బీరూట్ పేలుళ్లు: వైర‌ల్ వీడియోలు | Beirut Blast: Terrified Father And Son Take Shelter Under Table | Sakshi
Sakshi News home page

కొడుకును ర‌క్షించుకునేందుకు తండ్రి ఆరాటం

Published Wed, Aug 5 2020 2:30 PM | Last Updated on Wed, Aug 5 2020 9:03 PM

Beirut Blast: Terrified Father And Son Take Shelter Under Table - Sakshi

బీరూట్‌‌: లెబ‌నాన్ రాజ‌ధాని బీరూట్‌‌లో సంభ‌వించిన భారీ పేలుళ్లతో భ‌యాన‌క వాతావ‌ర‌ణం నెల‌కొంది. న‌గ‌రంలో ఎక్క‌డ చూసినా హృద‌య విదార‌క దృశ్యాలే ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. ఈ పేలుళ్ల‌లో సుమారు 100 మంది మ‌ర‌ణించ‌గా వేలాది మంది గాయ‌ప‌డ్డారు. ఈ ప్ర‌మాదంలో వీధుల‌కు వీధులే నేల‌మ‌ట్టం కాగా, మ‌రికొన్ని గృహాల బాల్క‌నీలు, కిటికీలు దారుణంగా దెబ్బ‌తిన్నాయి. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన ప‌లు వీడియోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. పేలుళ్ల శ‌బ్ధాలు వినిపించ‌డంతో ప్ర‌మాదం ముంచుకు వ‌స్తుంద‌ని భావించిన ఓ తండ్రి త‌న కొడుకుని చేతుల్లోకి తీసుకుని గ‌ట్టిగా ప‌ట్టుకున్నాడు. భ‌వ‌నం కంపిస్తుండ‌టంతో భ‌గ‌వంతుడిని త‌లుచుకుంటూ కొడుకును బ‌ల్ల కింద‌కు తోశాడు. ఆ త‌ర్వాత అత‌ను కూడా బ‌ల్ల కిందకు చేరిపోయాడు. (ఇంతటి విధ్వంసం ఎన్నడూ చూడలేదు: గవర్నర్‌)

ఇక మ‌రో వీడియోలో అందంగా ముస్తాబైన ఓ పెళ్లికూతురు ఫొటోలు దిగుతోంది. దీన్ని కెమెరాలో బంధిస్తుండ‌గా అక‌స్మాత్తుగా పేలుడు సంభ‌వించ‌గా అక్క‌డ వేసిన సెట్ మొత్తం ఒక్క‌సారిగా వ‌ణికిపోయింది. దీంతో వ‌ధువుతో పాటు ఆమె వెంట ఉన్న‌వాళ్లంద‌రూ ప్రాణ‌భ‌యంతో అక్క‌డ‌నుంచి ప‌రుగులు తీశారు. మ‌రో చోట ఓ మ‌హిళ త‌న య‌జ‌మాని కూతురును కాపాడేందుకు త‌న ప్రాణాన్ని అడ్డేసింది. ఆమె సాహ‌సానికి నెటిజ‌న్లు అబ్బుప‌డుతూ మెచ్చుకోకుండా ఉండ‌లేక‌పోతున్నారు. (బీరూట్ బీభత్సం :  మహిళ సాహసం)

ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement