Beirut blast
-
ఒక్కో బొమ్మకు ఒక్కో అమ్మాయి పేరు
పిల్లల లేత మనసులను అర్థం చేసుకోవడం, తగు రీతిగా స్పందించడం కొందరికే సాధ్యమవుతుంది. ఈ యేడాది కరోనాతోపాటు దేశ విదేశాల్లోనూ ఎన్నో ఆందోళనలు కలిగించే అంశాల గురించి విన్నాం. మొన్న ఆగస్టులో లెబనాన్‌లో జరిగిన బీరుట్ పేలుడులో 200 మందికి పైగా మరణించారు. వేలాది మంది గాయపడ్డారు. ఎన్నో కుటుంబాలు నిలువ నీడలేకుండా రోడ్డున పడ్డాయి. ప్రాణనష్టం, వస్తు నష్టం జరిగింది. ఆ పేలుడుకు ప్రభావితమైనవారిలో పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు. వారికి ఎంతో ఇష్టమైన బొమ్మలు పేలుడులో కాలిపోవడం, మసిబారడం.. వంటివి జరిగిపోయాయి. లెబనీస్ కళాకారిణి, బామ్మ ఆ పిల్లల స్థితికి తల్లడిల్లిపోయింది. ఆ చిన్నారి మనసులకు ఉపశమనం ఇవ్వాలనే ఆలోచనతో బొమ్మలు తయారు చేయడం మొదలుపెట్టింది. సొంతంగా తన చేతులతో రంగు రంగుల బొమ్మలను తయారు చేసింది. ఒక్కో బొమ్మకు ఒక్కో అమ్మాయి పేరు పెట్టింది. అలా ఇప్పటి వరకు తాను రూపొందించిన 100 బొమ్మలను అమ్మాయిలకు అందించింది. రోజూ ఉదయాన్నే నిద్రలేచింది మొదలు పడుకునేవరకు శ్రద్ధగా బొమ్మలను తయారు చేస్తూ కూర్చుంటుంది. బొమ్మలను తయారుచేసిన బామ్మ ఫొటో సోషల్ మీడియాలో నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంది. బామ్మ చేస్తున్న పనికి ఎంతోమంది ప్రశంసలు తెలియజేస్తున్నారు. -
మానవ తప్పిదమే; బీరూట్ పోర్టు డైరెక్టర్ అరెస్ట్
బీరూట్: లబనాన్ రాజధాని బీరూట్‌లో పేలుడు ఘటనకు బాధ్యుడిగా బీరూట్ పోర్టు డైరెక్టర్‌ను లెబనాన్ మిలటరీ పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం జరిగిన పేలుడు ఘటనలో 135 మంది ప్రాణాలు విడువగా దాదాపు 5 వేల మంది గాయాలపాలైన సంగతి తెలిసిందే. అటార్నీ జనరల్ ఫాదీ అకీకీ నేతృత్వంలో పోలీసులు పోర్టు డైరెక్టర్ హస్సాన్ కోరేటమ్‌ని అదుపులోకి తీసుకున్నారని ఆ దేశ మీడియా ఎన్ఎన్ఏ తెలిపింది. హస్సాన్ కోరేటమ్‌తో పాటు మరో 16 మందిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నట్టు వెల్లడించింది. వీరంతా పేలుడు పదార్థం అమ్మోనియం నైట్రేట్ నిల్వ ఉంచిన గోడౌన్ 12 వద్ద విధుల్లో ఉన్నారని పేర్కొంది. పేలుడుకు కారణమైన అమ్మోనియం నైట్రేట్ నిల్వల్లో గోడౌన్ 12 సిబ్బంది నిర్లక్షాన్యికి సంబంధించిన ఫొటోలు బయటికొచ్చాయని ఎన్ఎన్ఏ మీడియా తెలిపింది. పేలుడు ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు మొత్తం 18 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు చెప్పింది. (చదవండి: చెన్నైలో 700 టన్నుల అమోనియం నైట్రేట్ నిల్వలు) కాగా, మానవ తప్పిదం, నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు లెబనాన్ దేశాధ్యక్షుడు మిచెల్ అవున్ స్పష్టం చేశారు. నిష్పక్షపాత దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. 2,700 టన్నులకు పైగా అమ్మోనియం నైట్రేట్‌కు మంటలు అంటుకోవడం వల్లే ఈ పేలుడు సంభవించినట్లు వెల్లడించారు. 2014లో ఓ సరుకు రవాణా నౌక నుంచి ఈ అమ్మోనియం నైట్రేట్‌ను స్వాధీనం చేసుకున్నారని పేర్కొన్నారు. అమ్మోనియం నైట్రేట్ నిల్వలు రష్యాకు చెందిన వ్యాపారవేత్త ఇగోర్ గ్రెచుష్కిన్‌విగా తేలిందని, దర్యాప్తు బృందం అతన్ని ప్రశ్నించే అవకాశం ఎన్ఎన్ఏ మీడియా సంస్థ వెల్లడించింది. 1975 నుంచి 1990ల మధ్య జరిగిన సివిల్ వార్‌ను సైతం తట్టుకున్న భవనాలు, తాజా పేలుడు ధాటిని మాత్రం తట్టుకోలేక చరిత్రలో కనుమరుగయ్యేలా నేలకూలాయని లెబనాన్ వాసులు వాపోతున్నారు. దర్యాప్తులతో ఒరిగేదేమీ ఉండదని, పేలుడు పదార్థాలు పోర్టులోకి రాకుండే అడ్డుకుంటే చాలని అంటున్నారు. (కొడుకును రక్షించుకునేందుకు తండ్రి ఆరాటం) -
చెన్నైలో భారీగా అమ్మోనియం నైట్రేట్
సాక్షి ప్రతినిధి, చెన్నై: లెబనాన్ దేశ రాజధాని నగరం బీరుట్లో అత్యంత భారీ పేలుడు ఘటన నేపథ్యంలో చెన్నై వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెన్నై హార్బర్ గిడ్డంగిలో అయిదేళ్లుగా 700 టన్నుల ప్రమాదకర అమోనియం నైట్రేట్ నిల్వలు ఉండటమే ఇందుకు కారణం. 2015లో చెన్నైకి చెందిన ఓ సంస్థ రూ.1.80 కోట్ల విలువైన 700 టన్నుల అమోనియం నైట్రేట్‌ను దక్షిణ కొరియా నుంచి తెప్పించింది. అయితే, ఎరువుల తయారీ గ్రేడ్ రసాయనం పేరుతో పేలుడు పదార్థాలకు వాడే గ్రేడ్ అమోనియం నైట్రేట్‌ను దిగుమతి చేసుకుంది. దీంతో ప్రమాదకరమైన ఆ కెమికల్‌ను అధికారులు సీజ్ చేసి, 37 కంటైనర్లలో హార్బర్లోని గిడ్డంగిలో ఉంచారు. అయిదేళ్లయినా ఆ కంటైనర్లు అక్కడే ఉన్నాయి. బీరుట్ హార్బర్లో సంభవించిన పేలుడు.. అమ్మోనియం నైట్రేట్‌ను ఏళ్లపాటు ఒకే చోట ఉంచిన కారణంగానే సంభవించడం తెలిసిందే. చెన్నై హార్బర్లో సైతం 2015 నుంచి అమ్మోనియం నైట్రేట్ గిడ్డంగికే పరిమితం కావడం వల్ల అదే తీరులో పేలుళ్లకు దారితీస్తే చెన్నై నగరంపై తీవ్ర ప్రభావం ఉంటుందని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదిలా ఉండగా, కస్టమ్స్ అధికారులు గురువారం చెన్నై హార్బర్లో అమోనియం నైట్రేట్ నిల్వలు, భద్రతా చర్యలపై తనిఖీలు చేపట్టారు. ఇక్కడి నిల్వలతో ఎటువంటి ప్రమాదం లేదని స్పష్టం చేశారు. 2015లో చెన్నై వరదల సమయంలో సుమారు 7 టన్నుల అమోనియం నైట్రేట్ పాడైపోగా మిగతా 690 టన్నులను త్వరలోనే ఈ–వేలం ద్వారా విక్రయిస్తామని వెల్లడించారు. -
బీరూట్ పేలుళ్లు : 30 గంటలు సముద్రంలోనే..
బీరూట్ : లెబనాన్ రాజధాని బీరూట్ నగరంలో మంగళవారం సంభవించిన శక్తివంతమైన పేలుడు జరిగిన 30 గంటల తర్వాత సముద్రంలో ప్రాణాలతో బయటపడి మృత్యుంజయుడు అయ్యాడు పోర్టులో పని చేసే కార్మికుడు. భారీ పేలుళ్ల అనంతరం మిస్సయిన వారి జాడ తెలుసుకోవడం కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో క్రియేట్ చేసిన అకౌంట్లో రక్తపు మడుగులో ఉన్న అమిన్ అల్ జహెద్ ఫోటో కనిపించింది. భారీ పేలుళ్ల అనంతరం తీవ్రగాయాలైన అమిన్ అల్ జహెద్ మధ్యధరా సముద్రంలో పడిపోయినట్టు తెలుస్తోంది. రెస్క్యూ సిబ్బంది అమిన్ని కాపాడిన అనంతరం పడవపై పడుకోబెట్టిన ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. తీవ్రగాయాలతో ఉన్న అతన్ని రఫిక్ హరీరీ యూనివర్సిటీ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, సముద్రంలో 30 గంటలపాటూ ఎలా బతుకుపోరాటం చేశాడనే సమాచారం తెలియాల్సి ఉంది. బీరూట్‌లో సంభవించిన భారీ పేలుళ్లలో 137 మంది మృతిచెందగా, 5,000 మందికి పైగా గాయపడ్డారు. (2,700 టన్నుల అమ్మోనియం నైట్రేట్ వల్లే..) 2,700 టన్నులకు పైగా అమ్మోనియం నైట్రేట్‌కు మంటలు అంటుకోవడం వల్లే ఈ పేలుడు సంభవించినట్లు లెబనాన్ మంత్రి మొహమ్మద్ ఫహ్మీ చెప్పారు. బీరూట్ పోర్ట్‌లోని ఓ గోదాములో దీన్ని నిల్వ చేసినట్లు తెలిసింది. 2014లో ఓ సరుకు రవాణా నౌక నుంచి ఈ అమ్మోనియం నైట్రేట్‌ను స్వాధీనం చేసుకున్నారు. పేలుడు జరిగిన వెంటనే ముదురు నారింజ రంగు మేఘం పుట్టుగొడుగు ఆకారంలో ఆకాశంలోకి ఎగిరిపోతున్న దృశ్యం కనిపించింది. విషపూరితమైన నైట్రోజన్ డయాక్సైడ్ గ్యాస్ విడుదలైంది. దీన్ని పీల్చడం వల్ల చాలామంది శ్వాస ఆడక ప్రాణాలొదిలారు. పేలుడు ధాటికి చుట్టుపక్కల ఉన్న భవనాలు ధ్వంసమయ్యాయి. -
2,700 టన్నుల అమ్మోనియం నైట్రేట్ వల్లే..
బీరుట్: లెబనాన్ రాజధాని బీరుట్ నగరంలో మంగళవారం సంభవించిన శక్తివంతమైన పేలుడులో మృతుల సంఖ్య 135కు చేరిందని, 5,000 మందికి పైగా ప్రజలు గాయపడ్డారని లెబనీస్ రెడ్‌క్రాస్ సంస్థ ప్రతినిధి వెల్లడించారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వ అధికారి జార్జి కెటానెహ్ చెప్పారు. నగరంలో ఇటీవలి కాలంలో ఇదే అతి పెద్ద పేలుడని భావిస్తున్నారు. బుధవారం నగరంలో బీతావహ దృశ్యాలు కనిపించాయి. పోర్ట్ నుంచి ఇప్పటికీ పొగ వెలువడుతోంది. పరిసర ప్రాంతాలు బూడిద, వ్యర్థాలతో నిండిపోయాయి. పెద్దసంఖ్యలో వాహనాలు ధ్వంసమయ్యాయి. భవనాలు నేలమట్టమయ్యాయి. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. చిన్న మంటగా మొదలైన ఈ విస్ఫోటనం క్షణాల్లోనే భీకర రూపం దాల్చింది. ఈ దృశ్యాలు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. 1975–1990 మధ్య జరిగిన సివిల్ వార్‌లో, పొరుగు దేశం ఇజ్రాయెల్‌తో జరిగిన ఘర్షణల్లో, ఉగ్రవాద దాడుల్లో ఇలాంటి పేలుళ్లు కనిపించాయని స్థానికులు అంటున్నారు. ప్రాణాలు తీసిన అమ్మోనియం నైట్రేట్ 2,700 టన్నులకు పైగా అమ్మోనియం నైట్రేట్‌కు మంటలు అంటుకోవడం వల్లే ఈ పేలుడు సంభవించినట్లు లెబనాన్ మంత్రి మొహమ్మద్ ఫహ్మీ చెప్పారు. బీరుట్ పోర్ట్‌లోని ఓ గోదాములో దీన్ని నిల్వ చేసినట్లు తెలిసింది. 2014లో ఓ సరుకు రవాణా నౌక నుంచి ఈ అమ్మోనియం నైట్రేట్‌ను స్వాధీనం చేసుకున్నారు. పేలుడు జరిగిన వెంటనే ముదురు నారింజ రంగు మేఘం పుట్టుగొడుగు ఆకారంలో ఆకాశంలోకి ఎగిరిపోతున్న దృశ్యం కనిపించింది. విషపూరితమైన నైట్రోజన్ డయాక్సైడ్ గ్యాస్ విడుదలైంది. దీన్ని పీల్చడం వల్ల చాలామంది శ్వాస ఆడక ప్రాణాలొదిలారు. పేలుడు ధాటికి చుట్టుపక్కల ఉన్న భవనాలు ధ్వంసమయ్యాయి. ఆహార సంక్షోభం తప్పదా? చాలా చిన్న దేశమైన లెబనాన్‌లో ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే కుప్పకూలింది. సంక్షోభం రోజురోజుకూ ముదురుతోంది. ప్రజల్లో అసంతృప్తిజ్వాలలు రగులుతున్నాయి. వారు వీధుల్లోకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. మరోవైపు కరోనా మహమ్మారి లెబనాన్‌పై పంజా విసురుతోంది. ఆసుపత్రులు కరోనా బాధితులతో కిటకిటలాడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పేలుడు సంభవించి, 135 మంది అమాయక జనం చనిపోవడం పాలకులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. లెబనాన్ 10 లక్షల మందికి పైగా సిరియా శరణార్థులకు ఆశ్రయం కల్పిస్తోంది. విదేశాల నుంచి నిత్యావసర సరుకులు, ఆహార పదార్థాల దిగుమతికి బీరూట్ పోర్ట్ అత్యంత కీలకం. తాజా పేలుడు వల్ల ఈ ఓడరేవు చాలావరకు నామరూపాల్లేకుండా పోయింది. దిగుమతులన్నీ ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. దేశంలో ఇకపై ఆహార సంక్షోభం తప్పదని వాదన వినిపిస్తోంది. భారత ప్రధాని మోదీ దిగ్భ్రాంతి లెబనాన్‌లో పేలుడు సంభవించి, 135 మంది మరణించడం పట్ల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. మిన్నంటిన ఆక్రందనలు కూలిన భవనాలు, రేగుతున్న పొగలు, గల్లంతైన కుటుంబ సభ్యులు.. ఇదీ ప్రస్తుతం బీరుట్ లో పరిస్థితి. ఓ వైపు అంబులెన్స్ సైరన్లు మోగుతుంటే మరోవైపు బాధితుల ఆక్రందనలు మిన్నంటుతున్నాయి. దారుణమైన ఈ పేలుడు నగరాన్ని ఛిద్రం చేసేసింది. రంగు రంగుల అద్దాలతో, అందమైన రాళ్ల నిర్మాణాలతో ఉన్న ప్రాంతమంతా మరుభూమిగా మారింది. తరాల పాటు నిర్మించిన భవనాలు క్షణాల్లో నేలమట్టమయ్యాయి. 1975 నుంచి 1990ల మధ్య జరిగిన సివిల్ వార్‌ను సైతం తట్టుకున్న భవనాలు, పేలుడు ధాటిని మాత్రం తట్టుకోలేక చరిత్రలో కనుమరుగయ్యేలా నేలకూలాయి. ఇంటి బాల్కనీలు రోడ్డు నడిమధ్యకు వచ్చి పడ్డాయి. రెస్టారెంట్లు, షాపుల్లోని కుర్చీలు ఎవరినీ రానివ్వద్దన్నట్టు తలకిందులుగా పడిపోయాయి. నేనెక్కడికెళ్లాలి ? నేనేం చేయాలి అంటూ కుప్పకూలిన ఓ ఇంటి ఎదుట యజమానురాలు బాధను వ్యక్తం చేస్తూ కనిపించింది. పసి పిల్లలు పేలుడు ధాటికి ఆస్పత్రుల పాలయ్యారు. ఇంతకు మించి వినాశనమంటూ ఉంటుందా అనే స్థాయిలో నగరం దిబ్బగా మారింది. ప్రస్తుతానికైతే కుయ్ మంటూ తిరిగే అంబులెన్సులు, రాళ్లెత్తి మరీ మనుషుల కోసం వెతుకుతున్న వాలంటీర్ల శ్రమ, అయినవారిని కోల్పోయి రోదిస్తున్న బాధితుల ఆక్రందనలు మాత్రమే కనిపిస్తున్నాయి. లెబనాన్‌కు వెల్లువెత్తుతున్న సాయం లెబనాన్‌కి అంతర్జాతీయ సమాజం నుంచి సహాయం వెల్లువెత్తుతోంది. లెబనాన్‌లో సంభవించిన పేలుడు అనంతరం క్షతగాత్రులను ఆదుకోవడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ విమానాల ద్వారా అవసరమైన మందులను పరికరాలను పంపిస్తున్నట్లు వెల్లడించింది. మందులను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దుబాయ్‌లోని మానవతా సహాయ కేంద్రం నుంచి క్షతగాత్రులకు చేరవేస్తున్నట్లు డబ్ల్యూహెచ్‌వో అధికార ప్రతినిధి తారిక్ జెసా రెవిక్ చెప్పారు. ఓడరేవు కేంద్రంగా జరిగిన భారీ పేలుడు ప్రభావంతో అనేక భవనాలు శిథిలమయ్యాయి. బీరుట్లో బీభత్సం సృష్టించిన ఈ పేలుడు ప్రభావంతో ప్రజా జీవనం ఛిన్నాభిన్నమైంది. యూరోపియన్ సమాజం, రష్యా, నార్వే, టర్కీ, నెదర్లాండ్స్, సైప్రస్, గ్రీక్, ఫ్రాన్స్, జర్మనీ, పోలండ్, ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలు ఇప్పటికే మందులు, వాహనాలు, హెలికాప్టర్లు, అంబులెన్సులు, వైద్య బృందాలు, రెస్క్యూ టీమ్‌లను తరలించడం ప్రారంభించాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ లెబనాన్‌ను సందర్శించారు. దేశాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ ఘటనలో అనేక విదేశీ రాయబార కార్యాలయాలు సైతం దెబ్బతిన్నాయి. కష్టాల్లో ఉన్నాం.. ఆదుకోండి ప్రపంచ దేశాలకు లెబనాన్ ప్రధాని వేడుకోలు ఆర్థిక సంక్షోభంతోపాటు బీరుట్లో పేలుడు వల్ల తాము కష్టాల్లో కూరుకుపోయామని, ప్రపంచ దేశాలు, మిత్ర దేశాలు వెంటనే స్పందించి, ఆదుకోవాలని లెబనాన్ ప్రధానమంత్రి హసన్ దియాబ్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో ప్రసంగం విడుదల చేశారు. పేలుడుకు పాల్పడి, అమాయకుల ప్రాణాలను బలిగొన్న వారు ఎప్పటికైనా మూల్యం చెల్లించకోక తప్పదని పేర్కొన్నారు. పేలుడులో గాయపడిన మహిళకు చికిత్స అందిస్తున్న ఆరోగ్య కార్యకర్త పేలుడులో గాయపడిన చిన్నారి పేలుడు వల్ల ఎగిసిపడుతున్న మంటలను ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది -
బీరూట్ పేలుళ్లు: వైరల్ వీడియోలు
బీరూట్: లెబనాన్ రాజధాని బీరూట్‌లో సంభవించిన భారీ పేలుళ్లతో భయానక వాతావరణం నెలకొంది. నగరంలో ఎక్కడ చూసినా హృదయ విదారక దృశ్యాలే దర్శనమిస్తున్నాయి. ఈ పేలుళ్లలో సుమారు 100 మంది మరణించగా వేలాది మంది గాయపడ్డారు. ఈ ప్రమాదంలో వీధులకు వీధులే నేలమట్టం కాగా, మరికొన్ని గృహాల బాల్కనీలు, కిటికీలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఈ ఘటనకు సంబంధించిన పలు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పేలుళ్ల శబ్ధాలు వినిపించడంతో ప్రమాదం ముంచుకు వస్తుందని భావించిన ఓ తండ్రి తన కొడుకుని చేతుల్లోకి తీసుకుని గట్టిగా పట్టుకున్నాడు. భవనం కంపిస్తుండటంతో భగవంతుడిని తలుచుకుంటూ కొడుకును బల్ల కిందకు తోశాడు. ఆ తర్వాత అతను కూడా బల్ల కిందకు చేరిపోయాడు. (ఇంతటి విధ్వంసం ఎన్నడూ చూడలేదు: గవర్నర్) 😳 😳😳😳😳 Watch how this brave father protects his son during today’s explosion in Beirut. Praying for Beirut and rest of the world 🙏🙏 #beirut #lebanon #prayforlebanon pic.twitter.com/BNYaxudP5p — Thereportng (@thereportng) August 5, 2020 ఇక మరో వీడియోలో అందంగా ముస్తాబైన ఓ పెళ్లికూతురు ఫొటోలు దిగుతోంది. దీన్ని కెమెరాలో బంధిస్తుండగా అకస్మాత్తుగా పేలుడు సంభవించగా అక్కడ వేసిన సెట్ మొత్తం ఒక్కసారిగా వణికిపోయింది. దీంతో వధువుతో పాటు ఆమె వెంట ఉన్నవాళ్లందరూ ప్రాణభయంతో అక్కడనుంచి పరుగులు తీశారు. మరో చోట ఓ మహిళ తన యజమాని కూతురును కాపాడేందుకు తన ప్రాణాన్ని అడ్డేసింది. ఆమె సాహసానికి నెటిజన్లు అబ్బుపడుతూ మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. (బీరూట్ బీభత్సం : మహిళ సాహసం) Surreal. pic.twitter.com/pzvdpZAnva — Azad Essa (@azadessa) August 4, 2020 #BeirutBlast #beirutexplosion#Beirut #Lebanon My heart goes for this African maid, who ignored her own life, and tried to safe her employer’s child. Not all angels have wings 🕊 #BeirutExplosion #لبنان #Beirut pic.twitter.com/IfkhDN2iOZ — SANTOSH💞💥 (@santoshkr_08) August 4, 2020 #Beirut Future history books will need one chapter just for year 2020 alone.#Beirut #BeirutBlast pic.twitter.com/Dx6YeERX2r — Imran Inamdar (@immiee) August 5, 2020 ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బీరూట్ : పోర్టు ఏరియాలో భారీ పేలుళ్లు
-
లెబనాన్‌లో దౌత్యకార్యాలయం వద్ద దాడి
బిరూట్: ఆత్మాహుతి దాడులతో మంగళవారం లెబనాన్ ఉలిక్కిపడింది. దేశరాజధాని బీరూట్‌లోని ఇరాన్ దౌత్యకార్యాలయం సమీపంలో జరిగిన బాం బు దాడుల్లో 23 మంది మృతిచెందగా, 146 మంది గాయపడ్డారు. పేలుడు ధాటికి అక్కడిభవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మోటారుసైకిల్‌పై, కారులో వచ్చిన ఉగ్రవాదులు ఆత్మాహుతికి దాడికి పాల్పడినట్లు ఆర్మీ చెప్పింది.