Bedrooms
-
‘ఇక నిద్ర పోండి’, ట్విటర్ ఆఫీస్‌లో ఎలాన్ మస్క్ సరికొత్త ప్రయోగం!
సీఈవో ఎలాన్ మస్క్ ట్విటర్ కార్యాలయాన్ని ఉద్యోగులు నిద్రపోయేలా మార్పులు చేర్పులు చేసినట్లు తెలుస్తోంది. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం..శాన్ఫ్రాన్సిస్కో మార్కెట్ స్ట్రీట్ 900లో ఉన్న ప్రధాన కార్యాలయంలో ట్విటర్ మొత్తం 7 ఫ్లోర్లలో కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఇప్పుడు అదే ఆఫీస్‌లో ఉద్యోగుల కోసం ఒక్కో ఫ్లోర్లో 4 నుంచి 8 బెడ్ రూమ్ పాడ్స్‌ను ఏర్పాటు చేసింది. దీంతో పాటు చిన్న చిన్న రూములుగా విభజించి ఉద్యోగులకు బెడ్స్,కర్టన్లు, టెలిప్రెసెన్స్ మానిటర్స్‌తో కాన్ఫరెన్స్ రూమ్ తరహాలో డిజైన్ చేసినట్లు ఫోర్బ్స్ నివేదిక వెల్లడించింది. అయితే ట్విటర్ ఆఫీస్‌ను మస్క్ ఇలా ఎందుకు మార్చారనేది స్పష్టలేదు. కానీ కొద్దిరోజుల క్రితం మస్క్ ఉద్యోగులకు అల్టిమేటం జారీ చేసిన విషయం తెలిసిందే. ఆర్ధిక అనిశ్చితి నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు ప్రారంభించిన మస్క్..ఉద్యోగులు నిద్రాహారాలు పని చేయాలని కోరారు. కోరడమే కాదు ఉద్యోగుల నుంచి మెయిల్ రూపంలో హామీ కూడా తీసుకున్నారు. హార్డ్ కోర్ ఉద్యోగులైతే తన మెయిల్‌కు ఎస్ అని మాత్రమే రిప్లయి ఇచ్చేలా ఆప్షన్ ఇచ్చారు. అందుకు సిద్ధంగా ఉన్న ఉద్యోగులు రోజుకు 12గంటలు సంస్థ కోసం వెచ్చించాలని లేదంటే దివాలా తీసే అవకాశం ఉందని హెచ్చరించారు. రిప్లయి ఇవ్వని ఉద్యోగులు మూడు నెలల నోటీస్ పీరియడ్‌తో సంస్థను వదిలి వెళ్లాలని చెప్పారు. ఈ నేపథ్యంలో ట్విటర్ ఆఫీస్‌ను బెడ్రూమ్లుగా మార్చడం ఆసక్తికరంగా మారింది. సంస్థ కోసం రేయింబవళ్లు శ్రమిస్తున్న ఉద్యోగులు అక్కడే నిద్ర పోయేలా ఏర్పాట్లు చేసినట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు పేర్కొన్నాయి. -
యాదాద్రిలో నీటమునిగిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు
సాక్షి, యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లాలో రాత్రి నుండి తెల్లవారుజామున వరకు కురిసిన కుండపోత వర్షానికి ఆలేరు నియోజకవర్గంలోని వాగులు, వంకలు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. యాదగిరిగుట్ట మండలం వంగపల్లిలో వరద ఉధృతికి కొత్తగా నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్లు నీటమునిగాయి. రాత్రి నుండి కురిసిన భారీ వర్షానికి ఎగువ ప్రాంతం నుండి భారీగా వరదనీరు చేరుకోవడంతో డబుల్ బెడ్రూం ఇండ్ల గ్రౌండ్ ఫ్లోర్ సగం వరకు నీట మునిగింది. యాదగిరి పల్లి నుండి యాదగిరిగుట్ట వచ్చే రహదారిపై నీరు ప్రవహిస్తూ ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యాదగిరి గుట్ట మున్సిపాలిటీ లోని యాదగిరిపల్లి లో పలు కాలనీలలో కొత్తగా నిర్మిస్తున్న రోడ్డు వర్షానికి కొట్టుకుపోవడంతో కాలనీవాసులు అవస్థలు పడుతున్నారు. బిక్కేరు వాగు ఉధృతితో కొరటికల్-మురిపిరాల గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం లింగంపేట, నాగిరెడ్డిపేట, సదాశివనగర్, రామారెడ్డి మండలాల్లో భారీ వర్షం కురుస్తోంది. రంగారెడ్డి: కుండపోత వర్షాలతో రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలంలోని లోతట్టు ప్రాంతాలు ప్రాంతాల్లన్ని జలమయ్యాయి. లెనిన్ నగర్, ప్రశాంత్ నగర్, సాయి నగర్, మితులా నగర్, కాలనీల్లన్నీ నీటమునిగాయి. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో నిత్యవసర సరుకులన్ని తడిసిపోయాయి. -
‘డబుల్బెడ్రూం’ నిర్మాణాలు వేగవంతం చేయాలి
ఆర్డీవో చంద్రశేఖర్ చిగురుమామిడి : డబుల్బెడ్రూం ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని కరీంనగర్ ఆర్డీవో చంద్రశేఖర్ సూచించారు. మండలంలోని చిన్నముల్కనూర్ గ్రామాన్ని గురువారం ఆయన సందర్శించారు. గ్రామంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్లను పరిశీలించి త్వరగా పూర్తయ్యేలా వర్కర్లను నియమించుకోవాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. అనంతరం మండలంలోని ఇందుర్తిలో నిర్వహిస్తున్న ఆర్ఓఆర్ మోటేషన్ ప్రక్రియను పరిశీలించారు. నిబంధనల ప్రకారం ఉన్న దరఖాస్తులను పరిశీలించి తక్షణమే అమలు చేయాలని తహసీల్దార్ రాజాగౌడ్‌కు సూచించారు. కార్యక్రమంలో ఆర్ఐ అక్బర్, ఉపసర్పంచ్ చింతపూల నరేందర్, వార్డు సభ్యుడు బందెల శ్రీనివాస్, తదితరులున్నారు. కాగా ఇందుర్తి జెడ్పీ పాఠశాలలో కొన్నేళ్లుగా ఒకటే గ్రూపు వంట చేస్తుందని, వారిని తక్షణమే తొలగించాలని కొందరు మహిళలు ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. పరిశీలించి చర్యలు తీసుకుంటానని ఆయన వారికి హామీ ఇచ్చారు. -
ఓ టూరేద్దాం..
ఐఆర్సీటీసీ వేసవి ప్యాకేజీలు సిద్ధం ఢిల్లీ నుంచి ‘మహారాజా’ పయనం సిటీబ్యూరో: వేస‘విహారాని’కి ఐఆర్సీటీసీ ప్రత్యేక పర్యాటక ప్యాకేజీలను సిద్ధం చేసింది. విద్యార్థులు, ఉద్యోగులు, వివిధ వర్గాల పర్యాటకుల అభిరుచికి అనుగుణమైన ప్యాకేజీలను ప్రకటించింది. మండుటెండల్లో ఇంటిల్లిపాదీ కలిసి హాయిగా గడిపేందుకు అనువైన కూల్ ట్రిప్స్ కూడా ఈ పర్యటనల్లో ఉన్నాయి. ప్యాకేజీల వివరాలను ఐఆర్‌సీటీ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎన్.సంజీవయ్య బుధవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ప్యాకేజీల వివరాలు.. జమ్ము నుంచి కాట్రా, శ్రీనగర్, గుల్మార్గ్, సోన్మార్గ్, పహల్గామ్ తదితర ప్రాంతాల్లో పర్యటించి తిరిగి జమ్ముకు అక్కడి నుంచి హైదరాబాద్‌కు చేరుకుంటారు. మొత్తం 8 రాత్రులు, 9 పగళ్లు కొనసాగుతుంది. ఈ పర్యటనకు ఒక్కొక్కరికి రూ. 15,890 చార్జీ ఉంటుంది.మాతా వైష్ణోదేవి యాత్రా పర్యటన.. జమ్ము, శ్రీనగర్, గుల్మార్గ్, శ్రీనగర్ ప్రాంతాల్లో 7 రాత్రులు, 8 పగళ్లు పర్యటన ఉంటుంది. చార్జీ రూ.15,020.జన్మత్-ఇ కశ్మీర్ మాతా వైష్ణోదేవి ఆలయ పర్యటనలో శ్రీనగర్ నుంచి బయలుదేరి జమ్ము చేరుకుంటారు. 7 రాత్రులు, 8 పగళ్లకు రూ.14,480 చార్జీ. డిస్కవర్ అమేజింగ్ కాశ్మీర్ ప్యాకేజీలో శ్రీనగర్, గుల్మార్గ్, పహల్గామ్, సోన్మార్గ్ పర్యటన ఉంది. 5 రాత్రులు, 6 పగళ్లకు రూ.10,910 చార్జీ ఉంది. నార్త్ ఈస్ట్ డిలైట్స్ ప్యాకేజీలో న్యూ జుల్పాయ్‌గురి, బడోగ్రా, డార్జిలింగ్, పెలింగ్, గ్యాంగ్‌టక్, కలింపాంగ్ తదితర ప్రాంతాల్లో పర్యటించి తిరిగి న్యూ జల్పాయ్గురి చేరుకుంటారు. చార్జీ రూ. 20,217. ది స్ప్లెండర్స్ ఆఫ్ నార్త్ ఈస్ట్ మరో టూరిజం ప్యాకేజీ. న్యూ జల్పాయ్గురి, బడోగ్రా, డార్జిలింగ్, గ్యాంగ్‌టక్, కలింపాంగ్ తదితర ప్రాంతాల్లో పర్యటన కొనసాగుతుంది. చార్జీ రూ.16,001. హిమాచల్ పర్యటన సికింద్రాబాద్ నుంచే ప్రారంభమవుతుంది. ఇందులో సిమ్లా, కుఫ్రీ, కులు-మనాలి, రోహ్తక్ పాస్, చండీఘర్ ప్రాంతాల్లో పర్యటిస్తారు. ఒక్కొక్కరికి రూ.11,740 చార్జీ ఉంటుంది. ‘మహారాజా’లో ప్రయాణం.. ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన ట్రైన్‌గా ప్రసిద్ధి చెందిన ‘మహారాజా ఎక్స్‌ప్రెస్’లో కూడా పర్యటించవచ్చు. విశాలమైన బెడ్రూమ్స్, డైనింగ్ హాళ్లు, బార్ అండ్ రెస్టారెంట్లు, కాన్ఫరెన్స్ హాళ్లు వంటి సకల సదుపాయాలు ఇందులో ఉన్నాయి. న్యూఢిల్లీ కేంద్రంగా వివిధ పర్యాటక ప్రాంతాలకు ఇది రాకపోకలు సాగిస్తుంది. విదేశీ టూరిస్టులు ఎక్కువగా ఈ ట్రైన్లో పర్యటిస్తారు. ముంబయి, అజంతా, ఉదయ్‌పూర్, జోధ్‌పూర్, బికనీర్, జైపూర్, రణతంబోర్, ఆగ్రా, ఢిల్లీల్లో 8 పగళ్లు, 7 రాత్రులు పర్యటన ఉంటుంది. ఈ-కేటరింగ్ సదుపాయం దక్షిణ మధ్య రైల్వేలోని అన్ని ఏ, ఏ-1 కేటగిరీ రైల్వేస్టేషన్లో ప్రయాణికులు కోరుకున్న ఆహార పదార్థాలను అందించేందుకు ఐఆర్సీటీసీ ఏర్పాట్లు చేసింది. టిక్కెట్ బుకింగ్‌తో పాటే ఐర్సీటీసీ వెబ్సైట్లో ఈ కేటరింగ్ ఆర్డర్ ఇవ్వవచ్చు. ట్రైన్ నుంచి క్యాబ్ సర్వీస్ కూడా ఉంది. -
'అందరి ఇళ్లలోకి వెళ్లి చూడలేం కదా..'
న్యూఢిల్లీ: అశ్లీల వెబ్ సైట్లను నిషేధించడంపట్ల ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వివరణ ఇచ్చింది. ప్రతి ఒక్కరి ఇళ్లలోకి వెళ్లి తాము చూడలేము కదా అని అభిప్రాయపడుతూ పిల్లలకు సంబంధించిన అశ్లీల వెబ్ సైట్లను తప్పకుండా నిషేధించాల్సిందేనని సుప్రీంకోర్టుకు తెలిపింది. కేంద్ర ప్రభుత్వం తరుపున అటార్నీ జనరల్ ముఖుల్ రోహత్గీ సుప్రీంకోర్టు హాజరై అశ్లీల వెబ్ సైట్లను నిషేధించడం పట్ల సమాజంలోగానీ, పార్లమెంటులోగానీ భారీ స్ధాయిలో చర్చ జరగాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. గత వారం మొత్తం 850 పోర్న్ సైట్లను కేంద్ర ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. దీనిపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర వ్యతిరేకత రాగా కొంతమేరకు నిషేధం ఎత్తివేశారు. అయితే, పోర్న్ సైట్లను నిషేధించడం పట్ల కొందరు వ్యక్తులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా దీనిపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించిన నేపధ్యంలో ముఖుల్ రోహత్గీ వివరణ ఇచ్చారు.