belum caves
-
AP Special: బెలూం గుహలను చూసొద్దాం రండి..!
కోవెలకుంట్ల: భారతీయ సంస్కృతిలో గుహలు దేవుళ్లు, దేవతలకు నివాసమనే నమ్మకం వల్ల ఆ గుహలు పవిత్ర స్థలాలుగా విలసిల్లుతున్నాయి. కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం సమీపంలో ప్రపంచంలోనే రెండవదిగా భారతదేశంలోనే పొడవైన అంతర్భాభాగ గుహలుగా బెలూం గుహలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచాయి. సుమారు 23 ఎకరాల విస్తీర్ణంలో సాగు భూమి లోపల, భూమికి సమాంతరంగా ఇక్కడ గుహలు ఏర్పడటం ప్రత్యేకత. ఈ గుహలలో క్రీ.పూ. 450 సంవత్సరాల కాలం నాటి మట్టి పాత్రలో మనిషి అస్థికలు, రాతి కత్తి లభ్యం కావడంతో ఈ గుహలను ఆనాటి మానవులు నివాస స్థలాలుగా వినియోగించుకున్నట్లు చరిత్రకారులు పేర్కొంటున్నారు. గుహల ఉనికిని చాటిన ఆంగ్లేయుడు: 1884వ సంవత్సరంలో హెచ్‌బీ ఫూటే అనే ఆంగ్లేయుడు మొదటిసారిగా బెలూం గుహల ఉనికిని చాటాడు. తర్వాత 1982–1984 శీతాకాలాల్లో హెచ్డీ గేబర్ అనే జర్మనీ దేశస్తుడు సహచరులతో కలిసి 3225 మీటర్ల వరకు శోధించి ఒక పటాన్ని తయారు చేశాడు. వీరికి స్థానికులైన అప్పటి రిటైర్డ్ ఎస్పీ చలపతిరెడ్డి, ఆయన అల్లుడు రామసుబ్బారెడ్డి పూర్తి సహకారం అందించారు. 1988వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ పురాతత్వ శాఖ గుహలను రక్షిత స్థలంగా ప్రకటించి అప్పటి నుంచి కొన్నేళ్లపాటు కాపలాదారుని నియమించింది. గుహలోని శివలింగాలు 1999వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ బెలూం గుహలను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు వీటి నిర్వహణను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుంది. సొరంగ మార్గాల్లో ఒకటిన్నర కిమీ పొడవున మట్టి దిబ్బలను తొలగించి నాపరాళ్లు పరిచి నడక దారిని ఏర్పాటు చేశారు. సొరంగ మార్గాల్లో 150 విద్యుద్దీపాలతో కాంతివంతం చేశారు. గుహల లోపలకు గాలిని పంపు బ్లోయర్లు ఏర్పాటు చేశారు. 2003వ సంవత్సరం నుంచి బెలూం గుహల సందర్శనకు పర్యాటకులను అనుమతిస్తున్నారు. బెలూం గుహలు ఏర్పడిన ప్రదేశం బెలూం గుహల్లో చూడదగిన ప్రదేశాలు: బెలూం గుహల్లో 40 మెట్లు దిగిన తర్వాత 10 మీటర్ల లోతులో మొదలై 30 మీటర్ల లోతు వరకు ఉన్న ఈ సొరంగాలు కొన్ని చోట్ల ఇరుకుగాను, మరికొన్ని చోట్ల విశాలమైన గదులుగాను ఉండి కొన్నిచోట్ల స్టాలక్టైట్లు, స్టాలగ్మైట్లు అనబడే స్పటికాకృతులు ఏర్పడి ఉన్నాయి. ఈ కృత్రిమ శిలల ఆకృతుల ఆధారంగా కొన్ని ప్రదేశాలను వేయి పడగలు, కోటి లింగాలు, ఐరావతం, ఊడలమర్రి, మాయా మందిరం, వంటి పేర్లు పెట్టారు. ఇవి కాకుండా ధ్యాన మందిరం, మండపం, కప్పులో ఉన్న బొంగరపు గుంతలు, గుహల చివరి వరకు పోతే పాతాళ గంగ అనే నీటి మడుగు అక్కడే రాతిలో మలచిన శివలింగం ఉన్నాయి. విద్యుద్దీప కాంతులతో ఈ సొరంగ సోయాగాలను తిలకిస్తూ, సొరంగాలు పయనిస్తూ ఉంటే మరో ప్రపంచంలో ఉన్నట్లు సందర్శకులను గుహలు మైమరపిస్తున్నాయి. బెలూం గుహలోకి వెళ్లే ద్వారం భూగర్భంలో దాగి ఉన్న ఊహాతీతమైన పకృతి సౌందర్యాలు పోయినంత దూరం సందర్శకులకు ఆహ్లాదాన్ని ఇస్తున్నాయి. గుహ లోపల సంవత్సరం పొడవున 33 డిగ్రీల దాదాపు స్థిరమైన ఉష్టోగ్రత ఉండి గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బెలూం గుహలను తిలకించేందుకు సందర్శకులకు అనుమతి ఉంది. కాగా ఆదివారాలు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెలవు రోజుల్లో బెలూం గుహలకు సందర్శకుల తాకిడి అధికంగా ఉంటుంది. గుహలోని పాతాళ గంగ రాష్ట్రం నుంచే కాకుండా కర్ణాటక, తెలంగాణా, తమిళనాడు రాష్ట్రాలతో పాటు విదేశీయులు బెలూం గుహలను సందర్శిస్తున్నారు. సందర్శకులు బెలూం గుహలను తిలకించేందుకు వస్తుండటంతో టూరిజం శాఖకు ప్రతి ఏటా రూ. 1.79 కోట్ల ఆదాయం చేకూరుతోంది. గుహలను సందర్శనకు వచ్చే ప్రజల నుంచి పెద్దలకు రూ. 65, పిల్లలకు రూ. 45 ప్రకారం టికెట్ వసూలు చేస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి గుహల సందర్శనకు వచ్చే వారికి గుహల ప్రాముఖ్యత తెలియజేసేందుకు ఇక్కడ తమిళం, కన్నడ, హిందీ భాషలు తెలిసిన తెలుగు గైడ్లు అందుబాటులో ఉన్నారు. జిల్లాలో ఉన్న పర్యాటక ప్రదేశాల కంటే బెలూం గుహల నుంచి టూరిజం శాఖకు అధిక ఆదాయం చేకూరుతుండటం విశేషం. బెలూం గుహలకు ఇలా చేరుకోవాలి: ►కర్నూలు నుంచి ఓర్వకల్లు, బేతంచెర్ల, బనగానపల్లె మీదుగా 110 కిమీ ప్రయాణించి బెలూం గుహలను చేరుకోవాలి. ►అనంతపురం నుంచి తాడిపత్రి మీదుగా 80 కిమీ దూరంలో బెలూం గుహలు ఉన్నాయి ►చెన్నై నుంచి 420 కిమీ ►బెంగుళూరు నుంచి 280 కిమీ ►తిరుపతి నుంచి 275 కిమీ దూరంలో బెలూం గుహలు ఉన్నాయి. -
పర్యాటకుల మదిలో చిరస్థాయిలో నిలిచేలా..
కర్నూలు/కొలిమిగుండ్ల: భారతీయ సంస్కృతిలో గుహలు దేవుళ్లకు నివాసమనే నమ్మకం ఉండటంతో అవి పవిత్ర స్థలాలుగా విరాజిల్లుతున్నాయి. సాధారణంగా గుహలు కొండచరియల్లో, అడువుల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. కాని గుహల ప్రవేశ ద్వారం చేరే వరకు తెలియనంత సమతల ప్రదేశంగా, వ్యవసాయం చేసుకునే సాగు భూమి కింద సమాంతరంగా గుహలు ఏర్పడి ఉండటం ఓ అద్భుతం. అలాంటి అద్భుతాన్ని కనులారా వీక్షించాలంటే బెలుం గుహలను సందర్శించాల్సిందే. (ఇక్కడ చదవండి: భళా బెలుం) ప్రపంచంలోనే రెండొవదిగా.. భారత్‌లోనే పొడవైన అంతర్ భూభాగ గుహలుగా ఖ్యాతి పొందిన బెలుం ఆవరణలో భారీ స్థాయిలో ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో శనివారం నుంచి రెండు రోజుల పాటు జరిగే ఉత్సవాలను విజయవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. పర్యాటకుల మదిలో చిరస్థాయిలో నిలిచేలా ‘రారండో వేడుక చూద్దామంటూ’ ఆహ్వానం పలుకుతున్నారు. ఈ నేపథ్యంలో బెలుం గుహల విశిష్టతలు, వేడుక ఏర్పాట్లపై ప్రత్యేక కథనం. సొరంగ మార్గాల్లో ఒకటిన్నర కిలోమీటరు పొడవున మట్టి దిబ్బలను తొలగించి నాపరాళ్లు పరచి నడకదారిని ఏర్పరిచారు, 150 విద్యుద్దీపాలతో గుహలో వెలుగులు ఏర్పాటు చేశారు. గుహలలోపలికి గాలిని పంపే బ్లోయర్లు ఏర్పాటు చేయడం విశేషం. 40 మెట్లు దిగిన తర్వాత 10 మీటర్ల లోతులో మొదలై 30 మీటర్ల లోతు వరకు ఉన్న ఈ సొరంగాలు కొన్ని చోట్ల ఇరుకు, కొన్ని చోట్ల విశాలమైన గదులుగా ఉండటం, కొన్ని చోట్ల స్టాలక్ టైట్లు, స్టాలగ్మైట్లు అనబడే స్పటికాకృతులు ఏర్పడి ఉండటం విశేషం. ఈ కృత్రిమ శిలల ఆకృతిలను బట్టి కొన్ని ప్రదేశాలకు వేయిపడగలు, కోటిలింగాలు, ఐరావతం, ఊడలమర్రి, మాయా మందిరం వంటి పేర్లు పెట్టారు. ఇవిగాక ధ్యాన మందిరం, మండలం కూడా ఉన్నాయి. ఈ గుహల చివరి వరకు పోతే పాతాళ గంగ అనే నీటి మడుగు, అక్కడే రాతిలో మలిచిన శివలింగం కూడ కనిపిస్తోంది. విద్యుద్దీప కాంతులతో ఈ సొరంగాలు సోయగాలను తిలకిస్తూ.. పయనిస్తూ ఉంటే మరో ప్రపంచంలో ఉన్న అనుభూతి కలుగుతోంది. గుహలలోపల ఏడాది పొడవున 33 డిగ్రీల స్థిరమైన ఉష్ణోగ్రత ఉండి గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. వెలుగులోకి వచ్చింది ఇలా... 1884లో హెచ్‌బీ పూటే అనే ఆంగ్లేయుడు మొదటిసారిగా గుహలను గుర్తించారు. 1982, 1984 శీతాకాలాల్లో హెచ్డీ గేబర్ అనే జర్మన్ దేశస్తుడు తన సహచరులతో కలసి 3,225 మీటర్లు శోధించి ఒక పటాన్ని తయారు చేశారు. వీరికి స్థానికులు రిటైర్డ్ ఎస్పీ చలపతిరెడ్డి, పి.రామసుబ్బారెడ్డి సహకారం అందించారు. 1988లో ఆంధ్రప్రదేశ్ పురాతత్వశాఖ వీటిని రక్షణ స్థలంగా ప్రకటించి కాపలాదారులను నియమించింది. 1999లో ఆంధ్రప్రదేశ్ పర్యాటకశాఖ బెలుం గుహలను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు తమ అధీనంలోకి తీసుకొని అభివృద్ధి చేసింది. పురాతన కాలంలో గుహలను ప్రాచీన మానవులు నివాసంగా మార్చుకున్నట్లు చరిత్ర చెబుతోంది. క్రీ.పూ. 450 సంవత్సరాల నాటి మట్టి పాత్రలో మనిషి అస్థికలు, ఒక రాతి కత్తి లభ్యం కావడం విశేషం. ఒకప్పుడు బిలంగా పిలువబడుతుండగా క్రమేణా బెలుం గుహలుగా ప్రాచుర్యం పొందాయి. ప్రతి నెల 20 నుంచి 50 మంది వరకు విదేశీ పర్యాటకులు సందర్శిస్తున్నారు. ఏటా విదేశీయులతో కలిపి 2 లక్షల మంది పర్యాటకులు బెలుం గుహల అద్భుతాలను చూసి మైమరిచిపోతారు. ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు ప్రపంచంలోనే బెలుం గుహలకు ప్రత్యేక స్థానం ఉందని జాయింట్ కలెక్టర్–2 సయ్యద్ ఖాజా మొహిద్దీన్ అన్నారు.ప్రఖ్యాతి గాంచిన బెలుం గుహలు కర్నూలు జిల్లాలో ఉండడం అదృష్టమన్నారు. శని, ఆదివారాల్లో నిర్వహించే బెలుం ఉత్సవాలను సందర్భంగా శుక్రవారం కొండారెడ్డి బురుజు నుంచి కిడ్స్ వరల్డ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కొండారెడ్డి బురుజు సమీపంలో ఏర్పాటు చేసిన సభలో అయన మాట్లాడుతూ.. సంస్కృతి, సంప్రదాయాలకు ప్రపంచంలోనే భారత్‌కు ప్రత్యేకమైన స్థానం ఉందన్నారు. రెండు రోజుల పాటు నిర్వహించే బెలూం ఉత్సవాల్లో పెద్ద ఎత్తున జిల్లా ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. పర్యాటక రంగంలో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించిన మనదేశంలో బెలూం గుహలు అద్భుతమైనవన్నారు. అనంతరం డీఆర్డీఏ పీడీ ఎంకేవీ శ్రీనివాసులు, పౌరసంబంధాల శాఖ డీడీ పి.తిమ్మప్ప బెలుం గుహల ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీలో నగరంలోని పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, స్వ యం సహాయక సంఘాల మహిళలు, పాల్గొన్నారు. సర్వం సిద్ధం పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే బెలుం ఉత్సవాలకు సర్వం సిద్ధం చేశారు. 8, 9వ తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వేడుకలు కనువిందుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా కలెక్టర్ వీరపాండియన్, జేసీ రవిపట్టన్‌శెట్టి, జేసీ–2 ఖాజామోహిద్దీన్, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి్ద సంస్థ డీవీఎం ఈశ్వరయ్య ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఉత్సవాలకు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చే పర్యాటకులను అలరించేలా సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. సందర్శకులకు బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో భోజన సౌకర్యం కల్పించారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో 23 రకాల స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నారు. వివిధ శాఖల ప్రగతిని ప్రతిబింబించే విధంగా ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. పశుసంవర్ధకశాఖ అధికారులు ఒంగోలు కోడెలు, మేలు జాతి విత్తనపు పొట్టేళ్లు, అరుదైన పుష్పాలతో ప్రత్యేక ఎగ్జిబిషన్ నిర్వహించనున్నారు. వ్యవసాయశాఖ, ఉద్యానశాఖ, డీఆర్డీఏ విద్యశాఖ తదితర శాఖలు స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ పర్యాటక ప్రాంతాలపై ప్రత్యేక ఎగ్జిబిషన్ నిర్వహిస్తోంది. రాయలసీమ రుచుల గొప్పతనాన్ని చాటిచెప్పే విధంగా ఫుడ్ కోర్టు కూడా ఏర్పాటు చేశారు. గ్రామీణ క్రీడల్లో భాగంగా కబడ్డీ, ఖోఖో, కర్రసాము, గుండు ఎత్తడం తదితర పోటీలు నిర్వహించనున్నారు. విజేతలకు బహుమతులు అందజేయనున్నారు. ఉత్సవాలకు హజరయ్యే ప్రజలు పర్యాటకులను ఉర్రూతలూగించేందుకు పలువురు సెలబ్రిటీలు రానున్నారు. జిల్లాకు చెందిన కళాకారుల ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. గొరువయ్యల నృత్యాలు, కోలాటం, శాస్త్రీయ నృత్యాలు, జానపద నృత్యాలు, బీరప్పడోళ్లు తదితర వాటిని ప్రదర్శిస్తారు. సాయంత్రం 4.30 నుంచి సెలబ్రిటీల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించనున్నాయి. సింగర్ సింహ, అనుదీప్, గీతాభగత్ తదితరులు తమ పాటలతో అలరించనున్నారు. క్లాసికల్ డాన్స్‌లు, వెస్టర్న్ డాన్స్‌లు, లేజర్ షోలు తదితర ఎన్నో కార్యక్రమాలు అలరించనున్నాయి. తాగునీరు, టాయ్లెట్లు తదితర సౌకర్యాలు సిద్ధం చేశారు. పార్కింగ్ సమస్య తలెత్తకుండా కోవెలకుంట్ల సీఐ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో ముందస్తు చర్యలు తీసుకున్నారు. డీఎస్పీతో పాటు ముగ్గురు సీఐలు, పది మంది ఎస్ఐలతో కలిపి మొత్తం 150 మందికి పైగానే పోలీస్ సిబ్బంది బందోబస్తులో పాల్గొంటున్నారు. గుహలను తిలకించేందుకు రెండు రోజుల పాటు విద్యార్థులకు సాధారణ రోజుల్లో వసూలు చేసే టికెట్ ధరలో రాయితీ కల్పించనున్నారు. ఇలా చేరుకోవాలి.. కొలిమిగుండ్ల మండలం పరిధిలోని బెలుం గుహలు ఇటు బనగానపల్లె నుంచి 30 కి.మీ., అటు తాడిపత్రి నుంచి 30 కి.మీ. దూరంలో ఉన్నాయి. కర్నూలు నుంచి చేరుకోవాలంటే 110 కి.మీ., అనంతపురం నుంచి 80 కి.మీ., చెన్నై నుంచి 420 కి.మీ., బెంగళూరు నుంచి 280 కి.మీ., తిరుపతి నుంచి 275 కి.మీ. ప్రయాణించాల్సి ఉంది. కర్నూలు–తాడిపత్రి, విజయవాడ– బెంగళూరు, నంద్యాల, అవుకు( బనగానపల్లి మీదుగా) చేరుకోవచ్చు. కొలిమిగుండ్ల గ్రామానికి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో నైరుతి దిశలో ఉంటుంది. -
భళా బెలుం
కోవెలకుంట్ల/కొలిమిగుండ్ల: భారతీయ సంస్కృతిలో గుహలకు ప్రత్యేక స్థానం ఉంది. దేవుళ్లు, దేవతలకు గుహలు నివాసమని కొందరు నమ్మితే.. మరికొందరు ప్రాచీన చరిత్రకు ఆనవాళ్లుగా గుర్తిస్తారు. అందుకే అవి పవిత్ర స్థలాలుగా, పర్యాటక స్థలాలుగా విలసిల్లుతున్నాయి. సాధారణంగా గుహలు కొండ చరియల్లో, అడవుల్లో ఎక్కువగా కన్పిస్తాయి. దీనికి భిన్నంగా సుమారు 23 ఎకరాల విస్తీర్ణంలో సాగు భూమి లోపల ఏర్పడిన గుహలు కర్నూలు జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. కొలిమిగుండ్ల మండలం బెలుం సమీపంలోని ఈ గుహలు ప్రపంచంలోనే రెండో అంతర్భూభాగ గుహలుగా, దేశంలోనే పొడవైనవిగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచాయి. ఈ నేపథ్యంలో బెలుం గుహల విశేషాలు తెలుసుకుందాం. గుహల ఉనికిని చాటిన ఆంగ్లేయుడు 1884వ సంవత్సరంలో హెచ్‌బీ ఫూటే అనే ఆంగ్లేయుడు మొదటిసారిగా బెలుం గుహల ఉనికిని చాటినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. తర్వాత వందేళ్ల వరకు వీటి ప్రస్తావన లేదు. 1982–1984 మధ్య కాలంలో హెచ్డీ గేబర్ అనే జర్మనీ దేశస్తుడు ఇక్కడకు వచ్చి 3,225 మీటర్ల వరకు శోధించి ఒక పటాన్ని తయారు చేశాడు. వీరికి స్థానికులైన అప్పటి రిటైర్డ్ ఎస్పీ చలపతిరెడ్డి, ఆయన అల్లుడు రామసుబ్బారెడ్డి పూర్తి సహకారం అందించారు. 1988లో ఆంధ్రప్రదేశ్ పురాతత్వ శాఖ ఈ గుహలను రక్షిత స్థలంగా ప్రకటించి కొన్నేళ్లపాటు కాపాలాదారుని నియమించింది. ఇక్కడ క్రీ.పూ. 450 సంవత్సరాల కాలం నాటి మట్టి పాత్రలో మనిషి అస్థికలు, రాతి కత్తి లభ్యం కావడంతో ఈ గుహలను కూడా ఆనాటి మానవులు నివాస స్థలాలుగా వినియోగించుకున్నట్లు చరిత్రకారులు పేర్కొంటున్నారు. వీటిని అనంతపురం మ్యూజియంలో భద్రపరిచారు. 1999లో ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ బెలుం గుహలను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తమ ఆధీనంలోకి తీసుకుంది. 2003 నుంచి బెలుం గుహల సందర్శనకు పర్యాటకులను అనుమతిస్తున్నారు. సొరంగ మార్గాల్లో ఒకటిన్నర కిలోమీటర్ల పొడవున మట్టి దిబ్బలను తొలగించి నాపరాళ్లు పరిచి నడక దారిని ఏర్పాటు చేశారు. విశేషాలివీ - బెలుం గుహల్లో 40 మెట్లు దిగిన తర్వాత 10 మీటర్ల లోతులో మొదలై 30 మీటర్ల లోతు వరకు రకరకాలుగా ఉన్న ఈ సొరంగాలు కొన్నిచోట్ల ఇరుకుగాను, మరికొన్నిచోట్ల విశాలమైన గదులుగాను ఉండి కొన్నిచోట్ల స్టాలక్టైట్లు, స్టాలగ్మైట్లు అనబడే స్ఫటికాకృతులు ఏర్పడి ఉన్నాయి. - ఈ శిలల ఆకృతుల ఆధారంగా కొన్ని ప్రదేశాలకు వేయి పడగలు, కోటి లింగాలు, ఐరావతం, ఊడలమర్రి, మాయా మందిరం, వంటి పేర్లు పెట్టారు. - ఇవికాకుండా ధ్యానమందిరం, మండపం, కప్పులో ఉన్న బొంగరపు గుంతలు, గుహల చివరి వరకు పోతే పాతాళగంగ అనే నీటి మడుగు అక్కడే రాతిలో మలచిన శివలింగం ఉన్నాయి. - విద్యుద్దీప కాంతులతో ఈ సొరంగ సోయాగాలను తిలకిస్తూ లోపలికి వెళ్లే కొద్దీ మరో ప్రపంచంలో ఉన్నట్లు అనిపిస్తుంది. - గుహల్లో ఉండే నీటికి, బెలుం గ్రామంలోని శివాలయం పక్కనే నిటారు దారులు కలిగిన రాతిబావిలోని నీటిమట్టంకు సంబంధం ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రెండు చోట్లా ఎప్పుడూ నీటి మట్టాలు సమానంగా ఉంటాయని పేర్కొంటున్నారు. పెరుగుతున్న సందర్శకుల తాకిడి ప్రతి శని, ఆదివారాలు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెలవు రోజుల్లో బెలుం గుహలకు సందర్శకుల తాకిడి అధికంగా ఉంటుంది. రాష్ట్రం నుంచే కాకుండా కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలతోపాటు విదేశీయులు బెలుం గుహలను సందర్శిస్తున్నారు. పెద్దలకు రూ. 65, పిల్లలకు రూ. 45 ప్రకారం నామమాత్రపు రుసుం వసూలు చేస్తున్నారు. తద్వారా టూరిజం శాఖకు ఏటా రూ. 1.79 కోట్ల ఆదాయం చేకూరుతోంది. గుహల ప్రాముఖ్యత తెలియజేసేందుకు ఇక్కడ తమిళం, కన్నడ, హిందీ, ఇంగ్లిష్ భాషలు తెలిసిన తెలుగు గైడ్లు అందుబాటులో ఉన్నారు. జిల్లాలో ఉన్న పర్యాటక ప్రదేశాల కంటే బెలుం గుహల నుంచి టూరిజం శాఖకు అధిక ఆదాయం చేకూరుతుండటం విశేషం. -
తప్పిన పెను ప్రమాదం
- పొలంలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు - 23 మంది ప్రయాణికులు క్షేమం కొలిమిగుండ్ల: బెలుంగుహలు–కొలిమిగుండ్ల ప్రధాన రహదారిలో మంగళవారం రాత్రి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. బెలుంకు చెందిన తోక శాంతయ్య బైక్‌పై కొలిమిగుండ్లకు బయలు దేరాడు. బైక్‌పై ముందర పెట్టుకున్న ఎండుమిరప కాయలు బకెట్ మూత గాలికి ఎగిరి కింద పడటంతో బైక్‌ను అకస్మాత్తుగా పక్కకు తిప్పాడు. అదే సమయంలో బనగానపల్లెకు చెందిన ఆర్టీసీ బస్సు తాడిపత్రి నుంచి బనగానపల్లెకు వస్తుండగా బైకిస్ట్‌ను కాపాడే ప్రయత్నంలో బస్సు డ్రైవర్ బాలయ్య చాకచక్యంగా వ్యవహరించి బస్సును పక్కకు తిప్పడంతో రోడ్డు పక్కనున్న పొలంలోకి దూసుకెళ్లింది. మధ్యలో పెద్ద బండరాయి అడ్డు పడటంతో బస్సు బోల్తా పడకుండ నిలిచిపోయింది. దీంతో బస్సులో ఉన్న 23 మంది ప్రయాణికులు సురక్షితంగా బయట పడటంతో ఊపిరి పీల్చుకున్నారు. శాంతయ్య రోడ్డుపై కింద పడటంతో కాలికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో ప్రయాణికులను కాపాడేందుకు డ్రైవర్ తీసుకున్న నిర్ణయంతో స్థానికులు అభినందించారు. విషయం తెలుసుకున్న కానిస్టేబుళ్లు సుధాకర్, రఫీ ప్రమాద స్థలానికి చేరుకొని వివరాలను సేకరించారు.