beats to death
-
కరోనాను జయించాడు.. కానీ!
సియాటిల్: అమెరికాలోని సియాటిల్‌కు చెందిన మైఖేల్ ఫ్లార్ పేరు మీద ఇప్పుడు చాలా రికార్డులున్నాయి. ఒకటి, ఆయన 70 ఏళ్ల వయస్సులో కరోనాను జయించారు. రెండు, చాలా ఎక్కువ కాలం కోవిడ్–19తో పోరాడి, మృత్యువుపై విజయం సాధించారు. మూడు, కరోనా చరిత్రలోనే అత్యధిక మొత్తం బిల్‌ను ఆసుపత్రి నుంచి పొందారు. ఫ్లార్కు చికిత్స అందించిన ఇసాఖ్లోని స్వీడిష్ మెడికల్ సెంటర్, ఆయన చికిత్సకుగానూ 1.1 మిలియన్ డాలర్ల బిల్లు వేసింది. అంటే మన రూపాయల్లో దాదాపు 8.35 కోట్లు. మరో రికార్డు కూడా ఉంది. ఆయన చికిత్స, అందుకైన ఖర్చు వివరాలను మొత్తం 181 పేజీల్లో పొందుపరిచి, ఒక పుస్తకంలా ఆయనకు అందించారు. ఫ్లార్ దాదాపు మృత్యు ముఖం వరకు వెళ్లి వచ్చాడు. ప్రాణాలతో బయటపడే అవకాశాలు లేవని డాక్టర్లు భార్య, పిల్లలకు చెప్పేశారు. నైట్ డ్యూటీ నర్స్ చివరి కాల్ అని చెప్పి, కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడించింది. కానీ, కరోనాకు అంత ఈజీగా లొంగిపోదలచుకోలేదు ఫ్లార్. కరోనాతో 62 రోజుల పాటు పోరాడి విజయం సాధించాడు. ఆయనను వైద్యులు, ఇతర పేషెంట్లు అంతా ‘మిరాకిల్ చైల్డ్’ అనడం ప్రారంభించారు. డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చిన తరువాత.. 181 పేజీల పుస్తకాన్ని ఆసుపత్రి సిబ్బంది ఆయనకు పంపించారు. ఆ పుస్తకంలో చికిత్సకు సంబంధించిన పూర్తి వివరాలతో పాటు 1.1 మిలియన్ డాలర్ల బిల్లు వివరాలు కూడా ఉన్నాయి. ఆ భారీ బిల్లు చూసి ఫ్లార్ అవాక్కయ్యారు. బిల్లు చూసి హార్ట్ అటాక్ వచ్చినంత పనయిందన్నారు. ‘బిల్లు భారీగా ఉంటుందనుకున్నాను కానీ.. ఇంత భారీగా ఉంటుందనుకోలేద’న్నారు. ఐసీయూలో ఫ్లార్ ఉన్న గది అద్దె రోజుకు 9,736 డాలర్లు. ఆ ఐసోలేషన్ చాంబర్లో ఆయన 42 రోజులున్నారు. అలాగే, 29 రోజులు వెంటిలేటర్‌పై ఉన్నారు. ఆ బిల్లు రోజుకు 2,835 డాలర్లు. మెడిసిన్స్ ఖర్చు మొత్తం బిల్లులో దాదాపు నాలుగో వంతు. కిడ్నీలు, గుండె, ఊపిరితిత్తులు.. ఇలా మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ దిశగా వెళ్తున్న సమయంలో రెండు రోజుల పాటు అందించిన చికిత్స ఖర్చు లక్ష డాలర్లు. ఇలా అన్ని కలిసి మొత్తం బిల్లు 11 లక్షల డాలర్లయింది. అదృష్టవశాత్తూ, ఫ్లార్కు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది. దాంతో, బిల్లులో ఎక్కువ భాగం చెల్లించాల్సిన పనిలేదు. అలాగే, అది కోవిడ్–19 కనుక మొత్తం బిల్లు చెల్లించాల్సిన అవసరం రాకపోవచ్చు. బిల్లును చూడగానే ఎలా ఫీల్ అయ్యారన్న ప్రశ్నకు.. ‘బతికినందుకు సిగ్గుగా అనిపించింది’అని జవాబిచ్చారు ఫ్లార్. -
ప్రాణం తీసిన రూ.180
లక్నో: డబ్బు.. మనుషులను రాక్షసులను చేస్తుందనడానికి ఈ ఘటనే నిదర్శనం. బిల్లు చెల్లించలేదనే కోపంతో ఓ హోటల్ యజమాని కస్టమర్‌ను చంపేశాడు. ఉత్తరప్రదేశ్‌లోని బాదోమీ జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. సూరజ్ సింగ్, విశాల్ దూబే అనే యువకులు భోజనం కోసం ఓ హోటల్‌కు వెళ్లారు. భోజనం తర్వాత వెయిటర్ వారికి రూ.180 బిల్లు ఇచ్చాడు. అయితే తాము తిన్న భోజనానికి ఎక్కువ బిల్లు వేశారంటూ సూరజ్, విశాల్‌లు హోటల్ యజమానితో వాగ్వాదానికి దిగారు. ఈ గొడవ కాస్తా పెద్దదై కొట్టుకొనేవరకు వెళ్లింది. ఆగ్రహించిన హోటల్ యజమాని గుర్మయిల్, అతడి కుమారుడు సురేంద్ర సింగ్‌లు, సిబ్బందితో కలిసి కర్రలు, ఇనుప రాడ్లతో విశాల్, సూరజ్‌లపై దాడి చేశారు. ఈ ఘటనలో విశాల్ అక్కడ నుంచి తప్పించుకోగా.. సూరజ్‌ను తీవ్రంగా కొట్టారు. గాయాలతో కదల్లేని పరిస్థితిలో ఉన్న సూరజ్‌ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుర్మయిల్, సురేంద్ర సింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. దాడి చేసిన ఇద్దరు వెయిటర్లు పరారిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
తల్లికోసం బలైపోయిన నవజోత్
సాక్షి, అంబాలా: హరియాణాలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో విచక్షణ మరిచిపోయి కన్న కొడుకునే హత్య చేసిన ఘటన కలకలం రేపింది. అదీ తల్లిని రక్షించబోయిన కుమారుడు దారుణ హత్యకు గురి కావడం విషాదాన్ని నింపింది. అంబాలా నగరంలో బుధవారం రాత్రి ఈ విషాదం చోటు చేసుకుంది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం తప్పతాగి వచ్చిన నిందితుడు జోరావార్ సింగ్ భార్యపై గొడవపడి అనంతరం దాడికి దిగాడు. విచక్షణా రహితంగా తల్లిని కొడుతూ వుండటంతో అక్కడే ఉన్న కొడుకు నవజోత్ (17) తండ్రిని నిలువరించే ప్రయత్నం చేశాడు. దీంతో ఆవేశంలో కత్తితో కొడుకుపై దాడి చేశాడు. మెడపై అనేక సార్లు పొడిచాడు. ఇరుగు పొరుగువారు వచ్చి బాధితుడిని ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యలోనే నవజోత్ ప్రాణాలు కోల్పోయాడు. బాధితుల ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మెడపై తీవ్ర గాయం కావడంతో నవజోత్ మరణించాడని పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడన్నారు. కాగా తన సోదరుడు పార్ట్‌టైం జాబ్ చేస్తూ కుటుంబానికి ఆర్థికంగా సహాయపడేవాడని నవజోత్ సోదరి కన్నీటి పర్యంతమైంది. తన తండ్రి తాగి వచ్చి తరచూ తల్లితో గొడవపడేవాడని వాపోయింది. -
అమ్మను కొట్టాడని.. నాన్ననే చంపేశాడు!!
కన్న తండ్రిని కర్రతో కొట్టి చంపాడో యువకుడు. కానీ ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలుసా? తల్లి అంటే దైవంతో సమానం. ఆ దైవం లాంటి తల్లిని ఎవరైనా ఒక్క మాట అన్నా భరించలేం. అలాంటిది ఏకంగా రక్తం వచ్చేలా కొట్టారంటే సహించగలమా? అందుకే తమిళనాడులో ఓ విద్యార్థి అంత ఆవేశానికి వచ్చాడు. అతడి పేరు జ్ఞాన సుందరం. వయసు 22 సంవత్సరాలు. ఓ కాలేజీలో చదువుతున్నాడు. కాలేజీ నుంచి ఇంటికి వచ్చి చూసేసరికి తల్లి ముక్కు నుంచి రక్తం కారుతోంది. ఏంటని అడిగితే, మీ నాన్న కొట్టారు, అందుకే రక్తం వస్తోందని చెప్పిందామె. ఇద్దరి మధ్య చిన్న విషయమై గొడవ జరగడంతో ఆ పెద్దమనిషి తన భార్యను కొట్టాడు. విషయం తెలిసిన జ్ఞానసుందరానికి పట్టలేని ఆవేశం వచ్చేసింది. పక్కనే ఉన్న కర్ర తీసుకుని మళ్లీ అమ్మను కొడతావా అంటూ బాదడం మొదలుపెట్టాడు. కానీ, అతడు ఆపేసరికి చూస్తే.. ఆ తండ్రి చనిపోయాడు! దీంతో పోలీసులు జ్ఞాన సుందరంపై హత్యాభియోగం మోపి, అతడిని అరెస్టు చేశారు.