మార్కెట్‌కు విక్రయానికి తెచ్చిన వేలాది బస్తాల మొక్కజొన్న తడిసిముద్దయింది. జిల్లాలో పలు వాగులు, వంకలు పొంగిపొర్లాయి. నల్లమలలో భారీవర్షం కురియడంతో చంద్రవాగు ఉధృతంగా ప్రహహిస్తోంది. దుందుబీ ఉరకలేస్తోంది. శ్రీశైలం మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లాకేంద్రంతో పాటు పలుప్రాంతాల్లో లోతట్టుప్రాంతాలు జలమయమయ్యాయి. అప్రమత్తంగా ఉండి ఎలాంటి ప్రాణం నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.
పాలమూరు, న్యూస్‌లైన్: జడివాన జిల్లాను ముం చెత్తింది. మూడురోజులుగా కురుస్తున్న వర్షానికి వాగులు, వంకలు ఏకమైపారుతున్నాయి. నల్లమలలో కురిసిన భారీవర్షానికి చంద్రవాగు ఉధృతం గా ప్రవహిస్తోంది. గురువారం అచ్చంపేట మం డలంలో అత్యధికంగా 22 సెం.మీ వర్షపాతం న మోదైంది. జిల్లాలోని పలుచోట్ల లోతట్టుప్రాం తా లు జలమయమయ్యాయి. రహదారులు తెగి పోయి రాకపోకలకు నిలిచిపోయాయి. అన్నదాత రెక్కల పూర్తిగా వర్షార్పణమైంది. జిల్లాలో దాదాపు 1.50 లక్షల ఎకరాల్లో పత్తిపంట నీటమునిగింది. కేవలం నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలోనే దాదాపు 50వేల ఎకరాల్లో పత్తిపంటకు తీవ్రనష్టం వాటిల్లింది. గద్వాల, అలంపూర్, కల్వకుర్తి, షాద్‌నగర్, జడ్చర్ల, దేవరకద్ర, వనపర్తి, నియోజకవర్గాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది.
వర్షానికి రూ.200కోట్ల పంటనష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. అచ్చంపేట, అమ్రాబాద్ పరిధిలో వరి, పత్తి, మిర్చి, వేరుశనగ పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కందిసాగులో ప్రత్యేకతను చాటుకునే కొడంగల్ నియోజకవర్గంలో 50వేల ఎకరాల్లో కందిపంట సాగయింది. ప్రస్తుత వర్షానికి పంటమొత్తం నాశనమైపోయింది. రబీలో సాగుచేసిన వేరుశనగ విత్తనాలు కూడా నీటిలోనే మురిగిపోయార ుు. జిల్లాలో వర్షం ధాటికి 620 ఇళ్లు కూలి రూ. 17.50కోట్ల నష్టం వాటిల్లింది. ఆర్అండ్బీ రోడ్లు సుమారు 50కిలోమీటర్ల మేర పాడైపోయాయి. అలాగే జడ్చర్ల, షాద్‌నగర్, కల్వకుర్తి, మహబూబ్‌నగర్, వనపర్తి మార్కెట్లలో వేలాది మొక్కజొన్న బస్తాలు తడిసిపోయాయి.
జిల్లాలో 45.1 మి.మీ వర్షపాతం
గురువారం జిల్లా వ్యాప్తంగా 45.1 మి.మీ వర్ష పాతం నమోదైనట్లు వాతావరణ విభాగం అధికారులు పేర్కొన్నా రు. అచ్చంపేట మండల పరిధిలో అత్యధికంగా 220.0మి.మీ మేర వర్షపాతం నమోదైంది. బల్మూర్ 200.0 మి. మీ, లింగాల 132.0, అమ్రాబాద్ 109.0, తెలకపల్లి 106.0, కల్వకుర్తి 100.2, వంగూరు, పెద్దకొత్తపల్లి 90.0, కోడే రు 88.0, వెల్దండ 85.6, నాగర్‌కర్నూల్ 82.4, బిజినేపల్లి 67.4, కొల్లాపూర్ 66.0, షాద్‌నగర్ 63.2, ఆమనగల్లు 56.0, తిమ్మాజిపేట, మాడ్గుల 55.0, దరూర్ 51.0, ఉప్పునుంతల 50.0, ఆత్మకూర్ 49.0, గద్వాల 43.6, పెబ్బేరు, తలకొండపల్లి 43.0, కొత్తూరు 40.2, తాడూరు 40.0 మి.మీ చొప్పున వర్షపాతం నమోదైంది.