bc sangam
-
కుల గణన కోసం పోరుబాట
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కుల గణన చేపట్టాలనే డిమాండ్ పెరుగుతోంది. దేశవ్యాప్తంగా జన గణనకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో దానితోపాటే కుల గణన కూడా చేపట్టాలని బీసీ సంఘాలు ఒత్తిడి చేస్తున్నాయి. జనాభా లెక్కల సేకరణ 2011లో దేశవ్యాప్తంగా జరిగింది. మళ్లీ 2021లో జరగాల్సిన ఉండగా, కోవిడ్, ఇతర కారణాల వల్ల జాప్యమైంది. తాజాగా 2025లో జన గణన చేపట్టి 2026కు పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించింది.దీంతో జనాభా లెక్కల ఫార్మాట్లో ఈసారి బీసీ కులం కాలమ్ కూడా చేర్చి కుల గణన కూడా చేపట్టాలనే డిమాండ్ కేంద్రం ముందుకు వచ్చింది. ఈ డిమాండ్‌ను అంగీకరించేది లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. గతంలో మాదిరిగానే జనాభా లెక్కల సేకరణ మాత్రమే నిర్వహిస్తామని తేల్చి చెప్పింది. ఫలితంగా రాష్ట్రాల్లో కుల గణనకు డిమాండ్ పెరిగింది. ఈ మేరకు మన రాష్ట్రంలో ఉద్యమానికి బీసీ నేతలు సిద్ధమవుతున్నారు. కుల గణనకు చర్యలు చేపట్టిన జగన్ జనాభా లెక్కల్లోనే కుల గణన ద్వారా ఏయే కులాల జనాభా ఎంత అనేది తేలుతుంది. ఆర్థిక, సామాజిక, రాజకీయ తదితర రంగాల్లో ఆయా వర్గాల స్థానం ఏమిటీ అనేది తెలుసుకోవచ్చు. తద్వారా దామాషా పద్ధతిలో వారికి తగిన అవకాశాలు కలి్పంచేందుకు చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి... ముఖ్యమంత్రిగా ఉండగానే బీసీ నేతలు కోరకముందే రాష్ట్రంలో కుల గణన చేపడతామని ప్రకటించారు. దానికి అనుగుణంగా చర్యలు కూడా చేపట్టారు. ఈలోపు ఎన్నికలు రావడంతో ఆగిపోయింది. నైపుణ్య గణన పేరుతో కుల గణనకు బాబు బ్రేక్! దేశం లోనే బిహార్ రాష్ట్రం మొదట కుల గణన చేపట్టి పూర్తిచేసింది. ఆ తర్వాత ఏపీలోను గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కుల గణన ప్రక్రియను ప్రారంభించింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం కుల గణనను పక్కన పెట్టి నైపుణ్య గణన అంటూ కొత్త నినాదాన్ని తెరపైకి తెచి్చంది. పొరుగున ఉన్న తెలంగాణలోను కుల గణన చేపడతామని తాజాగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌లోను కుల గణనను పూర్తి చేయాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.ఇప్పటికే బీఎస్పీ రాష్ట్ర కో–ఆర్డినేటర్, మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు దశలవారీ ఉద్యమాలు నిర్వహిస్తున్నారు. పలువురు బీసీ నేతలు సైతం సీఎం చంద్రబాబును కలిసి రాష్ట్రంలో కులగణన చేపట్టాలని వినతిపత్రాలు అందించారు. అయినప్పటికీ కుల గణన విషయంలో చంద్రబాబు నుంచి సానుకూల స్పందన రావడంలేదని, బీసీ నేతలు రాష్ట్ర వ్యాపిత ఉద్యమాలకు సిద్ధమవుతున్నారు. -
కుల గణన నిర్ణయం చరిత్రాత్మకం
సాక్షి, అమరావతి: ఏపీలో కుల గణన చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం చరిత్రాత్మకమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం అధ్యక్షుడు ఎన్.మారేష్ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ బీసీ సంఘాల నాయకులు క్షీరాభిషేకం చేశారు. అనంతరం కృష్ణయ్య మాట్లాడుతూ.. బీసీలకు మేలు చేసే విషయంలో సీఎం జగన్ దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. కుల గణనను పూర్తి పారదర్శకంగా జరిపించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీని వల్ల ఏ కుల జనాభా ఎంత అనేది స్పష్టంగా తెలుస్తుందన్నారు. తద్వారా వారికి దక్కాల్సిన ఫలాలు అందుతాయన్నారు. సీఎం జగన్ గత నాలుగేళ్ల పాలనలో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు. అలాగే పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టించడం ద్వారా దేశానికే ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఏపీ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మారేష్ మాట్లాడుతూ.. సర్పంచ్ నుంచి రాజ్యసభ స్థానాల వరకు బీసీలకు రాజ్యాధికారంలో 65 శాతానికి పైగా వాటా ఇచ్చిన ఘనత సీఎం జగన్‌కు దక్కుతుందన్నారు. ఇప్పుడు కుల గణన చేపట్టడం బీసీల జీవితాల్లోనే మర్చిపోలేని అంశమన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల అభివృద్ధి ధ్యేయంగా పరిపాలన సాగిస్తున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ కుల సంఘాల నాయకులు రాజేందర్, వెంకట సుబ్బారావు, జనార్ధన్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. -
‘ఆసరా’ ఎప్పుడు?: ఆర్. కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్: ఆసరా పింఛన్ల పంపిణీలో జాప్యంపై బీసీ సంక్షేమ సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. లబ్ధిదారులకు వెంటనే పింఛన్లు ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం నేత, టీటీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. వరుసగా మూడు నెలల నుంచి పింఛను డబ్బులు ఇవ్వకపోవడంతో వృద్ధులు, వికలాంగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. పింఛన్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా 35 లక్షల మంది లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారని, పింఛను ఎప్పుడిస్తారని అధికారులను ప్రశ్నించినా సమాధానం రావడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పింఛను పంపిణీ తేదీలను ప్రకటించాలని, అదేవిధంగా తాజా బడ్జెట్లో పింఛన్ డబ్బులను రూ.2వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో ఈమేరకు పెంపు అనివార్యమన్నారు. -
మంజునాథ కమిషన్ ముట్టడిద్దాం
కాపులను బీసీల్లో చేరిస్తే అన్యాయమైపోతాం అమలాపురం బీసీ సంఘాల సమావేశంలో తీర్మానం అమలాపురం రూరల్ :'ఆర్థికంగా అభివృద్ధి చెందిన కాపులను బీసీల జాబితాలో చేరిస్తే బీసీలకు తీరని అన్యాయం జరుగుతుంది. జిల్లాలోని బీసీ కులాలన్నీ ఐక్యంగా దీనిని ప్రతిఘటించాలి. ఈనెల 28న విచారణకు వస్తున్న మంజునాథ కమిషన్‌ను ముట్టడించాలి' అని జిల్లా బీసీ సంఘాల సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. జిల్లా బీసీ సంఘాల సమావేశం బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు కుడుపూడి చిట్టబ్బాయి అధ్యక్షతన అమలాపురంలోని సూర్యనగర్ కమ్యూనిటీ హాల్లో సోమవారం జరిగింది. చిట్టబ్బాయి మాట్లాడుతూ తాము ఇతర కులాలకు వ్యతిరేకం కాదన్నారు. బీసీల్లో చేర్చడాన్ని వ్యతిరేకించే వారికి..చేర్చాలని కోరుతున్న వారికి జిల్లాలో ఒకేచోట మంజునాథ కమిషన్ విచారించడం వల్ల కులాల మధ్య వైషమ్యాలు, ఘర్షణలు తలెత్తే ప్రమాదం ఉందన్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కమిషన్ ఆ రెండు సామాజిక పక్షాలను ఒకే రోజు కాకండా వేర్వేరు తేదీల్లో విచారణ నిర్వహించాలని చిట్టబ్బాయి సూచించారు. ఈనెల 28న జిల్లా నలుమూలల నుంచి బీసీ సంఘాలన్నీ సంఘటితమై మంజూనా«థ కమిషన్‌కు తమ వాదన వినిపించి వినతిపత్రం ఇవ్వాలని చిట్టబ్బాయి కోరారు. 28న ఛలో కాకినాడకు తరలిరండి జెడ్పీ మాజీ చైర్మన్, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఆధికార ప్రతినిధి చెల్లుబోయిన వేణు మాట్లాడుతూ బీసీ సంఘాలన్నీ ఐక్యంగా ఉండి బీసీలకు జరిగే నష్టంపై మంజునా«థ కమిషన్‌కు తమ వాదన వినిపించాలన్నారు. వినతిపత్రాలు తయారు చేసేందుకు డ్రాప్టింగ్ కమిటీ ఏర్పాటు చేయాలని, జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి మోటార్‌సైకిళ్లు, కార్ల ద్వారా ఛలో కాకినాడకు తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం, ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ జనాభా తామాషా ప్రకారంగా ఆర్థికంగా వెనుకబడి కులవృత్తులున్నవారిని మాత్రమే బీసీల్లో చేర్చాలనే నిబంధన ఉందన్నారు. ఇప్పటికే 93 కులాలు ఉండాల్సిన బీసీల్లో 149 కులాలను చేర్చడం వల్ల బీసీలకు న్యాయం జరగడం లేదన్నారు. రిజర్వేషన్లు పెంచడానికి అభ్యంతరం చెబుతున్న కమిషన్లు, కాపులను ఏ విధంగా బీసీల్లో చేర్చుతారని ప్రశ్నించారు. రాష్ట్ర బీసీ జేఏసీ కన్వీనర్ కుడుపూడి సూర్యనారాయణరావు మాట్లాడుతూ రాజ్యంగ ప్రకారంగా కాపులను బీసీల్లో చేర్చే అధికారం ప్రభుత్వానికి లేదన్నారు. బీసీ సంఘాల ప్రతినిధులు కుడుపూడి పార్థసారథి, చెల్లుబోయిన శ్రీనివాసరావు, వాసంశెట్టి గంగాధరరావు, మార్గాని నాగేశ్వరరావు, బూడిగ శ్రీనివాసరావు, యిళ్ల సత్యనారాయణ, మట్టపర్తి నాగేంద్ర, యిళ్ల శేషారావు, కుడుపూడి బాబు, వాసంశెట్టి సుభాష్, చొల్లంగి వేణుగోపాల్, వాసంశెట్టి తాతాజీ, పంపన రామకృష్ణ, డి.వెంకటేశ్వరరావు, పాలెపు ధర్మారావు, బిళ్ల శ్రీనివాసరావు, రాజులపూడి భీముడు, రెడ్డి సురేష్, పాలాటి బాలయోగి, మావూరి శ్రీనివాసరావు పాల్గొన్నారు.