అమ్మను కొట్టాడని.. నాన్ననే చంపేశాడు!! | College student kills father in tamilnadu | Sakshi
Sakshi News home page

అమ్మను కొట్టాడని.. నాన్ననే చంపేశాడు!!

Published Tue, Feb 11 2014 3:03 PM | Last Updated on Mon, Jul 29 2019 5:43 PM

College student kills father in tamilnadu

కన్న తండ్రిని కర్రతో కొట్టి చంపాడో యువకుడు. కానీ ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలుసా? తల్లి అంటే దైవంతో సమానం. ఆ దైవం లాంటి తల్లిని ఎవరైనా ఒక్క మాట అన్నా భరించలేం. అలాంటిది ఏకంగా రక్తం వచ్చేలా కొట్టారంటే సహించగలమా? అందుకే తమిళనాడులో ఓ విద్యార్థి అంత ఆవేశానికి వచ్చాడు. అతడి పేరు జ్ఞాన సుందరం. వయసు 22 సంవత్సరాలు. ఓ కాలేజీలో చదువుతున్నాడు.

కాలేజీ నుంచి ఇంటికి వచ్చి చూసేసరికి తల్లి ముక్కు నుంచి రక్తం కారుతోంది. ఏంటని అడిగితే, మీ నాన్న కొట్టారు, అందుకే రక్తం వస్తోందని చెప్పిందామె. ఇద్దరి మధ్య చిన్న విషయమై గొడవ జరగడంతో ఆ పెద్దమనిషి తన భార్యను కొట్టాడు. విషయం తెలిసిన జ్ఞానసుందరానికి పట్టలేని ఆవేశం వచ్చేసింది. పక్కనే ఉన్న కర్ర తీసుకుని మళ్లీ అమ్మను కొడతావా అంటూ బాదడం మొదలుపెట్టాడు. కానీ, అతడు ఆపేసరికి చూస్తే.. ఆ తండ్రి చనిపోయాడు! దీంతో పోలీసులు జ్ఞాన సుందరంపై హత్యాభియోగం మోపి, అతడిని అరెస్టు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement