bathula brahmananda reddy
-
అదేంటో కాళ్లబేరానికి వెళ్లినా.. యుద్ధంలా కనిపిస్తోంది!
సాక్షి, ఒంగోలు : రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు యుద్ధం చేయడం లేదని, ఓటుకు నోటు కేసు భయంతోనే ఆయన ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముందు మోకరిల్లారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి విమర్శించారు. ఆదివారం ఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశం సందర్భంగా ప్రధాని మోదీకి చంద్రబాబు చిరునవ్వులు చిందిస్తూ.. ఒకింత భక్తిభావంతో వంగి కరచాలనం చేస్తూ కనిపించిన సంగతి తెలిసిందే. ఈ దృశ్యాన్ని సోషల్ మీడియా, ప్రసార సాధనాల ద్వారా వీక్షించిన ప్రజలు విస్తుపోయారు. ఈ అంశంపై బత్తుల బ్రహ్మానందరెడ్డి స్పందించారు. లాలూచీ రాజకీయాలు చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని మండిపడ్డారు. బీజేపీతో చంద్రబాబు లాలూచీ కొనసాగుతోందని, దానికి నిదర్శనమే ఢిల్లీలో మోదీ వద్ద చంద్రబాబు వేసిన వేషాలేనని అన్నారు. ‘అదేంటో మోదీతో కాళ్ళబేరానికి వెళ్లినా ఎల్లో మీడియాకు మాత్రం ఆయన యుద్ధం చేస్తున్నట్టు కనిపిస్తోంది’ అని ఎద్దేవా చేశారు. -
చంద్రబాబు సర్కార్ పూర్తిగా అవినీతిమయం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో అవినీతి మితిమీరిపోయిందని, చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా అవినీతిమయమైందని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి ఆరోపించారు. చంద్రబాబు పాలన చూసి వ్యాపారం పెట్టేందుకు భయపడుతున్నారని విమర్శించారు. దేశంలోనే ఏపీ నెంబర్ వన్ అని చంద్రబాబు ప్రచారం చేస్తున్నారని.. అవినీతి, దోపిడీ, ఇసుక మాఫియాలోనే రాష్ట్రం నెంబర్ వన్ అని అన్నారు. ప్రజా ప్రయోజనాలను చంద్రబాబు ఫణంగా పెట్టినందుకు సులభతర వాణిజ్య అనుకూల రాష్ట్రాల జాబితాలో ఏపీకి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందా అని బత్తుల బ్రహ్మానందరెడ్డి ప్రశ్నించారు. ప్రపంచ బ్యాంకు షరతులకు చంద్రబాబు బసవన్నలా తల ఊపుతున్నారని విమర్శించారు. చంద్రబాబు ఏం సాధించారని ఫస్ట్ ర్యాంకు ఇచ్చారని ప్రశ్నించారు. కొత్తగా పరిశ్రమలు రాకున్నా, వస్తున్నట్టుగా చంద్రబాబు ఘనంగా ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విమర్శించే అర్హత చంద్రబాబుకు లేదని అన్నారు. సులభతర వాణిజ్య అనుకూల రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మొదటి ర్యాంకు సాధించినట్లు కేంద్ర వాణిజ్య శాఖ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. -
చంద్రబాబు సర్కార్ పూర్తిగా అవినీతిమయం