basic salary
-
50 శాతం శాలరీ హైక్.. సెలవుల పెంపు; డిమాండ్లు ఇవే
గోదావరిఖని: దేశవ్యాప్తంగా ఉన్న బొగ్గు గని కార్మికుల ఉమ్మడి చార్టర్ ఆఫ్ డిమాండ్లను జాతీయ కార్మిక సంఘాలు సిద్దం చేశాయి. ఈ నెలాఖరుతో 10వ వేతన సంఘం గడువు పూర్తి కానుంది. వచ్చే నెల నుంచి కొత్త వేతన ఒప్పందం అమలు కావాల్సి ఉంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న నాలుగు జాతీయ సంఘాలు ఒకేతాటిపైకి వచ్చి ఉమ్మడి చార్టర్ ఆఫ్ డిమాండ్లు పొందు పర్చాయి. దేశంలోని 4 లక్షల మంది కార్మికులకు వర్తించనున్న డిమాండ్లపై బొగ్గు గని కార్మికుల్లో ఆసక్తి రేకిస్తోంది. తమకు సంబంధించి జాతీయ కార్మిక సంఘాలు ఏ విధంగా ముందుకు వెళ్తాయి.. 11వ వేతన కమిటీలో జీతభత్యాలు ఏ విధంగా పెరుగుతాయి.. అలవెన్సులు ఏ విధంగా ఉంటాయనే ఆసక్తితో ఎదురు చూస్తున్నాయి. దేశంలో ఉన్న జాతీయ కార్మిక సంఘాలు ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్, బీఎంఎస్, సీఐటీయూ యూనియన్లు తమ డిమాండ్లను ఉమ్మడిగా సిద్దం చేశాయి. ఈనెల 3న నిర్వహించిన వర్చువల్ సమావేశంలో దీనికి అంగీకరించారు. ప్రధానంగా మూల వేతనం, అలవెన్సులు, సెలవులు తదితర అంశాలపై ఇప్పటికే స్పష్టతకు వచ్చాయి. దీనిపై ఆదివారం మరోసారి వర్చువల్ సమావేశం నిర్వహించి పూర్తిస్థాయిలో అంగీకారం తెలుపనున్నాయి. ఈ ఒప్పందం పూర్తయితే 01.07.2021 నుంచి 30.06.2026 వరకు అమలులో ఉండనుంది. ప్రధాన డిమాండ్లు ప్రస్తుత మూల వేతనంపై 50 శాతం జీతం పెంచాలి. ఎల్ఎల్టీసీ రూ.75 వేలు, ఎల్టీసీ రూ .50 వేలు చెల్లించాలి రెస్క్యూ అలవెన్స్ వేతనంలో 15 శాతం చెల్లించాలి. క్వారీ, వాషరీ, క్రషర్, సీహెచ్‌పీల్లో పనిచేసే కార్మికులకు వేతనంలో 10 శాతం డస్ట్ అలవెన్స్ ఇవ్వాలి సాధారణ సెలవులు 11 నుంచి 15 రోజులకు పెంచాలి సిక్ లీవ్ 15 నుంచి 20 రోజులకు పెంచాలి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే కార్మికులు కోలుకునేంత వరకు పూర్తి స్థాయి వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలి మూడేళ్ల వరకు శిక్షణ, స్టడీ లీవ్ ఇవ్వాలి ప్రతి సంవత్సరం నిర్వహించే సమావేశాలకు టీఏ, డీఏతో పాటు నలుగురు ట్రేడ్ యూనియన్ ప్రతినిధులకు ప్రత్యేక సెలవులు ఇవ్వాలి. గ్రాడ్యువిటీ చెల్లింపునకు సీలింగ్ పరిమితి ఉండొద్దు విధుల్లో మరణించిన కాంట్రాక్టు కార్మికులతో సహా పర్మినెంట్ కార్మికులకు రూ.50 లక్షలు నష్టపరిహారం చెల్లించాలి. ఆధార పడిన వారికి పర్మినెంట్ ఉద్యోగం ఇవ్వాలి. సీపీఆర్ఎంఎస్ స్కీంపై రూ.25 లక్షల వరకు నగదు రహిత చికిత్స అందించాలి. ప్రతి గనిపై లైఫ్ సపోర్టు అంబులెన్సులు ఏర్పాటు చేయాలి పెన్షన్ ఫండ్ కోసం టన్ను బొగ్గుపై రూ.20 వసూలు చేయాలి. కనీస పెన్షన్ రూ.10 వేలకు తగ్గకూడదు వారంలో 40 పని గంటలు లేదా ఐదు రోజులు పనిదినాలు ఉండాలి కాంట్రాక్టు కార్మికులకు క్రమబద్ధీకరించాలి గనుల్లో కొత్త నియామకాలు ప్రారంభించాలి. కార్మికుల పదవీ విరమణ వయస్సు 60 నుంచి 62 ఏళ్లకు పెంచాలి కాంట్రాక్టు కార్మికులకు జేబీసీసీఐ పరిధిలోకి రావాలి. పారామెడికల్ స్టాఫ్‌కు ప్రత్యేక క్యాడర్ స్కీం తయారు చేయాలి. యువత చదువుకు తగిన ఉద్యోగం ఇవ్వాలి. వీటితో పాటు మరికొన్ని డిమాండ్లపై జాతీయ కార్మిక సంఘాలు పూర్తి స్థాయి కసరత్తు చేసి బొగ్గు పరిశ్రమ ద్వైపాక్షిక కమిటీకి అందించనున్నాయి. ఈ డిమాండ్లపై కోలిండియా యాజమాన్యం జాతీయ కార్మిక సంఘాలతో చర్చించనుంది. ఇరువర్గాల సంప్రదింపుల అనంతరం పూర్తి స్థాయి నిర్ణయాలు వెలువడనున్నాయి. చదవండి: సింగరేణిలో ఇదేం వివక్ష ? -
సత్య నాదెళ్ల వేతన ప్యాకేజీ
వాషింగ్టన్: సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల గత ఆర్థిక సంవత్సరంలో 42.9 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 305 కోట్లు) ప్యాకేజీ అందుకున్నారు. అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 66 శాతం అధికం. నాదెళ్ల మూలవేతనం సుమారు 2.3 మిలియన్ డాలర్లే అయినప్పటికీ, ప్యాకేజీలో అత్యధిక భాగం (సుమారు 29.6 మిలియన్ డాలర్లు) స్టాక్ ఆప్షన్స్ కింద లభించింది. 2017–18లో సత్య నాదెళ్ల 25.8 మిలియన్ డాలర్ల ప్యాకేజీ అందుకున్నారు. ‘గత ఆర్థిక సంవత్సరం కంపెనీ అత్యంత మెరుగైన ఆర్థిక ఫలితాలు సాధించింది. దీనికి సత్య నాదెళ్ల సారథ్యం, కస్టమర్ల విశ్వాసం చూరగొనడానికి ఆయన చేసిన కృషి, కంపెనీలో ప్రవేశపెట్టిన కొత్త మార్పులు, కొంగొత్త టెక్నాలజీలు.. మార్కెట్లలోకి కార్యకలాపాలను విస్తరించడం వంటి అంశాలు తోడ్పడ్డాయి‘ అని మైక్రోసాఫ్ట్ తెలిపింది. హైదరాబాదీ అయిన సత్య నాదెళ్ల 2014లో మైక్రోసాఫ్ట్ సీఈవోగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. -
తగ్గనున్న ఈపీఎఫ్.. పెరగనున్న వేతనాలు
న్యూఢిల్లీ : టేక్-హోమ్ శాలరీ చాలా తక్కువగా వస్తోందని బాధపడుతున్నారా? అయితే ఇక ఆ దిగులును ప్రభుత్వం కాస్త తగ్గించబోతుంది. ఉద్యోగుల టేక్-హోమ్ శాలరీని పెంచాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోంది. దీని కోసం ఉద్యోగుల వేతనాల్లోంచి తీసుకునే సామాజిక భద్రత సహకారం(సోషల్ సెక్యురిటీ కాంట్రిబ్యూషన్)ను తగ్గించేందుకు ప్రతిపాదనలు రూపొందిస్తోంది. దేశంలో ఉన్న ఉద్యోగులందరికీ ఒకే విధమైన సామాజిక భద్రత సహకారం ఉండేలా కార్మిక మంత్రిత్వ శాఖ కమిటీ పనిచేస్తుందని.. ప్రస్తుతమున్న సీలింగ్ 24 శాతాన్ని, 2 శాతం తగ్గించాలని ప్రభుత్వం ప్రతిపాదనలను తయారు చేస్తుందని ఓ సీనియర్ ప్రభుత్వ అధికారి తెలిపారు. ప్రస్తుతం ఉద్యోగుల సహకారం కింద వారి బేసిక్ వేతనం నుంచి 12 శాతాన్ని ఈపీఎఫ్‌కి అందిస్తున్నారు. అంతేకాక ఆర్గనైజేషన్స్ కూడా ఉద్యోగుల బేసిక్ వేతనం నుంచి 3.67 శాతాన్ని తమ సహకారం కింద ఈపీఎఫ్‌లో క్రెడిట్ చేస్తున్నాయి. ఈపీఎస్ లేదా ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ కింద 8.33 శాతం మైనస్ అవుతుంది. ఇవన్నీ కలిపి మొత్తంగా 24 శాతం ఉద్యోగుల బేసిక్ వేతనం నుంచి కట్ అవుతుంది. తాజాగా ఉద్యోగుల ఈపీఎఫ్ సహకారాన్ని 12 శాతం నుంచి 10 శాతానికి తగ్గించాలని ప్రభుత్వం చూస్తోంది. దీంతో ఉద్యోగుల టేక్-హోమ్ శాలరీ పెరగబోతుంది. ప్రస్తుతం 20 మంది కంటే తక్కువ ఉద్యోగులున్న సంస్థలకు కేవలం 10 శాతం మాత్రమే ఈపీఎఫ్ సహకారం ఉంది. ఇదే విధానాన్ని అన్ని ఆర్గనైజేషన్లకు అమలు చేయాలని ప్రభుత్వం ఈ ప్రతిపాదనలు రూపొందిస్తోంది. దీంతో 10 కోట్ల మంది ఈపీఎఫ్ఓ సబ్స్క్రైబర్లకు లబ్ది చేకూరనుంది. ఒక్కసారి కార్మిక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన కమిటీ ఈ ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే, ఆ మంత్రిత్వ శాఖ వాటాదారులతో సంప్రదింపులు జరుపుతుంది. ప్రస్తుతం సామాజిక భద్రత స్కీమ్ కింద 10 కోట్ల మంది ఉద్యోగులున్నారు. వీరిని 5 రెట్లు అంటే 50 కోట్లకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సామాజిక భద్రత సహకారం తగ్గితే, ఇటు ఉద్యోగులు, అటు ఆర్గనైజేషన్లకు రెండింటికీ ప్రయోజనం చేకూరనుందని ప్రభుత్వ అధికారులు చెప్పారు. -
మూల వేతనం 7 వేల నుంచి 18 వేలకు పెంపు!
న్యూ ఢిల్లీ: ఏడవ వేతన సంఘం సిఫారసుల అమలుకు బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో కోటి మంది కేంద్రప్రభుత్వ ఉద్యోగులు, ఫించనుదారులకు లబ్ధి చేకూరనుంది. ఓవరాల్ గా ఈ సిఫారసుల అమలుతో వీరి ఆదాయం 23.5 శాతం మేర పెరుగుతోంది. కేంద్ర కేబినెట్ ఆమోదీంచిన సిఫారసుల్లో ప్రధానంగా.. ఉద్యోగుల మూల వేతనం నెలకు 7 వేల నుంచి 18 వేలకు చేరుకోనుంది. కనీస పెన్షన్ సైతం 3,500 నుంచి 9 వేలకు పెంపును కేబినెట్ ఆమోదించింది. అలవెన్స్‌ల విషయంలో వేతన సంఘం చేసిన సిఫారసులను కేబినెట్ ఆమోదించింది. ఈ సిఫారసులను 2016 జనవరి 1 నుంచి అమలు చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.