BC Welfare Officers
-
ఏపీపీఎస్సీ పరీక్ష తేదీల్లో మార్పులు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) వివిధ పరీక్షల తేదీల్లో మార్పులు చేసింది. పరిపాలన కారణాల వల్ల పరీక్ష తేదీలను మార్చినట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి ఏకే మౌర్య శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. మారిన పరీక్షల వివరాలు... పరీక్ష పేరు మారిన తేదీ అసిస్టెంట్ బీసీ/సోషల్/ట్రైబల్ వెల్ఫేర్ నవంబర్ 4, నవంబర్ 5 జిల్లా సైనిక వెల్ఫేర్ ఆఫీసర్లు నవంబర్ 5, నవంబర్ 6 ఏపీ మైనింగ్ సర్వీస్ రాయల్టీ ఇన్స్పెక్టర్స్ నవంబర్ 5 హైడ్రాలజీ టెక్నికల్ అసిస్టెంట్లు నవంబర్ 26 ఏపీ సైనిక్ వెల్ఫేర్ ఆర్గనైజర్లు నవంబర్ 26 -
మంత్రి గారూ..ఇదేనా సంక్షేమం!
‘పేదలకు సక్రమంగా ఫలాలు అందాలంటే సంక్షేమ శాఖలు నా వద్దే ఉండాలి. అప్పుడే పేదలకు న్యాయం జరుగుతుంది.’ అని సాక్షాత్తు ముఖ్య మంత్రి కేసీఆర్ ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో ప్రకటించారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరి రెండు నెలలు పూర్తయినప్పటికీ సంక్షేమంపై సీఎం దృష్టి సారించినట్లు కనిపించడం లేదు. జిల్లాలో బీసీ సంక్షేమ వసతిగృహాల పరిస్థితి దారుణంగా తయారైంది. సమస్యలు తిష్ట వేసిన సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులు దుర్భర స్థితిని గడుపుతున్నారు. ఈ ఏడాదికి మరమ్మతుల నిధులు లేకపోవడంతో సొంత భవనా ల్లో ఉన్న వసతిగృహాలన్నీ అధ్వానంగా మారాయి. ఇటు సంక్షేమ వసతిగృహాల ను ఇంటిని తలపించేలా తయారు చేస్తామని సమావేశాల్లో ప్రసంగాలు ఇచ్చిన పాలకులు ఆచరణకొచ్చేసరికి ఆమడ దూరంలో ఉన్నారు. అధికారులది అదే తీరు. బీసీ సం క్షేమాన్ని పట్టించుకునే నాథుడే కరువయ్యారు. -ఇందూరు ఇందూరు: జిల్లాలో బీసీ సంక్షేమ వసతిగృహాలు పాఠశాల, కళాశాలలకు కలిపి మొత్తం 60 ఉన్నాయి. ఇందులో 37 వసతిగృహాలు సొంత భవనాల్లో ఉండగా, 23 వసతిగృహాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. గత జూన్ 12న జిల్లాలోని వసతిగృహాలన్నీ పున: ప్రారంభమయ్యాయి. అయితే వసతిగృహాలకు ప్రతి ఏటా మరమ్మతుల కోసం ప్రభుత్వం నుంచి లేదా జిల్లా ఫండ్ నుంచి నిధులు కేటాయిస్తారు. ఈ నిధులతో వసతిగృహాలు ప్రారంభం కాకముందే విద్యుద్దీపాలు, ఫ్యాన్లు, ఎలక్ట్రిసిటీ బోర్డులు, గదుల తలుపులు, బాత్రూమ్ తలుపులు, వాటి పరిశుభ్రత, నీటి సరఫరా, భవనానికి సున్నాలు, పైకప్పుల లీకేజీ ఇతర ఏవైన మరమ్మతులు చేయించాలి. ఇందుకు బీసీ సంక్షేమాధికారులు మరమ్మతులు అవసరం ఉన్న వసతిగృహాలను గుర్తించి, వాటికి నిధులు కేటాయించాలని మూడు నెలల క్రితం అప్పటి జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న కు ఫైలు పెట్టారు. అయితే ఆ ఫైలుకు అక్కడి నుంచి కదలిక లేదు. ఇటు విద్యాసంవత్సరం ప్రారంభం కావడంతో సంక్షేమాధికారులు చేసేదేమిలేక అరకొర వసతులతోనే వసతి గృహాలను ప్రారంభించాల్సి వచ్చింది. అవి ప్రారంభమై రెండు నెలల పూర్తయినప్పటికి ఒక్క పైసా కూడా కేటాయించలేదు. జిల్లా బీసీ సంక్షేమాధికారులు నెల రోజుల క్రితం వసతిగృహాల మరమ్మతుల కోసం నిధులు కేటాయించాలని, విద్యార్థులు అసౌకర్యాలతో ఇబ్బందులు పడుతున్నారని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డిని కలిసి విన్నవించారు. సానుకూలంగా స్పందించిన మంత్రి నిధుల మం జూరులో మాత్రం నిర్లక్ష్యం వహించారు. బీసీ సంక్షేమ వసతిగృహాలు మరమ్మతులకు నోచుకోకపోవడంతో ఆధ్వానంగా తయారయ్యాయి. సొంత భవనాల పైకప్పులు పెచ్చులూడుతున్నాయి. అవి విద్యార్థులకు ప్రమాదకరంగా మారుతున్నాయి. కిటికీలకు జాలీలు అమర్చకపోవడంతో దోమలబెడద తీవ్రంగా ఉంది. బాత్రూమ్లు పరిశుభ్రతకు నోచుకోక పోవడంతో దుర్వాసన వెదజల్లుతోంది. దీంతో విద్యార్థులు రోగా ల బారిన పడుతున్నారు. ఇటు బాత్రూమ్లకు తలుపులు లేకపోవడంతో స్నానాలు చేయడానికి ఇబ్బందులు పడుతున్నారు. తలుపులున్నప్పటికి అవి పూర్తిగా విరిగి పోయి దర్శనమిస్తున్నాయి. ఇక విద్యు త్ దీపాల విషయానికొస్తే విద్యార్థులు పడుకునే గదు ల్లో అక్కడక్కడ మాత్రమే ఏర్పాటు చేశారు. మరి కొన్ని వసతి గృహాల్లో విద్యుత్ దీపాలు అలంకారప్రాయంగా ఉన్నాయి. వసతిగృహాల ఆవరణలో కూడా ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలు పగిలిపోవడంతో ప్రస్తుతం అవి పని చేయడం లేదు. ఫ్యాన్లు కూడా తిరగడం లేదు. పై సమస్యలన్నింటిపై విద్యార్థులు వార్డెన్ల కు విన్నవించినప్పటికి నిధులు రాలేదనే సాకుతో వారు తప్పించుకుంటున్నారు. విద్యార్థులకు వసతు లు కరువయ్యాయని అనుకుంటే నోటు బుక్కులు, యూనిఫామ్‌లు ఇంత వరకు అందించలేదు. దీంతో సంక్షేమంలో సంక్షోభం నెలకొంది. -
బీసీ వెల్ఫేర్‌కు రూ.47 కోట్లు కావాలి!
- అరకొరగా బడ్జెట్ - బకాయి చెల్లింపులకే చాలని నిధులు - అందని స్కాలర్షిప్పులు... - చెల్లించని ఫీజు రీయింబర్స్మెంట్ విజయనగరం ఫూల్‌బాగ్: జిల్లాలో వెనుకబడిన తరగతుల సంక్షేమానికి 47 కోట్లు కావాల్సి ఉంది. ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకారవేతన బకాయిలు 47 కోట్లు ఉంటుందని అంచనా. ఈ నిధులు ఉంటే తప్ప బీసీ విద్యార్థుల సంక్షేమం చేపట్టలేమని బీసీ వెల్ఫేర్ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు ఎటూ చాలడం లేదని అధికారులే అభిప్రాయపడుతున్నారు. ఈ ఏడాది (2014-15) విద్యా సంవత్సరానికి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ కింద 5.85 కోట్లు, ఉపకార వేతనాలకు 5.90 కోట్లు, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల కోసం 1.18 కోట్లను రెన్యూవల్ కింద విడుదల చేసింది. ఈ నిధులు బకాయిలు చెల్లింపునకు కూడా చాలడం లేదు. గత ఏడాది (2013-14) విద్యా సంవత్సరానికి కొత్త విద్యార్థులకు (ఫెషర్స్కి) ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకారవేతనాలు విడుదల కాలేదు. దీంతో వీరి చదువులు ప్రశ్నార్థకమైంది. ఏ ఏడాదీ పూర్తి స్థాయి బడ్జెట్ లేదు ఏ విద్యా సంవత్సరంలోనూ విద్యార్థులకు సరిపడినంత పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రభుత్వం మంజూరు చేయలేదు. దీంతో బకాయిలు పేరుకుపోవడంతో ఏ ఏడాది విడుదలైన బడ్జెట్‌ను బకాయిలు చెల్లిస్తున్నారు. దీంతో ఉపకారవేతనాలు, ఫీజురీయింబర్స్‌మెంట్‌పై ఆధారపడిన విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. హాస్టల్ విద్యార్థులకు అందని ఉపకారవేతనాలు హాస్టల్ విద్యార్థులకు ఉపకారవేతనాలు అందకపోవడంతో నిర్వహణకు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా లో బీసీ వెల్ఫేర్‌కు సంబంధించి డిపార్టుమెంట్ హాస్టళ్లు 18 ఉన్నారు. బాలుర, బాలికలకు తొమ్మిది చొప్పున ఉన్నాయి. విజయనగరం, నెల్లిమర్ల, చీపురుపల్లి, ఎస్.కోట, గజపతినగరం, సాలూరు, బొబ్బిలి, పార్వతీ పురం, కురుపాం నియోజకవర్గాలో రెండేసి చొప్పున వసతి గృహాలు ఉన్నాయి. వీటిలో 1,564 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో 887 మంది బాలికలు, 677 మంది బాలురు ఉన్నారు. జిల్లాలో కాలేజీ అటాచ్డ్ హాస్టళ్లు 24 ఉన్నాయి. మహారాజా కళాశాల అనుంబంధ వసతిగృహం, ఎంఆర్ పీజీ, ఎస్కెడి వసతిగృహం, తిరుమల స్కూల్ ఆఫ్ నర్సింగ్, తిరుమల కాలేజీ ఆఫ్ నర్సింగ్, లక్ష్మి స్కూల్ ఆఫ్ నర్సింగ్, వైద్య మెడికల్ హెల్త్ సెన్సైస్, ఎంవీజీఆర్ (విజయగరం), మిమ్స్ మెడికల్ కాలేజీ (నెల్లిమర్ల), సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ (గరివిడి), పుణ్యగిరి డిగ్రీ, వివేకానంద డిగ్రీ, చైతన్యడిగ్రీ, ఐవీఎన్ రాజు డిగ్రీ (ఎస్.కోట) సాయిసిద్ధార్థ (గజపతినగరం), గోకుల్ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ (బొబ్బిలి)లో ఉన్నాయి. అయితే గతేడాది కాలేజీ అటాచ్డ్ హాస్టల్స్‌గా ఉన్న వివేకవర్ధిని (చినబోగిలి), వివేకానంద జూనియర్ కాలేజీ (ఎస్.కోట), గాయత్రి డిగ్రీ (సీతానగరం), ఎస్వికెసీడీ (కురుపాం) తదితర వసతిగృహాలను ఎత్తివేశారు. ఈ విద్యార్థులకు 2013-14 విద్యాసంవత్సరానికిగాను ఉపకారవేతనాలు విడుదల కాలేదు. 26,262 మందికి మొండి చేయి 2013-14లో 26,262 మందికి ప్రభుత్వం మొండిచేయి చూపించింది. జిల్లాలో 57,262 మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్పుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో రెన్యువల్(ద్వితీయ, తృతీయ సంవత్సరం) విద్యార్థులు 31 వేల మంది ఉన్నారు. వీరిలో 11,280 మందికి మాత్రమే నిధులు మంజూరయ్యాయి. రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా మరో 4,210 మం దికి ఉపకారవేతనాలు మంజూరు చేశారు. 26,262 మంది విద్యార్థులకు మొండిచేయి చూపించారు. 2013-14 బడ్జెట్ వివరాలు - 2013-14లో 48.55 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. - ఇందులో 27.42 కోట్లు 2012-13వ సంత్సరం బకాయిలకు కేటాయించారు - 2013-14లో విద్యార్థుల రెన్యువల్ కోసం 11.97 కోట్లు మంజూరు చేశారు. - ప్రభుత్వం మంజూరు చేసిన 48.55 కోట్లలో 9.16 కోట్లు విడుదల చేయలేదు.