begaluru
-
వామ్మో..! రాను రాను హోటల్లో ఆతిథ్యం ఇలా ఉంటుందా..!
బెంగళూరులోని ఒక హోటల్లోకి అడుగు పెట్టిన అనన్య నారంగ్‌కు రిసెప్షనిస్ట్ స్వాగతం పలికింది. అనన్యలో షాక్‌లాంటి ఆశ్చర్యం. ‘ఇందులో ఆశ్చర్యపోవాల్సింది ఏముంది!’ అనే కదా మీ డౌటు. అయితే సదరు ఈ రిసెప్షనిస్ట్ సాధారణ రిసెప్షనిస్ట్ కాదు... వర్చువల్ రిసెప్షనిస్ట్!‘సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా బెంగళూరులో వర్చువల్ రిసెప్షనిస్ట్’ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మన దేశంలో నవీన సాంకేతికత గురించి వివరంగా మాట్లాడుకునేలా చేస్తోంది. ‘సాంకేతికత సహాయంతో తక్కువ సిబ్బందితో ఎక్కువ పనులను ఏకకాలంలో సమన్వయం చేస్తున్నారు. సిలికాన్ వ్యాలీలో తప్ప మన దేశంలో ఎక్కడా ఇలాంటి దృశ్యం కనిపించదు’ అంటూ ఈ ‘వర్చువల్ రిసెప్షనిస్ట్’ ఫొటోని షేర్ చేసింది అనన్య. ‘ఎంత సాంకేతిక ప్రగతి’ అనే ప్రశంసల మాట ఎలా ఉన్నా... ‘అబ్బబ్బే! ఇదేం ప్రగతి. అందమైన మానవ రిసెప్షనిస్ట్ స్వాగతం పలకడానికి, వర్చువల్ రిసెప్షనిస్ట్ స్వాగతం పలకడానికి చా...లా తేడా ఉంటుంది’ అనే వాళ్లే ఎక్కువ! (చదవండి: నవరాత్రుల్లో గర్బా నృత్యం ఎందుకు చేస్తారో తెలుసా..!) -
చిత్తూరు జిల్లాలో ఐటీ కంపెనీ
సాక్షి,చిత్తూరు అర్బన్: చిత్తూరు జిల్లా ఎస్ఆర్ పురం సమీపంలోని కొట్టార్లపల్లెలో ఐటీ హబ్ ఏర్పాటు కానుంది. బెంగళూరుకు చెందిన స్మార్ట్ డీవీ గ్రూప్ ఆఫ్ టెక్నాలజీస్ ఆధ్వర్యంలో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ కంపెనీ ఏర్పాటుతో వచ్చే మూడేళ్లలో 3 వేల మందికి ఉపాధి లభించనుంది. ఇందుకు సంబంధించిన వివరాలను ఆ కంపెనీ అధినేత దీపక్‌కుమార్ తాల శనివారం చిత్తూరులో మీడియాకు వెల్లడించారు. కొట్టార్లపల్లె వద్ద 1.60 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐటీ కంపెనీని 20 వేల కోర్లతో క్లౌడ్ సర్వీస్‌తో ఏర్పాటు చేయనున్నట్టు ఆయన చెప్పారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి ఈనెల 14న భూమి పూజ చేస్తున్నామని, జూన్‌లో పనులు ప్రారంభించి, ఏడాదిలోపు నిర్మాణాలు పూర్తి చేస్తామని వివరించారు. ఇప్పటికే తమ కంపెనీలో తయారవుతున్న సెమీ కండక్టర్లు ప్రపంచంలోనే పేరున్న అన్ని ఎలక్ట్రానిక్స్‌లో ఉపయోగిస్తున్నారన్నారు. యాపిల్, ఐ వాచెస్, తోషిబా, శామ్సంగ్ ఉత్పత్తుల్లోను, కొన్ని దేశాల రక్షణ రంగ సంస్థల్లోను తమ ప్రొడక్టస్ ఉపయోగిస్తున్నారని చెప్పారు. తమ సంస్థకు అమెరికాలో 2, చైనాలో 1, ఇండియాలో 2 చోట్ల బ్రాంచ్‌లు ఉన్నాయని, జపాన్, సింగపూర్, రష్యాతో పాటు యూరప్ మొత్తం మార్కెటింగ్ చేస్తున్నామని వివరించారు. ఆయన వెంట ఆర్టీసీ వైస్ చైర్మన్ ఎంసీ విజయానందరెడ్డి ఉన్నారు. (చదవండి: నవరత్నాలు.. సుస్థిర అభివృద్ధికి మార్గాలు) -
ప్రాంగణ ఎంపికల్లో 10 మందికి ఉద్యోగాలు
ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్ : స్థానిక క్విస్ ఇంజినీరింగ్ కళాశాలలో బెంగళూరుకు చెందిన ప్రముఖ కార్పొరేట్ కంపెనీ క్రౌన్ ఇ ల్యాబ్స్ ఆధ్వర్యంలో నిర్వహించి న ప్రాంగణ ఎంపికల్లో 10 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. శని వారం ప్రారంభమైన క్యాంపస్ ఇంటర్వ్యూ లు ఆదివారంతో ముగిసాయి. ఇంజినీరింగ్ ఆఖరి సంవత్సరం చదువుతున్న ఈఈఈ, ఈసీఈ, సీఎస్ఈ, ఐటీ విభాగాల విద్యార్థులు ఇంటర్వ్యూల్లో పాల్గొన్నారు. శనివారం గ్రూప్ డిస్కషన్లో ప్రతిభ కనబరిచిన 47 మందికి ఆదివారం హెచ్ఆర్ రౌండ్ నిర్వహించారు. దానిలో అర్హత సాధించిన 15 మందికి టెక్నికల్ రౌండ్ నిర్వహించి ప్రతిభచూపిన 10 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేసినట్లు కళాశాల అధ్యక్షుడు నిడమానూరి నాగేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులను ఆయన అభినందించారు. రిక్రూట్మెంట్ కార్యక్రమంలో కంపెనీ ప్రతిని ధులు శృతి, హెచ్ఆర్ మేనేజర్, హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ మధుసూదన్ పాల్గొన్నారు. ముగిసిన వర్క్‌షాపులు... స్థానిక క్విస్ ఇంజినీరింగ్ కళాశాలలో ఫైనలియర్ మెకానికల్ విద్యార్థులు 110 మందికి ఐదు రోజులుగా నిర్వహిస్తున్న కటియా వర్క్‌షాప్ ఆదివారంతో ముగిసింది. చివరిరోజు కోయంబత్తూరుకు చెందిన ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ ప్రతినిధులు అబ్దుల్లా శివమణి ఆధ్వర్యంలో డాప్టింగ్, అడ్వాన్స్ పాట్డిజైన్, రిబ్, మల్టీసెక్షన్ తదితర అంశాలపై విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. అదే విధంగా ఆఖరి సంవత్సరం సివిల్ ఇంజినీరింగ్ విద్యార్థులు 60 మందికి 5 రోజులుగా నిర్వహిస్తున్న స్టాడ్ప్రో వర్క్‌షాప్ కూడా ఆదివారంతో ముగిసింది. ఈ వర్క్‌షాప్‌ను కోయంబత్తూరుకు చెందిన ప్రముఖ కంపెనీ ప్రతినిధులు నాగార్జున, కార్తీక్ నిర్వహించారు. ఆఖరి రోజు రెస్పాన్స్ స్పెక్ట్రమ్, ఎర్త్పాక్ (సెస్మిక్లోడ్స్) అనే అంశాలపై శిక్షణ ఇస్తూ విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు. -
రూట్ క్లియర్...
బళ్లారి బీజేపీ టికెట్ శ్రీరాములుకే నేడు పార్టీలో చేరిక మారుతున్న రాజకీయ సమీకరణలు బలోపేతమవుతున్న బీజేపీ అసెంబ్లీలోనూ పెరిగిన ‘కమలం’ బలం ఎనిమిది మందితో రెండో జాబితా రెడీ త్వరలో అధికారిక ప్రకటన సాక్షి ప్రతినిధి, బెంగళూరు : లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. బీజేపీ నుంచి వేరు కుంపటి పెట్టుకున్న మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప తిరిగి మాత ృ పార్టీలో చేరిన విధంగానే, బీఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు శ్రీరాములు కూడా ఆ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఢిల్లీలో గురువారం జరిగిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో పార్టీ అభ్యర్థిగా బళ్లారి నుంచి శ్రీరాములును ఎంపిక చేయాలని నిర్ణయిం చారు. జగదీశ్ శెట్టర్ శ్రీరాములు తరఫున అధిష్టానం వద్ద గట్టిగా వాదించినట్లు సమాచారం. ఆయనను పార్టీ అభ్యర్థిగా ప్రకటించకపోతే హై-క ప్రాంతంలో కనీసం ఐదారు స్థానాల ను కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరించినట్లు తెలిసింది. దీంతో అధిష్టానం ఆయనకు టికెట్టును ఖరారు చేసినట్లు తెలిసింది. దీంతో శ్రీరాములు శుక్రవారం పార్టీలో చేరనున్నారు. శాసన సభలో పెరగనున్న బీజేపీ బలం గత ఏడాది జరిగిన శాసన సభ ఎన్నికల్లో 40 స్థానాలను గెలుచుకున్న బీజేపీ ఓట్ల శాతంలో తేడా వల్ల ప్రధాన ప్రతిపక్ష స్థానాన్ని పొందలేక పోయింది. తదనంతరం యడ్యూరప్ప తనతో పాటు కేజేపీకి చెందిన మరో ముగ్గురు ఎమ్మెల్యేలతో బీజేపీలో చేరారు. దీంతో బీజేపీ సంఖ్యా బలం 44కు పెరగడం వల్ల ప్రధాన ప్రతిపక్ష స్థానాన్ని పొందగలిగింది. ప్రస్తుతం బీఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను శాసన సభలో ఇకమీదట బీజేపీ సభ్యులుగా పరిగణిస్తారు. దీంతో ఆ పార్టీ సంఖ్యా బలం 48కి పెరగనుంది. బీజేపీ జాబితా...? రాష్ట్రంలోని మొత్తం 28 లోక్‌సభ నియోజక వర్గాలకు గాను బీజేపీ 20 మందితో తొలి జాబితాను ఇదివరకే ప్రకటించింది. మిగిలిన ఎనిమిది స్థానాలకు పార్లమెంటరీ బోర్డు సమావేశంలో అభ్యర్థులను ఎంపిక చేశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఉడిపి-చిక్కమగళూరు స్థానానికి మాజీ మంత్రి శోభా కరంద్లాజె, తుమకూరుకు జీఎస్. బసవరాజు, కోలారుకు ఎం. నారాయణస్వామి, మండ్యకు శివలింగయ్య, మైసూరుకు జర్నలిస్టు ప్రతాప సింహ, హాసనకు సీహెచ్. విజయ్ శంకర్, బీదర్‌కు సూర్యకాంత నాగమారపల్లిలను ఎంపిక చేసినట్లు తెలిసింది. ఈ జాబితాను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.