Battle of the Oranges
-
పాక్ అమ్ములపొదిలో 600 యుద్ధ ట్యాంకులు
న్యూఢిల్లీ: భారీ స్థాయిలో అత్యాధునిక ఆయుధాలను సమకూర్చుకునే దిశగా పాకిస్తాన్ చర్యలు ప్రారంభించింది. ముఖ్యంగా జమ్మూకశ్మీర్లో భారత దేశ సరిహద్దు అయిన వాస్తవాధీన రేఖ వెంట మోహరించే లక్ష్యంతో యుద్ధ ట్యాంకులు, ఆధునిక తుపాకీలను పలు విదేశాల నుంచి కొనుగోలు చేస్తోంది. రష్యా నుంచి టీ–90లు సహా దాదాపు 600 యుద్ధ ట్యాంకులను సమకూర్చుకుంటోంది. వీటిలో 3 కిమీల నుంచి 4 కిమీల దూరంలోని లక్ష్యాలను కచ్చితంగా ఛేదించగల అత్యాధునిక కంప్యూటరైజ్డ్ ఫైర్ కంట్రోల్ వ్యవస్థ ఉంది. విదేశీ కొనుగోళ్లే కాకుండా, 2025 నాటికి దాదాపు 220 ట్యాంకులను చైనా సహకారంతో దేశీయంగా ఉత్పత్తి చేసుకోవాలని పాక్ నిర్ణయించింది. చైనా నుంచి వీటీ–4, ఉక్రెయిన్ నుంచి అప్లాడ్–పీ ట్యాంకులనూ కొనుగోలు చేస్తోంది. 150ఎంఎం ఎస్పీ మైక్–10 ఆధునిక తుపాకులను సైతం సమకూర్చుకుంటోంది. ఇటలీ నుంచి 245 ఈ తరహా తుపాకులను పాక్ కొనుగోలు చేస్తోంది. పాక్ క్షిపణి వ్యవస్థలను సైతం బలోపేతం చేసుకుంటోంది. విధానపరమైన జాప్యం కారణంగా ఆయుధ సంపత్తి పెంచుకునే విషయంలో భారత్ నత్త నడకన నడుస్తోందనే విమర్శలున్నాయి. అయితే, ఇప్పటికైతే, టీ–90, టీ–72, అర్జున యుద్ధ ట్యాంకులతో భారత్ పాక్ కన్నా బలంగానే ఉంది. -
వర్ణం: ఉత్సవంలో పోరాటం!
గతం వర్తమానంతో నిరంతరం సంభాషిస్తూనే ఉంటుంది. భూతకాలంలోని మంచీ, చెడూ ఏదైనాకూడా వర్తమానంలో ఉత్సవంగా రూపాంతరం చెందుతుంది. ఇటలీలో జరుపుకొనే ఈ ‘బ్యాటిల్ ఆఫ్ ది ఆరెంజెస్’ కూడా అలాంటిదే! రాక్షసపాలకులైన మధ్య యుగాల ప్రభువులను తరిమికొట్టడాన్ని ప్రతిబింబించే ఈ వేడుకలో వేలాది మంది పాల్గొంటారు. తొమ్మిది జట్లుగా విడిపోయి నారింజ పళ్లను ఒకరి మీదికి ఒకరు కాస్త గట్టిగానే విసురుకుంటూ తమ ప్రాచీనులతో కలిసి పోరాడిన అనుభూతి చెందుతారు. అధ్యక్షులవారి సప్లయర్ ఇతడు ఆంథోనీ తెషెరా. చేతిలోవి బ్యాగెట్లు. పిండి, ఈస్టు, ఉప్పు, నీళ్లతో చేసే ఫ్రెంచు రొట్టెలివి. 26 అంగుళాల పొడవుంటాయి. వీటిని చేయడంలో తెషెరా ప్రవీణుడు. అందువల్లే ‘బెస్ట్ బ్యాగెట్ ఆఫ్ పారిస్’ బహుమానం గెలుచుకున్నాడు. దీనివల్ల ఆయనకు ఏమొస్తుందంటారా? ఫ్రాన్సు అధ్యక్షుడి నివాస భవనమైన ‘ఎలిసీ ప్యాలెస్’కు అధికారికంగా బ్యాగెట్లను సప్లై చేసే కాంట్రాక్టు దక్కుతుంది. కుక్కెనక కుక్కగట్టి... ఇది అలస్కాలో ఆదరణ ఉన్న మంచు పరుగుపందెం. ‘ఇడిటారోడ్ ట్రయల్ స్లెడ్ డాగ్ రేస్’గా పిలిచే ఈ పోటీలో... గడ్డకట్టే చలిలో 1570 కిలోమీటర్ల దూరాన్ని 26 చెక్పాయింట్స్ దగ్గర క్యాంపులు వేసుకుంటూ మషర్స్ వెళ్తారు. ఈ స్లెడ్ బండిని కట్టడంలో ఒక పద్ధతి ఉంటుంది. అన్నింటికీ ముందుండేది లీడ్ డాగ్. ఒక్కోసారి రెంటినీ కట్టొచ్చు. ఇవి మషర్ ఆజ్ఞలను పాటిస్తూ బృందానికి నాయక స్థానంలో ఉంటాయి. వాటి తర్వాతి జత స్వింగ్ డాగ్స్. వీటికి మలుపుల్లో స్లెడ్ను లాగే నైపుణ్యం ఉంటుంది. తర్వాత వరుసగా ఉండే మూడు జతలు టీమ్ డాగ్స్. ఇవి బాగా పరుగెత్తగలుగుతాయి. బండికి తక్షణం ముందుండే జత వీల్ డాగ్స్. ఇవి బండిని బలంగా లాగుతాయి. ఈసారి విజేత డల్లాస్ సీవీ(అమెరికా) నిర్దేశిత దూరాన్ని 8 రోజుల 13 గంటల్లో పూర్తిచేశాడు. ముప్పై లక్షల రూపాయల ప్రైజ్మనీ గెలుచుకున్నాడు. అదనంగా ట్రక్కు! డబ్బుల్ని వేసుకెళ్లడానికని ఊహిస్తున్నారా!