BBM
-
మహారాష్ట్రలో మజ్లిస్–బీబీఎం పొత్తు
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో వచ్చే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు ఎంఐఎం, భరిపా బహుజన్ మహాసంఘ్ (బీబీఎం) పార్టీల మధ్య పొత్తు చిగురించింది. ఈ రెండు పార్టీలు 2019లో జరిగే లోక్‌సభ, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాయని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ శనివారం వెల్లడించారు. బీబీఎం అధ్యక్షుడు ప్రకాశ్ అంబేడ్కర్ అక్టోబర్ 2న ఔరంగాబాద్‌లో నిర్వహించే ర్యాలీకి తాను హాజరవుతున్నట్లు తెలిపారు. ఆ ర్యాలీలో సంకీర్ణ కూటమి గురించి ప్రకటిస్తామని ఆయన తెలిపారు. -
'బ్లాక్ బెరీ'లో కొత్త ఫీచర్లు
న్యూఢిల్లీ: కెనడియన్ మొబైల్ తయారీ సంస్థ బ్లాక్ బెరీ ఇప్పుడు వినియోగదారులకు మరికొన్ని కొత్త సదుపాయాలను అందుబాటులోకి తెచ్చింది. బ్లాక్ బెరీ మొబైల్ నుంచి ఇతరులకు పంపే సందేశాల్లో గోప్యతను పెంచేందుకు, వినియోగదారులే కంటెంట్ ను నియంత్రించే మెరుగైన అవకాశాలను కల్పిస్తోంది. ఈ కొత్త సదుపాయాన్ని ఎటువంటి ఛార్జీలు, ప్రత్యేక ఫీజులు లేకుండా యూజర్లకు అందుబాటులోకి తెస్తోంది. యాండ్రాయిడ్, స్మార్ట్ ఫోన్లలో ఎటువంటి ఫీజు లేకుండా కొత్త ఐవోఎస్ అప్ డేట్స్ అందిస్తోంది. యూజర్ల సౌకర్యార్థం వారు షేర్ చేసుకునే సందేశాలు, కంటెంట్ తమ నియంత్రణలోనే ఉంచుకునేందుకు బీబీఎం వినియోగదారులకు ఈ కొత్త అభివృద్ధి సహకరిస్తుందని బ్లాక్ బెరీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మాథ్యూటాల్బోట్ ఓ ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు తమ ఫోన్ నుంచిపొరపాటున కానీ, ఇష్టప్రకారం కానీ పంపిన మెసేజ్ లు, ఫొటోలు తిరిగి వెనక్కు రప్పించుకునే అవకాశం ఇప్పుడు బ్లాక్ బెరీలో ఉంది. అలాగే తాము పంపిన మెసేజ్ లు, ఫొటోలు ఇతరులకు ఎన్నాళ్ళ పాటు కనిపించాలో కూడా నిర్ణయించేందుకు వీలుగా టైమర్ ను సెట్ చేసుకునే అవకాశం ఇకపై అందుబాటులోకి వస్తుందని మాథ్యూ తెలిపారు. దీనికితోడు కొన్ని అదనపు కీ ఫీచర్లను కూడా బీబీఎం అందుబాటులోకి తెచ్చింది. ఒకరినుంచీ ఒకరికి ఛాట్ మెసేజ్ లను ఫార్వర్డ్ చేసే అవకాశం తోపాటు... విభిన్న వ్యక్తులతో ఛాట్ చేస్తున్నపుడు యాండ్రాయిడ్ లో మ్యూట్ నోటిఫికేషన్లు అందించే సామర్థ్యాన్ని బీబీఎం కొత్తగా కల్పించింది. అంతేకాక ఎన్నో మెరుగైన సందుపాయాలను కూడా వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చిన బ్లాక్ బెరీ.. ఇప్పుడు వీడియో షేరింగ్ ఆప్షన్ నూ అందిస్తోంది. ఈ కొత్త పద్ధతిలో అతి పెద్ద వీడియోలను సైతం క్యాప్చర్ చేసి ఇతరులకు షేర్ చేసే అవకాశం ఉంది. ఇవే కాక కొత్త ఛాట్ స్క్రీన్ ను ఐవోఎస్ అందిస్తోంది. యాండ్రాయిడ్ మార్ష్మాల్ల (6.0) ద్వారా ఇప్పుడు బీబీఎం పని చేస్తుంది. -
విద్యార్థులకు బీఆర్‌ఏయూ షాక్
పొందూరు, న్యూస్‌లైన్: ప్రశ్న పత్రాల లీకులతో విమర్శలు ఎదుర్కొంటున్న డాక్టర్ బి. ఆర్.అంబేద్కర్ యూనివర్సిటీ అధికారులు డిగ్రీ విద్యార్థులకు షాక్ ఇచ్చారు. ప్రశ్న పత్రంలో ఓ ప్రశ్న ముద్రించకపోవడంతో విద్యార్థు లు దానికి మార్కులు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. వివరాలు ఇవీ... శుక్రవారం డిగ్రీ రెండో సంవత్సరం(బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీ ఎం) విద్యార్థులకు జనరల్ తెలుగు పేపర్ పరీక్ష జరిగింది. ప్రశ్న పత్రం చూసి అవాక్కవడం విద్యార్థుల వంతైంది. కారణమేమిటంటే... ప్రశ్న పత్రం రెండవ పుటలో ఐదవ ప్రశ్నలో నాలుగు ప్రశ్నలిచ్చి ఒకదానికి వ్యాసం(జవా బు) రాయవలసి ఉంది. అయితే ఇందులో మూడు ప్రశ్నలే ఇచ్చారు. రోమన్ నంబర్ 1, 3, 4ల్లో ప్రశ్నలు మాత్రమే ఇచ్చారు. రెండో ప్రశ్న స్థానంలో కేవలం అంకె వేసి వదిలేశారు. ఈ ప్రశ్నకు ఎనిమిది మార్కులు కేటాయించా రు. దీంతో తాము చేయని తప్పునకు అనవసరంగా ఎనిమిది మార్కులు కోల్పోవలసి వచ్చిందని పలువురు విద్యార్థులు ‘న్యూసలైన్’కు తెలిపారు. తమకు జరిపిన అన్యాయాన్ని యూనివర్సిటీ ఉపకులపతి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ పరిశీలించి న్యాయం చేయాలని కోరుతున్నారు. ఈ ప్రశ్నపత్రం కోడ్ నంబర్ ట్చట002. ఈప్రశ్నపత్రం మొత్తం 70 మార్కులకు కేటాయించారు.