ప్రాంగణ ఎంపికల్లో 10 మందికి ఉద్యోగాలు
ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్ : స్థానిక క్విస్ ఇంజినీరింగ్ కళాశాలలో బెంగళూరుకు చెందిన ప్రముఖ కార్పొరేట్ కంపెనీ క్రౌన్ ఇ ల్యాబ్స్ ఆధ్వర్యంలో నిర్వహించి న ప్రాంగణ ఎంపికల్లో 10 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. శని వారం ప్రారంభమైన క్యాంపస్ ఇంటర్వ్యూ లు ఆదివారంతో ముగిసాయి. ఇంజినీరింగ్ ఆఖరి సంవత్సరం చదువుతున్న ఈఈఈ, ఈసీఈ, సీఎస్‌ఈ, ఐటీ విభాగాల విద్యార్థులు ఇంటర్వ్యూల్లో పాల్గొన్నారు.
శనివారం గ్రూప్ డిస్కషన్‌లో ప్రతిభ కనబరిచిన 47 మందికి ఆదివారం హెచ్‌ఆర్ రౌండ్ నిర్వహించారు. దానిలో అర్హత సాధించిన 15 మందికి టెక్నికల్ రౌండ్ నిర్వహించి ప్రతిభచూపిన 10 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేసినట్లు కళాశాల అధ్యక్షుడు నిడమానూరి నాగేశ్వరరావు తెలిపారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులను ఆయన అభినందించారు. రిక్రూట్‌మెంట్ కార్యక్రమంలో కంపెనీ ప్రతిని ధులు శృతి, హెచ్‌ఆర్ మేనేజర్, హెచ్‌ఆర్ ఎగ్జిక్యూటివ్ మధుసూదన్ పాల్గొన్నారు.
ముగిసిన వర్క్‌షాపులు...
స్థానిక క్విస్ ఇంజినీరింగ్ కళాశాలలో ఫైనలియర్ మెకానికల్ విద్యార్థులు 110 మందికి ఐదు రోజులుగా నిర్వహిస్తున్న కటియా వర్క్‌షాప్ ఆదివారంతో ముగిసింది. చివరిరోజు కోయంబత్తూరుకు చెందిన ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ ప్రతినిధులు అబ్దుల్లా శివమణి ఆధ్వర్యంలో డాప్టింగ్, అడ్వాన్స్ పాట్‌డిజైన్, రిబ్, మల్టీసెక్షన్ తదితర అంశాలపై విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు.
అదే విధంగా ఆఖరి సంవత్సరం సివిల్ ఇంజినీరింగ్ విద్యార్థులు 60 మందికి 5 రోజులుగా నిర్వహిస్తున్న స్టాడ్‌ప్రో వర్క్‌షాప్ కూడా ఆదివారంతో ముగిసింది. ఈ వర్క్‌షాప్‌ను కోయంబత్తూరుకు చెందిన ప్రముఖ కంపెనీ ప్రతినిధులు నాగార్జున, కార్తీక్ నిర్వహించారు. ఆఖరి రోజు రెస్పాన్స్ స్పెక్ట్రమ్, ఎర్త్‌పాక్ (సెస్మిక్‌లోడ్స్) అనే అంశాలపై శిక్షణ ఇస్తూ విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు.