
సాక్షి, ఒంగోలు : రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు యుద్ధం చేయడం లేదని, ఓటుకు నోటు కేసు భయంతోనే ఆయన ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముందు మోకరిల్లారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి విమర్శించారు. ఆదివారం ఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశం సందర్భంగా ప్రధాని మోదీకి చంద్రబాబు చిరునవ్వులు చిందిస్తూ.. ఒకింత భక్తిభావంతో వంగి కరచాలనం చేస్తూ కనిపించిన సంగతి తెలిసిందే. ఈ దృశ్యాన్ని సోషల్ మీడియా, ప్రసార సాధనాల ద్వారా వీక్షించిన ప్రజలు విస్తుపోయారు. ఈ అంశంపై బత్తుల బ్రహ్మానందరెడ్డి స్పందించారు. లాలూచీ రాజకీయాలు చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని మండిపడ్డారు. బీజేపీతో చంద్రబాబు లాలూచీ కొనసాగుతోందని, దానికి నిదర్శనమే ఢిల్లీలో మోదీ వద్ద చంద్రబాబు వేసిన వేషాలేనని అన్నారు. ‘అదేంటో మోదీతో కాళ్ళబేరానికి వెళ్లినా ఎల్లో మీడియాకు మాత్రం ఆయన యుద్ధం చేస్తున్నట్టు కనిపిస్తోంది’ అని ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment