తల్లికోసం బలైపోయిన నవజోత్‌ | Ambala man beats wife, stabs son to death as he tried to save his mother | Sakshi
Sakshi News home page

తల్లికోసం బలైపోయిన నవజోత్‌

Published Thu, Aug 2 2018 8:20 PM | Last Updated on Tue, Oct 9 2018 5:39 PM

Ambala man beats wife, stabs son to death as he tried to save his mother - Sakshi

సాక్షి, అంబాలా: హరియాణాలో దారుణం చోటు చేసుకుంది.  మద్యం మత్తులో విచక్షణ  మరిచిపోయి కన్న కొడుకునే హత్య చేసిన ఘటన కలకలం  రేపింది. అదీ తల్లిని రక్షించబోయిన కుమారుడు దారుణ హత్యకు గురి కావడం విషాదాన్ని నింపింది.  అంబాలా నగరంలో బుధవారం  రాత్రి ఈ విషాదం చోటు చేసుకుంది. 

పోలీసులు అందించిన సమాచారం  ప్రకారం తప్పతాగి వచ్చిన నిందితుడు జోరావార్‌ సింగ్‌ భార్యపై గొడవపడి అనంతరం దాడికి దిగాడు.  విచక్షణా రహితంగా తల్లిని కొడుతూ వుండటంతో అక్కడే  ఉన్న కొడుకు నవజోత్‌ (17) తండ్రిని నిలువరించే ప్రయత్నం చేశాడు.   దీంతో ఆవేశంలో కత్తితో  కొడుకుపై దాడి చేశాడు.  మెడపై అనేక సార్లు పొడిచాడు.   ఇరుగు పొరుగువారు వచ్చి బాధితుడిని ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యలోనే నవజోత్‌ ప్రాణాలు కోల్పోయాడు.   

బాధితుల ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు  చేస్తున్నారు. మెడపై తీవ్ర  గాయం కావడంతో నవజోత్‌ మరణించాడని పోలీసులు  వెల్లడించారు.  ప్రస్తుతం నిందితుడు పరారీలో  ఉన్నాడన్నారు. కాగా  తన  సోదరుడు పార్ట్‌టైం జాబ్‌ చేస్తూ కుటుంబానికి ఆర్థికంగా  సహాయపడేవాడని నవజోత్‌  సోదరి కన్నీటి పర్యంతమైంది.  తన తండ్రి తాగి వచ్చి  తరచూ తల్లితో  గొడవపడేవాడని వాపోయింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement