Beatrice
-
ప్రపంచ రికార్డు: 50 ఏళ్ల వయసు, 500 రోజులు ఒక్కత్తే.. గుహలో...
స్పెయిన్ అథ్లెట్ 50 ఏళ్ల బీట్రస్ ఒక ఆరోగ్య ప్రయోగంలో భాగంగా 500 రోజులు గుహలో ఒక్కత్తే గడిపి మొన్న (శుక్రవారం) బయటకు వచ్చింది. బయట నుంచి మాత్రమే నిపుణుల పర్యవేక్షణ ఉన్నా 260 అడుగుల లోతు గుహలో అదరక బెదరక జీవించింది. ఎక్కువ రోజులు గుహలో ఒంటరిగా జీవించిన ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్న బీట్రస్ కథా కమామీషు... ‘లోపలకు వెళ్లాక రెండు నెలల వరకూ లెక్క బెట్టాను. ఆ తర్వాత రోజుల్ని లెక్క బెట్టుకోవడం మానేశాను. సహాయక బృందం లోపలికి వచ్చి నన్ను బయటకు తెచ్చే వరకు ఏ 160 రోజులో ఉన్నాననుకున్నాను. కాని 500 రోజులు ఉన్నాను. కాలం ఇట్టే గడిచిపోయింది’ అంది బీట్రస్ ఫ్లెమినీ. తన 48వ ఏట నవంబర్ 21, 2021 తేదీన స్పెయిన్‌లోని గ్రనాడా పట్టణం సమీపంలో ఉన్న ఒక గుహలోకి బీట్రస్ అడుగుపెట్టింది. మళ్లీ 50వ ఏట ఏప్రిల్ 14, 2023న బయటకు వచ్చింది. ఒకటిన్నర సంవత్సరం గుహలో ఒక్కత్తే గడిపింది. ‘ఈ కాలంలో బయట ఏం జరిగిందో నాకు తెలియదు’ అందామె. గ్రనడా యూనివర్సిటీ, అల్మేరియా యూనివర్సిటీలోని శాస్త్ర నిపుణులు గుహలలో, పర్వతారోహణలో ఒక్కరిగా చిక్కుకుపోయినప్పుడు మనిషి ‘సర్కేడియన్ రిథమ్’ (వెలుతురు, చీకటిని బట్టి మానవ శరీర, మానసిక స్థితుల్లో 24 గంటల్లో వచ్చే మార్పు) అధ్యయనం చేయడానికి బీట్రస్ను గుహలోకి పంపారు. క్యాలెండర్, గడియారం ఏమీ ఇవ్వలేదు. 60 పుస్తకాలు, వెయ్యి లీటర్ల నీరు, స్టవ్, ఆమె కదలికలను బయటి నుంచి గమనించడానికి సెన్సర్స్‌ను తీసుకొని ఆమె లోపలికి వెళ్లింది. ‘నేను నాతో మాట్లాడుకుంటూ గడిపాను, వ్యాయామం, టోపీలు అల్లడం, పుస్తకాలు చదవడం, బొమ్మలు వేయడం... వీటితో టైమ్ సరిపోయింది. ఒక్కోసారి భ్రాంతి కలిగేది’ అని తెలిపింది. ఆమె ద్వారా వచ్చిన రీడింగ్స్‌ను శాస్త్రజ్ఞులు ఇప్పుడు క్రోడీకరించే పనిలో పడ్డారు. Athlete Beatriz Flamini spent almost two years alone in an underground cave. And she makes it sound pretty relaxing... Follow us on Gab: https://t.co/IuhLFQBQPc pic.twitter.com/e7nlKR9Kyc — RT (@RT_com) April 15, 2023 -
వింత ఆనవాయితీ.. అక్కడ సంక్రాంతికి అటుకులిచ్చి పంపుతారు!
విశాఖపట్నం: సంక్రాంతి పండక్కి వచ్చిన బంధువులు, స్నేహితులను ఉత్త చేతులతో పంపకుండా.. అటుకులిచ్చి గౌరవంగా పంపడం పల్లెల్లో అనాదిగా వస్తున్న ఆచారం. అటుకుల పేరు చెప్పగానే పురాణాల్లో స్నేహబంధం గుర్తుకు వస్తుంది. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడి మీద ప్రేమతో పేద స్నేహితుడైన కుచేలుడు అటుకులు బహుమానంగా ఇవ్వగా.. శ్రీకృష్ణుడు అతనికి అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తాడు. రైతులు కొత్తగా పండిన ధాన్యాన్ని తొలి పంటగా శ్రీకృష్ణుడికి నైవేద్యంగా చూపడం ఆనవాయితీ. ఆ ధాన్యాన్ని అటుకులుగా ఆడిస్తారు. రైతు కుటుంబాల్లో అటుకులు ప్రధాన పాత్ర వహిస్తాయి. అటుకులతో బెల్లం ముక్కలు, పాలు చక్కెర, ఉప్పు కారం, పులిహోర ఇలా అనేక రకాలుగా చిరు వంటకాలు తయారు చేస్తారు. ఈ ఏడాది ఆశించినమేర వరి సాగై.. రైతుల ఇళ్లకు ధాన్యం రావడంతో అటుకుల మిల్లుల నిర్వాహకులకు చేతినిండా పని దొరికింది. పెట్టుబడులకు తగ్గట్టుగా 3 నెలల పాటు పని చేసుకునే అవకాశం కలిగిందని మిల్లు యజమానులు చెబుతున్నారు. గతంలో పుట్టగొడుగుల్లా వెలసిన అటుకుల మిల్లులు.. ఇప్పుడు అక్కడక్కడ మాత్రమే దర్శనమిస్తున్నాయి. నక్కపల్లి, గొడిచర్ల, అడ్డురోడ్డు, పాయకరావుపేట, తుని తదితర ప్రాంతాల్లో సుమారు 15 వరకు అటుకుల మిల్లులు ఉన్నాయి. డిసెంబర్ మొదలు మార్చి వరకు ఈ మిల్లుల వద్ద సందడి ఉంటుంది. వేపిన ధాన్యాన్ని మిల్లులో వేసి అటుకులుగా తయారు చేస్తున్న దృశ్యం అటుకుల తయారీ ఇలా.. డీజిల్‌తో ఈ మిల్లులు నడుస్తాయి. ముందుగా ధాన్యాన్ని పొయ్యి మీద వేపుతారు. పొయ్యిని కూడా మట్టితో ఏర్పాటు చేస్తారు. దీని మీద 40 కిలోల బరువు ఉండే బీడు కలాయిలు ఏర్పాటు చేసి ఇసుకలో ధాన్యాన్ని ఒక పర్యాయం వేపిన తర్వాత.. మిల్లు ఆడిస్తే అటుకులు తయారవుతాయి. ధాన్యాన్ని వేపడం కోసం ప్రత్యేకంగా జీడి పిక్కల పరిశ్రమల నుంచి మడ్డి తెస్తారు. జీడి తొక్క నుంచి నూనె తీయగా వచ్చే నల్లటి మడ్డి పదార్థాన్ని వీరు పొయ్యిల్లో వేసి మండిస్తారు. కేడీపేట నుంచి బస్తా రూ.170లకు కొనుగోలు చేస్తారు. కలాయిలో ధాన్యాన్ని వేపుతున్న కార్మికుడు బస్తా మడ్డి 200 కిలోల ధాన్యాన్ని వేపేందుకు సరిపోతుంది. మిల్లును డీజిల్ ఇంజిన్ సహాయంతో నడుపుతారు. ధాన్యం వేపే వారికి కుంచానికి(4 కిలోలు)రూ.8, మిల్లు ఆడే వ్యక్తికి కుంచానికి రూ.5 చెల్లిస్తారు. 20 లీటర్ల డీజిల్‌తో 300 కుంచాల(1200 కిలోల) ధాన్యం అటుకులుగా ఆడొచ్చని నిర్వాహకులు చెబుతున్నారు. ఇలా ధాన్యాన్ని అటుకులుగా ఆడించినందుకు కుంచానికి రూ.40 వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం సంక్రాంతి సీజన్ కావడంతో అటుకుల మిల్లుల వద్ద సందడి కనిపిస్తోంది. -
నిరాడంబరంగా బ్రిటన్ ప్రిన్సెస్ వివాహం
లండన్ : ప్రిన్స్ ఆండ్రూ పెద్ద కుమార్తె ప్రిన్సెస్ బీట్రెస్(31) వివాహం శుక్రవారం ఓ వ్యాపారవేత్తతో జరిగింది. బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 మనవరాలు అయిన బ్రీట్రెస్ ఇటలీకి చెందిన మాపెల్లి మొజ్జిని(37) పెళ్లి చేసుకున్నారు. కరోనా వైరస్ కరాణంగా వీరి వివాహం నిరాడంబరంగా జరిగినట్లు బకింగ్హమ్ ప్యాలెస్ వర్గాలు ధృవీకరించాయి. ('క్వీన్ ఎలిజబెత్ ఆరోగ్యంపై దిగులుగా ఉంది') అయితే ప్రిన్సెస్ బ్రీట్రెస్, మాపెల్లిల పెళ్లి మొదటగా మే 29న లండన్‌లోని సెయింట్ జేమ్స్ ప్యాలెస్‌లో జరగాల్సి ఉంది. కానీ కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వీరి వివాహం వాయిదా పడింది. అనంతరం జూలై 17న శుక్రవారం ఉదయం 11 గంటలకు విండ్సర్లోని రాయల్ లాడ్జ్‌లోని రాయల్ చాపెల్ ఆఫ్ ఆల్ సెయింట్స్ వద్ద వీరి వివాహం జరిగినట్లు రాజ కుటుంబం ఓ ప్రకటలో తెలిపింది. కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలోనే ఈ వేడుక జరిగినట్లు తెలుస్తోంది.(ఆ విషయంలో అమెరికా తర్వాత ఇండియానే) -
అటుకిటుకులు
అటు ఇటు తిరుగుతూ దంచుకుని... మంచుకునే సూపర్ స్నాక్. అటుకుల వంటకాలు చిటికెలో అయిపోతాయి. చేయడానికి ఇన్ని కిటుకులు ఉన్నాయి. అటుకులమిక్స్చర్ కావలసినవి: పల్చటి అటుకులు – 2 కప్పులు; వేయించిన పల్లీలు – పావు కప్పు; పుట్నాల పప్పు – పావు కప్పు; వేయించిన జీడి పప్పులు – పావు కప్పు; ఎండు కొబ్బరి ముక్కలు – పావు కప్పు; కిస్మిస్ – 2 టేబుల్ స్పూన్లు; నూనె – పావు కప్పు; బెల్లం పొడి – 2 టీ స్పూన్లు; ఉప్పు – తగినంత; నూనె – అర టేబుల్ స్పూను పోపు కోసం... కరివేపాకు – రెండు రెమ్మలు; తరిగిన పచ్చి మిర్చి – 2; పసుపు – పావు టీ స్పూను; ఇంగువ – కొద్దిగా ; తయారీ: స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక, మంట బాగా తగ్గించి, అటుకులు వేసి దోరగా వేయించి తీసి పక్కన ఉంచాలి ∙అదే బాణలిలో నూనె వేసి కాగాక, పల్లీలు వేసి వేయించి తీసి పక్కన ఉంచాలి ∙పావు కప్పు ఎండు కొబ్బరి ముక్కలు వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి, ముక్కలను తీసి పక్కన ఉంచాలి ∙పుట్నాల పప్పు, జీడి పప్పులు, కిస్మిస్లను కూడా విడివిడిగా వేసి వేయించి తీసి పక్కన ఉంచాలి. అదే బాణలిలో అర టేబుల్ స్పూను నూనె వేసి కాగాక, మంట తగ్గించాలి ∙కరివేపాకు, పచ్చి మిర్చి, ఇంగువ వేసి వేయించాలి ∙పసుపు, ఉప్పు జత చేయాలిబెల్లం పొడి జత చేసి కలిపి, రంగు మారుతుండగా, వేయించిన అటుకులు జత చేసి ఐదు నిమిషాల పాటు కలపాలి ∙వేయించిన డ్రై ఫ్రూట్స్ జత చేసి కలిపి దింపేయాలి ∙చల్లారాక గాలిచొరని డబ్బాలో నిలవ చేసుకోవాలి ∙టీ టైమ్‌లో తినడానికి బాగుంటుంది. కిటుకు: కొద్దిగా నెయ్యి, కొద్దిగా గరం మసాలా జత చేస్తే మిక్స్చర్ మరింత రుచిగా ఉంటుంది. అటుకులలడ్డూ కావలసినవి: అటుకులు – ఒక కప్పు; గింజలు తీసిన ఖర్జూరాలు – అర కప్పు; ఏలకుల పొడి – ఒక టీ స్పూను; ఎండు కొబ్బరి తురుము – పావు కప్పు; బెల్లం పొడి – ఒక టేబుల్ స్పూను; వేయించిన నువ్వులు – ఒక టేబుల్ స్పూను; నెయ్యి – ఒక టీ స్పూను. తయారీ: స్టౌ మీద బాణలిలో నెయ్యి వేసి కరిగాక అటుకులు వేసి వేయించి తీసేయాలి ∙మిక్సీ జార్లో అటుకులు, ఖర్జూరాలు, ఎండు కొబ్బరి తురుము, నువ్వులు, బెల్లం పొడి, ఏలకుల పొడి వేసి మెత్తగా చేసి, ఆ మిశ్రమాన్ని పాత్రలోకి తీసుకోవాలి ∙చేతికి కొద్దిగా నెయ్యి పూసుకుని, అటుకుల మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుంటూ, ఉండలు చేయాలి. కిటుకు: ఈ జీడి పప్పుల పొడి జత చేస్తే లడ్డూలు మరింత రుచిగా ఉంటాయి. అటుకుల పునుగులు కావలసినవి: అటుకులు – ఒక కప్పు; బియ్యప్పిండి – పావు కప్పు; పెరుగు – అర కప్పు; ఉల్లి తరుగు – పావు కప్పు; క్యారట్ తురుము – ఒక టేబుల్ స్పూను; బంగాళదుంప తురుము – ఒక టేబుల్ స్పూను; అల్లం తురుము – ఒక టీ స్పూను; వెల్లుల్లి తురుము – ఒక టీ స్పూను; తరిగిన పచ్చి మిర్చి – 3; కొత్తిమీర తరుగు – టీ స్పూను; ఉప్పు – తగినంత; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా. తయారీ: ఒక పాత్రలో అటుకులకు తగినన్ని నీళ్లు జత చేసి, ఐదు నిమిషాల పాటు నానబెట్టాలి ∙రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి, గట్టిగా పిండి, నీళ్లు వేరు చేయాలి ∙ఒక పాత్రలో అటుకులు, బియ్యప్పిండి, ఉల్లి తరుగు, క్యారట్ తురుము, బంగాళదుంప తురుము, అల్లం తురుము, వెల్లుల్లి తురుము, కొత్తిమీర తరుగు, ఉప్పు, పెరుగు వేసి పునుగుల పిండిలా కలపాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాచాలి ∙పిండిని పునుగుల మాదిరిగా నూనెలో వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి, పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి ∙టొమాటో సాస్‌తో తింటే రుచిగా ఉంటాయి. కిటుకు: నానబెట్టి, ఉడికించిన సగ్గుబియ్యాన్ని (రెండు టీ స్పూన్లు) జత చేస్తే పునుగులు మెత్తగా వస్తాయి. అటుకులచిక్కీ కావలసినవి: అటుకులు – ఒక కప్పు; బెల్లం పొడి – ఒక కప్పు; ఏలకుల పొడి – ఒక టీ స్పూను; జీడిపప్పుల పొడి – ఒక టీ స్పూను; బాదం పప్పుల పొడి – ఒక టీ స్పూను; నెయ్యి – ఒక టేబుల్ స్పూను తయారీ: ∙స్టౌ మీద బాణలిలో నెయ్యి వేసి కరిగాక అటుకులు వేసి దోరగా వేయించాలి ∙ఒక పాత్రలో బెల్లం పొడి, కొద్దిగా నీళ్లు పోసి, స్టౌ మీద ఉంచి ఉండ పాకం వచ్చే వరకు కలుపుతుండాలి ∙ఏలకుల పొడి, బాదం పప్పుల పొడి, జీడి పప్పుల పొడి వేసి కలిపి దింపేయాలి నెయ్యి వేసి కలియబెట్టాలి ∙ఒక ప్లేటుకి నెయ్యి పూసి, తయారుచేసి ఉంచుకున్న అటుకుల చిక్కీ మిశ్రమాన్ని అందులో పోసి, గరిటెతో సమానంగా పరవాలి ∙కొద్దిగా గట్టిపడుతుండగా, చాకుతో ముక్కలుగా కట్ చేసి, చల్లారాక ముక్కలను గాలి చొరని డబ్బాలో నిల్వ చేసుకోవాలి. కిటుకు: పాకంలో నెయ్యి వేసి కలిపితే చిక్కీ చూపడటానికి అందంగా ఉంటుంది. అటుకుల పులిహోర కావలసినవి: అటుకులు – 2 కప్పులు; చింతపండు – పెద్ద నిమ్మకాయంత; వేయించిన పల్లీలు – ఒక టేబుల్ స్పూను; వేయించిన జీడి పప్పులు – 15; నూనె – 2 టేబుల్ స్పూన్లు; ఇంగువ – అర టీ స్పూను; పచ్చి సెనగ పప్పు – 2 టీ స్పూన్లు; మినప్పప్పు – 2 టీ స్పూన్లు; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 10; తరిగిన పచ్చి మిర్చి – 6; కరివేపాకు – 4 రెమ్మలు; పసుపు–పావు టీ స్పూను; ఉప్పు – తగినంత. తయారీ: ∙చింతపండును రెండు కప్పుల నీళ్లలో అరగంట సేపు నానబెట్టాక, రసం తీయాలి ∙అటుకులను శుభ్రంగా కడిగి, చింతపండు రసంలో నానబెట్టాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, ఇంగువ, పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, పచ్చి మిర్చి, కరివేపాకు వేసి వేయించి తీసేయాలి ∙ఒక పాత్రలో... చింతపండులో నానబెట్టిన అటుకులు, పోపు, పసుపు, ఉప్పు వేసి గరిటెతో జాగ్రత్తగా కలియబెట్టి అరగంట తరవాత తింటే రుచిగా ఉంటుంది. కిటుకు: తగినంత చింతపండు రసం మాత్రమే తీసుకుంటే రుచిగా ఉంటుంది. -
కిచెన్ కుచేల
అటుకులు అతుకేసే స్నేహాన్ని మించిన స్నేహం లేదు. అంటే, పేదరికం స్నేహానికి అడ్డం రాదు. అంత పవిత్రమైంది అటుకుల స్నేహం. శ్రీకృష్ణుడిని కలవడానికి వెళ్లిన కుచేలుడు తీసుకెళ్లిన కానుక అటుకుల మూట. పంచభక్ష్య పరమాన్నాలు తినే శ్రీకృష్ణుడు అటుకులు తిని తన్మయత్వం చెందాడు. రేపు స్నేహితుల దినోత్సవం. అటుకులు పంచండి. స్నేహం పెంచండి. హాట్ పోహా! కావల్సినవి: అటుకులు–4 కప్పులు; పచ్చిమిర్చి – 2; ఎండుమిర్చి – 3; జీడిపప్పు – 3 టేబుల్ స్పూన్లు; శనగపప్పు – 5 టేబుల్‌స్పూన్లు; పుట్నాల పప్పు – 5 టేబుల్ స్పూన్లు; కరివేపాకు – 2 రెమ్మలు; పసుపు – అర టీ స్పూన్; ఉప్పు – టీ స్పూన్; ఆలివ్ నూనె–4 టేబుల్ స్పూన్లు తయారీ: ∙కడాయి పొయ్యి మీద పెట్టి నూనె వేసి వేడి చేయాలి ∙దీంట్లో పల్లీలు వేసి వేయించాలి ∙తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి, జీడిపప్పు వేసి వేయించాలి ∙ఆ తర్వాత కరివేపాకు, పసుపు, పుట్నాలపప్పు వేయించి మంట తగ్గించాలి ∙ఉప్పు కలిపి ఆ తర్వాత కప్పు అటుకులు వేసి కలపాలి ∙అటుకులకు పసుపు, నూనె పట్టిన తర్వాత మిగతా అటుకులు వేసి కలపాలి ∙ ఇలా చేయడం వల్ల మిగతా అటుకులకంతా పోపు మిశ్రమం బాగా పడుతుంది ∙5–8 నిమిషాల సేపు అలా సన్నని మంట మీద ఉంచి, అడుగుమాడకుండా మధ్య మధ్య కలుపుతూ ఉండాలి ∙తర్వాత మంట తీసేసి, చల్లారాక నిమ్మముక్కతో సర్వ్ చేయాలి. రోల్స్ కావల్సినవి: గుడ్డు – 1; అటుకులు – పావు కప్పు; బంగాళదుంప ముక్కలు – 100 గ్రాములు; పచ్చిమిర్చి – 2; పల్లీలు – 2 టేబుల్ స్పూన్లు; ఆమ్చూర్ – పావు టీ స్పూన్; గరం మసాలా – పావు టీ స్పూన్; కారం – పావు టీ స్పూన్; బ్రెడ్ క్రంబ్స్ – 2; నూనె – వేయించడానికి తగినంత; కొత్తిమీర – కొన్ని ఆకులు తయారీ: ∙బంగాళదుంపపై పొట్టు తీసి, ఉడకబెట్టాలి ∙తర్వాత గరిటతో గుజ్జులా చేయాలి ∙అటుకులను కడిగి, జల్లెడలో పోయాలి ∙కడాయిలో నూనె పోసి, స్టౌ మీద పెట్టి పల్లీలు వేయించాలి ∙దీంట్లో అటుకులు, పల్లీలు, మిర్చి, కరివేపాకు, మెత్తగా చేసిన బంగాళదుంపల గుజ్జు వేసి బాగా కలపాలి ∙ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ చేత్తో రోల్లా చేయాలి ∙ పొయ్యిమీద కడాయి పెట్టి నూనె పోసి కాగనివ్వాలి ∙సిద్ధంగా ఉంచుకున్న అటుకుల రోల్స్‌ని గుడ్డు సొనలో ముంచి, కాగుతున్న నూనెలో వేసి అన్ని వైపులా వేయించాలి ∙టొమాటో సాస్ లేదా పచ్చడితో వేడి వేడిగా వడ్డించాలి. కట్లెట్ కావల్సినవి: అటుకులు – కప్పు; శనగపిండి – 2 1/2 కప్పులు; క్యాప్పికమ్ తరుగు – పావు కప్పు; అల్లం ముద్ద – అర టీ స్పూన్; పచ్చిమిర్చి పేస్ట్ – అర టీ స్పూన్; కారం – టీ స్పూన్; నిమ్మరసం – అర టీ స్పూన్; ఇంగువ – చిటికెడు; జీలకర్ర – 1/4 టీ స్పూన్; కొత్తిమీర – పావు కప్పు; పుదీనా ఆకులు – కొన్ని (తరగాలి); టీ స్పూన్ – పంచదార; ఉప్పు – తగినంత; నూనె – వేయించడానికి తగినంత తయారీ: ∙అటుకులను కడిగి 2 నిమిషాలు జల్లెడలో నీళ్లన్నీ పోయేదాక ఉంచాలి ∙ఒక గిన్నెలో మిగిలిన దినుసులు, పిండి అన్నీ వేసి కలపాలి ∙దీంట్లో అటుకులు కూడా వేసి బాగా కలిపి ముద్దలా చేయాలి ∙సుమారు 8 నుంచి 10 చిన్న చిన్న ఉండలు చేసి, చేత్తో అదమాలి ∙పొయ్యి మీద కడాయి పెట్టి, నూనె పోసి కాగనివ్వాలి ∙దీంట్లో సిద్ధం చేసుకున్న పట్టీలను వేసి రెండువైపులా ముదురు గోధుమరంగు వచ్చేవరకు వేయించి తీయాలి ∙పుదీనా లేదా టోమాటో చట్నీ లేదా కెచప్‌తో వేడి వేడిగా అటుకుల కట్లెట్ను సర్వ్ చేయాలి. లడ్డు కావల్సినవి అటుకులు – కప్పు; బెల్లం – ముప్పావు కప్పు; యాలకులు – 2 (పొడి చేయాలి); ఎండుకొబ్బరి తురుము – అర కప్పు; నెయ్యి – పావు కప్పు; జీడిపప్పు – 10; కిస్మిస్ – 10 తయారీ : అటుకులను వేయించాలి. దీంట్లో కొబ్బరి తురుము కలిపి సన్నని మంట మీద మళ్లీ కొద్దిగా వేయించాలి సువాసన వస్తుండగా మంట తీసేసి చల్లారనివ్వాలి ∙యాలకుల పొడి, బెల్లం కలిపి మిక్సర్‌లో బ్లెండ్ చేయాలి ∙ఈ మిశ్రమాన్ని ప్లేట్లోకి తీసుకోవాలి ∙పాన్‌లో నెయ్యి, జీడిపప్పులు వేయించిన తర్వాత కిస్మిస్ వేసి మంట తీసేయాలి ∙దీంట్లో మిగిలినవన్నీ వేసి కలపాలి చిన్న చిన్న ముద్దలు తీసుకొని, బాల్స్ చేయాలి ∙ దీంట్లో వేయించిన ఇతర నట్స్ కూడా కలుపుకోవచ్చు ∙త్వరగా, సులువుగా, రుచిగా ఈ లడ్డూలను తయారుచేసుకోవచ్చు. స్వీట్ పోహా! కావల్సినవి : అటుకులు – కప్పు; బెల్లం – అర కప్పు; యాలకుల పొడి – పావు టీ స్పూన్; కొబ్బరిపొడి – 2 టేబుల్ స్పూన్లు; జీడిపప్పులు – 8 (సగం పలుకుగా చేయాలి); బాదం పప్పులు – 7 (సన్నగా తరగాలి); నెయ్యి – అర టేబుల్ స్పూన్లు. తయారీ: ∙అటుకులను కడిగి, జల్లిలో వేసి, పూర్తిగా నీళ్లు పోయాక గిన్నెలోకి తీసుకోవాలి ∙వీటిపైన మళ్లీ 2 టేబుల్ స్పూన్ల నీళ్లు చల్లాలి పది నిమిషాల తర్వాత పొయ్యిమీద మూకుడు పెట్టి, దాంట్లో నెయ్యి వేసి వేడయ్యాక జీడిపప్పు, బాదం పలుకులు వేయించాలి ∙దీంట్లో కొబ్బరి పొడి, యాలకుల పొడి వేసి కలపాలి ∙అర కప్పు నీళ్లలో బెల్లం వేసి కరిగించాలి. సన్నని మంట మీద 8 నిమిషాల సేపు ఉంచితే బెల్లం పూర్తిగా కరుగుతుంది ∙ఈ బెల్లం పాకంలో నానిన అటుకులు, కొబ్బరి తురుము, వేయించిన నట్స్ వేసి కలపాలి ∙వడ్డించే ముందు మరిన్ని నట్స్ వేసుకోవచ్చు ∙ఎండుకొబ్బరి బదులుగా పచ్చికొబ్బరి తురుము కూడా వాడుకోవచ్చు. దద్ద్యోజనం కావల్సినవి : అటుకులు – కప్పు; పెరుగు – 3 కప్పులు; ఆవాలు – టీ స్పూన్; మినప్పప్పు – టేబుల్ స్పూన్; శనగపప్పు – టేబుల్ స్పూన్; ఎండుమిర్చి – 3; నూనె – టేబుల్ స్పూన్; కరివేపాకు – రెమ్మ; ఉప్పు – తగినంత తయారీ: ∙అర టీ స్పూన్ ఉప్పు 2 కప్పుల నీళ్ళలో కలిపి, అటుకులు నిమిషంసేపు నానబెట్టాలి ∙తర్వాత అటుకులను వడకట్టాలి పెరుగును గరిటతో మృదువుగా అయ్యేంత వరకు చిలికి, కొద్దిగా ఉప్పు కలపాలి ∙మందపాటి గిన్నె పొయ్యి మీద పెట్టి నూనె వేసి వేడి చేయాలి ∙దీంట్లో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, పల్లీలు వేయించి మంట తీసేయాలి ఎండుమిర్చి, కరివేపాకు వేసి కలిపి 10–20 సెకన్లు అలాగే ఉంచాలి ∙దీంట్లో నానబెట్టిన అటుకులు, పెరుగు వేసి కలపాలి ∙కావాలనుకుంటే పోపులో పావు టీ స్పూన్ శొంఠి వేసుకోవచ్చు. దోసె కావల్సినవి: బాయిల్డ్ రైస్ – కప్పు; అటుకులు – అర కప్పు; మినప్పప్పు – 2 టేబుల్ స్పూన్లు; మజ్జిగ – కప్పు; బేకింగ్ సోడా – పావు టీ స్పూన్; ఉప్పు – టీ స్పూన్; నూనె – తగినంత తయారీ: ∙బియ్యం కడిగి నీళ్లుపోసి నానబెట్టాలి ∙మరోగిన్నెలో అటుకులు, మినప్పప్పు వేసి నీళ్లతో కడిగి వడబోయాలి ∙దీంట్లో మజ్జిగను కలిపి 3 గంటల సేపు నానబెట్టాలి ∙ముందుగా బియ్యం, తర్వాత నీళ్లను వడకట్టి అటుకుల మిశ్రమం మిక్సర్జార్లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి ∙పిండిని గిన్నెలోకి తీసుకున్న తర్వాత బేకింగ్ సొడా, ఉప్పు కలపాలి ∙4 గంటలసేపు పిండిని అలాగే ఉంచి, ఆ తర్వాత దోసెలు వేసుకోవాలి ∙పొయ్యి మీద నాన్‌స్టిక్ పెనం పెట్టి, పైన 2–3 చుక్కల నూనె వేసి మెత్తటి బ్రష్ లేదా గుడ్డతో తుడిచేయాలి ∙తర్వాత గుంట గరిటతో పిండి తీసుకొని పెనం మీద వేసి, ఆ పైన గుండ్రంగా పిండి విస్తరించేలా గరిటను తిప్పాలి తర్వాత దోసె చుట్టూత నూనె వేసి, కాలనివ్వాలి ∙ఇష్టాన్ని బట్టి రెండో వైపు కూడా కాల్చుకోవాలి. కొబ్బరి పచ్చడి లేదా సాంబార్‌తో వడ్డించాలి.