baton
-
నాడు సైకిల్.. నేడు ఇన్నోవాలు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: పోలీస్ వ్యవస్థ నిత్యనూతనమవుతోంది. కరుడుగట్టిన నేరస్తులను కూడా నేరం జరిగిన గంటల వ్యవధిలోనే తేలిగ్గా పట్టుకొంటున్నారు. భయపెట్టడమే పోలీస్ లక్షణం అన్న కాలం నుంచి ప్రజలకు మంచి స్నేహితులు అనే స్థాయికి మార్పులు వచ్చాయి. ఒకప్పుడు పోలీసును చూస్తే చాలు జనం పరుగులు పెట్టేవారు. ఠాణా మెట్లెక్కాలన్నా వణికేవారు. ఫ్రెండ్లీ పోలీసు విధానం అమల్లోకి వచి్చన తరువాత బాధితులు నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తమ గోడును చెప్పుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో కిందిస్థాయి సిబ్బంది నిర్లక్ష్యం చేసినా, తమకు న్యాయం జరగదని అర్థం అయినా ఉన్నతాధికారుల వద్దకూ వెళుతున్నారు. అప్పట్లో పోలీసు అంటేనే కరుకు మాటలు గుర్తుకొచ్చేవి. ఇప్పుడు పోలీసుల ప్రవర్తనలోనే కాదు అన్ని విషయాల్లోనూ చాలా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా నేర పరిశోధనలో పోలీసులు అప్పట్లో డాగ్ స్క్వాడ్ల మీద ఆధారపడాల్సి వచ్చేది. ఇప్పుడు టెక్నాలజీని వాడుకుంటున్నారు. ఎంత తెలివైన నేరస్తులను కూడా సులువుగా పట్టుకోగలుగుతున్నారు. పట్టణాల్లో అయితే పోలీసు స్టేషన్లో కూర్చుని కంట్రోల్ సిస్టం ద్వారా ఎక్కడ ఏం జరుగుతుందోనని సీసీ కెమెరాల ద్వారా ప్రత్యక్షంగా చూడగలిగే అవకాశం ఏర్పడింది. అయితే పోలీసు శాఖలో ఇప్పుడు రాజకీయ జోక్యం మాత్రం పెరిగింది. పోస్టింగులన్నీ అధికార పార్టీ నేతలు చెప్పినట్టే నడుస్తున్నాయి. దీంతో మంచి చోట్ల పోస్టింగుల కోసం పోలీసు అధికారులు పైరవీలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నాడు చేతిలో తుపాకులు.. నేడు ట్యాబ్లునక్సలైట్ల కాలంలో పోలీసులు తుపాకీ లేకుండా బయట తిరిగే పరిస్థితి ఉండేది కాదు. వాళ్ల సొంత వాహనాలకు కూడా నంబర్ ప్లేట్లు ఉండేవి కాదు. ఇప్పుడు పోలీసు వాహనాలు, సొంత వాహనాలకు సైతం పోలీస్ అని రాసుకుని దర్జాగా తిరుగగలుగుతున్నారు. తుపాకులు పోలీసు కార్యాలయాల్లో భద్రపరిచారు. ఏదైన పెద్ద ఘటన జరిగినపుడే బయటకు తీస్తున్నారు. ఇçప్పుడు ఏ పోలీసు చేతిలో చూసినా ట్యాబ్‌లు కనిపిస్తున్నాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఉల్లంఘనదారులను ఆపి ట్యాబ్‌లో వారి వాహన నంబర్ నమోదు చేసి ఫైన్లు వేస్తున్నారు. ఫైన్లు పెండింగ్ ఉన్న వాహనాలను కూడా ట్యాబ్‌ల ద్వారా ట్రాఫిక్ పోలీస్ వెబ్సైట్లలో క్షణాల్లో చెక్ చేసి పట్టుకొంటున్నారు.నాడు సైకిల్.. నేడు ఇన్నోవాలు నాలుగైదు దశాబ్దాల క్రితం పోలీసులు నిక్కర్ తొడుక్కుని, జబ్బకు లాఠీ తగిలించుకుని సైకిల్‌పై సవారీ చేసేవారు. గ్రామాలే కాదు పట్టణాల్లోనూ సైకిళ్ల మీదే తిరిగేది. తరువాతి కాలంలో నిక్కర్ల స్థానంలో ప్యాంట్లు వచ్చాయి. సైకిళ్ల స్థానంలో సైకిల్ మోటార్లే కాదు ఇన్నోవాలు, బొలేరో వాహనాలు వచ్చి చేరాయి. జిల్లా స్థాయి అధికారులకైతే ఫార్చూనర్లు కూడా సమకూర్చారు. నక్సలైట్ల కార్యకలాపాలు కొనసాగిన సమయంలో పోలీసులకు ప్రత్యేక నిధులు ఇచ్చేవారు. వాటితో ఇన్ఫార్మర్లను తయారు చేసుకుని నక్సలైట్లను పట్టుకునేందుకు ప్రయత్నాలు చేసేవారు. వాహనాల్లో వెళితే నక్సలైట్లు మెరుపుదాడులు చేస్తారని, మారుమూల గ్రామాలకు కాలినడకనే వెళ్లేవారు. సివిల్ దుస్తుల్లో, నంబర్ ప్లేట్లు లేని ద్విచక్ర వాహనాలు, అలాగే ప్రయాణికులతో కలిసి బస్సులు, ఇతర ప్రైవేటు వాహనాల్లో తిరిగేవారు. నక్సలైట్ల ప్రాబల్యం తగ్గిపోయిన తరువాత పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. ఏ గ్రామానికైనా దర్జాగా వెళుతున్నారు. విలేజ్ పోలీస్ ఆఫీసర్ (వీపీవో) విధానం అమల్లోకి వచ్చిన తరువాత ఊరికొక పోలీసు ఉండేవారు. వారు వారానికోసారైనా ఆ ఊరికి వెళ్లాల్సిందే. అక్కడి ప్రజలతో మమేకం అయి, వాళ్ల సమస్యలను తెలుసుకుని అధికారులకు నివేదించేవారు. అప్పుడు చేతిరాత...ఇప్పుడు కంప్యూటర్ గతంలో కేసుల నమోదుకు సంబంధించి ఎఫ్ఐఆర్ రాయడం, అరెస్టు, రిమాండ్ డైరీ రాయడం ఆఖరుకు చార్జిïÙట్ రాయడానికి గంటల కొద్దీ సమయం పట్టేది. ఏ పోలీసు స్టేషన్‌కు వెళ్లినా స్టేషనరీ సమస్య కనిపించేది. బాధితులు లేదా నిందితుల తరపు వారికి చెప్పి స్టేషన్‌కు కావలసిన పేపర్ బండిల్స్, కార్బన్ పేపర్లు...ఇలా అన్ని తెప్పించుకునేవారు. తరువాతి కాలంలో ప్రభుత్వాలు పోలీసు స్టేషన్లకు నిర్వహణ ఖర్చులు ఇవ్వడం ద్వారా వసూళ్లకు కొంతమేర అడ్డుకట్ట పడింది. కంప్యూటర్లు రావడంతో ఈ విధానమంతా మారిపోయింది. ప్రతి విషయాన్ని కంప్యూటర్లో కంపోజ్ చేయడమే. కంపోజింగ్ తరువాత తప్పు ఒప్పులు చెక్ చేసి ప్రింట్స్ తీసి ఫైల్ తయారు చేయడమే తరువాయి. కమాండ్ కంట్రోల్ రూంలు జిల్లా కేంద్రాల్లోని పోలీసు కార్యాలయాల్లో కమాండ్ కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలన్నింటికీ అనుసంధానం చేయడంతో కూర్చున్న చోటు నుంచే పర్యవేక్షించే వెసులుబాటు కలిగింది. రిజొల్యూషన్ ఎక్కువ ఉన్న కెమెరాలు బిగించడంతో ప్రతీది చూసుకునే అవకాశం ఏర్పడింది. వాహనదారులు గానీ, మరెవరైనా సరే ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడితే జిల్లా పోలీసు కార్యాలయం నుంచే వారి ఫొటోలు తీసి జరిమానాలు విధిస్తున్నారు. నేర పరిశోధనలో టెక్నాలజీ వాడకం గతంలో హత్య జరిగితే ఘటనా స్థలానికి పోలీసు జాగిలాలను వెంట బెట్టుకుని వెళ్లేవాళ్లు. అవి ఎంత దూరం పరుగు పెడితే అంతదూరం వెళ్లడం, అక్కడ నుంచి అనుమానితులను పట్టుకుని వారిని రోజుల తరబడి కుళ్ల»ొడిచేవాళ్లు. అసలు నేరస్తుడో కాదో కానీ, అనుమానంతోనే పట్టుకుని చిత్రహింసలు పెట్టేవారు. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచి్చన తరువాత నేరస్తులను పట్టుకోవడం పోలీసులకు సులువైంది. చిన్న క్లూతో నేరస్తులను ఇట్టే పట్టేస్తున్నారు. ఊరూరా, వాడవాడలా సీసీ కెమెరాలు ఏర్పాటయ్యాయి. సీసీ పుటేజీలను తీసుకుని, అందులోని అనుమానితుల వివరాలు సేకరించడం, అలాగే సెల్‌ఫోన్ నెట్వర్క్ ట్రాకింగ్ ద్వారా నేరం జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో సంచరించిన వ్యక్తుల ఫోన్ నంబర్లను గుర్తించడం, వేలి ముద్రల ఆధారంగా నేరస్తులు ఎవరో తెలుసుకోవడం... ఇలా అనేక టెక్నాలజీలు నేరపరిశోధనలో కీలకంగా మారాయి. ఫ్రెండ్లీ పోలీసింగ్ అప్పట్లో పోలీసు అంటేనే ఒక రకమైన భయం. వాళ్ల దగ్గరకి వెళితే ఎలా ప్రవçర్తిస్తారో తెలియదు. ఆపద వచి్చనా, ఇబ్బందులు ఎదురైనా సరే వెళ్లడానికి జంకేవారు. తరువాతి కాలంలో పోలీసు మ్యాన్యువల్లోఅనేక మార్పులు తీసుకొచ్చారు. ప్రభుత్వాలు మారినపుడల్లా కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం, అందులో ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ప్రజలు కొంత ధైర్యంగా వెళ్లగలుగుతున్నారు. ఇప్పుడుకూడా అక్కడక్కడా కొన్ని ఇబ్బందులు ఉన్నా, చాలా వరకు మార్పయితే కనబడుతోంది. స్టేషన్లో రిసెప్షనిస్ట్‌గా మహిళా కానిస్టేబుల్ ఉండడం, ఫిర్యాదు చేయటానికి వచ్చినవారిని కూర్చోబెట్టి వారి సమస్య ఏమిటో తెలుసుకుని అధికారిని కలిపించే ప్రయత్నం చేస్తున్నారు. -
లాఠీ పట్టుకుని బోర్ కొట్టిందేమో! ఏకంగా గరిట పట్టుకుని..
కాసేపు లాఠీని పక్కనపెట్టి గరిటను పట్టుకుందాం అనుకుని కేరళలోని ఒక పోలీస్ స్టేషన్ వారు ఈ వానల్లో వేడివేడిగా వంట చేశారు. వీడియో కూడా తీశారు. వాళ్లు లొట్టలేసుకు తింటుంటే నెటిజన్లు‘ఈ మాత్రం కళాపోషణ’ ఉండాలి అని మెచ్చుకున్నారు. కాని పోలీసు బాసులు మాత్రం వేరొకటి తలచారు. ఏమా వంట? ఏమా వైరల్? ఆ పోలీసులు ఇంట్లో వంట చేసుకుని ఉంటే బాగుండు. కాని వానాకాలంలో వేడివేడిగా ఏదైనా తినాలనిపించిందో ఏమో, కొంచెం బోర్ను బ్రేక్ చేద్దాం అనుకున్నారో ఏమో ఏకంగా స్టేషన్లోనే వంట చేశారు. ఆ చేయడం వీడియోలో షూట్ చేసి ఇన్‌స్టాలో పెట్టారు. చూసిన జనం ఈ మాత్రం సర్దా ఉండాల్లే అని ముచ్చట పడితే పోలీసు బాసులు మాత్రం కయ్యిమన్నారు. అసలేం జరిగిందంటే కేరళలోని ఇలవుంతిట్ట అనే స్టేషన్లో పోలీసులు వంట చేసుకు తిన్నారు. చికెన్‌ని తేవడం, ముక్కలు కొట్టించడం, కూర చేయడం, మటన్ కూర, దాంతో పాటు చిలగడదుంపల సంగటి కెమెరా ముందు అద్భుతంగా వండారు. పెద్ద పెద్ద అరిటాకులు తెచ్చి స్టేషన్ ఎస్.ఐతో పాటు అందరూ ఆరగించారు. దానికి మంచి పాట జత చేశారు. వీడియో సోషల్ మీడియాలో వదిలారు. ఇంకేముంది... జనం రకరకాల సరదా కామెంట్లు చేశారు. ‘అప్పుడప్పుడు తినండోయ్... ఎప్పుడూ డ్యూటీయేనా’ అన్నారు. కాని ఈ వీడియో పోలీస్ బాస్‌ల కంట పడింది. ఆ ఏరియా ఐ.జి ‘ఈ విధంగా డ్యూటీలో వండుకు తినడం ఏ విధంగా విధులకు భంగకరం కాదో’ వివరణ ఇమ్మని ఆదేశించాడు. మరి ఐ.జి గారికి ఎక్సప్లనేషనే పంపుతారో ఇంకో కూర వండి కూల్ చేస్తారో తెలియదు. (చదవండి: వాట్ యాన్ ఐడియా!..ఏకంగా అంబులెన్స్‌నే ఇల్లుగా..!) -
లాఠీ..లూటీ
- ఆదాయ వనరులుగా పోలీస్ సర్కిళ్లు - అధికార పార్టీ నేతల అండదండలు - బాధితులకు అందని న్యాయం - మూమూళ్లిస్తే కేసు తారుమారు - మసకబారుతున్న పోలీస్‌శాఖ ప్రతిష్ట కర్నూలు: కర్నూలు సబ్‌డివిజన్ పరిధిలోని బళ్లారి రోడ్లో హంద్రీ బ్రిడ్జీ వద్ద రోడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా గుంత తవ్వి వదిలేశారు. వెంకటగిరికి గ్రామానికి చెందిన ఎల్లసాని అనే యువకుడు మోటర్‌సైకిల్‌పై వెళ్తూ ప్రమాదవశాత్తు గుంతలో పడి మృతి చెందాడు. ప్రమాద సూచికలు ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యం వహించాడంటూ కాంట్రాక్టరును బెదిరించి ఓ పోలీసు అధికారి రూ.4 లక్షలు వసూలు చేసినట్లు సమాచారం. - పులకుర్తి గ్రామంలో ఈ ఏడాది జనవరిలో హత్య జరిగింది. రాజకీయ కుట్రలో భాగంగా మద్దిలేటి అనే రైల్వే ఉద్యోగిని ప్రత్యర్థులు కేసులో ఇరికించారు. అతడిని రిమాండ్‌కు పంపకుండా ఉండేందుకు ఓ అధికారి రూ.3 లక్షలు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పై రెండు ఉదాహరణలే కాదు.. ఇలాంటివి ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. పోలీసు శాఖ ప్రతిష్టను దిగదార్చుతున్నాయి. శాంతి భద్రతల పరిరక్షణతో పాటు అసాంఘిక కార్యకలాపాలను అణచివేయడం పోలీసుల బాధ్యత. కొంతమంది అధికారులు.. విధి నిర్వహణలను పక్కనపెట్టి ఆదాయమే పరమావధిగా పని చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వీరికి అధికార పార్టీ నేతల అండదండలు పుష్కలంగా ఉండడం విమర్శలు తావిస్తోంది. పోలీస్ స్టేషన్‌కు బాధితులు వేదనతో వస్తారు. తమ కష్టాన్ని పోలీసులతో చెపుకుంటే న్యాయం జరుగుతుందని భావి«స్తారు. కష్టాలు, ఇబ్బందుల్లో ఉన్న వారికి స్వాంతన కలిగించేలా వ్యవహరించాలి. న్యాయం జరుగుతుందనే ధీమా కల్పించాలి..పోలీసు ఉన్నతాధికారులు తరచూ కిందిస్థాయి సిబ్బందికి చెప్పే మాటలివి. క్షేత్ర స్థాయిలో మాత్రం పరిస్థితి అందుకు పూర్తిభిన్నంగా ఉంది. పోలీస్ ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడటంతో పలువురు పోలీసు అధికారులు ఆశాఖ పరువును మంటగలుపుతున్నారు. డబ్బుల కోసం కేసులను తారుమారు చేయడం, నిందితులను మార్చడం దాకా వ్యవహారాలు కొనసాగిస్తున్నారు. అక్రమ ఆదాయం పైనే కన్ను .. ప్రతీ పోలీస్ సర్కిల్ పరిధిలో మద్యం, కళ్లు దుకాణాలు, బియ్యం, కిరోసిన్ అక్రమ రవాణా వ్యాపారులు ప్రతి నెలా స్టేషన్ మామూళ్లు ఇస్తారనేది బహిరంగ రహస్యమే. దీనికి తోడు హోటళ్లు, రెస్టారెంట్లు, డాబాలు, లాడ్జీలు, పైరసీ సీడీ సెంటర్లు, మద్యం బెల్టు దుకాణాలతో పాటు, చిన్నా చితక చికెన్, మటన్ దుకాణా దారుల నుంచి మామూళ్ల కోసం బలవంతం చేసిన ఉదంతాలు జిల్లాలో అనేకం. ఈ వసూళ్లను ఆయా స్టేషన్లలో పని చేసే ఐడీ పార్టీ కానిస్టేబుళ్లు చక్కబెడుతున్నారు. ఒక్కొక్క సర్కిల్ పరిధిలో అక్రమ ఆదాయం రూ.5 నుంచి రూ.8 లక్షలపైగా వస్తున్నా... చిన్నా, చితక పిటిషన్లతో స్టేషన్లను ఆశ్రయించే బాధితులను సహితం డబ్బుల కోసం పట్టి పీడిస్తున్న ఉదంతాలు కోకొల్లలు. అసాంఘిక కార్యకలాపాలకు మామూళ్లు ః జూదం, వ్యభిచారం, మట్కా వంటి అసాంఘిక కార్యకలాపాలతో పాటు హత్యలు, ఆత్మహత్యలు, వరకట్న హత్యలు, రోడ్డు ప్రమాదాలు, స్థల దురాక్రమణలు, భార్యభర్తల తగాదాలు, కుటుంబ సభ్యుల ఆస్థి తగాదాలు ఇలా ఒక్కటేంటి... పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన ప్రతి సమస్య రక్షణ భటులకు ఆదాయ వనరులే. సివిల్ పంచాయితీల్లో తలదూర్చే అధికారం వారికి లేకున్నా.. కేసుల పరిష్కారం సందర్భాల్లో అటు ఫిర్యాదు దారులనుంచి, ఇటు నిందితుల నుంచి కూడా పర్సంటేజీలు నిర్ణయించి సొమ్ము చేసుకోవడం జిల్లాలో నిత్యం నడుస్తున్నదే. అధికార పార్టీ నేతల అండ... జిల్లాలో పని చేస్తున్న ప్రతి పోలీస్ అధికారికి అధికార పార్టీకి చెందిన నాయకుల అండ ఉంది. కొంత మంది పోలీస్ అధికారులు టీడీపీ నేతలకు పెద్ద మొత్తంలో డబ్బులు ముట్టజెప్పి ఆదాయం ఉన్న సర్కిళ్లలో పాగా వేస్తున్నారు. దీంతో అధికారుల అక్రమ వసూళ్లకు అడ్డుకట్ట వేసే వారు లేరు. జిల్లాలో సర్కిళ్లతో కలిపి ఉన్నవి 19, అప్‌గ్రేడ్ స్టేషన్లు 14 ఉన్నాయి. వీటిలో సివిల్ పోలీస్ సర్కిళ్లు 28 ఉన్నాయి. వీటిని ఆదాయపరంగా పోలీసు శాఖ ఏ,బీ, సీ కేటగిరిలుగా విభజించినట్లు సమాచారం. బాగా ఆదాయమార్గాలున్న సర్కిళ్లలో పని చేసేందుకు పోలీసు అధికారులు పోటీ పడుతుంటారు. ఏకేటగిరిలోని సర్కిళ్లను ఇన్స్పెక్టర్లు తమకు కాసుల వర్షం కురిపించేవిగా భావిస్తున్నారు. ఇటీవల జరిగిన బదిలీల్లో భాగంగా ఏ కేటగిరి సర్కిల్‌కు ఒక ఇన్స్పెక్టర్ అధికార పార్టీకి చెందిన ముఖ్యనేతకు రూ.20 లక్షలు ముడుపులు చెల్లించి పోస్టింగ్ వేయించుకున్నట్లు పోలీసు శాఖలో చర్చ జరుగుతుంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జీలను ఇళ్లవద్ద కలిసి వారి అనుమతి తీసుకుంటే తప్ప పోస్టింగ్‌లు దక్కే పరిస్థితి లేదు. ఆదాయన వనరులులివే... నిబంధనలను ఉల్లంఘించి తిరిగే వాహనాలు, వరికోత మిషన్లు, క్యాట్‌ఫిష్ వాహనాలు, కంకర ఫ్యాక్టరీలు, బండలను పేల్చే మందుగుండు సామగ్రి వ్యాపారులు, ఇసుక, మైనింగ్.. పోలీసు అధికారుల అక్రమ సంపాదనకు ప్రధాన వనరులు. చట్టాన్ని అతిక్రమించి లావాదేవీలు నిర్వహించే ఎలాంటి నేరగాళ్లయినా మామూళ్లు ఇచ్చుకుంటూ తమ పని సాఫీగా కొనసాగించుకోవచ్చు. గత బదిలీల్లో కర్నూలుకు వచ్చిన ఒక పోలీసు అధికారి.. శాంతిభద్రతలను అక్కడ ఎలా పరిరక్షించాలి. నేరాల నివారణ, నేరస్తులను ఆటకట్టించడం ఎలాగనే విషయంపై అధ్యయనం చేయాల్సింది పోయి ఆదాయ మార్గాలను అన్వేషించారు. విధుల్లో చేరగానే సర్కిల్ పరిధిలో జరిగే నేరాలు ఎలాంటివి, ఆదాయ మార్గాలు ఏమిటి, స్టేషన్‌కు వచ్చే సాధారణ మామూళ్లు ఎంత, పంచాయతీలు, సెటిల్మెంట్ల ద్వారా ఎంత సమకూరుతుంది.. మట్కా, పేకాట, ఇతర అసాంఘిక కార్యకలాపాల నిర్వహకులవైపు కన్నెత్తి చూడకుండా ఉండేందుకు ఎంతిస్తారు, ఇది వరకు ఉన్న అధికారి నిర్ణయించిన రేట్ల వివరాలను కనుగొన్నారు. సదరు అధికారి అదనపు ఆదాయం కోసం రేట్లు నిర్ణయించి వసూళ్లకు పాల్పడుతున్నారన్న ప్రచారం ఉంది. కర్నూలు నగరంతో పాటు పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న పాణ్యం, డోన్, కోవెలకుంట్ల, కర్నూలు రూరల్ తాలూకా, బేతంచెర్ల, నంద్యాల సర్కిళ్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఒక్కొక్క సర్కిల్ పరిధిలో మూడు నుంచి 5పోలీస్ స్టేషన్లు ఉన్నందున, స్టేషన్ల వారీగా కూడా సర్కిల్ స్థాయి అధికారికి భారీగా మామూళ్లు అందుతున్నట్లు సమాచారం. ఇవీ ఉదాహరణలు.. -డోన్ పట్టణానికి చెందిన ఓ దొంగను కర్నూలు పోలీసులు రెండు వారాల క్రితం అదుపులోకి తీసుకున్నారు. భారీ ఎత్తున నేరాల చిట్టా బయటపడింది. అతని వద్ద నుంచి రూ.1.80 లక్షల నగదు, రెండు విలువైన సెల్ఫోన్లు స్వాధీనం చేసుకొని.. కేసు లేకుండా వదిలేశారు. - కర్నూలు పట్టణం శ్రీరామ్‌నగర్‌లో నివాసం ఉంటున్న ఓ మహిళ ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. ప్రకాష్‌నగర్‌లో ఉన్న భర్త ఆమెను పుట్టింటిలోనే కొట్టి వేధించాడు. ఈ మేరకు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత ఇద్దరూ రాజీ అయ్యారు. అంతా మీ ఇష్టమేనా అంటూ ఒక అధికారి వారి నుంచి రూ.50 వేలు వసూలు చేశారు. - కర్నూలు నగరం అయ్యప్పగుడి వద్ద ఐదుగురు మిత్రులు పేకాడుతూ విభేదాలు తలెత్తి కొట్టుకున్నారు. పంచాయితీ స్టేషన్‌కు చేరింది. వారి వద్ద నుంచి రూ.50 వేలు తీసుకొని ఓ అధికారి అందరినీ రాజీ చేశాడు. - ఆదోని పట్టణంలో నిషేధిత పదార్థాలు పట్టుబడ్డాయి. వాటిని విక్రయిస్తున్న వారిపై కేసు నమోదు చేయకుండా భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్నారు. ఆదాయపరంగా సర్కిళ్లకు గ్రేడ్లు ఏగ్రేడ్ సర్కిళ్లు (ఆదాయం రూ.5 నుంచి, రూ.8 లక్షలు) – కర్నూలు టూటౌన్, త్రీటౌన్, ఫోర్త్ టౌన్, ఆదోని టౌన్, టూటౌన్, ట్రాఫిక్, నంద్యాల టౌన్, టూటౌన్, డోన్, ఆళ్లగడ్డ, బేతంచెర్ల. బీగ్రేడ్ సర్కిళ్లు ( రూ.3 నుంచి రూ.4 లక్షలు) – కోడుమూరు, ఎమ్మిగనూరు, ఆళ్లగడ్డ ట్రాఫిక్, ఆత్మకూరు, పత్తికొండ, ఆదోని తాలూకా, ప్యాపిలి, కర్నూలు రూరల్ తాలూకా, మంత్రాలయం. సీ గ్రేడ్ సర్కిళ్లు (రూ.లక్ష నుంచి రూ.3 లక్షలు) – కోసిగి, శిరివెళ్ల, శ్రీశైలం, నంద్యాల తాలూకా. -
విద్యార్థులపై విరిగిన లాఠీ
నెల్లూరు(పొగతోట): స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట శుక్రవారం విద్యార్థులు చేపట్టిన ధర్నా ఉద్రిక్తంగా మారింది. పోలీసులు లాఠీచార్జి చేయడంతో విద్యార్థులు తలోవైపు పరుగులు తీశారు. విద్యార్థులు మొదట నగరవీధుల మీదుగా ర్యాలీగా కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. కాసేపు ప్రశాంతంగా ధర్నా నిర్వహించారు. అనంతరం తమ సమస్యలను అధికారులకు వివరించేందుకు కలెక్టరేట్‌లోకి వెళుతామని, అనుమతివ్వాలని పోలీసులను కోరారు. అందరూ లోనికి వెళ్లేందుకు పోలీసులు అంగీకరించకపోవడంతో ప్రభుత్వవ్యతిరేక నినాదాలను హోరెత్తించారు. ప్రభుత్వంతో పాటు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఒక్కసారిగా కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట చోటుచేసుకుంది. పోలీసులు, విద్యార్థుల మధ్య వాగ్వాదం జరిగింది. తోపులాటలో ఒకటో నగర ఇన్స్పెక్టర్ మద్ది శ్రీనివాసరావు పట్టుతప్పి కిందపడిపోయాడు. దీంతో పోలీసులు రెచ్చిపోయారు. విద్యార్థులను చెదరగొట్టేందుకు లాఠీలు ఝుళిపించారు. దొరికినవారిని దొరికినట్టుగా చితకబాదారు. లాఠీ దెబ్బలకు తట్టుకోలేక తలోవైపు చెల్లాచెదురయ్యారు. ఎదురుతిరిగిన కొందరు విద్యార్థులు మరోమారు కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. పరిస్థితి మరింత అదుపుతప్పుతుండటంతో విద్యార్థులను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ క్రమంలో వారి నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. కొందరిని బలవంతంగా జీపులో ఎక్కించారు. ఆ జీపు ముందుకు కదలకుండా ఇంకొందరు అడ్డుకున్నారు. వారిని పక్కకు తీయడానికి పోలీసులు శ్రమించాల్సివచ్చింది. చివరకు బలవంతంగా వారిని పక్కకు లాగిపడేశారు. తోపులాట, అరెస్ట్‌ల సమయంలో పలువురు విద్యార్థులకు స్వల్పగాయాలయ్యాయి. ఎస్ఎఫ్ఐ నాయకులతో పాటు పలువురు విద్యార్థులను ఒకటో నగర పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షకార్యదర్శులు జి.సుధీర్, పి.కిరణ్ మాట్లాడుతూ విద్యార్థుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందన్నారు. గత ఏడాదికి సంబందించిన స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.15.93 కోట్లు ఉన్నాయన్నారు. వాటిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జీఓ నంబర్ 72ను సవరించడంతో పాటు స్థానికతపై విద్యార్థులకు స్పష్టత ఇవ్వాలన్నారు. నెల్లూరులోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో వెంటనే ప్రాక్టికల్స్ నిర్వహించాలన్నారు. వీఎస్‌యూ భవన నిర్మాణాన్ని వెంటనే పూర్తిచేసి ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు వి. ప్రసాద్, ఎంవి రమణ, ఎన్ రవి, రాము, రవీంద్ర, బాబురావు, రాజశేఖర్, గణేష్, సాయి, నాగరాజు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.