bellam
-
Sankranti 2025 : పర్ఫెక్ట్ కొలతలతో, ఈజీగా అరిసెలు, కజ్జికాయలు
సంక్రాంతి వస్తోందంటే తెలుగు లోగిళ్లలో సంబరాలు మొదలవుతాయి. ఉపాధి కోసం దేశ విదేశాలకు తరలిపోయిన పిల్లలంతా రెక్కలు కట్టుకొని మరీ సొంత ఊరిలో వాలిపోతారు. పిండివంటలు, కొత్తబట్టలు, గొబ్బెమ్మలు.. ఇలా సంకురాత్రి సంబరాలతో పల్లెలన్నీ మురిసి పోతాయి. మరి అరిసెలు లేని సంక్రాంతిని అస్సలు ఊహించగలమా. అందులోనూ ఈ చల్లని వేళ, శ్రేష్టమైన నువ్వులద్దిన అరిసెలు తింటూ ఉంటే... పంటికింద నువ్వులు అలా తగులుతుంటే.. ఆహా అని మైమరిచిపోమూ. ఆరోగ్యం, ఆనందం రెండింటినీ అందించే అరిసెలు, అలాగే అందరికీ ఎంతో ఇష్టమైన, మరో ముఖ్యమైన స్వీట్ కజ్జికాయలను సులువుగా, రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం రండి! నువ్వుల అరిశెలుకావలసినవి: బియ్యం – ఒక కిలో; బెల్లం పొడి – 800 గ్రా.; నువ్వులు, గసగసాలు– కొద్దిగా; నెయ్యి – కేజీతయారీబియ్యాన్ని ముందు రోజు రాత్రి కడిగి నానబెట్టాలి. ఉదయాన్నే నీళ్లను వంపేసి తడిగా ఉన్నప్పుడే దంచాలి. దంచిన పిండిని జల్లించాలి. పిండి గాలికి పొడిబారకుండా ఒకపాత్రలో వేసి అదిమి మూత పెట్టాలి. ఇప్పుడు పాకం సిద్ధం చేసుకోవాలి. మందపాటి పాత్రలో ఒక గ్లాసు నీరు పోసి బెల్లం పొడి వేసి పాకం వచ్చేదాకా తెడ్డుతో కలుపుతూ మరిగించాలి. పాకం వచ్చిన తర్వాత స్టవ్ మీద నుంచి దించేసి బియ్యప్పిండి వేసి ఉండలు కట్టకుండా తెడ్డుతో కలపాలి. బాణలిలో నెయ్యి పోసి కాగనివ్వాలి. పాకంపిండిని పెద్ద నిమ్మకాయంత తీసుకుని గసాలు, నువ్వులలో అద్ది పాలిథిన్ పేపర్ మీద పెట్టి వేళ్లతో వలయాకారంగా అద్ది కాగిన నెయ్యిలో వేసి దోరగా కాలిన తర్వాత తీసి అరిశెల పీట మీద వేసి అదనంగా ఉన్న నెయ్యి కారిపోయేటట్లు వత్తాలి. గమనిక: అరిశె మెత్తగా రావాలంటే పాకం లేతగా ఉన్నప్పుడే బియ్యప్పిండి కలుపుకోవాలి. గట్టిగా ఎక్కువ తీపితో కావాలనుకుంటే ముదురు పాకం పట్టాలి. ఈ అరిశెలు పదిహేను రోజుల వరకు తాజాగా ఉంటాయి. నువ్వుల కజ్జికాయలుకావలసినవి : మైదా లేదా గోధుమ పిండి – కేజి; నువ్వులు – కేజి; బెల్లం పొడి – 800 గ్రా.; ఏలకులు– 10 గ్రా. జీడిపప్పు– వందగ్రాములు; నూనె– కేజీ;ఇదీచదవండి : సోషల్ మీడియా DPDP నిబంధనలు : 18 ఏళ్లలోపు పిల్లలకు తల్లిదండ్రుల సమ్మతి తప్పనిరితయారీ:పిండిని చపాతీలకు కలుపుకున్నట్లుగా కలుపుకుని పక్కన ఉంచుకోవాలి. నువ్వులను దోరగా వేయించి చల్లారిన తర్వాత కాస్త పలుకుగా గ్రైండ్ చేయాలి. బెల్లం పొడి, యాలకుల పొడి వేసి అన్నీ సమంగా కలిసే వరకు కలపాలి. గోధుమ పిండిని చిన్న గోళీలుగా చేసుకోవాలి. ఒక్కొక్క గోళీని ప్రెస్సర్‌తో పూరీలా వత్తుకుని దానిని సాంచా (కజ్జికాయ చేసే చెక్క మౌల్డ్) లో పరిచి ఒక స్పూను నువ్వులు, బెల్లం మిశ్రమాన్ని, ఒక జీడిపప్పును పెట్టి సాంచా మూత వేయాలి. సాంచాలో నుంచి తీసి కజ్జికాయను మరుగుతున్న నూనెలో వేసి దోరగా కాలనివ్వాలి. ఇవి దాదాపుగా ఇరవై రోజుల వరకు తాజాగా ఉంటాయి. -
ఈ సీజన్లో స్పెషల్ లడ్డూ : రోజుకొకటి తింటే లాభాలెన్నో!
పురాతన ఆయుర్వేద కాలం నుండి, నువ్వులకు చాలా ప్రాధాన్యత ఉంది. వీటిని ఏదో విధంగా రెగ్యులర్ డైట్లో చేర్చుకోవడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా శీతాకాలంలో శరీరానికి వేడిని అందిస్తాయి. అలాగే బెల్లంతో కలిపి చేసిన నువ్వుల లడ్డూలను పిల్లలకు తినిపిస్తే బోలెడన్ని పోషకాలు లభిస్తాయి. నువ్వులు, నువ్వుల లడ్డూ ఉపయోగాల గురించి తెలుసుకుందాం. నువ్వులను అనేక రకాలుగా వంటకాల్లో వాడతారు. నువ్వుల పొడి, నువ్వుల కారంతోపాటు నువ్వులతో తీపి వంటకాలను చేస్తారు. ముఖ్యంగా బెల్లం, నువ్వులను కలిపి తయారు చేసిన లడ్డూలు మంచి రుచిగా ఉండటమేకాదు అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయి.వీటిల్లో ప్రోటీన్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం పుష్కలంగా లభిస్తాయి. ఇవి రక్తాన్ని శుభ్రపరుస్తాయి. జీర్ణక్రియను సులభతరం చేస్తాయి. నువ్వులలోని మెగ్నీషియం సుగర్ వ్యాధి నియంత్రణలో ఉంచుతుంది. ఆరోగ్యకరమైన చర్మానికి, జుట్టు నాణ్యతను మెరుగుపరచడానికి, ఎముకలను బలోపేతం చేయడానికి ఇవి సహాయపడతాయి. ఇందులోని జింక్ , సెలీనియం వంటి ఖనిజాలతో అకాల వృద్ధాప్యాన్ని నివారించవచ్చు. నువ్వుల్లో కాల్షియం ఎముకలను బలోపేతం చేస్తుంది. చిన్నారులు, గర్భిణీలకు ఎంతో పోషణ లభిస్తుంది. నువ్వుల్లో విటమిన్ B12 పుష్కలంగా ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది . రక్తహీనత ఉన్నవారికి ఇవి మేలు చేస్తాయి.ఇన్ఫెక్షన్ల నుండి రక్షించి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాదు మహిళలకు పీరియడ్ సమయంలో వచ్చే నొప్పులకు మంచి పరిష్కారం. నువ్వుల గింజలలో లిగ్నాన్స్, విటమిన్ ఇ, ఇతర యాంటీఆక్సిడెంట్లు రక్తప్రసరణను సులభం చేస్తాయి. రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి.నువ్వుల గింజలలో ఫైటోఈస్ట్రోజెన్లు ఉంటాయి, ఇవి శరీరంలో ఈస్ట్రోజెన్ లాగా పనిచేసే మొక్కల ఆధారిత సమ్మేళనాలు. ఇవి హార్మోన్ స్థాయిలను సమతుల్యం చేస్తాయి. ముఖ్యంగా ఈస్ట్రోజెన్, సాధారణ ఋతు చక్రానికి మద్దతు ఇస్తాయి. అందుకే రజస్వల అయినపుడు ఆడపిల్లలకు నువ్వుల చిమ్నీ తినిపిస్తారు.నువ్వుల లడ్డూ తయారీకావాల్సిన పదార్థాలు: ఆర్గానికి బెల్లం, నువ్వులు, నెయ్యి, యాలకుల పొడి. వేరు శనగ పప్పు. కావాలంటే జీడిపప్పు, బాదం పలుకులు కూడా వేసుకోవచ్చు. తయారీముందుగా ఓ కడాయిలో నువ్వులను దోరగా వేయించాలి. చిటపడ లాడుతూ కమ్మటి వాసన వస్తాయి. అపుడు వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇదే కడాయిలో వేరు శనగ పప్పులను కూడా వేయించి ముక్కా చెక్కలాగ మిక్సీ పట్టాలి. ఇప్పుడు బెల్లాన్ని సన్నగా తరిగి, పాకం పట్టుకోవాలి. ఇది పాకం వచ్చాక నువ్వులు, మిక్సీ పట్టుకున్న పల్లీలు వేసుకోవాలి. ఇందులోనే యాలకుల పొడి, నెయ్యి కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని నెయ్య రాసిన ప్లేట్లోకి తీసుకోవాలి. వేడి మీదే వీటిని ఉండలు చుట్టుకోవచ్చు. లేదంటే అచ్చుల్లాగా కట్ చేసుకోవచ్చు.నువ్వులను ఇలా పలురకాలుగా నువ్వులు రెండు రకాలుగా లభిస్తాయి. నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు. తెల్ల, నల్ల నువ్వులను వంటకాల్లో ఉపయోగిస్తుంటారు. నువ్వుల తైలంతో శరీరానికి మర్ధన చేస్తే మంచిదని చెబుతారు. అయితే నల్ల నువ్వులను మాత్రం పూజాది కార్యక్రమాలకు వాడతారు. అలాగే శనిదోష నివారణకు నల్ల నువ్వులను దానం చేస్తారు. నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే మంచిదని భావిస్తారు. -
మంచి రుచితో పాటు పోషకాలు అధికం..!
-
సారా ప్యాకింగ్ కేంద్రాలపై దాడులు
పార్వతీపురం టౌన్: కొమరాడ మండలం పరశురాంపురం గ్రామంలో ఎస్ఈబీ టాస్క్‌ఫోర్స్ సీఐ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో సిబ్బంది గురువారం దాడులు చేసి 30లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ పార్వతీపురం పట్టణంలోని ఇందిరాకాలనీకి చెందిన సొండి రాజేష్ విక్రాంపురం గ్రామంలో సారా రవాణా చేస్తున్న సమయంలో స్వాధీనం చేసుకుని నిందితుడిపై కేసునమోదు చేసి రిమాండ్ నిమిత్తం పార్వతీపురం జుడీషియల్ మెజిస్ట్రేట్ వద్ద హాజరుపర్చామని తెలిపారు. మరో సంఘటనలో ఎస్ఈబీ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎల్. ఉపేంద్ర పార్వతీపురం మండలం కృష్ణపల్లి గ్రామ సమీపంలో నిర్వహించిన దాడుల్లో 160లీటర్ల సారా, 100 ప్యాకెట్లు సారా స్వాధీనం చేసుకున్నారు. పార్వతీపురం మున్సిపాల్టీ పాత రెల్లివీధికి చెందిన సొండి చంద్రపై కేసు నమోదు చేశారు. అలాగే పాత రెల్లివీధి సమీపంలో తుప్పల్లో దాచిపెట్టిన 60లీటర్లసారా, 50 ప్యాకెట్ల సారాను స్వాధీనం చేసుకున్నారు. 1,400 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం సాలూరు: మండలంలోని పెద్దవలస గ్రామ సమీపంలో బెల్లపు ఊటను ధ్వంసం చేసినట్లు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్ ఈశ్వరరావు తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన మాట్లాడుతూ, సిబ్బందితో కలిసి పెద్దవలస సమీపంలో సారా స్థావరాలపై దాడి చేసి సారా తయారికి సిద్ధం చేసిన 1,400 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసి కేసు నమోదు చేశామని తెలిపారు. వేపాడ మండలంలో 1000 లీటర్లు.. వేపాడ: కృష్ణారాయుడుపేట గ్రామ సమీపంలో నిర్వహించిన దాడుల్లో సారా తయారీకి సిద్ధం చేసిన 1000 లీటర్లు బెల్లం ఊటను గుర్తించి ధ్వంసం చేసినట్లు స్పెషల్ ఎన్పోర్స్మెంట్ బ్యూరో సీఐ సీహెచ్ రాజేశ్వరి, ఎస్సై పి.నరేంద్ర తెలిపారు. అనంతరం కృష్ణారాయుడుపేటలో నిర్వహించిన పరివర్తన కార్యక్రమంలో సీఐ మాట్లాడుతూ సారా నిర్మూలనకు గ్రామస్తులు, çమహిళలు, సహకారం ఉండాలన్నారు. (చదవండి: -
Summer Tips: పానకంలో ఏలకులు, మిరియాలు, అల్లం వంటివి చేర్చితే!
Bellam Panakam: సంప్రదాయ వేసవి పానీయాల్లో పానకానిది ప్రత్యేక స్థానం. ఇది అచ్చమైన తెలుగు పానీయం. బెల్లంతో తయారు చేసే పానకాన్ని పూజల్లో నైవేద్యంగా కూడా పెడతారు. ముఖ్యంగా వేసవి ప్రారంభంలో వచ్చే శ్రీరామనవమి రోజున రాములవారికి వడపప్పు, పానకం నైవేద్యంగా సమర్పించడం ఆనవాయితీ. ఇక బెల్లం పానకంలో ఏలకులు, మిరియాలు, అల్లం వంటివి చేర్చడం వల్ల పానకానికి అదనపు రుచి వస్తుంది. వేసవితాపం నుంచి ఉపశమనం కలిగించే పానకం జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. తెలుగువారి పానకం మాదిరిగానే ఒడియా ప్రజలు ‘పొణా’ అనే పానీయాన్ని తయారు చేస్తారు. ఒడియా ప్రజల నూతన సంవత్సరం మేష సంక్రాంతి రోజున వస్తుంది. ఆ రోజున వీధి వీధినా చలివేంద్రాలను ఏర్పాటు చేసి, జనాలకు ఉచితంగా ‘పొణా’ను పంచిపెడతారు. అందువల్ల ఈ పండుగను ‘పొణా సంక్రాంతి’ అని కూడా అంటారు. ‘పొణా’ తయారీలో ప్రధానంగా నవాతుబెల్లాన్ని ఉపయోగిస్తారు.‘పొణా’లో పచ్చిమామిడి ముక్కలు, కొబ్బరికోరు, అరటిపండు ముక్కలు, జీడిపప్పు, కిస్మిస్ వంటివి కూడా చేరుస్తారు. ‘పొణా’ సేవనంతోనే ఒడియా ప్రజలు వేసవికి స్వాగతం పలుకుతారు. చదవండి: Bad Habits: వాష్‌రూమ్ వాడి సరిగ్గా నీళ్లు కొట్టరు.. ఎలా చెప్తే మారతారు మగాళ్లు? -
మేడారం సమ్మక్మ-సారలమ్మ గద్దెల వద్ద బంగారం తొలగింపు సబబేనా..?
పున్నమి వెలుగున గద్దెనెక్కిన వనదేవతలు.. భక్త‘కోటి’ ఆరాధ్య దైవాలు.. ఇంటి ఇలవేల్పులు. వరాలిచ్చే దేవరలు.. చెంతకొచ్చినా.. మదిలో తలచినా నిండు మనసుతో ఆశీర్వచనాలిచ్చే కల్పవల్లులు. రెండేళ్లకోసారి దర్శనభాగ్యం కల్పించేందుకు కళ్లెదుటే సాక్షాత్కరించగా.. జై సమ్మక్క.. జై సారలమ్మ తల్లీ అంటూ మొక్కుల చెల్లింపునకు అశేష భక్తజనం పోటెత్తింది. ఎత్తు బెల్లం(బంగారం), పసుపు, కుంకుమ, చీర సారె సమర్పిస్తూ తల్లుల సేవలో తరించారు. చల్లని చూపులను ప్రసాదిస్తూ.. కోరిన కోర్కెలు తీర్చేందుకు అభయమిచ్చితిరి ఆ అమ్మలు. సాక్షి, మేడారం(ఎస్‌ఎస్‌తాడ్వాయి/ఏటూరునాగారం): తల్లుల గద్దెలపై ఆచార వ్యవహారాలకు విరుద్ధంగా చేపట్టిన చర్యలను పూజారులు తప్పుబడుతున్నారు. మేడారం సమ్మక్క–సారలమ్మ కొలువుదీరిన గద్దెలపై బెల్లం(బంగారం), ఒడిబియ్యం, కొబ్బరి కుడుకలు, పోక, ఖర్జూర, చీర సారె భక్తులు సమర్పించడం పూర్వం నుంచి వస్తున్న ఆచారం. ఇవన్నీ చుట్టూరా ఉంటేనే అమ్మవార్లు అక్కడ ఉన్నట్లు భావిస్తారు. అయితే.. జాతర పూర్తి కాకముందే ఎప్పటికప్పుడు కానుకలు తొలగించడం సంప్రదాయానికి విరుద్ధమని పలువురు పూజారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పూజారిని అడగగా.. బంగారం తొలగించడాన్ని తాము తప్పుబడుతున్నామని, అమ్మవార్లు గద్దెలపై కొలువుదీరిన నాటి నుంచి వనప్రవేశం చేసే వరకు రాశిగా ఉంటేనే ఆనందంగా ఉంటుందని చెప్పుకొచ్చారు. చదవండి: మేడారం జాతర: గట్టి మంత్రి.. ‘పంచాయితీ’ పెట్టే మంత్రిని కాను.. కాగా.. వనప్రవేశం ముందు ఆచారంగా ఆదివాసీలు, మేడారం ఆడబిడ్డలు, స్థానికులు గద్దెలపై ఉన్న బెల్లం, చీర సారెలను ప్రసాదంగా ఇంటికి తీసుకెళ్తారు. ఇప్పుడంతా తొలగించడంతో ఈసారి ప్రసాదం స్థానిక ఆదివాసీలకు అందే పరిస్థితి లేకుండా పోయిందని పూజారులు వాపోయారు. జాతరకు ముందు జరిగిన సమీక్షలో సైతం గద్దెలపై కేవలం ప్లాస్టిక్ కవర్లు మాత్రమే తొలగించాలని పూజారులు సూచించారు. దీనిపై డీపీఓ వెంకయ్యను వివరణ కోరగా.. భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రతి జాతరలో ఇలానే తొలగిస్తామని, ఈసారి కూడా తొలగించినట్లు పేర్కొన్నారు. -
1200 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం
భూపాలపల్లి: జయశంకర్ జిల్లా భూపాలపల్లి మండలం నాగారం గ్రామంలో సోమవారం ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్బంగా సుమారు 1200 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.