బెల్ట్ షాపులు ఎత్తివేయాలి
ఆసిఫాబాద్ : పట్టణంలోని బెస్తవాడ, బనార్వాడ ప్రాంతాల్లో అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్ షాపులు, గుడుంబా స్థావరాలను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం కాలనీకి చెందిన మహిళలు స్థానిక ఎక్సైజ్కార్యాలయం ఎదుట ధర్నా చేపటా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కూలి పని చేసుకుని జీవించే కార్మికులు, యువకులు మద్యానికి బానిసై ఆర్థికంగా నష్టపోవడంతోపాటు అనారోగ్యం పాలవుతున్నారు. దీంతో ఎన్నో కుటుంబాలు వీధిన పడుతున్నాయన్నారు.
నిబంధనలకు విరుద్ధంగా బెల్ట్ షాపులు నడుస్తున్నా ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. అనం తరం ఎక్సైజ్ ఎస్సై సుందల్ సింగ్కు వినతిపత్రం అంద జేశారు. కాలనీ మహిళలు విఠుబాయి, సిందూబాయి, అనిత, మాయ, మనుబాయి, అరవింద్, ఆనంద్, మనోహర్, పెంటుతోపాటు సుమారు 50 మంది పాల్గొన్నారు.