బ్యాటరీ స్వాపింగ్ ఫెసిలిటీ.. దేశంలో తొలిసారిగా హైదరాబాద్‌లో
దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ నగరంలో బ్యాటరీ స్వాపింగ్ ఫెసిలిటీ అందుబాటులోకి వచ్చింది. మీ ఎలక్ట్రిక్ వెహికల్లో బ్యాటరీ ఛార్జింగ్ తక్కువగా ఉందనిపి పెట్రోలు, డీజిల్ కొట్టించినంత ఈజీగా బ్యాటరీనీ మార్చుకోవచ్చు.
హెచ్పీసీఎల్తో కలిసి
ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ రంగంలో ఉన్న రేస్ ఎనర్జీస్, హిందూస్థాన్ పెట్రోలియం కార్పోరేషన్‌తో కలిసి బ్యాటరీ స్వాపింగ్ సెంటర్‌ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. నగరంలో మొత్తం మూడు సెంటర్లు ఓపెన్ చేయాలని రేస్ లక్ష్యంగా పెట్టుకోగా అందులో మొదటి సెంటర్‌ని హైటెక్ సిటీ సమీపంలో ఐకియా ఎదురుగా ఉన్న పెట్రోలు బంకులో అందుబాటులో తెచ్చింది.
రెండు నిమిషాల్లో
రేస్ ఎనర్జీస్, హెచ్‌పీసీఎల్‌లు సంయుక్తంగా ఏర్పాటు చేసిన బ్యాటరీ స్వాపింగ్ సెంటర్లో డిస్ ఛార్జ్ అయిన బ్యాటరీ స్థానంలో ఛార్జ్డ్ బ్యాటరీని కేవలం రెండు నిమిషాల్లో ఫిట్ చేస్తారు. బ్యాటరీ స్వాపింగ్కి అనుగుణంగా బైకులు, ఆటోలు (త్రీ వీలర్స్) వరకు ప్రస్తుతం ఇక్కడ బ్యాటరీలు స్వాప్ చేస్తున్నారు. ముఖ్యంగా నగరంలో పెద్ద సంఖ్యలో ఉన్న ఈ ఆటలోకు ఈ స్వాపింగ్ సెంటర్ ఉపయోగకరంగా మారనుంది. అయితే బ్యాటరీ స్వాపింగ్కి ఎంత్ ఛార్జ్ చేస్తున్నారనే అంశంపై రేస్ ఎనర్జీస్ స్పష్టత ఇవ్వలేదు.
చదవండి:కొత్త ఏడాదిలో మరింత పెరగనున్న కార్ల ధరలు.. ఎందుకో తెలుసా?